ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
కొఠారి కమిషన్ (1964-66)
- దీన్నే జాతీయ విద్య, భారతీయ విద్యా కమిషన్ అంటారు.
- రాజ్యాంగంలో నిర్దేశించిన బాధ్యతల మేరకు, మారిన అవసరాల సమస్యల దృష్ట్యా అన్ని రంగాల్లో విద్య అభివృద్ధికి సమగ్రమైన సూచనలను చేయడానికి డా.దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన, జేపీ నాయక్ కార్యదర్శిగా భారతీయ విద్యా కమిషన్‌ను 1964, జూలై 14న కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1964, అక్టోబర్ 2 నుంచి ఈ కమిషన్ పని చేయడం ప్రారంభించింది.
- విద్య జాతీయ వికాసం/అభివృద్ధి పేరుతో 19 అధ్యాయాలతో కూడిన సమగ్రమైన నివేదికను 1966, జూన్ 29న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసీ చాగ్లాకు సమర్పించారు.
- కొఠారి 1948లో రక్షణ శాఖకు శాస్త్రీయ సలహాదారుడిగా పని చేశారు. అందువల్ల ఇతన్ని ఆర్కిటెక్ట్ ఆఫ్ డిఫెన్స్ సైన్స్ అని పిలుస్తారు.
- 1961లో యూజీసీ చైర్మన్‌గా పని చేశారు.
- 1962లో పద్మ భూషణ్, 1973లో పద్మ విభూషణ్ అవార్డులను పొందారు.
- 1981 నుంచి 1991 వరకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వైస్ చాన్స్‌లర్‌గా పని చేశారు.
- NCERT ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తల కోసం నిర్వహించే NTSE (National Talent Search Examination) లను ప్రారంభించారు.
- జైన మతస్థుడు
- దేశంలో విద్య శీఘ్రగతిన ఆధునీకరణకు తోడ్పడాలి
- విద్యా లక్ష్యాలు, ప్రజల ఆశయాలకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి.
- ఎక్కువ మందిగల తరగతుల్లో బోధన నాణ్యతకు తీవ్ర నష్టం చేకూరుతుంది. రద్దీగా ఉన్న తరగతి గదుల్లో సృజనాత్మకతకు ప్రాముఖ్యత లోపిస్తుంది.
- మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడం అనేది అత్యంత ప్రాధాన్య విషయం.
- జేపీ నాయక్: అసలు పేరు జయంత్ పాండురంగ నాయక్.
- యునెస్కో ఎంపిక చేసిన 100 మంది విద్యావేత్తల్లో ఠాగూర్, గాంధీలతో పాటు జేపీ నాయక్ ఒకరు.
- 1950-51లో డా.సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు.
- విద్యా మంత్రిత్వ శాఖలో ఉపాధ్యాయులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు.
- విద్యా ఉత్పాదకత
ఈ కమిషన్ విద్యా లక్ష్యాలు
- సాంఘిక, జాతీయ సమైక్యత
- ప్రజాస్వామ్య విలువలు, అభివృద్ధి
- అంతర్జాతీయ అవగాహన
- ఆధునీకరణ
- సాంఘిక, నైతిక, ఆధ్యాత్మికత
- 19 అధ్యాయాల నివేదికను మూడు భాగాలుగా విభజించారు. అవి..
- మొదటి భాగం- 1 నుంచి 6 అధ్యాయాలు (విద్య పునర్నిర్మాణం)
- రెండో భాగం- 7 నుంచి 17 అధ్యాయాలు (ప్రాథమిక, మాధ్యమిక, ఉపాధ్యాయులు, మూల్యాంకనం మొదలైనవి.)
- మూడో భాగం- 18, 19 అధ్యాయాలు (విద్య పరిపాలన, కరికులమ్/ప్రణాళిక)
- విద్యా విధానం 10+2+3
- మూడు నుంచి ఆరు సం.ల వయస్సు వరకు ఉచిత పూర్వ ప్రాథమిక విద్య
- 10 సం.ల విద్య అంటే.. 7/8 సం. ప్రాథమిక, 2/3 సం. మాధ్యమిక విద్య
- ప్రాథమిక విద్య – 1-4/5వ తరగతులు దిగువ ప్రాథమిక, కి.మీ పరిధిలో విద్య, మాతృభాషలో బోధన, ఇతర సబ్జెక్టులతో పాటు పని అనుభవం ఉండాలి.
- 6-7/6-8 తరగతులు ఎగువ ప్రాథమిక. 3 కి.మీ ల పరిధిలో పాఠశాల, ద్వి భాష అంటే మాతృభాష, హిందీ/ఇంగ్లిష్. వీటితో పాటు వ్యాయామం, కళ, నైతిక, విలువల విద్య.
- 9 నుంచి 10 తరగతులు- దిగువ సెకండరీ. సబ్జెక్టులతో పాటు సంగీతం, లలిత కళలు.
- 11, 12 తరగతులు- హయ్యర్ సెకండరీ. సబ్జెక్టులతో పాటు బాలికలకు హోమ్ సైన్స్ ఆప్షనల్‌గా ఉండాలి.
- హయ్యర్ సెకండరీ స్థాయిలో 1 లేదా 3 సం.ల వృత్తి విద్యలు.
- 3 సంవత్సరాల డిగ్రీ
- 2 సంవత్సరాల పీజీ ఉండాలి.
- వృధా, స్తబ్ధత నివారించటానికి 1వ తరగతిలో చేరిన పిల్లలు కనీసం 80 శాతం మంది 10వ తరగతి వరకు కొనసాగేలా చూడాలి.
పీయూసీ (Pre University Course)
- దీన్ని యూనివర్సిటీ నుంచి మాధ్యమిక పాఠశాలకు బదిలీ చేయాలి. రెండు సం.ల కోర్సు ఉండాలి.
- పాఠశాల పని దినాలు 234. 39 వారాలు.
- కళాశాలలో 36 వారాలు పని చేయాలి.
- క్యాలెండర్ రూపకల్పనలో కేంద్రం రాష్ర్టాలను సంప్రదించాలి.
- సెలవుల వ్యత్యాసం 10 రోజులకు మించరాదు
- పరీక్షలకు, ముఖ్య దినాలకు 21 రోజులు కేటాయించాలి.
- పర్యవేక్షకులు వార్షిక, త్రై వార్షిక తనిఖీ చేపట్టాలి.
- విద్య అభివృద్ధికి పర్యవేక్షణ వెన్నెముక వంటిది. పర్యవేక్షకులకు కూడా నేషనల్ స్టాఫ్ కాలేజ్ ఇన్‌సర్వీస్ ద్వారా శిక్షణ ఉండాలి.
- ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్‌ను స్థాపించాలి. డీఈవోను అందులో చేర్చాలి.
- పాఠశాల విద్యలో మార్గదర్శకత్వం, మంత్రణం అంతర్థానంగా ఉండాలి.
- విద్య అభివృద్ధికి స్కూల్ కాంప్లెక్స్ ఉండాలి. దీన్ని రెండు స్థాయిల్లో ప్రారంభించాలి.
- మొదటి స్థాయి- 1 నుంచి 5 తరగతుల 8 లేదా 10 పాఠశాలలను, 6 నుంచి 8 తరగతి పాఠశాలలకు అనుసంధానించాలి. ఈ హెచ్ఎం కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
- రెండో స్థాయిలో ఇలా అనుసంధానించిన 6 నుంచి 8 తరగతుల 4 లేదా 5 స్కూల్స్‌ను ఒక హైస్కూల్‌కు అనుసంధానించాలి.
- 5 సంవత్సరాలకు ఒకసారి విద్యా విధానాన్ని సమీక్ష చేయాలి.
- అందరికీ కామన్ స్కూల్ (సాధారణ పాఠశాల) ఉండాలి.
- బుక్ బ్యాంక్స్ ఉండాలి. ప్రతిభావంతుల్లో 15 శాతం మందికి స్కాలర్షిప్స్, బుక్ గ్రాంట్లు ఇవ్వాలి.
- ఎలిమెంటరీ స్థాయి వరకు బోధించే ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల ఉచిత ఉపాధ్యాయ శిక్షణ, శిక్షణా కళాశాలలు 230 రోజులు పని చేయాలి. టీచింగ్ ప్రాక్టీస్ కోసం అటాచ్డ్ పాఠశాల ఉండాలి.
- ప్రాథమిక విద్య ఉచితంగా అందించాలి.
NPE-జాతీయ విద్యా విధానం (1968)
- కొఠారీ సిఫారసులతో మొదటి జాతీయ విద్యా విధానానికి రూపకల్పన జరిగింది.
- ఈ విద్యా విధానాన్నే పునర్నిర్మాణం చేసే ‘రాడికల్’ ప్రక్రియ అని పేర్కొన్నారు.
- 10+2+3 విద్యా విధానం, త్రి భాషా సూత్రం (తెలుగు, హిందీ, ఆంగ్లం), క్రీడలు (పాఠశాల విద్యలో) ఉండాలని సూచించారు.
ఈశ్వరీ భాయ్ పటేల్ కమిటీ (1977)
- 1968 జాతీయ విద్యా విధానాన్ని కొన్ని రాష్ర్టాలు ఒకే విధంగా అమలు చేయకపోవడంతో కేంద్రంలో ఉన్న జనతా ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలనే దృక్పథంపై సమీక్ష నిర్వహించమని గుజరాత్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఈశ్వరీ భాయ్ పటేల్‌ను నియమించారు.
- ఇతను 3 సబ్జెక్టులను ప్రతిపాదించారు. 1. మానవీయ శాస్త్రం, 2. పరిసరాల విజ్ఞానం 1, 2 పేరుతో అమలు చేస్తున్నారు. 3. SUPW- సాంఘికంగా ప్రయోజనం గల ఉత్పత్తిదాయక కృషి
- SUPW కోసం 1 నుంచి 5వ తరగతి వరకు టైం టేబుల్ నుంచి 20 శాతం సమయం, 6 నుంచి 10వ తరగతి వరకు వారానికి ఆరు పిరియడ్స్.
- టీచర్లకు Hand Books, TLM ఉండాలి
1 నుంచి 5వ తరగతికి ప్రతిపాదనలు/సిఫారసులు
- కచ్చితమైన అకాడమిక్ ఇయర్ ప్రాథమిక దశలో అవసరం లేదు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి.
- 2 1/2 నుంచి 3 గంటలు విద్యార్థులు ఉంటే చాలు
- కచ్చితమైన టైం టేబుల్ విద్యా పరంగా ఆరోగ్యవంతమైనది కాదు.
- పాఠ్య పుస్తకాల భారం తగ్గాలని 1, 2 తరగతులకు (ఒక్క) భాషకు మాత్రమే ఒక టెక్ట్స్ బుక్, 3, 4, 5 తరగతులకు భాష, మ్యాథ్స్, సైన్స్‌కు 3 టెక్ట్స్ బుక్స్ మాత్రమే.
- హోంవర్కు వద్దు. పాఠశాలలోనే అధిక స్వీయ శిక్షణ ఉండాలి.
మాల్కం ఆదిశేషయ్య కమిటీ (1978)
- ఇంటర్‌కు సమాన స్థాయిలో వృత్తివిద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి అప్పటి మద్రాసు యూనివర్సిటీ వీసీ మాల్కం ఆదిశేషయ్యను నియమించారు.
- వీరి నివేదిక లెర్నింగ్ టు డు.
- వృత్తి విద్యా కోర్సుల అనంతరం అప్రెంటిస్, సెమిస్టర్ పరీక్షలు.
- విద్యార్థులను అనాథలుగా వదిలిపెట్టరాదు.
ప్రాక్టీస్ బిట్స్
1. కొఠారీ కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పడింది?
1. దౌలత్ సింగ్
2. చంద్రశేఖర్ ఆజాద్
3. శాడ్లర్
4. విష్ణుస్వామి
2. కొఠారీ కమిషన్ తన సిఫారసులను ఏ నెల, ఏ సంవత్సరంలో ప్రభుత్వానికి సమర్పించినది?
1. జూన్ 29, 1966
2. జూన్ 28, 1966
3. జూన్ 24, 1966
4. జూన్ 21, 1966
3. కొఠారీ కమిషన్ సిఫారసుల్లో లేనిది?
1. పాఠశాల దశ నుంచి ఆంగ్ల
విద్య ప్రోత్సాహం
2. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయడం
3. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్
4. అన్ని విద్యా దశల్లో సాధారణ విద్యలో అంతర్భాగంగా పని అనుభవం
ప్రవేశపెట్టాలి
4. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
1. 1977 2. 1877
3. 1967 4. 1987
5. ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ సిఫారసుల్లో ఉన్నవి?
1. నియత, అనియత విధానాల ద్వారా విద్యను అందించాలి
2. విద్యా సూత్రాలకు విద్యా విధానాల్లో ముఖ్య స్థానాన్ని కల్పించాలి
3. బహుళ ప్రవేశ విధానాన్ని అమలు చేయాలి
4. పైవన్నీ
6. కామన్ స్కూల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన కమిటీ?
1. ఆచార్య రామ్మూర్తి కమిటీ
2. ఈశ్వరీ భాయ్ పటేల్ కమిటీ
3. రాధా కృష్ణన్ కమిషన్
4. మాధ్యమిక విద్యా కమిషన్
7. 10+2+3 నమూనాను సూచించిన కమిషన్?
1. కొఠారీ కమిషన్
2. ఈశ్వరీ భాయ్ పటేల్ కమిషన్
3. యశ్పాల్ కమిటీ
4. ఆచార్య రామ్మూర్తి కమిటీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు