ఐసర్సైన్స్ విద్యార్థులకు వరప్రదాయిని
విజ్ఞానశాస్త్రంలో పరిశోధనల ద్వారా సామాజిక సమస్యలకు స్థిరమైన పరిష్కారాలను కనిపెట్టి, అమలుచేయడం ద్వారా దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి ఏర్పాటుచేసిన సైన్స్ విద్యాలయాలే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్). ప్రారంభించిన అతి తక్కువ కాలంలో ఐసర్ అనేక ప్రచురణలు, పేటెంట్లను సాధించి నమ్మశక్యం కాని మేధోసంపత్తిని సృష్టించాయి. సైన్స్ పై ఆసక్తి, పరిశోధనా రంగంలో అడుగుపెట్టాలనుకునే వారికి వీటిని వరప్రదాయినులుగా పేర్కొనవచ్చు. ఇంటర్ అర్హతతో బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశాలను కల్పించే ఐసర్ గురించి సంక్షిప్తంగా…
ఐసర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్. దేశంలో మొదట కోల్‌కతా, పుణెలలో ప్రారంభించారు. తర్వాత మొహాలి, భోపాల్, తిరువనంతపురం, తిరుపతి, బెర్హంపూర్‌లలో వీటిని ప్రారంభించారు.
ప్రత్యేకతలు
ఈ సంస్థలు ఐదేండ్ల డ్యూయల్ డిగ్రీ సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి.
తరగతి గది అభ్యసనాన్ని పరిశోధనతో అనుసంధానించడం, ఇంటర్ డిసిప్లినరీ కార్యకలాపాలకు తగినంత అవకాశాలను ఇక్కడ కల్పిస్తారు.
సైన్స్, ఇంజినీరింగ్ సైన్సెస్, ఎకనామిక్స్ పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టి సారించడం ఈ సంస్థల ప్రత్యేకత.
ప్రతిభావంతమైన పరిశోధనలు కొనసాగించే అవకాశాలను కల్పిస్తారు.
అన్ని వసతులతో కూడిన పూర్తిస్థాయి రెసిడెన్షియల్ క్యాంపస్ ఈ ఐసర్
ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్
బయాలజికల్ సైన్సెస్
కెమికల్ సైన్సెస్, ఎర్త్ & ైక్లెమేట్ సైన్సెస్/ఎర్త్ & ఎన్విరాన్మెంటల్ సైన్సెస్
ఎకనామిక్ సైన్సెస్
ఇంజినీరింగ్ సైన్సెస్ (కెమికల్, డాటాసైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఈఈ, సీఎస్)
జియాలజికల్ సైన్సెస్
ఇంటిగ్రేటెడ్ &ఇంటర్‌డిసిప్లినరీ సైన్సెస్
మ్యాథమెటికల్ సైన్సెస్
ఫిజికల్ సైన్సెస్
నోట్: నాలుగేండ్ల బీఎస్ ప్రోగ్రామ్ ఇన్ ఇంజినీరింగ్ సైన్సెస్ అండ్ ఎకనామిక్స్‌ను ఐసర్ భోపాల్ క్యాంపస్ మాత్రమే అందిస్తుంది.
ప్రవేశాలు కల్పించే పద్ధతి
ఈ సంస్థల్లో మూడు రకాలుగా ప్రవేశాలు కల్పిస్తారు
1. కేవీపీవై (కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన)
2. ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్డ్)
3. స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్ (ఎస్సీబీ)
నోట్: ఎస్సీబీ చానెల్ అభ్యర్థులకు ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఐఏటీ) నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
అర్హత: ఇంటర్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఆయా రాష్ర్టాలవారీగా అభ్యర్థులకు నిర్దేశిత పర్సంటేజీలో మార్కులతో ఉత్తీర్ణత.
సాధించాలి.
ఐఏటీ పరీక్ష కేంద్రాలు
రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం,
మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్
దరఖాస్తు:ఆన్లైన్లో
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: http://www.iiseradmission.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు