రన్నింగ్ పోటీలో ఉపయోగించే గడియారం?
- నిహారికలు అంటే?
1) అంతరిక్షంలో ఉండే నక్షత్ర వీధులు
2) అంతరిక్షంలో ఉండే వాయు,
ధూళి మేఘాలు
3) పాలపుంతల సముదాయం
4) సూర్యగోళంలో మండుతున్న
వాయు మేఘాలు - ఆకాశంలో దక్షిణం వైపున ఉన్న ప్రకాశవంతమైన నక్షత్రాల కూటమి?
1) పియాహ్ తియేహ 2) సప్తర్షి మండలం
3) ఓరియన్ 4) ఏదీకాదు - సూర్యుడు తూర్పు నుంచి పడమరకు పోతున్నట్లు భూమి మీద ఉన్నవారికి అనిపించడానికి కారణం?
1) భూమి తూర్పు నుంచి
పడమరకు తిరగడం
2) భూమి పడమర నుంచి
తూర్పుకు తిరగడం
3) భూమి ఉత్తరం నుంచి
దక్షణానికి తిరగడం
4) భూమి దక్షిణం నుంచి ఉత్తరానికి తిరగడం - రాకెట్ పనిచేసే సూత్రం?
1) న్యూటన్ మొదటి నియమం
2) న్యూటన్ రెండో నియమం
3) కెప్లర్ నియమం
4) న్యూటన్ మూడో నియమం - సెంటిగ్రేడ్ ఉష్ణమాపకాల్లో ఉండే విభాగాల సంఖ్య?
1) 100 2) 80 3) 180 4) 212 - వైశాల్యానికి M.K.S పద్ధతిలో ప్రమాణం?
1) చదరపు అడుగు
2) చదరపు సెంటీమీటరు
3) చదరపు మీటరు 4) అంకణం - అక్రమాకార వస్తువుల ఘనపరిమాణాన్ని కనుగొనుటలో ఉపయోగించేది?
1) పిప్పెట్ 2) బ్యూరెట్
3) లీటరుపాత్ర 4) నీరు, కొలజాడీ - వెర్నియర్ కనీసపు కొలత?
1) 0.1 సెం.మీ 2) 0.01 సెం.మీ
3) 0.001 సెం.మీ 4) 0. 0001 సెం.మీ - రన్నింగ్ పోటీలో ఉపయోగించే గడియారం?
1) సన్ డయల్ 2) నీడ గడియారం
3) స్టాప్ వాచ్ 4) చేతి గడియారం - స్థిరమైన లోలకం డోలనావర్తన కాలం?
1) కంపన పరిమితికి
అనులోమానుపాతంలో ఉంటుంది
2) కంపన పరిమితికి
విలోమానుపాతంలో ఉంటుంది
3) కంపన పరిమితి పై వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది
4) కంపన పరిమితిపై ఆధారపడి ఉండదు - గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్ల నిష్పత్తి?
1) 1:4 2) 4:1 3) 2:1 4) 1:2 - గాలిలో తేమ ఘనీభవించి చిన్న చిన్న మంచుముక్కలు గాలిలో తేలియాడుతూ ఉంటే దాన్నిఏమంటారు?
1) తుషారం 2) ఫ్రాస్ట్
3) పొగమంచు 4) మంచు - సబ్బులో అధికంగా ఉండే పదార్థం?
1) సోడియం సల్ఫేట్
2) పొటాషియం స్టియరేట్
3) సోడియం స్టియరేట్
4) పొటాషియం పెర్మ్యూటేట్ - సెడిమెంటేషన్ ట్యాంక్‌లో మలినాలు (బురద కణాలు) నీటి అడుగుభాగాన్ని చేరడానికి వాడే పదార్థం?
1) బొగ్గు 2) ఆలం (పట్టిక)
3) జీరోకార్బ్ 4) ఇసుక - గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే వాయువు?
1) Co 2) Co2 3) CFC 4) పైవన్నీ - స్కేటింగ్ ఏ సూత్రం ఆధారంగా ఆడతారు?
1) పీడనం తగ్గితే మంచు ద్రవీభవనం స్థానం తగ్గుతుంది
2) పీడనం తగ్గితే మంచు ద్రవీభవనం స్థానం పెరుగుతుంది
3) పీడనం పెరిగితే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది
4) పీడనం పెరిగితే మంచు ద్రవీభవన స్థానం పెరుగుతుంది - అంతరిక్షం నుంచి రాళ్లు, ఖనిజాలు భూమికి చేరడాన్ని ఏమంటారు?
1) ఉల్కలు 2) ఉల్కాపాతం
3) అల్బిడో 4) లిబిడో - విద్యుత్ బల్బులో నింపే వాయువు?
1) He 2) Kr 3) N 4) పై వన్నీ - కింది వాటిలో పరావర్తకాలు?
1) భూమి 2) చంద్రుడు
3) భూమి, చంద్రుడు 4) నక్షత్రాలు - కాంతి పరావర్తన సూత్రానికి సంబంధించి సరైనది?
