ఇంటర్వ్యూ అంటే భయమా?
చాలా పెద్ద సమస్య వచ్చింది బాబాయ్ చెప్పాడు. వింటున్నాడు శశాంక్. బాబాయ్‌కి యాభై, అరవై మధ్య వయస్సు ఉంటుంది. ఎంతో హుందాగా బతికిన ఆయన నుంచి ఇలాంటి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి శశాంక్‌కి. నాకేదో భయంగా ఉంది. ఏంటి బాబాయ్ విషయం?
నీకు మన మురళి తెలుసుకదా వాడి గురించే నా బాధంతా ఉపోద్ఘాతంలా మొదలుపెట్టాడు బాబాయ్. ఆయన కరీంనగర్‌కు కాస్త దూరంలో ఓ గ్రామంలో ఉంటారు. అక్కడ ఆయనంటే చాలామందికి గౌరవం. పెద్దగా చదువుకోకపోయినా వ్యవహారదక్షత, లోకజ్ఞానం, మంచితనం వల్ల తలలో నాలుకలా ఉంటారు. పెద్దబ్బాయి ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికాలో సెటిలైపోయాడు. కానీ రెండో అబ్బాయి మురళి, ఇతని గురించే బాబాయ్ బాధ. మురళి సమస్య ఏంటో ఊహించలేకపోయాడు శశాంక్. మంచి కాలేజీలో బీటెక్ ఫైనలియర్లో ఉన్నాడు. ప్రతి సెమిస్టర్లో మంచి గ్రేడింగ్ తెచ్చుకుంటున్నాడు. చెడు అలవాట్లు, స్నేహాలు కూడా ఏం లేవు. ఇంకో ఏడాది ఆగితే జీవితంలో స్థిరపడిపోవడానికి అనుకూలమైన పరిస్థితి. ఇంటర్వ్యూలకు వెళ్లనంటున్నాడు. అని చెప్పసాగారు. బీటెక్ కాగా నే ఇంటిపట్టున ఉండి వ్యవసాయం చూసుకుంటాను. ఇంటర్వ్యూలంటే భయంగా ఉంది అని పట్టుదలగా ఉన్నాడు. విషయం పూర్తిగా అర్థమైంది. ఏం భయపడకు బాబాయ్. నేను వాడితో మాట్లాడి సర్దిచెబుతాను. ఇది చాలా చిన్న సమస్య . ఇద్దరు ఊరివైపు బయలుదేరారు. నిజానికి ఇదొక మురళి సమస్యే కాదు. చాలామంది విద్యార్థులది కూడా.
అసలు భయం ఎందుకు ఏర్పడుతుంది? భయం అనేది అవసరం. ఎలాగంటారా? ఓ చిన్న ఉదాహరణ తీసుకుందాం. అప్పుడప్పుడే విషయ పరిజ్ఞానం ఏర్పడుతున్న పసిపాపను ఊహించుకోండి. పాప పాకుతూ ఓ వేడి స్టీలు గిన్నెను పట్టుకుంది. ఏడవడం, బొబ్బలెక్కడం సహజంగానే జరిగిపోయాయి. ఇప్పుడు పసి మనసుపై ఓ ము ద్రపడింది. వేడిగిన్నే కాదు.. మరే గిన్నె అయినా పట్టుకునేముందు హెచ్చరిక జారీ చేస్తుంది. అదే మనకు రక్షణ ఇస్తుంది. అంటే మన సబ్కాన్షియష్ మైండ్ మనల్ని రక్షించుకోవడానికి ఇలా.. అనేక జ్ఞాపకాలు, అనుభూతులు పదిలంగా కాపాడుకుంటూ మనకు ఆయా సమయాల్లో హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. అంటే మనకు కలిగే భయం మనల్ని రక్షించడానికి ఏర్పాటైన ఒక మంచి వ్యవస్థ అన్నమాట.
ముందూ వెనుక చూసుకోకుంటే ప్రమాదమే కదా! కేవలం పుస్తకాలు చదవడం, పరీక్షలు రాయడం, మార్కులు, ర్యాం కులు ఇలాంటి వాతావరణంలో మాత్రమే పెరుగుతూ వచ్చిన మురళి లాంటి కుర్రాళ్లకు నలుగురిలో కలవ డం, వాక్చాతుర్యంతో సంభాషణల్లో పాల్గొనడం వంటివి క్లిష్టమైన సమస్యగా కనిపిస్తాయి. మార్కులు, ర్యాంకులు, గోల్డ్‌మెడల్స్, లెక్చరర్ల అభినందనలు వీటికి అలవాటు పడ్డ వీరు చిన్న అపజయాన్ని కూడా ఎదుర్కోలేరు. విజ్ఞానం, మార్కులు ఎంత ముఖ్యమో! వాక్చాతుర్యం కలివిడిగా నలుగురితో కలిసి మాట్లాడటం, వాద ప్రతివాదనల్లో ఎదుటివారిని నొప్పించక-తానొవ్వక గెలవటం అంతే ముఖ్యం. హెచ్ఆర్ మేనేజర్లు ముఖ్యంగా మూడు విషయాల్ని ఆశిస్తారు. అవి ఏంటంటే..
-విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం
-కమ్యూనికేషన్ స్కిల్స్
సాధన ద్వారా ఎలాంటి నైపుణ్యాన్నయినా సాధించవచ్చు. శ్రద్ధ, ఏకాగ్రత, నేర్చుకోవాలనే తపన ఉంటే పై నైపుణ్యాలు సాధించవచ్చు.
ఇటీవల కాలంలో చాలామంది హెచ్ఆర్ మేనేజర్లు చెబుతున్నదేమిటంటే నైపుణ్యాలు ముఖ్యమైనవే. కానీ ఒక అభ్యర్థిని ఎన్నుకొనేటప్పుడు నైపుణ్యం విషయం లో రాజీపడతాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థి దృక్పథంలో మాత్రం రాజీపడం.
ఆలోచనా ధోరణి సానుకూల దృక్పథం
విన్-విన్ ధోరణి ఐయామ్ ఓకే-యూఆర్ ఓకే
అటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ పట్టువిడుపు ధోరణి
సానుభూతి ధోరణి నాయకత్వ లక్షణాలు
ఇలాంటి లక్షణాలు వ్యక్తి ఎదుగుదల క్రమంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. సరైన దృక్పథం లేకుంటే నాయకుడిగా ఎదగలేరు. ఒకవేళ అదృష్టవశాత్తు ఎదిగినా ఎక్కువ కాలం నిలవలేరు. ఎవరు నాయకులుగా పుట్టరు. శిక్షణ ద్వారా నాయకులుగా తయారవుతారు. ఇది ఆకట్టుకొనే నినాదం మాత్రమే. సరైన దృక్పథం లేని వ్యక్తికి ఎంతశిక్షణ ఇచ్చినప్పటికీ, నాయకత్వ లక్షణాలు ఒంటపట్టించుకోలేడు. సరైన దృక్పథం శిక్షణతో అందించడం అసాధ్యం. దృక్పథం నేర్పించలేం, మార్చగలం అంతే. అతడే మారాలి. మార్పు అనేది అతడి ఆమోదంతో, స్వయంప్రేరణతో మాత్రమే సాధ్యం.మార్పునకు సిద్ధపడిన మానసిక స్థితిలో, మార్పు కోరుకుంటూ ముందుకు వచ్చిన వ్యక్తికి సరైన వాతావరణం కల్పిస్తే, అప్పుడు శిక్షణ ద్వారా అతడి ప్రవృత్తిలో మా ర్పు తీసుకురావచ్చు. వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణులు చేసే పని ఇదే. ఇంటర్వ్యూ సమయంలో హెచ్ఆర్ మేనేజర్లు ఈ విషయంలో రాజీలేని ధోరణి ప్రదర్శిస్తారు.నైపుణ్యాల లోటుపాట్లను ట్రైనింగ్ ద్వారా భర్తీ చేసుకొంటాం. కానీ నైపుణ్యా లు బాగుండి, దృ క్పథ లోపాలున్న వ్యక్తిని కచ్చితంగా తిరస్కరిస్తారు.వ్యక్తిత్వ వికాసం, శిక్షణ తరగతులకు అటెండ్ కావడం, మంచి పుస్తకాలు చదవటం, బెస్ట్ ఫ్రెండ్స్ ఉండటం, మంచి అలవాట్లు, ఆలోచనా ధోరణి ఇవన్నీ కూడా మంచి దృక్పథానికి తోడ్పడుతాయి. Without Changing the root. you cannot change the fruit మీ జీవితంలో ప్రతి మార్పు మీ ఆలోచనను మార్చటం ద్వారా సాధ్యమవుతుంది. మురళి దృక్పథ సమస్య కారణంగా రెండు, మూడు ఇంటర్వ్యూల్లో ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. అపజయమెరుగని మురళి వెనుకడుగు వేయడం పరిష్కారమనుకున్నాడు. విజయం సాధించాలంటే భయమే భయపడేలా పోరాడాలి. శశాంక్ శిక్షణలో అతడు మంచి విజేతగా మారాడని వేరే చెప్పనవసరం లేదనుకుంటాం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం