Camera .. Start .. Action .. | కెమెరా.. స్టార్ట్.. యాక్షన్..!
(ఫిలిం కోర్సులు – భవిష్యత్తుకు బాటలు)
సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే మాధ్యమం సినిమా. ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎన్నో మాధ్యమాలు ఉన్నా.. చాలా మందికి సినిమానే ఫస్ట్ బెస్ట్ ఆప్షన్. ప్రస్తుత జనరేషన్లో భారీ బడ్జెట్ చిత్రాలే కాకుండా షార్ట్ ఫిల్మ్స్ , టెలివిజన్, డాక్యుమెంటరీలు కూడా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. అయితే, సినిమా ఓ ఎంటర్టైన్మెంట్ టూల్ మాత్రమే కాదని, ఉపాధి అవకాశాలనూ అందించే వస్తువు కూడా అని సినీవర్గాల అభిప్రాయం. స్టోరీ నుంచి స్క్రీన్‌ప్లే వరకు, డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వరకు ఇలా ఎన్నో విభాగాల్లో అపార అవకాశాలను ముందుంచుతుంది. సృజనాత్మకత, శ్రమించే వ్యక్తిత్వం, విభిన్న ఆలోచనలు గలవారు ఈ ఫీల్డ్‌ను ఎంచుకోవచ్చు. నటనకు బాటలు వేసే ఫిలిం ఇన్స్టిట్యూట్లు, కోర్సుల సమాచారం ఈ వారం నిపుణలో..
అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా, హైదరాబాద్
-దేశంలోనే మొదటి ప్రైవేట్ ఫిల్మ్ మీడియా ఇది. అత్యాధునిక సౌకర్యాలతో మీడియా కోర్సులు చేసేవారికి తగిన సౌకర్యాలు కల్పిస్తున్నది. పెద్ద పెద్ద కెమెరాలు, పదికిపైగా ఔట్‌డోర్ లొకేషన్స్, ఐమ్యాక్ కంప్యూటర్ ల్యాబ్ వంటి సదుపాయాలను ఈ స్కూల్ కలిగి ఉన్నది.
-అర్హత : ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా
కోర్సులు :
-డిగ్రీ అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఇన్ ఫిలిం మేకింగ్ అండ్ యానిమేషన్
-అడ్మిషన్ తేదీ: ప్రతి ఏడాది ఏప్రిల్ చివరివారం
-ఫోన్ : +91 40 4007 3000
-వెబ్సైట్ : http://www.aisfm.edu.in/
రామోజీ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్, హైదరాబాద్
-రామోజీఫిలింసిటీ హైదరాబాద్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఫిలింసిటీని 1996లో రామోజీరావు స్థాపించారు. షూటింగ్ బహుళ అంతస్తులు, ప్రొఫెషనల్ కెమెరాలు, పోస్ట్ ప్రొడక్షన్‌కు సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయి.
-అర్హత : అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా
కోర్సులు :
-డిజిటల్ ఫిలిం మేకింగ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్
కాల వ్యవధి : ఏడాది
-సెల్ : 09390002655
-వెబ్సైట్ : http://ramojifilmcity.com/raft/
సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్, కోల్‌కతా
-ఈ ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందింది. అమల్ నీరద్, సాగర్ బాలరీ, నమ్రతారావు, శివకుమార్ విజయన్ వంటి ప్రముఖులు ఈ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థులు.
కోర్సులు :
-పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ సినిమా
-పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ యానిమేషన్
కాల వ్యవధి : మూడేండ్లు
-అడ్మిషన్ తేదీ : ప్రతి ఏడాది ఏప్రిల్ 10
-ఫోన్: 033 24328355/53/9300
-ఈమెయిల్: chairman@srfti.ac.in
-వెబ్సైట్: http://srfti.ac.in/
ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్
ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఇన్స్టిట్యూట్ ఇది. ఈ ఇన్స్టిట్యూట్ నాలుగేండ్ల డిజైన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నది.
కోర్సులు :
-బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ : యానిమేషన్ అండ్ ఫిలిం డిజైన్
-బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ : ఫిలిం అండ్ వీడియో కమ్యూనికేషన్
-సెల్ : 079 2662 9500
-వెబ్సైట్ : http://www.nid.edu/
కేఆర్ నారాయణన్ నేషనల్ ఇన్స్టిట్యూట్
-ఈ ఇన్స్టిట్యూట్ను కేరళ ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడ శిక్షణ పొందడానికి దేశ, విదేశాల నుంచి వస్తుంటారు.
-అడ్మిషన్ : ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా అడ్మిషన్స్ ఉంటాయి.
-ప్రతి ఏడాది మార్చిలో అడ్మిషన్లు ఉంటాయి.
