TET Sociology Special | వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది?
టెట్ ప్రత్యేకం-సైకాలజీ
1. వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఏది?
1) పెరుగుదల ఒక్కటే ప్రభావితం చేస్తుంది
2) వికాసం ఒక్కటే ప్రభావితం చేస్తుంది
3) పరిపక్వత/పరిణితి ఒక్కటే ప్రభావితం చేస్తుంది
4) పై మూడూ ప్రభావితం చేస్తాయి
2. జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో గాని, నిర్మాణంలో గాని సంభవించే ఒక పరిమాణాత్మక/గుణాత్మక మార్పును ఏమంటారు?
1) పెరుగుదల 2) వికాసం
3) పరిపక్వత 4) అభ్యసనం
3. ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు?
1) పరిపక్వత 2) వికాసం
3) పెరుగుదల 4) అభ్యసనం
4. పుట్టుకతోనే వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా వికసించడమే?
1) వికాసం 2) పెరుగుదల
3) పరిపక్వత 4) అభ్యసనం
5. ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధుల్లో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలైన మానసిక అంశాల్లో జరిగే మార్పు?
1) పెరుగుదల 2) వికాసం
3) పరిపక్వత 4) అభ్యసనం
6. అనువంశికంగా వచ్చిన శారీరక, మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమని పిలుస్తారు?
1) పరిపక్వత 2) పెరుగుదల
3) వికాసం 4) పైవన్నీ
7. మెదడు పెరగడం వల్ల వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని, వివేచనా సామర్థ్యాన్ని పొందుతాడనే వాక్యం కింది వాటిలో దేన్ని సూచిస్తుంది?
1) అభ్యసనం 2) పెరుగుదల
3) పరిపక్వత 4) వికాసం
8. క్రమబద్ధమైన, పొందికైన, పురోగమన మార్పులుగా నిర్వచించిన అంశం ఏది?
1) పెరుగుదల 2) పరిపక్వత
3) వికాసం 4) అభ్యసనం
9. కింది వాటిలో బుద్ధిమాంద్యులకు చెందిన వాక్యం ఏది?
1) మానసిక అభివృద్ధి ఉంది, కానీ శారీరక అభివృద్ధి లేదు
2) శారీరక అభివృద్ధి ఉంది, కానీ మానసిక అభివృద్ధి లేదు
3) శారీరక, మానసిక అభివృద్ధి లేదు
4) శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందుతాడు
10. కింది వాటిలో మరుగుజ్జులకు చెందిన వాక్యం ఏది?
1) శారీరక అభివృద్ధి ఉంది, కానీ మానసిక అభివృద్ధి లేదు
2) మానసిక అభివృద్ధి ఉంది, కానీ శారీరక అభివృద్ధి లేదు
3) శారీరక, మానసిక అభివృద్ధి లేదు
4) శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందుతాడు
11. పెరుగుదల, వికాసానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి.
1) వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ
2) పెరుగుదలను కచ్చితంగా కొలవగలం
3) వికాసం పరిశీలించడానికి సాధ్యపడును
4) పెరుగుదల జీవితాంతం కొనసాగదు
12. కింది వాటిలో వికాసానికి సంబంధించినది?
1) మూడేళ్ల వయస్సులో మాట్లాడగలగడం
2) ఆరు నెలల వయస్సులో దంతాలు రావడం
3) ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం
4) ఆరు అడుగుల ఎత్తును కలిగి ఉండటం
13. వికాసానికి చెందిన సరైన వాక్యాన్ని గుర్తించండి.
1) ఇది గుణాత్మకమైనది కాదు
2) ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు
3) ఇది పరిమితమైన ప్రక్రియ కాదు
4) ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినది కాదు
14. సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఐదు సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే?
1) పరిపక్వత, ప్రజ్ఞ అవసరం
2) పరిపక్వత, సృజనాత్మకత అవసరం
3) పరిపక్వత, ప్రేరణ అవసరం
4) పరిపక్వత, అభ్యసనం అవసరం
15. వికాసం/అభివృద్ధి అంటే?
1) సంభావనీయత విచ్చుకోవడం
2) దేహం పెరగటం
3) అవయవ స్థితిలో మార్పు
4) రూపంలో మార్పు
సమాధానాలు
1. 4 2. 1 3. 2 4. 3
5. 2 6. 1 7. 4 8. 3
9. 2 10. 2 11. 3 12. 3
13. 3 14. 4 15. 1
1. కింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) పెరుగుదల నిరంతర ప్రక్రియ
2) పెరుగుద పరిమాణాత్మకమైనది
3) పెరుగుదల అంటే ఎత్తు, బరువు, ఆకారంలో మార్పులు
4) వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైంది
2. వ్యక్తి పెరుగుదల, వికాసాలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి.
1) పెరుగుదల, వికాసంలో లీనమై ఉంటుంది
2) వికాసం, పెరుగుదల వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి
3) వికాసం, పెరుగుదలలో వైయక్తిక భేదాలుండవు
4) వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం
3. వికాసం, పరిపక్వత, అభ్యసనం మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం?
1) అభ్యసనం = f (పరిపక్వత X వికాసం)
2) వికాసం= f (పరిపక్వత/అభ్యసనం)
3) అభ్యసనం= f (పరిపక్వత/వికాసం)
4) వికాసం= f (పరిపక్వత X అభ్యసనం)
4. కింది వాటిలో వికాస లక్షణం కానిది?
1) అంతర్గతమైన చర్చ
2) ఒక ప్రత్యేకాంశానికి పరిమితం
3) గుణాత్మకమైనది
4) సమగ్రమైనది
5. కింది వాటిలో కచ్చితంగా కొలవగలిగేది?
1) విద్యార్థి ఉద్వేగాలు
2) విద్యార్థి వివిధ సబ్జెక్టుల్లో పొందిన జ్ఞానం
3) విద్యార్థి పెరుగుదల
4) విద్యార్థి వికాసం
6. జతపరచండి.
ఎ. కాళ్లు, చేతుల ఎదుగుదల 1. వికాసం
బి. దంతాలు రావడం 2. పరిపక్వత
సి. ఈత నేర్చుకోవడం 3. పెరుగుదల
1) ఎ-2, బి-1, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-3, బి-1, సి-2
4) ఏదీకాదు
7. కింది వాటిలో వికాసం అంటే?
1) అభ్యసనం 2) పరిపక్వత
3) సామర్థ్యాల సంశ్లేషణ
4) పైవన్నీ
8. కింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది?
1) భౌతిక మార్పు 2) సాంఘిక మార్పు
3) శారీరక మార్పు 4) ఆకార మార్పు
9. ఒక శిశువు 3 సంవత్సరాలకు మాట్లాడటం, ఐదు సంవత్సరాలకు రాయగలగడం అనేది దేని ప్రకారం జరుగుతుంది?
1) పెరుగుదల 2) వికాసం
3) పరిపక్వత 4) అభ్యసనం
10. ఒక వ్యక్తి పొడవుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడనే వాక్యాలు దేన్ని సూచిస్తాయి?
1) పెరుగుదల 2) వికాసం
3) పరిపక్వత 4) అభ్యసనం
సమాధానాలు
1. 1 2. 1 3. 4 4. 2
5. 3 6. 2 7. 4 8. 2
9. 3 10. 1
1. వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒక రోజు బయటకు కనిపిస్తాయి. ఇందులోని వికాస సూత్రం ఏది?
1) వికాసం సర్వశక్తుల సమ్మేళనం
2) వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది
3) వికాసం ఒక కచ్చితమైన దిశగా సాగుతుంది
4) వికాసం ఒక పరస్పర చర్య
2. కింది వాటిలో వికాసం గురించి సరికాని ప్రవచనం?
1) క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది
2) వైయక్తిక భేదాలుంటాయి
3) అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది
4) సంచిత ప్రక్రియ
3. వికలాంగుడైన విద్యార్థి తరచూ ఒంటరిగా ఉంటూ అందరిపై ఎక్కువగా కోపాన్ని చూపిస్తూ పరీక్షల్లో కూడా తక్కువ మార్కులు సాధిస్తున్నట్లయితే ఆ విద్యార్థి ఏ వికాస నియమానికి చెందుతాడు?
1) వికాసం సంచిత ప్రక్రియ
2) వికాసం క్రమానుగతమైనది
3) వికాసంలో వ్యక్తిగత భేదాలుంటాయి
4) వికాసం ఏకీకృత మొత్తం
4. ఒక వ్యక్తిలో జ్ఞానం ఆధారంగా అవగాహన, అవగాహన ఆధారంగా వినియోగం, వినియోగం ఆధారంగా విశ్లేషణం, విశ్లేషణం ఆధారంగా సంశ్లేషణ, సంశ్లేషణ ఆధారంగా మూల్యాంకనం ఏర్పడుతుందనే వాక్యం ఏ వికాస నియమాన్ని
సమర్థిస్తుంది?
1) వికాసం క్రమానుగతమైంది
2) వికాసం సంచితమైనది
3) వికాసం ఏకీకృత మొత్తం
4) వికాసం అవిచ్ఛిన్నమైనది
5. శారీరక వికాసం మానసిక వికాసాన్ని, మానసిక వికాసం ఉద్వేగ వికాసాన్ని, ఉద్వేగ వికాసం నైతిక వికాసాన్ని, నైతిక వికాసం సాంఘిక వికాసాన్ని పరస్పరం ప్రభావితం చేసుకుంటాయనే విషయాన్ని సమర్థించే వికాస నియమం ఏది?
1) వికాసం ఏకీకృతమైనది
2) వికాసం క్రమానుగతమైనది
3) వికాసం సంచితమైనది
4) వికాసం అవిచ్ఛిన్నమైనది
6. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) శిశువు సంకలనం తర్వాత వ్యవకలనం, తర్వాత గుణకారం, తర్వాత భాగాహారం నేర్చుకోవడం క్రమానుగతం
2) శిశువు సంకలనం ఆధారంగా గుణకారం, వ్యవకలనం ఆధారంగా భాగాహారం నేర్చుకోవడం సంచితం
3) శిశువులో భాషా వికాసం నిరంతరం జరగడం విచ్ఛిన్నం
4) వివిధ రకాల వికాసాలు విడివిడిగా గాక కలిసి పని చేయడం ఏకీకృతం
7. వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది?
1) పిల్లల్లోని వైయక్తిక భేదాలు
2) పిల్లల సాంఘిక, ఆర్థిక పరిస్థితులు
3) పిల్లల సామర్థ్యాలు
4) పిల్లల అభ్యసన సంసిద్ధత
8. మొదట ఎగిరేవన్నీ పక్షులే అని తెలుసుకున్న శిశువు తర్వాత ఆస్ట్రిచ్ పక్షి అయినప్పటికీ ఎగరదని తెలుసుకున్నాడు. అయితే ఇది ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం సులభం నుంచి జఠిలం వైపు దారి తీస్తుంది
2) వికాసం జఠిలం నుంచి సులభం వైపు దారి తీస్తుంది
3) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు దారి తీస్తుంది
4) వికాసం నిర్దిష్టం నుంచి సాధారణం వైపు దారి తీస్తుంది
9. అనుకూల బదలాయింపును సమర్థించే వికాస నియమం ఏది?
1) వికాసం క్రమానుగతం
2) వికాసం అవిచ్ఛిన్నం
3) వికాసం ఏకీకృతం
4) వికాసం సంచితం
10. నవజాత శిశువు ‘సాధారణ ఉత్తేజం’, ‘ఆర్తి’, ‘ఆహ్లాదం’ ప్రతిస్పందనలుగా విడివడటం ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు?
1) వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది
2) వికాసం సులభ అంశాల నుంచి జఠిల అంశాలకు సంభవిస్తుంది
3) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
4) వికాసం కచ్చితమైన దిశగా సాగుతుంది
11. వికాసం క్రమానుగతమైనది అనే నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషా బోధనలో అనుసరించే క్రమం ఏది?
1) WRSL 2) RSLW
3) LSRW 4) SLWR
12. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది, దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడవడంలో దాగి ఉన్న వికాస నియమం?
1) వికాసం సంచితమైనది
2) వికాసం ఒక పరస్పర చర్య
3) వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి
4) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
13. కింది వాటిలో ఏ వికాస సూత్రం గెస్టాల్ట్ వాదాన్ని సమర్థిస్తుంది?
1) వికాసం అవిచ్ఛిన్నం
2) వికాసం అసంచితం
3) వికాసం క్రమానుగతం
4) వికాసం సర్వశక్తుల సమ్మేళనం
14. ఒక ఉపాధ్యాయుడు తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలను ఇవ్వడం అనేది వికాస నియమాల్లో దేన్ని సమర్థిస్తుంది?
1) వికాసం క్రమానుగతం
2) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
3) వికాసం రెండు నిర్దేశ పోకడల్లో సంభవిస్తుంది
4) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు
15. కింది వాటిలో వికాస సూత్రం?
1) వికాసాన్ని ప్రాగుక్తీకరించలేం
2) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు
3) వికాసం నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా సాగుతుంది
4) వికాసం సంకుచితమైనది
సమాధానాలు
1. 1 2. 3 3. 4 4. 2
5. 1 6. 3 7. 2 8. 3
9. 4 10. 1 11. 3 12. 2
13. 4 14. 2 15. 2
శివపల్లి
సైకాలజీ ఫ్యాకల్టీ
టీఎస్, ఏపీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?