సహకార క్రీడల్లో పాల్గొనడం తెలిపే వికాస నియమం?
- పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఉన్న వికాస సూత్రం?
1) వికాసం సాధారణ దిశ నుంచి
నిర్దిష్టదిశగా సాగుతుంది
2) వికాసం కచ్చితమైన వరుస
క్రమాన్ని అవలంబిస్తుంది
3) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
4) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు - వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి, హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపిస్తాయి. ఇందులో వికాస సూత్రం?
1) వికాసం సంచితమైనది
2) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం
3) వికాసం కచ్చితమైన దిశగా సాగుతుంది
4) వికాసం ఒక పరస్పర చర్య - కనిపించని తన తల్లిని వెతకడం ప్రారంభించిన సరయుకు గల పియాజే సంజ్ఞానాత్మక వికాసదశ?
1) పూర్వ ప్రచాలక దశ
2) ఇంద్రియ చాలక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) అమూర్త ప్రచాలక దశ - సిరి తన తల్లిదండ్రుల నుంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవటం వల్ల మంచి గాయకురాలైంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం?
1) వికాసం ఒక పరస్పర చర్య
2) వికాసం సంచితమైనది
3) వికాసం అవిచ్ఛిన్నమైనది
4) వికాసం పరస్పర
సంబంధంగా కొనసాగుతుంది - కింది వాటిలో వికాస సూత్రం?
1) వికాసాన్ని ప్రాగుక్తీకరించలేం
2) పెరుగుదల, వికాసం అన్ని దశల్లో
ఒకే విధంగా సాగవు
3) వికాసం నిర్దిష్ట దిశ నుంచి
సాధారణ దిశగా సాగుతుంది
4) వికాసం సంకుచితమైనది - అమృతకు మానసిక వికాస లోపం కలదు. ఇది ఆమె భాషా వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని సూచించే వికాస సూత్రం?
1) వికాసం ఒక పరస్పర చర్య
2) వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి
3) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
4) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు - శిరీష మొదట తలను నిలిపిన తర్వాత నడుము నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్లను నిలిపి నడవటం చేస్తుంది. ఇందులోని వికాస సూత్రం?
1) సాధారణం నుంచి నిర్దిష్టం
2) అవిచ్ఛిన్నమైనది
3) కచ్చితమైన దిశగా సాగుతుంది
4) సంచితమైనది - పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం?
1) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
2) వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి
3) వికాసం ఒక కచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది
4) వికాసం ఒక పరస్పర చర్య - ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్ది దానిని వేళ్లతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం?
1) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
2) వికాసం పరస్పర సంబంధమైనది
3) వికాసం శిరోఃపాదాభిముఖంగా ఉంటుంది
4) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం - వికాసం ఏ దిశగా సాగుతుందని శిరఃపాదాభిముఖ వికాసం సూచిస్తుంది?
1) నాభి నుంచి తలకు
2) పాదం నుంచి నాభికి
3) తల నుంచి పాదానికి
4) కేంద్రం నుంచి ఇతర భాగాలకు - పిల్లవాని మానసిక వికాసం నెమ్మదిగా ఉండటం వల్ల అతనికి నైతిక వికాసం కూడా నెమ్మదిగా జరుగుతుంది. దీనికి సంబంధించిన వికాస సూత్రం?
1) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
2) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
3) వికాసం కచ్చితమైన నమూనాను
అనుసరిస్తుంది
4) వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి - కింది వాటిలో వికాస సూత్రం కానిది?
1) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది
2) వికాసం నిరంతర ప్రక్రియ
3) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
4) వికాసం సంచితమైనది - శ్రావణి చతురస్రం గీయడంలో ఇబ్బందిని గమనించిన ఉపాధ్యాయుడు డైమండ్‌ను గీయడంలో కూడా ఇబ్బందిని ఎదుర్కొంటుందని ఊహిస్తాడు. ఉపాధ్యాయుని ఈ ఊహకు మూలాధారమైన వికాస నియమం?
1) వికాసం క్రమానుగతమైనది
2) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు
3) వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే
సంచిత ప్రక్రియ
4) వికాసంలో వ్యక్తిగత భేదాలుంటాయి - మానవ వికాసం కొన్ని నియమాలను అనుసరిస్తుంది. ఆ వికాస నియమాల్లో భాగం కానిది?
1) నిరంతరం
2) వరుసక్రమం
3) సాధారణం నుంచి ప్రత్యేకం
4) పరివర్తనీయమైనది - కింది వాటిలో వికాస సూత్రం?
1) అందరిలోనూ సమానగతిని
అనుసరించదు
2) ఎల్లవేళలా రేఖీయ క్రమంలో జరుగుతుంది
3) నిరంతర ప్రక్రియ కాదు
4) వికాస ప్రక్రియ మధ్య
అంతర సంబంధం ఉండదు - సిరి ఏ పాఠ్యాంశాన్నయినా త్వరగా అభ్యసిస్తుంది. అమృత ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది?
1) వికాసం అవిచ్ఛిన్నమైనది
2) వికాసం సాధారణ అంశాల
నుంచి ప్రత్యేక అంశాలకు
జరుగుతుంది
3) వైయక్తిక భేదాలు
4) అంతర సంబంధాలు - శిశువు అభివృద్ధిలో శిరోఃపాదాభిముఖ నియమానికి సంబంధించిన సత్యమైన ప్రవచనం?
1) వికాసం తల నుంచి మొదలై
శరీర భాగాలకు విస్తరిస్తుంది
2) వికాసం కాళ్ల నుంచి మొదలై పై
శరీర భాగాలకు విస్తరిస్తుంది
3) వికాసం దేహ మధ్యస్థ భాగాల నుంచి మొదలై దూరం భాగాలకు
విస్తరిస్తుంది
4) ఏదీకాదు - శారీరక వికాసం నవజాత శిశువు, శైశవ దశలో వేగంగా ఉండి పూర్వ బాల్యదశలో వేగం కాస్త తగ్గి ఉత్తర బాల్యదశలో వేగం ఇంకా తగ్గి కౌమార దశలో వేగం పెరగడంలో వికాస సూత్రం?
1) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు
2) వికాసంలో వైయక్తిక
భేదాలుంటాయి
3) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
4) వికాసం ఒక పరస్పర చర్య - ఒక ఉపాధ్యాయుడు శ్రవణం, భాషణం, పఠనం, లేఖనంల క్రమాన్ని అనుసరించి బోధన చేయడానికి ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం క్రమానుగతమైనది
2) వికాసం సంచితమైనది
3) వికాసం నిరంతరమైనది
4) వికాసం సాధారణం నుంచి
నిర్దిష్టం వైపునకు జరుగుతుంది - కౌమారదశలో భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షణ, ఉద్వేగ అస్థిరతను కనబరుస్తున్న పిల్లవాడిని మందలిస్తున్న ఉపాధ్యాయుడికి ఏ వికాస నియమం పట్ల అవగాహన లేదు?
1) వికాసం అందరిలో ఒకే విధంగా జరగదు
2) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు
3) వికాసం క్రమానుగతం
4) వికాసం సంచితమైనది - 6వ తరగతి సామాన్యశాస్త్రంలో కొలతలు అనే పాఠ్యాంశంలో పొడవు, వైశాల్యం, ఘనపరిమాణాలను వరుస క్రమంలో అమర్చడం ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది?
1) వికాసంలో వైయక్తిక భేదాలు కలవు
2) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం
3) వికాసం క్రమానుగతం
4) వికాసం సంచితమైనది - సిరి 9 నెలల వయసులో నిలబడగలిగితే తన తమ్ముడు హస్వితేజ్ 12నెలల వయసులో చెల్లెలు సరయు 13 నెలల వయసులో నిలబడగలగటం ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు
2) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
3) వికాసం అందరిలో
సమానగతిని అనుసరించదు
4) వికాసం పరస్పర సంబంధమైనది - ఏ వస్తువునైనా రెండు చేతులతో పట్టుకునే కల్యాణ్ క్రమేపీ వస్తువు ఆకారాన్ని బట్టి ఒక్కో వస్తువును ఒక్కో రకంగా పట్టుకోవడం ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం సంచితమైనది
2) వికాసం సాధారణం నుంచి
నిర్దిష్టం వైపు జరుగుతుంది
3) వికాసం పరస్పర చర్య
4) వికాసం పరస్పర సంబంధమైనది - సాంఘిక వికాస క్రీడల పరంగా విద్యార్థి ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడల్లో పాల్గొనడం ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం క్రమానుగతమైనది
2) వికాసం సంచితమైనది
3) వికాసం పరస్పర చర్య
4) వికాసం అవిచ్ఛిన్నమైనది - పాఠశాల విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి అనేది ఏ వికాస నియమాన్ని
సూచిస్తుంది?
1) వికాసం పరస్పర చర్య
2) వికాసం పరస్పర సంబంధాలు
కలిగి కొనసాగుతుంది
3) వికాసం సంచితమైనది
4) వికాసం నిరంతరమైనది - 5వ తరగతిలో పరిసరాల విజ్ఞానాన్ని ప్రవేశపెట్టి 8వ తరగతిలో భౌతిక, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్ర్తాలను ప్రవేశపెట్టడంలో ఏ వికాస నియమాన్నిసూచిస్తుంది?
1) వికాసం పరస్పర చర్య
2) వికాసం క్రమానుగతమైనది
3) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం
వైపునకు జరుగుతుంది
4) వికాసం సంచితమైనది - NCF-2005 పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సహ పాఠ్యాంశాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలని సూచించడం ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం పరస్పర చర్య
2) వికాసం ఏకీకృత మొత్తం
3) వికాసం క్రమానుగతం
4) వికాసం ప్రాగుక్తీకరించవచ్చు - తల్లి గర్భంలో జైగోట్తో ప్రారంభమైన వ్యక్తి వికాసం జీవితాంతం జరుగుతూనే ఉంటుందని తెలిపేది?
1) వికాసం క్రమానుగతమైనది
2) వికాసం అవిచ్ఛిన్నమైనది
3) వికాసం పరస్పర చర్య
4) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు - ఒక ఉపాధ్యాయుడు తరగతిలో ప్రథమస్థానం సాధించిన అమృతకు ప్రత్యేక ప్రాజెక్టులను ఇచ్చి వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ బోధన చేస్తున్న అతడే ఏ వికాస నియమాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు భావించవచ్చు?
1) వికాసం అందరిలో ఒకే విధంగా
జరుగుతుంది
2) వికాసంలో వైయక్తిక భేదాలు కలవు
3) వికాసం ప్రాగుక్తీకరించవచ్చు
4) వికాసం అవిచ్ఛిన్నమైనది - వ్యాయామ ఉపాధ్యాయుడు నరేష్ ప్రధానోపాధ్యాయునితో మన పాఠశాల నుంచి భవిష్యత్తులో మంచి క్రికెటర్ ఆవిర్భవించగలడు అని తెలిపేందుకు ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం సంచితమైనది
2) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
3) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరుగదు
4) వికాసం పరస్పర చర్య - జ్ఞానేంద్రియ వికాసం, మెదడులో పెరుగుదల శైశవదశలో జరిగినంతగా ఏ దశలో జరుగదు అనేది ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది?
1) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
2) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరుగదు
3) వికాసం అందరిలో సమాన
గతిని అనుసరించదు
4) వికాసం సంచితమైనది - నవజాత శిశువు సాధారణ ఉత్తేజం ఆ తర్వాత ఆర్తి, ఆహ్లాదం అనే ప్రతిస్పందనలుగా విడిపోవడం ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు?
1) వికాసం ఏకీకృతమైనది
2) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం
3) వికాసం అవిచ్ఛిన్నమైనది
4) వికాసం కచ్చితమైన దిశగా సాగుతుంది - అంకెల భావన ఏర్పడిన తర్వాతనే సంఖ్యలు ఆ తర్వాత సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారాల వరుస క్రమంలో నేర్పడం ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది?
1) వికాసం కచ్చితమైన వరుసక్రమాన్ని అనుసరిస్తుంది
2) వికాసం పరస్పర చర్య
3) వికాసం సంచితం
4) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం
Answers:
1-1, 2-1, 3-2, 4-1, 5-2, 6-2, 7-3, 8-3, 9-4, 10-3, 11-4, 12-1, 13-1, 14-4, 15-1, 16-3, 17-1, 18-1, 19-1, 20-2, 21-3, 22-3, 23-2, 24-1, 25-2, 26-3, 27-2, 28-2, 29-2, 30-2, 31-2, 32-2, 33-1
- Tags
Previous article
DEETఉద్యోగాలు
Next article
తెలుగులో మొదటి లక్షణ గ్రంథం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు