DSC Special | పియాజే, బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేధించిన ప్రధాన అంశం?
1. ఎప్పుడూ విమానం చూడని పిల్లవాడు మొదటిసారి ఆకాశంలో విమానం చూసినప్పుడు దానిని తెల్లని పక్షిగా గుర్తించడంలో సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది?
1. వ్యవస్థీకరణం 2. సాంశీకరణం
3. అనుగుణ్యం 4. సమతుల్యత
2. పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారని తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త?
1. పియాజే 2. చోమ్స్కీ
3. కార్ల్ రోజర్స్ 4. ఫ్రాయిడ్
3. పిల్లాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ?
1. వ్యవస్థీకరణ 2. సాంశీకరణం
3. అనుగుణ్యం 4. సమతుల్యత
4. పిల్లాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ?
1) సాంశీకరణ 2) వ్యవస్థీకరణ
3) అనుగుణ్యం 4) సమతుల్యత
5. పియాజే, బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేధించిన ప్రధాన అంశం?
1) బోధన, పరిపక్వతల మధ్య సంబంధం
2) బోధన, ప్రేరణల మధ్య సంబంధం
3) బోధన, విషయాల మధ్య సంబంధం
4) బోధన, మూల్యాంకనాల మధ్య సంబంధం
6. పాలపీకతో పాలు తాగే అలవాటున్న పిల్లవానికి గ్లాసుతో ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి తర్వాత కొత్తగా గ్లాసుతో తాగడం నేర్చకుంటాడు. ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియ?
1) సాంశీకరణం 2) వ్యవస్థీకరణం
3) సమతుల్యత 4) అనుగుణ్యం
7. తన తల్లిని మమ్మీ అని పిలిచే పిల్లాడు మహిళలందరినీ మమ్మీ అని పిలువసాగాడు. దీనికి గల కారణం?
1) అనుగుణ్యం 2) వ్యవస్థీకరణ
3) సాంశీకరణం 4) సర్వాత్మవాదం
8. తల్లి కనిపించకపోతే పిల్లాడు తన తల్లిని
వెదకడంతో ప్రారంభమయ్యే పియాజే
సంజ్ఞానాత్మక దశ?
1) పూర్వ ప్రచాలక దశ
2) ఇంద్రియ చాలక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) అమూర్త ప్రచాలక దశ
9. ఒక అమ్మాయి తను ఆడుకొనే బొమ్మకు స్నానం చేయించడం, అన్నం పెట్టడం చేస్తోంది. పియాజే ప్రకారం ఈ ఆమ్మాయి సంజ్ఞానాత్మక దశ?
1. ఇంద్రియ చాలక దశ
2. అమూర్త ప్రచాలక దశ
3. మూర్త ప్రచాలక దశ
4. పూర్వ ప్రచాలక దశ
10. పూర్వ భావనాత్మక అంతర్బుద్ధి దశలను
కలిగిన సంజ్ఞానాత్మక దశ ఏది?
1. పూర్వ ప్రచాలక దశ
2. ఇంద్రియ చాలక దశ
3. అమూర్త ప్రచాలక దశ
4. మూర్త ప్రచాలక దశ
11. చిలుక ఎగురుతుంది, కాకి ఎగురుతుంది, పావురం ఎగురుతుంది. కాబట్టి రెక్కలున్న పక్షులన్నీ ఎగురుతాయి అనే వాక్యం సూచించేది ఏది?
1. తార్కిక ఆలోచన
2. నిగమనాత్మక వివేచన
3. ఆగమనాత్మక ఆలోచన
4. నిగమనాత్మక ఆలోచన
12. రెక్కులున్న పక్షులు ఎగురుతాయి. కాబట్టి చిలుక, కాకి, పావురం పక్షులు కాబట్టి అవి ఎగురుతాయి” అనే వాక్యాన్ని సూచించేది?
1. ఆగమనాత్మక ఆలోచన
2. నిగమనాత్మక వివేచన
3. ఆగమనాత్మక వివేచన
4. ఊహా ఆలోచన
13. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని జ్ఞానేంద్రియ చలన దశ ఈ కింది వాటిలో దేనికి సంబంధించింది?
1. సామాజిక విషయాలపై ఆసక్తి
2. పరికల్పనలను ప్రతిపాదించి, విశ్లేషించే సామర్థ్యం
3. తార్కిక పద్ధతిలో సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం.
4. అనుకరణ, స్మృతి, మానసిక నిరూపణం
14. భారతదేశానికి రాజధాని న్యూడిల్లీ అని చెప్పిన తర్వాత న్యూఢిల్లీ ఏ దేశానికి రాజధాని అని అడిగితే సమాధానం చెప్పలేని విద్యార్థి పియాజే సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు? దాన్ని ఏమంటారు?
1. ఇంద్రియ చాలక దశ –
వస్తు స్థిరత్వ భావన
2. పూర్వప్రచాలక దశ – ఎనిమిజం
3. పూర్వప్రచాలక దశ – ఏకమితి
4. మూర్త ప్రచాలక దశ –
ఆగమనాత్మక ఆలోచన
15. ఈ కింది వాటిలో సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించనిది?
1. ఉపాధ్యాయుని ప్రవర్తనా నమూనాలు విద్యార్థి అనుసరించడం
2. తన గురించి పరిసరాల గురించి శిశువు అవగాహన చేసుకోవడం
3. దశపై ఆధారపడుతుంది కానీ వయస్సుపై ఆధారపడదు
4. వయస్సుపై ఆధారపడుతుంది కానీ దశపై ఆధారపడదు
16. ఒకే ఆకారం, పరిమాణం ఉన్న రెండు మట్టి గోళాలను తీసుకుని వాటిలో ఒకదాని ఆకారాన్ని మార్చినప్పుడు దాన్ని తిరిగి మొదటి ఆకారంలోకి మార్చగలమని భావించలేని
శిశువులో లోపించిన భావనాలోపం?
1. అహంకేంద్ర వాదం
2. పదిలపరచుకొనే భావనా లోపం
3. అవిపర్యయాత్మక భావనాలోపం
4. సర్వాత్మవాదం
17. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1. ప్రతీ తార్కిక ప్రచాలకాన్ని తిరిగి
చేయవచ్చు అనే భావన లేకపోవడం –
అవిపర్యయాత్మక భావనా లోపం
2. ఒక వస్తువు ఆకారాన్ని మార్చినా, స్థితిని మార్చినా దాని గుణం కూడా మారుతుంది
– కన్ఫర్వేషన్
3. ఒక ఆటవస్తువును వేరొక ఆట వస్తువులాగా భావించడమే – ప్రతిభాసాత్మక ఆలోచన
4. ప్రాణంలేని వాటికి ప్రాణాన్ని
ఆపాదించడం – సర్వాత్మవాదం
సమాధానాలు
1-2 2-1 3-2 4-3
5-1 6-4 7-3 8-2
9-4 10-1 11-3 12-2
13-4 14-3 15-4 16-3
17-2
ఏకేఆర్ స్టడీసర్కిల్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?