1) పతన కిరణం, పరావర్తన కిరణం,లంబం ఒకే తలంలో ఉంటాయి
2) లంబానికి చెరోవైపున పతన,పరావర్తన కిరణాలు ఉంటాయి
3) పతన, పరావర్తన కోణాలు సమానం
4) పైవన్నీ - కన్ను, చెవి, గొంతు, పన్ను పరీక్షించే వైద్యులు ఉపయోగించేది?
1) కుంభాకార దర్పణం
2) పుటాకార దర్పణం
3) కుంభాకార కటకం
4) పుటాకార కటకం - పరావర్తన కిరణాలు పరావర్తనం తరువా త ఏదైనా బిందువు వద్ద కలుసుకోవడం లేదా ఖండించుకోవడం చేస్తే ఆ బిందువుకు ఆ వస్తువు స్థానం?
1) నిజ ప్రతిబింబ స్థానం
2) మిథ్యా ప్రతిబింబ స్థానం
3) వస్తువు నిజ స్థానం
4) ఏదీకాదు - కాంతి సిద్ధాంతానికి సంబంధించి కింది వాటిని జతపర్చండి
ఎ. కాంతి ఫోటానుల సముదాయం- న్యూటన్ సిద్ధాంతం
బి. కాంతి విద్యుదయస్కాంత
తరంగంలా ఉంటుంది - హైగన్స్ సిద్ధాంతం
సి. కాంతి అనుదైర్ఘ్య యాంత్రిక తరంగం - మాక్స్వెల్ సిద్ధాంతం
డి. కాంతి సూక్ష్మకణాల సముదాయం - మాక్స్ప్లాంక్స్ సిద్ధాంతం
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి- 4
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-2, బి-1, సి-4, డి-3
- న్యూటన్ సిద్ధాంతం
- ఎండమావులు ఏర్పడటానికి కారణం?
1) కాంతి పరావర్తనం
2) కాంతి వక్రీభవనం
3) కాంతి వ్యతీకరణం
4) కాంతి సంపూర్ణాంతర పరావర్తనం - ప్రతిపాదన (ఏ): కాంతి వేగం విరళయానకంలో సాంద్రతరయానకంలో కంటే ఎక్కువ. వివరణ (ఆర్): కాంతి తరంగాలు అనుదైర్ఘ్యయాంత్రిక తరంగాలు
1) ఏ సరైనది ఆర్ సరైనది కాదు
2) ఏ సరైనది ఆర్ సరైనది
3) ఏ, ఆర్ రెండూ సరైనవి. కానీ ఆర్,
ఏ కు సరైన వివరణ కాదు
4) ఏ, ఆర్ రెండూ సరైనవి. ఆర్,
ఏ కు సరైన వివరణ - బంకర్లలో ఉండి భూ ఉపరితలంపై శత్రు సైనికుల కదలికలను తెలుసుకోడానికి ఉపయోగించేది?
1) కుంభాకార కటకం 2) కెలిడయాస్కోపు
3) పెరిస్కోపు 4) ఏదీకాదు - టాపులేని కారులో ఒక వ్యక్తి 90 కిలో మీటర్ల సమవేగంతో నిలువు కొండవైపు ప్రయాణిస్తూ హారన్ మోగిస్తే ఆ ధ్వని ప్రతిధ్వనిని 4 సెకన్లలో విన్నాడు. గాలిలో ధ్వని వేగం 335ms-1 అయిన హారన్ మోగించిన ప్పుడు కొండనుంచి కారు దూరం మీటర్లలో?
1) 1440 2) 1240
3) 720 4) 620 - చల్లని పాలు వేడి టీని కలిపినప్పుడు ఉష్ణబదిలీ ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది?
1) ఉష్ణవాహనం 2) ఉష్ణసంవహనం
3) ఉష్ణవికిరణం 4) ఉష్ణమాపకం - వేడిచేసినప్పుడు ఎక్కువగా వ్యాకోచించేది?
1) ఇనుము 2) రాగి
3) నీరు 4) అల్యూమినియం - కింది వాటిలో ఉష్ణబంధకం కానిది?
1) రాగి 2) గాలి 3) నీరు 4) 1, 2 - సముద్రగాలులు భూమిపైకి వీచడానికి కారణం?
1) ఉష్ణవాహనం 2) ఉష్ణసంవహనం
3) ఉష్ణవికిరణం 4) ఉష్ణప్రసారం - పర్వత ప్రాంతాల్లో ఇంకు పెన్ను నుంచి ఇంకు బయటకు రావడానికి కారణం?
1) అధిక వాతావరణ పీడనం
2) పెన్ను లోపలి పీడనం కంటే బయట
పీడనం ఎక్కువగా ఉండటం
3) పెన్ను బయట పీడనం కంటే
తక్కువగా ఉండటం
4) ఉష్ణోగ్రత, వాతావరణ
సాంద్రత తక్కువగా ఉండటం - ఎ, బి అనే రెండు రైలు పట్టాలను ఒకదానితో మరొకటి బిగించినప్పుడు మధ్యలో ఖాళీ వదిలితే ఏం జరుగుతుంది?
1) వేసవి సమయంలో
రైలు పట్టాలు వ్యాకోచం చెందుతాయి
2) ఖాళీ వలన పట్టాలు బిగుతుగా ఉంటాయి
3) ప్రమాదాలు నివారించవచ్చు
4) పైవన్నీ - ఒక విద్యార్థి శీతాకాలంలో రాత్రి సమయంలో ఒక చేతితో లోహపుకడ్డీ మరొక చేతితో చెక్కను స్పృశించిన లోహపు కడ్డీ చల్లగా అనిపిస్తుంది. కానీ చెక్క అనిపించదు. దీనికి గల కారణం?
1) లోహం ఉత్తమ వాహకం,
చెక్క అథమ వాహకం
2) లోహం అథమ వాహకం,
చెక్క ఉత్తమ వాహకం
3) లోహం అథమ వాహకం అయినా
ఉష్ణాన్ని గ్రహించదు
4) పైవన్నీ - ఒక బాంబు పేలినప్పుడు వెలువడే శక్తి రూపాలు?
1) కాంతి, ఉష్ణం 2) ధ్వని, కాంతి, ఉష్ణం
3) కాంతి, ధ్వని 4) విద్యుత్ - సముద్రమట్టం నుంచి ఎత్తు పెరిగితే?
1) వాతావరణ పీడనం పెరుగుతుంది
2) మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత పెరుగుతుంది
3) నీరు మరిగే ఉష్ణోగ్రత పెరుగుతుంది
4) గాలి సాంద్రత పెరుగుతుంది - తాప నియంత్రకాలు ఉన్న సాధనాలు ఏవి?
1) విద్యుత్ ఇస్త్రీ పెట్టెలు 2) రిఫ్రిజిరేటర్లు
3) అగ్ని ప్రమాదాలను పసిగట్టే పరికరాలు
4) పైవన్నీ - ఉష్ణబంధకాలు?
1) రాగి, ఇనుము 2) అల్యూమినియం
3) రాగి 4) నీరు, గాజు - ఉష్ణం యానకం లేకుండా ప్రసరించడం?
1) ఉష్ణవికిరణం 2) ఉష్ణసంవహనం
3) ఉష్ణవాహనం 4) ఉష్ణప్రవాహం - మరుగుతున్న నీటికంటే నీటి ఆవిరి ఎక్కువ హానిని కలిగిస్తుంది. దీనికి కారణం?
1) నీటి ఆవిరి అధిక సాంద్రతను
కలిగి ఉంటుంది
2) నీటి ఆవిరి అధిక భాష్పీభవన గుప్తోష్ణాన్ని
కలిగి ఉంటుంది
3) నీటి ఆవిరి అధిక ఘనీభవన గుప్తోష్ణాన్ని కలిగి ఉంటుంది
4) నీటి ఆవిరిలో అనేక హానికారక
వాయువులు ఉంటాయి - సూర్యకాంతి, చెట్టు (వృక్షం) పత్రాల మధ్య ప్రసరిస్తూ, భూమిపై కాంతి వలయాలు ఏర్పరచడానికి గల కారణం?
1) సూర్యుడు గుండ్రంగా ఉండటం
2) సూర్యకాంతి తిర్యక్ తరంగ స్వభావం
3) వివర్తన ఫలితం
4) పత్రాల మధ్య గల అంతర
వృత్తాకారంగా ఉండటం - లేజర్ కాంతి ప్రత్యేక లక్షణం?
1) సంబద్ధత 2) విశయనీతయ
3) ఏకవర్ణీయత 4) పైవన్నీ - కుంభాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబం?
1) వస్తువు పరిమాణం కంటే చిన్నదైన
తలకిందులుగా ఉండే నిజ ప్రతిబింబం
2) వస్తువు పరిమాణం కంటే పెద్దదైన
తలకిందులుగా ఉండే మిథ్యా ప్రతిబింబం
3) వస్తువు పరిమాణానికి సమానమైన,
కుడి ఎడమలు తారుమారైన ప్రతిబింబం
4) వస్తువు పరిమాణం కంటే చిన్నదైన,
కుడి ఎడమలు తారుమారైన,
నిటారైన మిథ్యా ప్రతిబింబం - సంపూర్ణ పారదర్శక పదార్థం?
1) గాలి 2) శూన్యం 3) గాజు 4) నీరు - గబ్బిలాలు వేటిని ఉత్పత్తి చేయడం ద్వారా దోమలను వేటాడగలుగుతాయి?
1) అతిధ్వనులు 2) పరశ్రావ్యాలు
3) మైక్రోతరంగాలు 4) రేడియోతరంగాలు
- Tags
Previous article
కరెంట్ అఫైర్స్
Next article
పంచనదుల భూమిగా పిలిచే రాష్ట్రం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు