TET- Child Development Pedagogy | తరగతి గదిలో విద్యార్థులకు అత్యంత ఉపయోగపడే నాయకత్వం?
నిన్నటి తరువాయి
45. అంతః పరీక్షణ పద్ధతిని ప్రారంభించినవారు?
1. సంరచనాత్మక వాదులు
2. ప్రవర్తనా వాదులు
3. మనోవిశ్లేషణ వాదులు
4. గెస్టాల్టు వాదులు
46. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రభావం విద్యార్థి వ్యక్తీకరణ నైపుణ్యాలపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగ పరిశోధనలో మధ్యస్థచరం కానిది?
1. విద్యార్థి వ్యక్తీకరణ నైపుణ్యాలు
2. విద్యార్థి అభిరుచి
3. విద్యార్థి కుటుంబం
4. విద్యార్థి విద్యార్హతలు
47. స్వతంత్ర చరం అంటే?
1. ఉద్దీపన 2. కారణము
3. 1& 2 4. ప్రతిస్పందన
48. జాకెబ్ ఎల్ మొరినో ఏ మూర్తిమత్వ పరీక్షను తెలిపాడు?
1. సోషియో మెట్రి 2. సైకోమిట్రి
3. పెరానియా 4. హైపోమానియా
49 . పగటి కలలు కనడం దేనితో పోల్చరు?
1. మరదశ సాధారణ లక్షణం
2. సాధించలేని అంశాన్ని తృప్తిపరిచే రక్షక తంత్రం
3. వీటిని వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోగలం
4. ఇవి మారుతూ ఉంటాయి
50. వైఖరులకు సంబంధించి కింది ప్రవచనాల్లో సరికానిది ఏది ?
1. అవి వ్యక్తి ఉద్వేగాలతో కలిసి పనిచేస్తాయి
2. ఇవి అభ్యసనం వల్ల ఏర్పడవు
3. వీటిని వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోగలం
4. ఇవి మారుతూ ఉంటాయి.
51. MMPT రూపకర్తలు ఎవరు?
1. హాలాండ్, బేకర్
2. హతావే, మెకాన్లీ
3. అమెరికా ఉపాధి కల్పనా కేంద్రం
4. స్ట్రాంగ్ కాటిల్
52. రోషాక్ సిరా మరకల కార్డుల్లో ఉండే అంశాలు?
1. అస్పష్ట జంతు చిత్రాలు
2. స్పష్టమైన మానవ, జంతు, వస్తు ఆకారాలు
3. స్పష్టమైన మానవ, జంతు, వస్తు ఆకారాలు
4. రూపరహితాలు
53. T, A, T కి సంబంధించి సరికానిది.
1. స్పష్ట మానవ చిత్రాలు గల కార్డులను చూసి ఒక కథను రాయాల్సి ఉంటుంది
2. ప్రతి ప్రయోజ్యుడు ఇవ్వబడిన 30 కార్డులను అన్నింటిని కావలసినంత సమయం చూసి కథ పరిణామాలు, దానికి దారితీసిన పరిస్థితులు చెప్పాల్సి ఉంటుంది
3. ఇంటర్వ్యూ ద్వారా ప్రయోజ్యుడు పరీక్ష పూర్తైన తర్వాత ప్రయోక్తను కలిసి తాను రాసిన కథకు తన జీవితానికి సంబంధం చెప్పాల్సి ఉంటుంది
4. T,A,T పరీక్షను ప్రయోజ్యునికి ఒకరోజు వ్యవధితో రెండు విడతలుగా చేస్తారు
54. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1. ‘అందని ద్రాక్ష పుల్లన’ అనే సామెత ‘హేతుకీకరణ’ను తెలుపుతుంది
2. ‘పచ్చ కామెర్ల వానికి’ లోకం పచ్చన అని ‘పరిహారం’ను తెలుపుతుంది
3. ‘దొంగే దొంగ’ అని అరవడం ‘ఉపసంహారాన్ని’ తెలుపుతుంది
4. పైవన్నీ సరైనవే
55. మాస్లో పిరమిడ్‌లో 3వ అవసరం ఏది?
1. ప్రేమ సంబంధిత 2. రక్షణ
3. గుర్తింపు 4. ఆత్మ
56. అంతర్గత ప్రేరణకు సంబంధితమైన కృత్యం?
1. వివిధ ప్రదేశాలను చూడటానికి క్రికెట్ ఆడటం
2. ధనార్జనకు క్రికెట్ ఆడటం
3. వరద బాధితుల సహాయార్థం క్రికెట్ ఆడటం
4. ఆనందం పొందటానికి క్రికెట్ ఆడటం
57. ప్రాథమిక పునర్బలనానికి ఉదాహరణ?
1. ఆహారం 2. డబ్బు
3. నీరు 4. 1,3
58. బహుళ ప్రజ్ఞలో గార్ట్సర్ తెలపని అంశం?
1. సంగీత ప్రజ్ఞ
2. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ
3. వ్యక్తంతర్గత ప్రజ్ఞ
4. యాంత్రిక ప్రజ్ఞ
59. బడిగంట కొట్టడం అలవాటు లేని ఒక మారుమూల పల్లెటూరి పాఠశాలలో చదివిన పిల్లవాడు అక్కడ కొత్తగా వచ్చిన ఒక ఉపాధ్యాయుడు అదే రోజు బడిగంట కొట్టగా పిల్లవాడు స్పందించకపోవడం?
1. హయ్యర్ ఆర్డర్ కండీషనింగ్ (ఉన్నత క్రమ నిబంధన)
2. డీ కండీషనింగ్ (నిబంధన తొలగింపు)
3. రీ కండీషనింగ్ (పునర్నిబంధనం)
4. అన్ కండీషనింగ్ (నిర్నిబంధనం)
60. కింది వాటిలో సరైన వ్యాఖ్య?
1. విస్మృతి, ధారణలు పరస్పర అనులోమాలు
2. స్మృతి అనేది ధారణ చేతనారూపం
3. పూరక ప్రశ్నల కంటే బహుళైచ్ఛికాలు తేలిక స్మృతి రూపం
4. స్మృతిని పెంచే ఏకైక ఉత్తమ మార్గం- పునఃస్మరణ
61. కార్యసాధక నిబంధనం వల్ల వచ్చిన ప్రతిఫలం?
1. కంప్యూటర్ సహాయిత స్వీయ అభ్యసనం
2. చిన్న సోపానాలతో వెలసిన దూర విద్య పుస్తకాలు
3. స్వీయ వేగాన్ని ప్రోత్సహించే పని పుస్తకాలు (వర్క్‌బుక్స్) 4. పైవన్నీ
62. స్వామి వివేకానంద సూక్తులు ‘విన్న ప్రతిసారి తాను నిర్వహించే పనుల్లో దాని ప్రభావాన్ని ప్రదర్శించే వ్యక్తి కింది ఏ ప్రేరణతో వ్యవహరిస్తున్నట్లు?
1. బహిర్గత 2. అంతర్గత
3. సాధన 4. ప్రాకృతిక
63. బోధనా యంత్రాల ఉద్దేశం?
1. స్వీయ వేగంతో శక్త్యానుసారం అభ్యసించే అవకాశం
2. ఉపాధ్యాయుడి వీక్షణ వేగాన్ని బట్టి విద్యార్థి అభ్యసన జరగడం
3. విద్యార్థులు వారి వ్యక్తిగత పునఃర్బలనాలను ఒకరికొకరు పంచుకోవడం
4. పైవన్నీ
64. భావనోద్భవం ఏ అంశంతో ముడిపడి ఉంది?
1. ఇంద్రియ జ్ఞానం 2. అమూర్త
3. సామాన్యీకరణం 4. ఆలోచన
65. గతంలో DSC మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి పొందిన బహుమతి, ప్రఖ్యాతి గమనించిన కొత్త విద్యార్థి తాను కూడా అతనిలా ఫలితం సాధించాలనుకున్న విద్యార్థి ప్రేరణ?
1. ప్రత్యక్ష పునఃర్బలనం
2. స్వీయ పునఃర్బలనం
3. పరోక్ష ప్రత్యామ్నాయ పునఃర్బలనం
4. పైవన్నీ
66. ప్రేరణలో పాఠ్యాంశం ప్రారంభించి ప్రేరణతో కొనసాగించి ఆ ప్రేరణతో ముగించాలని చెప్పింది?
1. స్కిన్నర్ 2. బందూరా
3. థారన్‌డైక్ 4. బ్రూనర్
67. బాల నేర ప్రవృత్తి దేనికి సంబంధించింది?
1. నైతిక సమస్య
2. న్యాయపరమైన సమస్య
3. ప్రవర్తనా సమస్య
4. సామాజిక సమస్య
68. జీన్ పియాజే తన ముగ్గురు పిల్లల సంజ్ఞానాత్మక వికాసాన్ని అనేక సంవత్సరాల పాటు పరిశీలించారు. ఇది ఏ రకమైన
పరిశీలనా పద్ధతి?
1. అంతఃపరిశీలన 2. సమాంతర
3. కాలక్రమ 4. వ్యక్తి అధ్యయన పద్ధతి
69. బావి గిలకను చూసిన తర్వాత కప్పీల గురించి వివరించే ఉపాధ్యాయుడు పాటించిన వికాస నియమం?
1. క్రమానుగతంగా జరుగుతుంది
2. సాధారణం నుంచి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది
3. ఏకీకృత మొత్తం
4. పరస్పర చర్చ
70. విద్యా మార్గదర్శకత్వం అంటే వ్యక్తి జ్ఞానాభివృద్ధికి దోహదం చేసే చేతనాత్మక ప్రయత్నం. ఇది బోధన లేదా అభ్యసనానికి సంబంధించినది అని అన్నది?
1. బ్రేవర్ 2. బ్రూనర్
3. స్టీమర్ 4. క్లిపుర్ట్బీర్స్
71. భాషణ సంబంధ, పఠన సంబంధ, రాగ సంబంధ వైకల్యాలను వరుసగా ఎలా పిలుస్తారు?
1. డిస్ గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్‌ఫేసియా
2. డిస్ ఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా
3. డిస్ ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా
4. డిస్ గ్రాఫియా, డిస్‌ఫేసియా, డిస్లెక్సియా
72. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు?
1. పుస్తకాల ద్వారా అభ్యసనం
2. తరగతిలో అభ్యసనం
3. విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం
4. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం
73. RTE -2009 ప్రకారం సరికాని ప్రవచనం?
1. పిల్లలు ఒక తరగతికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్లీ అదే తరగతిలో కొనసాగించాలి
2. పిల్లల వయస్సుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి
3. పిల్లలను శారీరకంగా, మానసికంగా వేధించరాదు
4. పిల్లల మాతృభాషలోనే విద్య జరగాలి
74. బ్రూనర్ ప్రకారం అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని అందించే పద్ధతులకు సంబంధించింది ?
1. క్రియాత్మక పద్ధతి
2. చిత్ర ప్రతిమ పద్ధతి
3. ప్రతీకాత్మక పద్ధతి
4. అంతర్ దృష్టి పద్ధతి
75. ప్రకల్పన పద్ధతిని మొదటగా విద్యా రంగానికి అందించిన వారు?
1. ప్రకృతి వాదులు
2. అస్థిత్వ వాదులు
3. వ్యవహారిక సత్తావాదులు
4. భావవాదులు
76. బాలల హక్కుల ఒడంబడికను ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సంవత్సరం?
1. 1989 నవంబర్ 14
2. 1989 సెప్టెంబర్ 21
3. 1989 నవంబర్ 20
4. 1989 సెప్టెంబర్ 20
77. తరగతి గదిలో విద్యార్థులకు అత్యంత ఉపయోగపడే నాయకత్వం?
1. నిర్దేశిత నాయకత్వం
2. భాగస్వామ్య నాయకత్వం
3. సహభాగి నాయకత్వం
4. 2, 3
78. మంత్రణకుడి సహాయంతో సహాయార్థి తనకు తానుగా తన సమస్యను విశ్లేషించుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనే మంత్రణం?
1. నిర్దేశక మంత్రణం
2. అనిర్దేశక మంత్రణం
3. శ్రేష్టగ్రహణ మంత్రణం
4. వ్యక్తిగత మంత్రణం
79. 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం తయారీలో మార్గదర్శక సూత్రం కానిది?
1. శిశుకేంద్ర అభ్యసనం
2. కృత్యాధార అభ్యసనం
3. ఉపాధ్యాయ, శిశుకేంద్ర అభ్యసనం
4. సామాజిక భాగస్వామ్య అభ్యసనం
80. RTE Act-2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలిసిన ఉపాధ్యాయుల సంఖ్య?
1. 5 2. 3 3. 2 4. 4
81. కింది వారిలో ‘విద్య నేర్వగల మానసిక వికలాంగులు’?
1. తీవ్ర బుద్ధిమాంద్యులు
2. సంపూర్ణ బుద్ధిమాంద్యులు
3. స్వల్ప బుద్ధిమాంద్యులు
4. మిత బుద్ధిమాంద్యులు
82. కింది పనిలో జౌదోయగిక మార్గదర్శకత్వం అవసరమైన వ్యక్తి?
1. చదివిన పాఠాలు మరిచిపోయే విద్యార్థికి
2. ఎదుటి వ్యక్తి చెప్పే విషయాలను అవగాహన చేసుకోలేని వారికి
3. అశాంతితో బాధపడేవారికి
4. MA చదివి ఏ ఉద్యోగం
చేయాలో తెలియని వారికి
83. భావ వ్యక్తీకరణ చేయడం బాలల హక్కుల్లో కింది ఏ వర్గానికి చెందుతుంది?
1. భాగస్వామ్య హక్కు
2. జీవించే హక్కు
3. రక్షణ పొందే హక్కు
4. అభివృద్ధి చెందే హక్కు
84. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. అనిర్దేశక ఎ. F.C ధార్ప్ కౌన్సిలింగ్
2. నిర్దేశక బి. కార్ల్ రోజర్స్ కౌన్సిలింగ్
3. శ్రేష్ట గ్రహన సి. విలియం సన్ కౌన్సిలింగ్ A డార్లీ
1. 1-బి, 2-ఎ, 3-సి
2. 1-బి, 2-సి, 3-ఎ
3. 1-సి, 2-ఎ, 3-బి
4. 1-సి, 2-బి, 3-ఎ
85. సమ్మిళిత విద్య లక్ష్యం?
1. బుద్ధిమాంద్యుల అవసరాలు తీర్చడం
2. అంగవైకల్యం కలవారి అవసరాలు తీర్చడం
3. పిల్లలందరి అవసరాలు తీర్చడం
4. ప్రత్యేక అవసరాలు గల పిల్లల అవసరాలు తీర్చడం
86. కింది వాటిలో విద్యా హక్కు చట్టం ప్రకారం సరైనది?
1. ప్రాథమిక విద్య పూర్తయ్యేవరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు
2. బడి ప్రారంభానికి గుర్తింపు పత్రం తప్పనిసరి కాదు
3. వయస్సు ధ్రువీకరణ పత్రం ఉంటేనే పాఠశాలలో చేర్పించుకోవాలి
4. పిల్లలు తప్పు చేస్తే శారీరకంగా దండించవచ్చు
87. మూఢుల ప్రజ్ఞాలబ్ధి?
1. 50-70 మధ్య 2. 26-49 మధ్య
3. 25 కన్నా తక్కువ 4. 70-89 మధ్య
88. త్వరణం ఎవరికి చెందిన విద్యా కార్యక్రమం?
1. అభ్యసన వైకల్యం గల పిల్లలు
2. బుద్ధి మాంద్యులు
3. శ్రవణ వైకల్యం గల వారికి
4. ప్రతిభావంతులకు
89. హెర్బర్ట్ పాఠ్య పథక సోపానాల్లో మూడోది ఏది?
1. సన్నాహం 2. సంసర్గం
3. ప్రదర్శనం 4. అన్వయం
సమాధానాలు
45. 1 46. 1 47. 2 48. 1
49. 4 50. 2 51-2 52-4
53-2 54-1 55-1 56-4
57-4 58-4 59-4 60-3
61-4 62-1 63-1 64-1
65-3 66-4 67-3 68-3
69-2 70-1 71-2 72-3
73-1 74-4 75-3 76-2
77-4 78-2 79-3 80-4
81-4 82-4 83- 84-2
85-3 86-1 87-3 88-4
89-2
పంతులు మధుబాబు
సీనియర్ సైకాలజీ ఫ్యాకల్టీ,
రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?