అభ్యసనం – పునర్విమర్శ

- ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు నుంచి నలుగురు విద్యార్థులు ఒక సహకార సమూహంగా ఏర్పడి పాఠ్యగ్రంథ విషయంపై జవాబు సూచిక డైలాగ్‌లను వంతులవారీగా చెప్పడం?
1) పరస్పర బోధన
2) ప్రత్యుపాయ బోధన
3) విస్తార బోధన 4) సహకార అభ్యసనం - మంచి అభ్యసనాన్ని అవరోధపరిచే అంశం?
1) అభ్యసన అంశాలను అర్థవంతంగా, అంతర్గత ప్రేరణతో నేర్చుకోవడం
2) నిర్విరామంగా నేర్చుకోవడం
3) అవరోధాన్ని కలిగి ఉండటం
4) పునర్బలనాలను పొందుతూ నేర్చుకోవడం - కింది వాటిలో అంతర్గత ప్రేరణ సూచించేది?
ఎ. చింటు తుఫాను బాధితుల కోసం పాటల పోటీలో ప్రైజ్‌మనీ గెలవాలనుకోవడం
బి. తన తండ్రి గుర్తింపు పొందాలని పాటల పోటీలో పాల్గొనడం
సి. తోటి పిల్లల మెప్పు పొందాలని పాటల పోటీలో పాల్గొనడం
డి. పాటల పోటీలో పాల్గొనడం ద్వారా ఆనందం పొందడం
1) ఎ, డి 2) డి 3) బి, డి 4) ఎ, బి, డి - ఏ రకమైన ప్రేరణలో ప్రేరణ ఎక్కువ కాలం నిలిచి ఉండదు?
ఎ. బహిర్గత బి. సహజ సి. కృత్రిమ డి. అంతర్గత ఇ. దీర్ఘకాలిక
1) ఎ, సి 2) ఎ 3) సి 4) బి, డి - ఒక పిల్లవాడికి మొదట 20 చిత్రపటాలను చూపించి వాటిని మరో 60 చిత్రపటాలతో కలిపి మొదట చూపిన 20 గుర్తించమంటే 15 తప్పుగా గుర్తించినట్లయితే అతడి గుర్తింపు గణన?
1) 75 శాతం 2) 25 శాతం
3) 50 శాతం 4) 66.6 శాతం - ఒక పిల్లవాడు ఇంగ్లిష్ స్టోరీని మొదటిసారి 40 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. రెండోసారి అదే ఇంగ్లిష్ స్టోరీని 20 రోజుల తరువాత పది ప్రయత్నాల్లో నేర్చుకొనిన అతడి పొదుపు గణన ఎంత?
1) 25 శాతం 2) 50 శాతం
3) 75 శాతం 4) 16.6 శాతం - అభ్యసన బదలాయింపు అనేది వేటి మధ్య జరుగుతుంది?
1) రెండు నేర్చుకున్న విషయాల మధ్య జరుగుతుంది
2) రెండు నేర్చుకోబోయే విషయాల మధ్య జరుగుతుంది
3) ఒక నేర్చుకున్న, ఒక నేర్చుకోబోయే విషయం మధ్య జరుగుతుంది
4) ఏ విధంగానైనా జరుగవచ్చు - ఎ అనే విద్యార్థి బి అనే విద్యార్థికి ఇంగ్లిష్ అభ్యసించడంలో సహాయపడింది. ఎ నుంచి పొందిన జ్ఞానం వల్ల బి ఇంగ్లిష్‌లో అధిక మార్కులు సాధించింది. అయిన ఇక్కడ బి, ఎలలో జరిగే బదలాయింపులు వరుసగా?
1) అనుకూల, అనుకూల
2) శూన్య, అనుకూల
3) అనుకూల, శూన్య 4) శూన్య, శూన్య - ఒక 8వ తరగతి విద్యార్థి మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి ప్రాధాన్యం ఇచ్చిన ఉపాధ్యాయుడు ఏ అభ్యసన రంగానికి ప్రాధాన్యం ఇచ్చాడు?
1) మానసిక చలనాత్మక 2) క్రియాత్మక
3) భావావేశ 4) జ్ఞానాత్మక - ఏ స్మృతి టెక్నిక్‌ను ఉపయోగించి పిల్లలు దిక్కులు, మూలలను వరుసక్రమంలో ‘ఊరుతై అదనెపవగా’ గుర్తుంచుకుంటారు?
1) కొండగుర్తులు
2) ద్వంద్వ సంసర్గ అభ్యసనం
3) రిహార్సల్
4) గుంపులుగా ఏర్పరచుకోవడం - కింది వాటిలో స్మృతిని పెంపొందించడానికి తోడ్పడేది?
ఎ. అతి అభ్యసనం బి. నిర్విరామ అభ్యసనం సి. వల్లెవేయడం డి. విరామ అభ్యసనం
1) ఎ, సి, డి 2) బి 3) బి, సి 4) ఎ, సి, డి - విద్యార్థులతో మానసిక చలనాత్మక రంగ వికాసానికి దోహదపడే కృత్యం?
1) కవితల పోటీ 2) పాటల పోటీ
3) బృందగానం 4) ఈత, సైక్లింగ్ - సకశేరుక వర్గాలను అభ్యసించిన తరువాత అకశేరుక వర్గాలను గుర్తుతెచ్చుకోవడంలో ఎదురయ్యే ఇబ్బంది?
1) పురోగమన అవరోధం
2) తిరోగమన అవరోధం
3) దమనం 4) వాడుక లోపం - ఎబ్బింగ్ హాస్ ప్రకారం వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో ఆరో రోజు చివరకు జరిగే విస్మృతి, స్మృతి శాతం?
1) 75 శాతం, 25 శాతం
2) 72 శాతం, 28 శాతం
3) 28 శాతం, 72 శాతం
4) 25 శాతం, 75 శాతం - ఉపాధ్యాయుడు తరగతిలో ఒక పాఠాన్ని బోధించిన తరువాత ఆ పాఠ్యాంశానికి సంబంధించిన బహుళైచ్ఛిక రూపంలో పరీక్ష నిర్వహించాడు. అయిన అతడు వారిలో దేనిని మాపనం చేయదలచాడు?
1) గుర్తింపు 2) పునఃస్మరణ
3) పునరభ్యసనం 4) వైఖరులు - ‘యథా రాజా తథా ప్రజ’ అనేది ఏ అభ్యసన సిద్ధాంతానికి చెందింది?
1) అనుకరణ 2) నిర్గమ సిద్ధాంతం
3) ఉద్గమ సిద్ధాంతం 4) సంధాన సిద్ధాంతం - పాఠశాల పట్ల ఇష్టాన్ని ఏర్పర్చుకున్న సిరి ఉదయాన్నే స్కూల్ డ్రెస్ వేయగానే ఆనంద పడటం నిబంధిత అభ్యసనంలోని ఏ నియమాన్ని సూచిస్తుంది?
1) పునర్బలనం 2) సామాన్యీకరణ
3) విరమణ 4) ఉన్నత క్రమ నిబంధనం - నర్సరీ పాఠశాలకు చెందిన సిరి పలకపై రాసి ఇచ్చిన ‘ఎ’ అనే అక్షరాన్ని పలుమార్లు పలుకుతూ దిద్దడం వల్ల ‘ఎ’ అనే అక్షరాన్ని రాయగలగడం ఏ అభ్యసన సిద్ధాంతం సూచిస్తుంది?
1) ఎంపిక సంధాన సిద్ధాంతం
2) పరిశీలనాభ్యసనం
3) శాస్త్రీయ నిబంధనం
4) కార్యసాధక నిబంధనం - ఉపాధ్యాయుడు తరగతిలో హృదయ నిర్మాణాన్ని వివరించిన తరువాత సిరిని హృదయ పటాన్ని నల్లబల్లపై గీయమన్నాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు సిరితో ఏ విషయాన్ని మాపనం చేయదలిచాడు?
1) పునఃస్మరణ 2) గుర్తింపు
3) పునఃఅభ్యసనం 4) అభిరుచి - 6వ తరగతి చదువుతున్న సరయు అసెంబ్లీలో నీతి పద్యాన్ని చదవమంటే చదివింది. కానీ భావాన్ని తెలుపలేకపోయింది సరయులోని స్మృతి?
1) స్వల్పకాలిక 2) దీర్ఘకాలిక
3) క్రియాత్మక స్మృతి 4) బట్టీ స్మృతి - వ్యక్తి స్వభావ సిద్ధంగా ఇతరులను అనుకరించే ప్రవృత్తి ఏ ప్రేరణను సూచిస్తుంది?
1) బహిర్గత 2) సహజ
3) సాధన 4) క్రియాత్మకత - సంకేత రూపంలో భద్రపరిచిన ఎన్గ్రామ్లలోని సమాచారాన్ని తిరిగి అసలు రూపంలోకి మార్చడం సరికానిది?
1) ఎన్కోడింగ్ 2) డీకోడింగ్
3) జ్ఞప్తికి తెచ్చుకోవడం 4) రిట్రైవల్ - కథలు సంఘటనలకు, సన్నివేశాలకు, నాటకీకరణ చేయడం ద్వారా వాటిని నేర్చుకొని జ్ఞప్తికి ఉంచుకోవడం?
