శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
1. కింది వాటిలో భిన్నమైనది?
1) గ్రీలిన్ 2) లెప్టిన్
3) సెక్రిటిన్ 4) వాసోప్రెస్సిన్
2. ఆహారం జీర్ణమయ్యే భాగం?
1) కాలేయం 2) మూత్రపిండాలు
3) చిన్నప్రేగు 4) పెద్ద ప్రేగు
3. ఆస్యకుహరంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారపు ముద్దను ఏమంటారు?
1) కైమ్ 2) కైల్
3) విల్లే 4) బోలస్
4. మానవుని జీర్ణాశయంలో ఉత్తత్తి అయ్యే ఆమ్లం?
1) ఎసిటిక్ ఆమ్లం
2) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
3) ఫార్మిక్ ఆమ్లం
4) నైట్రిక్ ఆమ్లం
5. మానవునిలో పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్‌లు దేనిలో ఉంటాయి?
1) లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు
2) లాలాజల గ్రంథులు, క్లోమగ్రంథులు
3) ఆంతరగ్రంథులు, జఠర గ్రంథులు
4) పైవేవీకావు
6. పైత్యరసంలో ఉండే ఎంజైమ్
1) రెనిన్ 2) ట్రిప్సిన్
3) బైలురూబిన్ 4) ఉండవు
7. కొవ్వులను ఎమల్సీకరణం చేసేవి?
1) క్లోమరస లవణాలు
2) పైత్యరస లవణాలు
3) పైత్యరస వర్ణకాలు
4) అమైలేజ్
8. జీర్ణవ్యవస్థ నాళాలు, శ్వాసవ్యవస్థ నాళాలు కింది భాగం ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాయి?
1) ఆహార వాహిక 2) గ్రసని
3) స్వరపేటిక 4) శ్వాసనాళం
9. కింది వాటిలో హీమోపోయిటిక్, హీమోలైటిక్ అవయవంగా పనిచేసేది?
1) ప్లీహం 2) కాలేయం
3) 1, 2 4) పిత్తాశయం
10. శాకాహార క్షీరదాల్లో డయాస్టీమా వేటి మధ్య ఉండును?
1) కుంతకాలు-రదనికలు
2) రదనికలు – చర్వణకాలు
3) కుంతకాలు – చర్వణకాలు
4) కుంతకాలు – అగ్రచర్వణకాలు
11. కింది వాటిలో సరైన జతకానిది?
1) రెనిన్- కాలేయం
2) టయలిన్ – ఆస్యకుహరం
3) పెప్సిన్ -జీర్ణాశయం
4) ట్రిప్సిన్ – క్లోమం
12. జీర్ణవ్యవస్థలోని ఏ భాగాల్లో పెరిస్టాలిటిక్ చలనం గమనించవచ్చు?
ఎ) నోరు బి) ఆహార వాహిక
సి) చిన్న పేగు డి) జీర్ణాశయం
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
13. సోడియం, పొటాషియం కోలేట్లు టారా కోలేట్లు దేనిలో ఉంటాయి?
1) ఆంత్రరసం 2) జీర్ణరసం
3) పైత్యరసం 4) క్లోమరసం
14. కింది జీర్ణరసాలు అవి స్రవించే గ్రంథులను సరిగా జతపరచండి?
1) లాలాజలం ఎ) అంతరగ్రంథులు
2) జఠరరసం బి) క్లోమం
3) పైత్య రసం సి) కాలేయం
4) క్లోమరసం డి) జఠర గ్రంథులు
5) ఆంత్రరసం ఇ) లాలాజల గ్రంథులు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-డి, 5-బి
4) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-సి
15. జీర్ణవ్యవస్థలోని వ్యర్థ పదార్థం?
1) కైల్ 2) కైమ్
3) మూత్రం 4) మలం
16. ఏకకణ జీవుల్లో ఆహార సేకరణ పద్ధతి కింది వేటి ద్వారా జరుగుతుంది?
1) శరీర ఉపరితలం ద్వారా
2) నోటి ద్వారా 3) దంతాల ద్వారా
4) రిక్తిక ద్వారా
17. జీర్ణక్రియలో పాల్గొనే రసాయన పదార్థాలు?
1) ఎంజైమ్‌లు
2) హార్మోన్లు
3) విటమిన్లు
4) న్యూరోట్రాన్స్మీటర్లు
18. పేగులో ఆహార పదార్థాల స్థితి?
1) ఆమ్లం 2) క్షారం
3) తటస్థం 4) లవణయుతం
19. అల్సర్లకు కారణం?
1) వైరస్ 2) బ్యాక్టీరియా
3) శైవలం 4) శిలీంధ్రం
20. జీర్ణవ్యవస్థలో పిండి పదార్థాలు చివరిగా దేనిగా మారతాయి?
1) అమైనో ఆమ్లాలు 2) గ్లూకోజ్ 3) కొవ్వు ఆమ్లాలు 4) గ్లిజరాల్
1. అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగమేది?
1) అండాశయం
2) ఎపిడిడిమిస్
3) గర్భాశయ ముఖ ద్వారం
4) ఫాలోపియన్ నాళం
2. శుక్రకణం అండంతో కలిసే ప్రక్రియను ఏమంటారు?
1) ఫ్రాగ్మెంటేషన్ 2) ఫెర్మెంటేషన్
3) ఫెర్టిలైజేషన్ 4) ఫ్యూజన్
3. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది?
1) వాస్ డిఫరెన్స్ 2) ఎపిడిడిమిస్
3) బ్లాడర్ 4) స్క్రోటమ్
4. శుక్రకణం, అండం పొరలను ఎలా ఛేదిస్తుంది? కింది వాటిలో సరైన దాన్ని ఎన్నుకోండి?
1) అండకవచంలోని రంధ్రాన్ని చీల్చడం ద్వారా
2) అండకవచాన్ని రసాయనాలతో కలిగించడం ద్వారా
3) అండకవచాన్ని కొరకడం ద్వారా
4) అండకవచంలోని ఖాళీలను నొక్కడం ద్వారా
5. అండం, శుక్రకణాల కంటే పెద్దదిగా ఉంటుంది ఎందుకు సరైన దాన్ని ఎన్నుకోండి?
1) అండం ఎక్కువ కణాలను కలిగి ఉంటుంది
2) ఫలదీకరణం అనంతరం పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది
3) మందమైన కణ కవచాలను కలిగి ఉంటుంది
4) పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటుంది
6. కింది వాటిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపేవి? సరైన దాన్ని ఎన్నుకోండి?
1) సిగరెట్ పొగలోని రసాయనాలు
2) ఆల్కహాల్
3) మందులు 4) పైవన్నీ
7. కింది వాటిని జతపరచండి?
1) బ్యాక్టీరియాలో అలైంగికోత్పత్తి విధానం ఎ) పార్థినోకార్పి
2) విత్తనాలు లేని ఫలాలు ఏర్పడే ప్రక్రియ బి) విచ్ఛిత్తి
3) ఈస్ట్‌లోని అలైంగిక విధానం సి) తేనెటీగలు, చీమలు, కందిరీగలు
4) పార్థినోజెనెసిస్ డి) కోరకీభవనం
5) రైజోపస్లో ప్రత్యుత్పత్తి విధానం ఇ) సిద్ధబీజాలు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ 2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ
3) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ 4) 1-సి, 2-ఇ, 3-డి, 4-ఎ, 5-బి
8. ఫెర్న్ మొక్కలోని ఆకు అడుగు మచ్చలను ఏమంటారు?
1) సంచులు 2) పరాగరేణువులు
3)సోరై 4) కార్బైక్యులా
9. కింది వాటిని జతపరచండి.
1) భూచర జంతువుల్లో ఫలదీకరణ విధానం ఎ) ఫాలోపియన్ నాళం
2) మానవునిలో ఫలదీకరణ జరిగే ప్రదేశం బి) అంతర ఫలదీకరణం
3) జరాయువు ఏర్పడే సమయం సి) 280 రోజులు
4) మూడు నెలల పిండం డి) 12వ వారం
5) మానవుని గర్భావధి కాలం ఇ) భ్రూణం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ 2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-డి, 5-బి 4) 1-బి, 2-ఎ, 3-డి, 4-ఇ, 5-సి
10. సోము తన ఇంటిలో తోకను కోల్పోయిన బల్లి తిరిగి మళ్లీ ఏర్పరచుకోవడం గమనించాడు. ఇది ఏ ప్రక్రియ?
1) ముక్కలు అవటం
2) పునరుత్పత్తి
3) విచ్ఛిత్తి 4) కోరకీభవనం
11. బాహ్య ఫలదీకరణం కంటే అంతర ఫలదీకరణం మెరుగైనది ఎందుకంటే?
ఎ) అంతర ఫలదీకరణంలో
పిండానికి రక్షణ ఉంటుంది
బి) అంతర ఫలదీకరణంలో
ఫలదీకరణ అవకాశాలు ఎక్కువ
సి) అంతర ఫలదీకరణలో
మనుగడ అవకాశాలు ఎక్కువ
డి) అంతర ఫలదీకరణలో
పోషణ సదుపాయాలు ఎక్కువ
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) సి, డి
12. కింది వాటిని వరుసక్రమంలో అమర్చండి.
1) శుక్రవాహికలు 2) శుక్రనాళికలు
3) శుక్రోత్పాదక నాళికలు
4) శుక్రాశయం
1) 2, 1, 3,4 2) 3, 2, 4, 1
3) 4, 2, 3, 1 4) 3, 2, 1, 4
13. పురుష ప్రత్యుత్పత్తిలోని ప్రసేకం ద్వారా
1) మూత్రం ప్రయాణిస్తుంది
2) ఎంజైమ్స్ ప్రయాణిస్తాయి
3) శుక్రం ప్రయాణిస్తుంది
4) హార్మోన్స్ ప్రయాణిస్తాయి
1) 1, 2 2) 1, 3
3) 2, 4 4) 2, 3
14. గర్భావధి చివరి కాలంలో క్షీర గ్రంథుల్లో పోగయ్యి, శోషరసాన్ని పోలిన ద్రవం?
1) ముర్రుపాలు 2) ప్రథమస్తన్యం
3) కోలోస్ట్రమ్ 4) పైవన్నీ
15. కింది వాటిలో సరైన వాక్యం?
ఎ) పార్థినోజెనెసిస్ విధానంలో ఏర్పడిన ఏకస్థితిక పిల్లజీవులు – మగజీవులు
బి) పార్థినో జెనెసిస్ విధానంలో ఏర్పడిన ద్వయస్థితిక పిల్లజీవులు – ఆడజీవులు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
16. శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
1) ఎపిడిడిమిస్ 2) ముష్కాలు
3) శుక్రవాహికలు 4) పౌరుషగ్రంథి
17. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
ఎ) ట్యూబెక్టమీ పురుషులకు నిర్వహిస్తారు
బి) వ్యాసెక్టమీ స్త్రీలకు నిర్వహిస్తారు
సి) కండోమ్ తాత్కాలిక గర్భ నిరోధక సాధనం
డి) కాపర్ – T స్త్రీ
గర్భ నిరోధక సాధనం
1) బి, సి 2) ఎ, బి
3) సి, డి 4) బి, డి
18. కింది వాటిని జతపరచండి.
1) G1, దశ ఎ) సమవిభజన జరిగే దశ
2) S దశ బి) కణాంగాల విభజన
3) G2 దశ సి) డీఎన్ఏ సంశ్లేషణ
4) M దశ డి) కణపరిమాణం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
19. సమ విభజనలో ఉన్న వివిధ ప్రావస్థల మధ్యగల క్రియాత్మక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఏ శాస్త్రవేత్తలు కణ సంలీన ప్రక్రియను ఉపయోగించి ప్రయోగాలు చేశారు?
1) వాట్సన్, క్రిక్
2) పోటు నరసింహారావు, జాన్సన్
3) ష్వాన్, ఆవ్రే
4) మెకంజీ – మెక్ లాయిడ్
20. గాయం తగిలితే కొద్ది రోజుల్లో గాయం మానిపోతుంది. ఆ ప్రాంతంలో జరిగే కణ విభజన?
1) క్షయకరణ విభజన 2) సమవిభజన
3) అసమ విభజన 4) 1, 2
21. కింది ఏ మొక్కలో పిండం విత్తనంగా ఎదిగే వరకు దానితోపాటే అంకురచ్ఛదం పెరుగుతుంది?
1) చిక్కుడు 2) బఠాణి
3) మొక్కజొన్న 4) పైవన్నీ
22. పిండకోశంలో ద్వయస్థితిలో ఉండే కణం
1) స్త్రీ బీజకణం
2) సహాయ కణాలు
3) ద్వితీయ కేంద్రకం
4) ప్రతిపాదక కణాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు