సౌతాఫ్రికా
యూనివర్సిటీ ఆఫ్ కేప్‌టౌన్
-1829లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ అతి పురాతనమైనది. ప్రపంచంలోనే మొదటి గుండెమార్పిడి జరిపిన యూనివర్సిటీగా పేరుంది.
-మెడిసిన్, లా, అగ్రికల్చర్, జియోగ్రఫీ కోర్సులను అందిస్తుంది. బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది.
-వెబ్సైట్: www.uct.ac.za
యూనివర్సిటీ ఆఫ్ ది విట్వాటర్సాన్డ్
-1896లో స్థాపించబడింది.
-ప్రస్తుతం 33,300 మంది విద్యార్థులు ఉన్న ఈయూనివర్సిటీలో 2,600 బయటి దేశం విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆర్కియాలజీతో పాటు ఇతర విద్యా సంబంధమైన కోర్సులను అందిస్తుంది.
-బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 26వ స్థానం.
-వెబ్సైట్ : www.wits.ac.za
స్టెల్లోన్బోస్చ్ యూనివర్సిటీ
-1918లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ అభివృద్ధి దిశలో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 30,100 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
-మెడిసిన్, హెల్త్ సైన్స్ ఫ్యాకల్టీ గ్రామీణ ప్రాంతంలో ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తూ ఆరోగ్యాభివృద్ధికి కృషి చేస్తుంది.
-వెబ్సైట్ : http://www.sun.ac.za
బ్రెజిల్
యూనివర్సిడేడ్ డే సాయో పాలో
-1934లో స్థాపించబడింది.
-బ్రెజిల్‌లోనే పేరుప్రఖ్యాతులు గల ఈ యూనివర్సిటీ బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానం పొందింది.
-12 మంది బ్రెజిల్ అధ్యక్షులు ఇక్కడ విద్యనభ్యసించడం విశేషం.
-బ్రెజిల్‌లోనే పేరొందిన ఈ యూనివర్సిటీకి ఎక్కువ సంఖ్యలో ప్రవేశాలు వెల్లువెత్తుతుంటాయి.
-మొత్తం 11 క్యాంపస్‌లు ఉన్న ఈ యూనివర్సిటీలో అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, ఆర్కిటెక్ట్ కోర్సులతో పాటు అంతర్జాతీయ ముఖ్యమైన పాఠాలను బోధిస్తుంది.
-వెబ్సైట్: www.usp.br
యూనివర్సిడేడ్ ఎస్టాడ్యూల్ డి క్యాంపైనస్
-1966లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీకి బ్రిక్స్‌లో 12వ స్థానం.
-వరల్డ్ బెస్ట్ యంగ్ ఇన్స్టిట్యూషన్గా పేరుంది.
-35,600 మంది విద్యార్థులున్న ఈ యూనివర్సిటీలో 16,000 మంది పీజీ చేస్తున్నారు.
-ఫారెస్ట్రీ, డెంటిస్ట్రీ, అగ్రికల్చర్ కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్: www.unicamp.br
యూనివర్సిడేడ్ ఫెడరల్ రియో డీ జనీరో
-1792లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ లాటిన్ అమెరికాలోనే అతి పురాతనమైనది.
-ఈ ఏడాది బ్రిక్స్ కంట్రీస్‌లో ఈ యూనివర్సిటీ 29వ ర్యాంక్ పొందింది.
-67,000 మంది ఉన్న ఈ యూనివర్సిటీలో అధిక సంఖ్యలో మ్యూజియమ్స్, హాస్పిటల్స్, రిసెర్చ్ సెంటర్లు ఉన్నాయి.
-బ్రెజిల్‌లోనే రెండో పెద్ద నగరమైన రియో డీ జనీరోలో 2016 ఒలింపిక్స్ జరిగాయి.
-ఆర్ట్స్, సోషియాలజీ, మినరల్స్ అండ్ మైనింగ్ ఇంజినీర్సింగ్ కోర్సులను ఆఫర్ చేస్తుంది.
-వెబ్సైట్ : ufrj.br
యూనివర్సిడేడ్ ఎస్టాడ్యూల్ పాలిస్టా జూలియో డీ మెస్క్విట ఫిలో
-1976లో స్థాపించబడింది.
-ఈ యూనివర్సిటీకి బ్రిక్స్‌లో 36వ ర్యాంక్ కాగా, లాటిన్ అమెరికాలో 12వ స్థానం
-23 క్యాంపస్‌లు కలిగిన ఈ యూనివర్సిటీలో 50,600 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
-33 లైబ్రెరీ, రెండు యూనివర్సిటీ హాస్పిటల్స్, మూడు వెటర్నరీ హాస్పిటల్స్‌తో అనేక రకాల క్లినిక్‌లు ఉండటం వల్ల రిసెర్చ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది.
-డెంటిస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్: www.unesp.br
యూనివర్సిడేడ్ ఫెడరల్ డీ సాయో పాలో
-1933లో స్థాపించబడింది.
-ఈ యూనివర్సిటీకి బ్రిక్స్‌లో 45వ స్థానం కాగా, లాటిన్ అమెరికాలో 27వ స్థానం పొందింది.
-హెల్త్ సైన్స్ పట్ల ప్రత్యేక దృష్టి సారించిన ఈ యూనివర్సిటీ ప్రపంచంలో బెస్ట్ ఫోర్ సబ్జెక్టులను బోధిస్తుంది.
-నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, బయాలాజికల్ కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్ : www.unifesp.br
రష్యా
1. లామన్సావ్ మాస్కోస్టేట్ యూనివర్శిటీ
-రష్యన్ కంట్రీలోనే పురాతనమైన యూనివర్సిటీ ఇది
-1755లో స్థాపించబడింది. బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో నిలిచింది.
-మాస్కోలో ఉన్న ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం 47,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
-ఈ యూనివర్సిటీకి ప్రపంచంలోనే అతి పొడవైన భవనం ఉంది. భాషాశాస్త్రం, గణితం, ఫిజిక్స్, ఆస్ట్రానమి కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్ : www.msu.ru
2. సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీ
-1724లో స్థాపించబడింది.
-బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానం
-రష్యాలోని అతి పురాతన యూనివర్సిటీలో 30,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
-భాషాశాస్త్రం, గణితం, ఫిలాసఫీ, చరిత్ర, ఆధునిక భాషలు వంటి కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్: http://english.spbu.ru
3. నవోసిబిర్క్స్ స్టేట్ యూనివర్సిటీ
-1959లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానం
-13 మంది ఫ్యాకల్టీ ఉన్న ఈ యూనివర్సిటీలో 6,000 మంది విద్యార్థులే చదవడానికి అవకాశం ఉంది.
-ఫిజిక్స్, ఆస్ట్రానమి, మ్యాథమెటిక్స్ కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్: www.nsu.ru
చైనా
సింఘా యూనివర్సిటీ
-గత మూడేళ్ల కాలంలో చైనాలోనే కాకుండా బ్రిక్స్ కంట్రీస్‌లోనే అత్యున్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న యూనివర్సిటీ ఇది.
-1911లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 5వ స్థానం పొందింది.
-ఇప్పటివరకు 46,200 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
-కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, లా, ఆర్ట్స్ అండ్ డిజైన్స్, పాలిటిక్స్, మ్యాథమెటిక్స్, ఆధునిక భాషల కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్ : www.tsinghua.edu.cn
పెకింగ్ విశ్వవిద్యాలయం
-1898లో స్థాపించబడింది.
-చైనా టాప్ యూనివర్సిటీల్లో రెండవది.
-బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానం
-ఈ యూనివర్సిటీలో చైనా విద్యార్థులే కాకుండా జర్మనీకి చెందిన విద్యార్థులు ప్రవేశాలు పొందుతుంటారు.
-ఆధునిక భాషలు, కెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, మైనింగ్ ఇంజనీరింగ్, లా, కంప్యూటర్‌సైన్స్, మెకానికల్ సైన్స్, ఆర్ట్ అండ్ డిజైన్, మ్యాథమెటిక్స్ కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్ : www.pku.edu.cn