1) నిష్క్రియాత్మక స్మృతి 2) తార్కిక స్మృతి
3) క్రియాత్మక స్మృతి 4) సంసర్గ స్మృతి - ఉపాధ్యాయుడు నల్లబల్లపై గీతను గీసి దానిని చెరపకుండా చిన్నది చేయడాన్ని ఎలా అని ప్రశ్నించినప్పుడు సిరి ఆకస్మికంగా వచ్చిన ఆలోచన వల్ల సమస్యకు పరిష్కారం చూపడం ఏ అభ్యసనం?
1) శాస్త్రీయ నిబంధనం
2) కార్యసాధక నిబంధనం
3) యత్నదోష సిద్ధాంతం 4) అంతరదృష్టి - న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతం తెలపడంలో అతడికి ఏ అభ్యసన సిద్ధాంతం దోహదపడింది?
1) శాస్త్రీయ నిబంధనం 2) అంతరదృష్టి
3) కార్యసాధక నిబంధనం 4) యత్నదోష - ప్రశ్నించడం, సంక్షిప్తీకరించడం, స్పష్టం చేయడం, ప్రాగుక్తీకరించడం అనేవి నిర్మాణాత్మక అభ్యసనంలోని ఏ అంశాన్ని సూచిస్తుంది?
1) పరస్పర బోధన
2) భాగస్వామ్యయుత బోధన
3) నిరంతర బోధన 4) జ్ఞాన బోధ - విస్మృతికి కారణం?
1) కొండగుర్తులు
2) అర్థవంతంగా చదవకపోవడం
3) సంసర్గాలు 4) అతి విశ్వాసం - కింది వాటిలో సరైనది?
1) పునఃస్మరణ కన్నా గుర్తింపు తేలిక
2) గుర్తింపు కన్నా పునఃస్మరణ తేలిక
3) గుర్తింపు పునఃస్మరణ కన్నా రెండు రెట్లు చిన్నది
4) పునఃస్మరణ గుర్తింపు కన్నా 6 రెట్లు పెద్దది - ఒక తోటలో ఒకే రకమైన గులాబీలు పెంచినప్పుడు కంటే వివిధ రకాల గులాబీలను పెంచినప్పుడు ఆ తోట అందంగా కనిపిస్తుంది. ఇందులోని సిద్ధాంత భావన?
1) శాస్త్రీయ నిబంధన
2) కార్యసాధక నిబంధన
3) అంతరదృష్టి 4) యత్నదోష - దేశంలోని రాష్ర్టాలు, ముఖ్యమంత్రుల పేర్లు చెప్పమని అడగటంతో మురళి తన స్మృతిలో నుంచి సమాచారాన్ని బయటకు తీసే ప్రయత్నం?
1) సందర్భ సంకేతం 2) దీర్ఘకాలిక స్మృతి
3) వ్యవస్థీకరణ 4) వెనక్కి తీసుకోవడం - డెజావు అంటే?
1) గతంలో చూసినదాన్ని ఇప్పుడు గుర్తించలేకపోవడం
2) గతంలో చూడటంవల్ల ఒక విషయాన్ని రాసినట్లుగా అనిపించడం
3) గతంలో చూడకపోయినా ఎక్కడో చూసినట్లుగా ఉందని అనిపించడం
4) ప్రస్తుతం చూస్తున్న విషయం గతంలో కూడా చూసి ఉండటం - గతంలో చూడటంవల్ల ఒక విషయాన్ని ఎక్కడో చూసినట్లుగా ఉందని అనిపించడం?
1) పునఃస్మరణ 2) గుర్తింపు
3) పునరభ్యసనం 4) ధారణ - జంతువులపై చేసిన ప్రయోగాలకు సంబంధించి సరైనది?
ఎ. థారన్‌డైక్ – అమెరికా – పిల్లి
బి. స్కిన్నర్ – అమెరికా – ఎలుక/పావురం
సి. పావ్లోవ్ – రష్యా – కుక్క
డి. కొహ్లెర్ – జర్మనీ – చింపాంజీ
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి, డి, ఎ 4) డి, సి - చీకట్లో మాత్రమే సంచరించే బొద్దింక చీకటి ప్రాంతానికి వెళ్లగానే అతి స్వల్పంగా షాక్ కొట్టేట్లు చేస్తే కొద్దికాలానికి చీకట్లో సంచరించడం మానివేయడం?
1) సకారాత్మక నిబంధనం
2) నకారాత్మక నిబంధనం
3) పురాగామి నిబంధనం
4) తిరోగామి నిబంధనం - మెరిసేదంతా బంగారమే అనుకోవడం ఏ నియమాన్ని సూచిస్తుంది?
1) సామాన్యీకరణం 2) విచక్షణ
3) విరమణ
4) ఆయత్న సిద్ధ స్వాస్థ్యం - ఉపాధ్యాయుడు-విద్యార్థి, బ్లాక్‌బోర్డ్-చాక్‌పీస్, పుస్తకం-పెన్ వంటి పదాలు ఒకదాని వెంట ఒకటి తటస్థపడటం థారన్‌డైక్ ఏ నియమాన్ని సూచిస్తుంది?
1) సారూప్యత 2) సామీప్యత
3) ప్రేరణకారక 4) సంబంధిత - రసాయ శాస్త్రంతో అణు నిర్మాణం అనే పాఠ్యాంశ అభ్యసనం భౌతిక శాస్త్రంలో అదే పాఠ్యాంశ అభ్యసనాన్ని సులభతరం చేయడంలో ఇమిడి ఉండే నియమం?
1) సామీప్య 2) సారూప్య
3) పాక్షిక చర్య 4) బహుళ ప్రతిస్పందన - 1857 అంటేనే సిపాయిల తిరుగుబాటు గుర్తుకు రావడం?
1) సామీప్యత 2) సారూప్యత
3) సంబంధిత 4) పాక్షిక చర్య - శాస్త్రీయ నిబంధనానికి సంబంధించి సరికానిది?
1) ప్రతిస్పందన వెలువడినా వెలువడకపో
యినా పునర్బలనం లభిస్తుంది
2) థారన్‌డైక్ సామీప్యత నియమంపై
ఆధారపడుతుంది
3) రాబట్టబడిన ప్రతిస్పందనలు (నిర్గమాలు)
4) ప్రవర్తన పరిసరాలతో సంబంధం కలిగి బహిర్గతంగా ఉంటుంది - కార్యసాధన నిబంధనానికి సంబంధించి సరికానిది?
1) ప్రతిస్పందనకు ప్రాధాన్యం కలదు
2) ప్రవర్తన పరిసరాల్లో సంబంధం కలిగి బహిర్గతంగా ఉంటుంది
3) బయటకు వదిలిన ప్రతిస్పందనలు (ఉద్గమాలు)
4) ప్రవర్తన అంతర్గతంగా వ్యక్తిగతంగా ఉంటుంది - అంతర దృష్టి అభ్యసనానికి సంబంధించి సరికానిది?
1) గెస్టాల్ట్వాదానికి చెందినది
2) ఆయత్న సిద్ధ అభ్యసనం జరగుతుంది
3) మొత్తానికి కాకుండా విడిభాగాలకు ప్రాధాన్యం ఇస్తుంది
4) సమస్యా పరిష్కారం హఠాత్తుగా లభిస్తుంది - విజయ పథవరణ రీతి అభ్యసనం అని దేనికి పేరు?
1) శాస్త్రీయ నిబంధనం
2) కార్యసాధక నిబంధనం
3) యత్నదోష సిద్ధాంతం
4) అంతరదృష్టి అభ్యసనం - సంధాన సిద్ధాంతానికి చెందినది?
1) చింటు ఉపాధ్యాయుడి ప్రవర్తనను ఆదర్శంగా తీసుకోవడం
2) చింటు అలారం మోత వినగానే నిద్ర నుంచి మేల్కొవడం
3) చింటు క్లిష్టమైన గణిత సమస్యలను సులభంగా సాధించగలగడం
4) చింటు యోగాసనాలు సాధన చేయడం - నిర్మాణాత్మక ఉపగమం ప్రకారం అభ్యసనం అంటే?
1) ప్రత్యక్ష వ్యవస్థాపనం
2) నమూనాలను స్వీకరించడం
3) ప్రయత్నాల ద్వారా నేర్చుకోవడం
4) జ్ఞాన నిర్మాణం - కుక్కని చూసిన అనుభవమున్న చింటు గుర్రాన్ని చూసినప్పుడు అది కుక్కలాగా ఉంది. కానీ కుక్క కాదని గుర్తించి దానిని గురించి ఇంటర్నెట్, గ్రంథాలయం, కంప్యూటర్ల ఆధారంగా తెలుసుకోవడం వైగోట్స్కీ ప్రకారం?
1) సామాజిక స్కఫోల్డింగ్ 2) ఎంకేపీ
3) ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్
4) పరస్పర బోధన

శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
9441022571
- Tags
Previous article
పంచనదుల భూమిగా పిలిచే రాష్ట్రం?
Next article
కుర్క్యాల శాసనం వేయించింది?
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






