Continental news | ఖండాలు విశేషాలు
71 శాతం నీటితో ఆవరించిఉన్న ఈ భూభాగంపై ఏడు ఖండాలు విస్తరించి ఉన్నాయి. ప్రకృతి సోయగాలు, రమణీయ ప్రదేశాలు, ఆయా ప్రాంతాల్లో మాత్రమే కనిపించే జీవజాలం, వివిధ శీతోష్ణస్థితి పరిస్థితులు, భూ స్వరూపాల వంటి విశేషాలు అనేకం. పెద్ద, చిన్న దేశాలు, ద్వీపాల సముదాయంగా ఉండే ఖండాలు.. పర్వతాలు, వాటిలో పుట్టే నదులు, అవి ఏర్పర్చే లోయలు, ఆ నదులను ఆసరాగా చేసుకుని వెలిసిన ఆవాసాలు, నగరాలు, పరిశ్రమలు… ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల వంటి అంశాలపై వీఆర్ఏ నుంచి సివిల్స్ వరకు ప్రతి పరీక్షలో ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. అందువల్ల నిపుణ పాఠకుల కోసం ఈ వారం ఆసియా, ఐరోపా ఖండాల గురించిన విశేషాలు..
ఆసియా
ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం ఆసియా. 44,579,000 చ.కి.మీ
విస్తరించి ఉన్న ఇది మొత్తం భూవిస్తీర్ణంలో 29.81 శాతం ఆక్రమించి ఉంది. 62,800 కి.మీ. (39,022 మీ.) సముద్రతీరాన్ని కలిగి ఉంది.
మొత్తం దేశాలు 48. వీటిలో రష్యా, కజకిస్థాన్, టర్కీలు
ఐరోపాలో కొంత భాగం ఆక్రమించి ఉన్నాయి.
అతిపెద్ద దేశాలు- రష్యా (17.1 మి.చ.కి.మీ.), చైనా
(9.6 మి.చ.కి.మీ.), భారత్ (3.3 మి.చ.కి.మీ.)
చిన్నదేశాలు- మాల్దీవులు (300 చ.కి.మీ.),
సింగపూర్ (719 చ.కి.మీ.), బహ్రెయిన్ (765 చ.కి.మీ.)
ఐరోపా
ప్రపంచంలో రెండో చిన్న ఖండం. 99,38,000 చ.కి.మీ. వైశాల్యం ఉన్న ఇది ప్రపంచ విస్తీర్ణంలో 6.8 శాతం భూభాగం కలిగి ఉంది.
మొత్తం దేశాలు- 50
పెద్ద దేశం- ఉక్రెయిన్ (603,700 చ.కి.మీ.)
రష్యా ఆసియా ఖండంలో కూడా భాగంగా ఉంది.
చిన్న దేశం- వాటికన్ సిటీ (0.17 చ.కి.మీ.)
భూ పరివేష్టిత దేశం- స్విట్జర్లాండ్
(60 శాతం భూభాగం ఆల్ఫ్స్
పర్వతాలుంటాయి)
శీతోష్ణస్థితి
-ఈ ఖండం ఉత్తర సమశీతోష్ణ మండలంలో ఉంది.
-అట్లాంటిక్ మహాసముద్ర అగాథ ప్రవాహాలు ఇక్కడి అధిక ఉష్ణోగ్రతకు ప్రధాన కారణం.
-ఐరోపా, ఆసియాలను కలిపి యురేషియా అంటారు.
-ప్రపంచ ఉత్తర సరిహద్దుగా ఉన్న రాజధాని నగరం- రెక్జావిక్ (ఐస్లాండ్)
శీతోష్ణస్థితి
-పశ్చిమాసియాలోని ఇరాక్, ఇరాన్లలో ఎండాకాలంలో 710c ఉష్ణోగ్రత నమోదవుతుంది.
-అంటార్కిటికా మినహా మిగిలిన ఖండాల కంటే ఆసియాలో చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో సుమారు -67.70c (రష్యాలోని వెర్కొయాన్స్క్, ఓమ్యకోన్ పట్టణాల్లో) నమోదవుతుంది.
-అధిక వర్షపాతం- మాసిన్రాం (1141 సెం.మీ.), చిరపుంజి (1087.4 సెం.మీ.)
-అత్యల్ప వర్షపాతం- థార్, అరేబియా ఎడారుల్లో
-ఆసియాలో వేసవిలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది.
ఖనిజాలు
-రష్యా, చైనా, భారత్, జపాన్, ఉత్తర కొరియాల్లో ఖనిజాలు అధికంగా లభిస్తాయి.
-రష్యా- లిగ్నైట్, బాక్సైట్, రాగి, యురేనియం, పాదరసం, ఇనుపఖనిజం ఉత్పత్తిలో మొదటి స్థానం.
-జపాన్- వెండి, తుత్తునాగం
-చైనా- మాంగనీసు, టంగ్స్టన్
-భారత్- క్రోమైట్ ఉత్పత్తి, అబ్రకం (ప్రపంచంలో మొదటి స్థానం)
జనాభా
-మొత్తం జనాభా- 742 మిలియన్లు
-ప్రపంచ మొత్తం జనాభాలో 11 శాతం (1/4వ వంతు) ఐరోపాలో ఉన్నారు.
-జనసాంద్రత- సగటున చ.కి.మీ.కి 101 మంది.
-అత్యధిక జనాభా- జర్మనీ (8,13,05,856 మంది)
-తక్కువ జనాభా- వాటికన్ సిటీ
నదులు
-పొడవైన నదులు- ఓల్గా (3692 కి.మీ.), డాన్యూబ్ (2960 కి.మీ.), యూరల్ (2530 కి.మీ.)
-డాన్యూబ్ నది ఏడు దేశాలగుండా ప్రవహించే అంతర్జాతీయ నది.
-అతిగొప్ప విదీర్ణదరి కలిగిన, పగులు లోయగుండా ప్రవహించే నది- రైన్
-పశ్చిమాన వేడినీరు ఉన్న ఖండం- ఐరోపా
పర్వతాలు
-ఎత్తయిన పర్వతాలు- ఆల్ఫ్స్, యూరల్
-ఎత్తయిన శిఖరం- ఎల్బర్గ్ (5642 మీ.,-రష్యా)
-కెలడోనియా పర్వతాలు- నార్వే, స్వీడన్, గ్రేట్బ్రిటన్
-ఆల్ఫ్స్ పర్వతాలు- ఫ్రాన్స్, స్విట్జర్లాండ్
-పైరనీస్- స్పెయిన్, ఫ్రాన్స్ మధ్య
-ఫ్రాన్స్‌లో- జురా, మాసిఫ్, వాస్జెస్ పర్వతాలు
-జర్మనీ- బ్లాక్‌ఫారెస్ట్, యూరల్ పర్వతాలు
-రష్యా- కాకసస్ పర్వతాలు
-ఇటలీ- వెసూవియస్ అగ్నిపర్వతాలు
-సిసిలీ- ఎట్నా అగ్నిపర్వతాలు
ఐరోపా నుంచి ఆసియాను వేరుచేసే పర్వతాలు- యూరల్, కాకస్
లోతైన ప్రాంతం- కాస్పియన్ సముద్రం (-28 మీ.- రష్యా)
అడవులు -జంతువులు
-అత్యధిక అడవులు ఉన్న దేశం- ఫిన్లాండ్ (77 శాతం భూ విస్తీర్ణంలో)
-తక్కువ అటవీ శాతం ఉన్న దేశం- ఐస్లాండ్ (1 శాతం మాత్రమే)
-టైగా అడవుల్లో స్ప్రూస్, లార్చ్, ఫర్ వృక్షాలు పెరుగుతాయి.
-మధ్యదరా శీతోష్ణస్థితి అడవుల్లో ఆలీవ్ వృక్షాలు ఎక్కువగా ఉంటాయి.
-యూరప్‌లో ప్రధానంగా కనిపించే జంతువులు తోడేళ్లు, ఎలుగుబంట్లు. వీటితోపాటు పోలోడీర్, కెస్ట్రెల్, త్రష్, ధృవపు ఎద్దు, లెమ్మింగ్ వంటివి ఎక్కువగా కనిపిస్తాయి.
జలసంధులు
-జీబ్రాల్టర్- ఇది ఐరోపా, ఆఫ్రికాలను వేరుచేస్తుంది.
-బోనిఫాసియో- ఇటలీలోని సార్డానియా, ఫ్రాన్స్‌లోని కార్సికాల మధ్య ఉంది.
-మెస్సివా- టెర్రిహీనియన్, మధ్యదరా సముద్రాలను కలుపుతుంది.
-ఇంగ్లిష్ చానల్- బ్రిటన్, ఫ్రాన్స్‌ల మధ్య ఉన్న సముధ్రభాగం
-రిగా సింధుశాఖ- ఎస్టోనియా, లాత్వియాలను వేరుచేస్తుంది
-బిస్కే అఖాతం- ఫ్రాన్స్, స్పెయిన్‌లను వేరుచేస్తుంది
పంటలు-పరిశ్రమలు
-బార్లీ, గోధుమ, మక్కజొన్న, రై ధాన్యం, ఓట్స్
-బార్లీ ఉత్పత్తిలో ఐరోపా వాటా 42 శాతం.
-రై ఉత్పత్తిలో ప్రపంచం మొత్తంలో 91 శాతం వాటా కలిగి ఉంది.
-ఓట్స్‌ను రష్యా, పోలెండ్, ఫ్రాన్స్, స్వీడన్, యూకే అత్యధికంగా సాగుచేస్తున్నాయి.
-ప్రపంచ మొత్తం ఇనుప ధాతువులో 1/4వ వంతు యూరప్‌లో ఉత్పత్తవుతుంది.
-పాదరసం- ఇటలీ (ప్రపచంలో మొదటిస్థానం)
-ఇనుప ఖనిజం- ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా
-రాగి ఖనిజం- ఆస్ట్రియా, స్లొవాక్, జర్మనీ
-ద్రాక్షసారా- ఫ్రాన్స్‌లోని బర్గండి, షాంపెన్
-కరారా పాలరాయి- ఇటలీ
-నౌకానిర్మాణ పరిశ్రమ- స్కాట్లాండ్, ఇంగ్లండ్, జర్మనీ, ఫిన్లాండ్
-జర్మనీలోని రూర్ లోయలో 12కు పైగా పారిశ్రామిక నగరాలు ఉన్నాయి.
పర్యాటక ప్రాంతాలు
-రోమ్, బెల్జియం, కెంట్ (ఇంగ్లండ్), అబర్డీన్ (స్కాట్లాండ్), ఫిన్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, వెనీస్ (ఇటలీ), స్టాక్‌హోమ్ (స్వీడన్), ఇస్తాంబుల్, ఏథెన్స్, రోమ్ (ప్రాచీన నగరాలు), నేపుల్స్, జెనోవా ఐరోపాలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు.
ప్రముఖ యూనివర్సిటీలు
-యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్- యూకే
-యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్- యూకే
-ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్- యూకే
-స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- జ్యూరిచ్ (స్విట్జర్లాండ్)
-యూనివర్సిటీ కాలేజ్- లండన్
-లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్- యూకే
-యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్- యూకే
-ఎల్ఎంయూ- మ్యూనిచ్ (జర్మనీ)
-కింగ్స్ కాలేజ్- లండన్
పరిశ్రమలు
-ఉక్కు, సిమెంటు, చక్కెర, నూలు, రెడిమేడ్ వస్ర్తాలు- రష్యా
-కలప పరిశ్రమలో- ఇండోనేషియా
-వ్యాపార నౌకల పరిశ్రమలో- చైనా
-రైలు మార్గాల వ్యవస్థ- భారత్
-అధిక సాంద్ర రైల్వే వ్యవస్థ- జపాన్
-ఎలక్ట్రానిక్ పరికరాలు- జపాన్, దక్షిణ కొరియా
చారిత్రక ప్రదేశాలు
-కంబోడియా- అంగ్‌కోర్‌వాట్, ఆంగ్కోర్ థోమ్ దేవాలయాలు (Angkor Thom & Angkor Wat)
-తాజ్‌మహల్, ఎర్రకోట – భారత్
-చైనా- గ్రేట్ వాల్, ఫర్బిడెన్ సిటీ, టెంపుల్ ఆఫ్ హెవెన్, మింగ్ టూంబ్స్, జేడ్ బుద్ధ టెంపుల్, టెర్రకోట వారియర్స్, గ్రేట్ వైల్డ్ గూస్ పగోడా.
-నేపాల్- ఖాట్మండు
-థాయ్‌లాండ్- గ్రాండ్ ప్లేస్, బ్యాంకాక్‌లోని దేవాలయాలు
జనాభా
-ప్రపంచ జనాభాలో ఆసియా ఖండంలో సుమారు 4.427 బిలియన్ల మంది నివసిస్తున్నారు. ఇది ప్రపంచ మొత్తం జనాభాలో 62 శాతం.
-అధిక జనాభా- చైనా (1.4 బిలియన్లు), భారత్ (1.3 బిలియన్లు), ఇండోనేషియా (259 మిలియన్లు)
-తక్కువ జనాభా- మాల్దీవులు (3,41,000), బ్రూనై (4,12,000)
-అత్యధిక జనసాంద్రత- బంగ్లాదేశ్ (చ.కి.మీ.కు 967 మంది)
-అత్యల్ప జనసాంద్రత- మంగోలియా (చ.కి.మీ.కు నలుగురు)
-పెద్ద నగరాలు- టోక్యో (జపాన్), షాంఘై (చైనా), జకర్తా (ఇండోనేషియా), న్యూ ఢిల్లీ
-మతం- ఇస్లాం మతాన్ని 1.1 బిలియన్ల (110 కోట్లు) మంది, హిందూ మతాన్ని 1 బిలియన్ (100 కోట్లు) జనాభా అనుసరిస్తున్నారు.
-అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం- ఇండోనేషియా (20 కోట్ల )
పెద్ద నగరాలు
-జనాభా, విస్తీర్ణం పరంగా ఆసియాలో పెద్ద నగరాలు టోక్యో (జపాన్), జకర్తా (ఇండోనేషియా), ఢిల్లీ (భారత్), కరాచీ (పాకిస్థాన్), సియోల్ (దక్షిణ కొరియా), షాంఘై (చైనా), మనీలా (ఫిలిప్పైన్స్), ముంబై (భారత్), బీజింగ్, గ్వాంగ్జ్ ఫోషన్ (చైనా).
భాష
-అత్యధికంగా మాండరిన్‌ను 1.3 బిలియన్ల మంది, హిందీని సుమారు 400 మిలియన్ల మంది, ఇండోనేషియన్ 240 మిలియన్లు, బెంగాలీని 150 మిలియన్ల మంది మాట్లాడుతారు.
-చైనా, సింగపూర్, తైవాన్‌లో అధికారిక భాషైన మాండరిన్‌ను ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడుతారు.
-ఆర్థికంగా బలమైన దేశాలు: చైనా, భారత్, దక్షిణ కొరియా, ఇండోనేషియా
పర్వతాలు
-ఆసియా ఖండపు మొత్తం భూవిస్తీర్ణంలో 20 శాతం పర్వతాలు ఉన్నాయి. వాటిలో…
-హిమాలయాలు (8,848 మీ.), గాడ్విన్ ఆస్టిన్ (8611 మీ. ప్రపంచంలో రెండో ఎత్తయిన పర్వతం), హిందూకుష్ (పాక్-ఆఫ్ఘనిస్థాన్), అరకాన్యెమ (ఇండోనేషియా, మయన్మార్), టియాన్పాస్ (చైనా), ఆల్టామ్, యాబ్లొనోలి (రష్యా) ముఖ్యమైనవి.
ప్రధాన జంతువులు
-అతిపెద్ద జంతువు- ఏనుగు.
-స్నోచిరుతపులి, కస్తూరి ఎద్దు, రైన్డీర్, మూప్లాన్, ఐబెక్స్, స్నో గుడ్లగూబ, నార్వీజియన్ లెమ్మింగ్ (norwegian lemming), నక్క, స్కేబుల్, మింక్ ఇక్కడ ప్రధాన జంతువులు.
నదులు పొడవైన నదులు
-యాంట్జ్ (చైనా)- 6,301 కి.మీ., ఎల్లో రివర్ లేదా హొయాంగ్ హో (చైనా)- 5,464 కి.మీ., ఇవి ఆసియాలో పొడవైన నదులు కాగా, ప్రపంచంలో నాలుగు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.
-మెకాంగ్ నది- ఇది ఆగ్నేయాసియాలో పెద్దనది. ఇది 4909 కి.మీ. ప్రవహిస్తుంది.
నదీ మైదానాలు
-గంగా-సింధు మైదానం- ప్రపంచంలో అతి విశాలమైన ఒండ్రుమట్టి మైదానం (భారత్)
-చైనా మైదానం- హొయాంగ్ హో, సికియాంగ్ నదుల మధ్య
-ఇరాక్‌లో- టైగ్రిస్, యూప్రటిస్ మైదానం
-ఐరావతీ మైదానం- మయన్మార్
-మెకాంగ్ మైదానం- వియత్నాం
-సైబీరియా మైదానం- యూరల్ పర్వతాల నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు (రష్యా)
-అతిపొడవైన (Longest river)నది- Yangtze River చైనా
-ప్రపంచంలో యునెస్కో హెరిటేజ్ జాబితాలో అత్యధిక ప్రాంతాలు కలిగిన దేశం- ఇటలీ
-దక్షిణఫ్రాన్స్ తీరంలో ఉన్న చిన్న దేశం మొనాకో. ఇది కాసినోలకు ప్రసిద్ధి చెందింది.
-తలసరి జలవిద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న దేశం- నార్వే
-ప్రపంచంలో రోడ్డుమార్గాల అభివృద్ధిలో యూరప్ రెండో స్థానంలో ఉంది.
-ప్రపంచంలో అత్యధిక రోడ్ల సాంద్రత నెదర్లాండ్స్‌లో ఉంది.
-ప్రపంచంలోని పొడవైన రైలు మార్గం ట్రాన్స్ సైబీరియా (10,000 కి.మీ.)లో ఉంది.
టాప్ వర్సిటీలు
-నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్,
-పెకింగ్ యూనివర్సిటీ, చైనా
-సింగువా యూనివర్సిటీ, బీజింగ్, చైనా
-నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, సింగపూర్
-యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, Pokfulam, హాంకాంగ్
-హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హాంకాంగ్
-యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, జపాన్
-కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దక్షిణ కొరియా
-సియోల్ నేషనల్ యూనివర్సిటీ, దక్షిణ కొరియా
-పొహంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
నాగరికత
-సింధూనది మైదాన ప్రాంతంలో క్రీ.పూ. 3000 లో సింధూ నాగరికత వర్ధిల్లింది. 1922లో జరిపిన పురావస్తు తవ్వకాల్లో ఈ నాగరికత బయటపడింది.
-వాయవ్య భారత్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లోని సింధూ నది, ఘగ్గర్-హాక్రా నది పరివాహక ప్రాంతాల్లో (సుమారు 1.25 మి. చ.కి.మీ.) ఈ పట్టణ నాగరికత వర్ధిల్లింది.
-ఈ కాలంలో ప్రధాన పట్టణాలు హరప్పా, మొహంజొదారో. వీటితోపాటు చాన్హుదారో (పాక్), భారత్‌లోని కాలిబంగన్ (ఘగ్గర్ నది), బన్వాలీ (సరస్వతీ నది), లోథాల్ (భొగావా Bhogava), సర్కటోడా, ధోలవీర (లూనీ నది), రోపార్ (సట్లెజ్ నది)లో ఈ నాగరికత బయల్పడింది.
-మెసపటోమియా నాగరికత యూప్రటిస్, టైగ్రిస్ నదీలోయ ప్రాంతాల్లో విలసిల్లింది. నేటి ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ దేశాల్లో ఈ నాగరికత ఆనవాళ్లు కనిపిస్తాయి. యూప్రటిస్, టైగ్రిస్ నదులు ఇరాక్, టర్కీ, సిరియా, ఇరాన్, సౌదీ అరేబియా, కువైట్, జోర్డాన్ దేశాల్లో వ్యాపించి ఉన్నాయి.
-చైనాలోని హొయాంగ్ హో నది పరిసర ప్రాంతాల్లో చైనా నాగరికత క్రీ.పూ. 1850లో ఏర్పడింది. దీన్ని షాంగ్ నాగరికత అని కూడా పిలిచేవారు.
భౌగోళిక పరిస్థితి
-అతిపెద్ద ఎడారి- అరేబియన్ ఎడారి (9,00,000 చ.మైళ్లు), గోబీ (5 లక్షల చ.మైళ్లు)
-విశాలమైన శీతల ఎడారి- గోబీ (మంగోలియా, చైనా)
-సిరియా ఎడారి- సౌదీ అరేబియా, సిరియాల మధ్య
-థార్ ఎడారి- భారత్, పాక్‌ల మధ్య విస్తరించి ఉంది.
-అతిపెద్ద దీవుల సముదాయం- ఇండోనేషియా (ప్రపంచంలో కూడా)
-అతిపెద్ద ద్వీపం- బరోని
-లోతైన ప్రాంతం- మృత సముద్రం
-అతిపెద్ద సరస్సు- కాస్పియన్
-లోతైన సరస్సు- బైకాల్ (రష్యా)
-లోతైన అగాథం- మేరియానా
-పెద్ద జలపాతం- కోహినే (లావోస్)
-ఎత్తయిన పీఠభూమి- టిబెట్
-పొడవైన సముద్రం- దక్షిణమహాసముద్రం
-ఎత్తయిన పర్వతం- ఎవరెస్ట్
-పొడవైన రైల్వే మార్గం- రష్యాలోని వోల్గా గ్రాడ్ – వ్లాడివోస్టాక్ (8,640 కి.మీ.)
ముఖ్యమైన సింధు శాఖలు
-పర్షియన్ గల్ఫ్- హిందూ మహాసముద్రంలో అరేబియన్ ద్వీపకల్పం, ఇరాన్ పీఠభూమికి మధ్య
-గల్ఫ్ ఆఫ్ ఒమన్- హిందూ మహాసముద్రంలో ఒమన్, ఇరాక్ పీఠభూమికి మధ్య
-గల్ఫ్ ఆఫ్ ఏడెన్- హిందూ మహాసముద్రంలో సోమాలియా, యెమెన్ల మధ్య
పర్యాటక ప్రాంతాలు
-టైగర్ నోస్ టెంపుల్, భూటాన్- దీన్ని తక్త్సంగ్ అని కూడా పిలుస్తారు. భూమికి 3000 మీ. ఎత్తులో దీన్ని నిర్మించారు.
-బొకియో నేచర్ రిజర్వు, లావోస్
-ఇది లావోస్‌లోని బొకియో ప్రావిన్స్‌లో ఉంది. దీన్ని అంతరించిపోతున్ననల్ల గిబ్బన్లను రక్షించడానికి ఏర్పాటు చేశారు.
-కౌలాలంపూర్- మలేషియా
-Ha Long Bay, వియత్నాం
-ఇది యునెస్కో గుర్తింపుపొందిన ప్రపంచ వారసత్వ ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ 3వేలకుపైగా దీవులు ఉండటంతోపాటు, ఫ్లోటింగ్ విలేజీల్లో సుమారు 1600 మంది నివసిస్తున్నారు.
-The War Memorial of Korea, దక్షిణ కొరియా
-ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ స్టేడియం రన్గ్రాడోమే స్టేడియం ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో ఉన్నది. ఇందులో 1,50,000 మంది ప్రేక్షకులు కూర్చోవచ్చు.
-అత్యధిక సైనిక బలగాలుగల దేశాల్లో చైనా (21,83,000 మంది), భారత్ (13,95,100), ఉత్తరకొరియా (11,90,000), రష్యా (8,31,000)లు వరుస స్థానాల్లో ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?