కోర్సులు :
-పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు ఇన్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, యాక్టింగ్, ఆడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్
-ఫోన్ : 0471 2430068
-వెబ్సైట్ : http://www.krnnivsa.edu.in/
బిజూ పట్నాయక్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్
-ఈ సంస్థను ఒడిశా గవర్నమెంట్ ప్రారంభించింది. మూడు రకాల కోర్సులను ఈ సంస్థ ఆఫర్ చేస్తున్నది. ఇక్కడి శిక్షణ కోర్సులకు (ఏడాదికి ఒక్కో కోర్సుకు) 20 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేస్తున్నది.
-అడ్మిషన్స్ : అర్హత పరీక్ష ఆధారంగా
కోర్సులు :
-సినిమాటోగ్రఫీ, సౌండ్ అండ్ టీవీ ఇంజినీరింగ్ (ఆడియోగ్రఫీ) అండ్ ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్
కాల వ్యవధి : మూడేండ్ల డిప్లొమా
-అడ్మిషన్ తేదీ : ప్రతి ఏడాది జూన్ మొదటివారం
-ఫోన్ : 0671-2413968/2418480
-వెబ్సైట్ : http://www.dtetorissa.gov.in/
గవర్నమెంట్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు
-దేశంలోనే మొదటి గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇది. బెంగళూరులోని హెసరగట్టలో ఉంది. మూడు రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నది. సినిమాటోగ్రఫీ, సౌండ్ రిక్డారింగ్, ఇంజినీరింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నది. ఒక్కో ఏడాదికి ఒక్కో కోర్సుకు 133 మంది అభ్యర్థులను మాత్రమే శిక్షణకు ఆహ్వానిస్తున్నది.
-అర్హత : ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది.
కోర్సులు :
-సినిమాటోగ్రఫీ, సౌండ్ ఇంజినీరింగ్
-అడ్మిషన్ తేదీ : ప్రతి ఏడాది మే మొదటివారం
-వెబ్సైట్ : http://www.dte.kar.nic.in/# sthash. 6Sk9wD4O.dpuf
ఎల్వీ ప్రసాద్ ఫిలిం ఇన్స్టిట్యూట్, చెన్నై-త్రివేండ్రం
ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. ప్రముఖ నిర్మాత, యాక్టర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ అయిన ఎల్వీ ప్రసాద్ చెన్నైలో ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. ఇతర ప్రైవేట్ ఫిలిం ఇన్స్టిట్యూట్లతో పోలిస్తే అత్యాధునిక, ప్రామాణికమైన సౌకర్యాలను ఇది అందిస్తున్నది. ఇండోర్ స్టేడియం, లైబ్రరీ, ప్రొఫెషనల్ కెమెరాలు (ఎంఎక్స్) వంటి సదుపాయాలు కలిగి ఉన్న సంస్థ ఇది.
-అర్హత : ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా
కోర్సులు :
-ఫిలిం డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ
కాల వ్యవధి : రెండేండ్లు
-ఫిలిం ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైనింగ్
కాలవ్యవధి : ఏడాది
-అడ్మిషన్ తేదీ : ప్రతి ఏడాది మార్చి మొదటివారం
-సెల్ : 096770 44898
-వెబ్సైట్ : http://www.prasadacademy.com/
న్యూయార్క్ ఫిలిం అకాడమీ, ముంబై
న్యూయార్క్ ఫిలిం అకాడమీ ఇటీవల ముంబైలో కొత్త అకాడమినీ ప్రారంభించింది. ఇక్కడ ఎంతో మంది ఫిలింమేకర్స్ శిక్షణ పొందారు. వసతులు, సౌకర్యాల కల్పన మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం పొందాలంటే ఖర్చుతో కూడుకున్న పని.
కోర్సులు :
-షార్ట్‌టర్మ్ కోర్సులు (ఫిల్మ్ మేకింగ్ అండ్ సినిమాటోగ్రఫీ)
-సెల్ : +91 993 088 6074
-వెబ్సైట్ : https://www.nyfa.edu/mumbai
ఆదర్శ ఫిలిం ఇన్స్టిట్యూట్, బెంగళూరు
-ఇది బెంగళూరులో ఉంది. ఎడిటింగ్ రూమ్స్, హాస్టల్స్, శిక్షణా తరగతులు, థియేటర్స్, ఫొటోగ్రఫీ స్టూడియో, అడ్మినిస్ట్రేషన్ విభాగం వంటి సదుపాయాలను కలిగి ఉన్నది.
-అడ్మిషన్స్ ప్రక్రియ : మొదట దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యం
కోర్సులు:
-సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్
-ఫిలిం ఎడిటింగ్ అండ్ యాక్టింగ్
కాల వ్యవధి : ఆరు నెలలు
-అడ్మిషన్ తేదీ: ప్రతి ఏడాది ఆగస్టు మొదటివారం
-సెల్ : +91 80 2356 0886
-వెబ్సైట్: http://www.adarshafilminstitute.com
జ్యోతి చిత్రబన్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్, అసోం
-జ్యోతి ప్రసాద్ అగర్వాల్ పేరు మీదుగా ఈ అకాడమీ ప్రారంభమైనది. మొదటి అస్సామీ ఫిలిం డైరెక్టర్, ప్రొడ్యూసర్. 73 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక బిల్డింగ్లు, 16ఎంఎం మూవీ కెమెరాలు వంటి అత్యాధునిక సదుపాయాలను కలిగి ఉన్నది.
-అర్హత : ప్రవేశ పరీక్ష ఆధారంగా
కోర్సులు :
-డిప్ల్లొమా ఇన్ ఆడియోగ్రఫీ, సౌండ్ ఇంజినీరింగ్, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ మోషన్ పిక్చర్ అండ్ యాక్టింగ్
-అడ్మిషన్ తేదీ : ఏప్రిల్ చివరివారం
-ఫోన్ : 0361 238 6059
-వెబ్సైట్ : www.jyotichitraban.com
మరికొన్ని ఇన్స్టిట్యూట్లు
-సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆర్ట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, ఢిల్లీ
-విజ్లింగ్ వుడ్ ఇంటర్నేషనల్, ముంబై
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఫైన్ ఆర్ట్స్, కోల్‌కతా
-డిజిటల్ అకాడమీ ఫిలిం స్కూల్, ముంబై
-మాట్రికీస్ ఫిలిం స్కూల్, ఢిల్లీ
-కేరళ చలనచిత్ర అకాడమీ త్రివేండ్రం
-డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలిం స్టడీస్, జాదవ్‌పూర్ యూనివర్సిటీ
-ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పుణె
ఫిలిం కోర్సులు కూడా ప్రొఫెషనల్ లాంటివే..
చాలామంది ఎలాంటి బేసిక్స్ లేకుండా సినిమాపై ఆసక్తి చూపుతుంటారు. సరైన ప్రణాళిక లేకుండా సినిమా రంగంలో రాణించాలనుకునేవారికి అంత సులువు కాదు. ఇంజినీరింగ్, డిగ్రీ, మెడిసిన్ కోర్సులను ఎలాగైతే నేర్చుకుంటున్నామో. ఆ విధంగా ఫిలిం కోర్సులను నేర్చుకునేందుకు ఆసక్తి కనబర్చాలి. నాలుగేండ్లు కష్టపడి ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దానికంటే ఎక్కువే ఇక్కడ సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ప్రొఫెషనల్‌గా భావించి ఈ కోర్సులు చేయాల్సి ఉంటుంది. చాలామంది హీరోనో, డైరెక్టరో కావాలని ఈ రంగంలోకి వస్తుంటారు. అలా కాకుండా సినిమాలోని 24 విభాగాల్లోని ఏదైనా ఒకదానిపై పట్టు సాధించినట్లయితే అనేక అవకాశాలు ముందుంటాయి.
– మహేష్ గంగిమళ్ల, యాక్టింగ్ కోచ్, కాస్టింగ్ డైరెక్టర్
మ్యూజిక్ కోర్సులతోనూ అనేక అవకాశాలు
సినిమా సంగీత విభాగంలోకి రావాలనుకునే యువతీయువకులకు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది. మ్యూజిక్ కంపోజిషన్‌లో కూడా అనేక అవకాశాలు ఉంటాయి. సింగర్స్, మ్యూజిక్ కంపోజర్స్, లిరిక్ రైటర్స్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, సౌండ్ ఇంజనీర్స్ ఇలా సంగీతానికి సంబంధించిన విభాగాల్లో ప్రతిభ నిరూపించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. అయితే చాలామందికి హిందుస్థానీ, కర్ణాటిక్, ఫోక్, వెస్ట్రన్ సంగీతంలో ప్రవేశం ఉన్నప్పటికీ మూవీ కంపోజిషన్‌కు తగ్గట్టుగా అప్డేట్ కావాల్సి ఉంటుంది. ఇందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా సంగీత శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ఏదైనా ఒకదానిపై పట్టు సాధిస్తే ఈ రంగంలో రాణించవచ్చు. సినిమా ఎప్పుడూ కొత్తవాళ్లకి స్వాగతం పలుకుతూనే ఉంటుంది. ఈ రంగంలోకి వచ్చేవాళ్లకు ఉండాల్సింది టాలెంట్, ఓపిక మాత్రమే.
– వెంగీ, మ్యూజిక్ డైరెక్టర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?