TET Special – Child Development | ప్రయోజనాత్మక ప్రవర్తన.. హేతుబద్ధ ఆలోచన
ప్రజ్ఞ
పరిచయం
- సాధారణ పరిభాషలో ప్రజ్ఞ/ Intelligence అంటే “తెలివితేటలు”
- నాటి నిప్పు, చక్రాల ఆవిష్కరణ నుంచి నేటి కంప్యూటర్ రంగం వరకూ ప్రగతి కారణం, మానవునికి ఉన్న ప్రజ్ఞతో మానవుడు తన సుఖమయ జీవనానికి తన చుట్టూ ఉన్న ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు.
- ఈ అనుకూలతను పొందడంలో ప్రధాన పాత్ర వహించింది – మనిషి ఆలోచన
- ఈ అనుకూలతకు ఉపయోగపడే ఆలోచననే తెలివి/ప్రజ్ఞ అంటారు.
ప్రజ్ఞ ఒక నిర్దిష్ట (Specific) అంశానికి సంబంధించింది కాదు. ఇది ఎన్నో అంశాలతో ముడిపడి వుంటుంది.
1. నూతన పరిస్థితులను వేగంగాను, సమర్థవంతంగాను ఎదుర్కొని సర్దుబాటు చేసుకొనే సామర్థ్యం : - కొత్త సమస్యలను, పరిస్థితులకు అనుగుణ్యతను పొందే, సామాన్య శక్తియే ప్రజ్ఞ- స్టెర్న్.
- ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకొనే సామర్థ్యమే ప్రజ్ఞ – ఎడ్వర్డ్.
- ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో, ఆత్మ విమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తి ప్రజ్ఞ – బినే.
2. అమూర్త భావనలను వినియోగించుకోగలిగే సామర్థ్యం : - అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ – మెక్డోగల్.
- అమూర్త ఆలోచనా శక్తియే ప్రజ్ఞ – టెర్మన్.
- తన గ్రాహక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ – గాల్టన్
3. సంబంధాలను అర్థం చేసుకొని త్వరగా అభ్యసించే సామర్థ్యం : - సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యమే ప్రజ్ఙ – స్టోడార్ట్.
- అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ – గేట్స్
- పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ – స్పియర్మన్.
- ప్రజ్ఞకు సమగ్ర నిర్వచనం ఇచ్చినది – వెప్లర్.
- ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మలచుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ – వెప్లర్
- తెలివిగా మసలుకోవడమే ప్రజ్ఞ – ఉడ్వర్త్
- ప్రజ్ఞ నికష పరీక్షించేదే ప్రజ్ఞ – బోరింగ్, లాంగ్ ఫీల్డ్.
- ప్రజ్ఞ లక్షణాలు/స్వభావం : ప్రజ్ఞఅమూర్తమైంది. దృగ్గోచరం కానిది.
వ్యక్తిలో ఉండే సహజ అంతర్గత శక్తి.
భౌతిక స్థితికి సంబంధంలేనిది.
పుట్టుకతో అనువంశికంగా సంక్రమిస్తుంది.
పరిసరాలు ప్రభావితం చేయలేవు. - వ్యక్తులందరిలో ఒకేలా ఉండదు. కాబట్టి వైయక్తిక భేదాలుంటాయి.
- అందరిలోనూ ఉంటుంది.
- జాతి, మతం, కులం, లింగ భేదాలు ప్రజ్ఞకు లేవు.
- లైంగికపరంగా ప్రజ్ఞకు భేదం ఉండదు.
- ప్రజ్ఞను మాపనం చేసి నిర్దిష్టంగా కొలవవచ్చు.
- ప్రజ్ఞాభివృద్ధి కౌమార దశ వరకు కొనసాగి, తర్వాత ఆగిపోతుంది.
- సంక్లిష్టమైన సమస్యల సాధనకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొవడానికి సహకరిస్తుంది.
- విషయ అభ్యాసం, నూతన పరిస్థితులను సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
- సమైక్య ఆలోచన ఉన్న వారికి ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. విభిన్న ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకత అధికంగా ఉంటుంది – గిల్ఫర్డ్
- ప్రజ్ఞ వ్యక్తి జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన ఒక మానసిక సామర్థ్యం.
1. జ్ఞానం 2. నైపుణ్యం
3. స్మృతి 4. సృజనాత్మకత 5. ప్రత్యక్షం
6. సహజ సామర్థ్యం 7. ప్రావీణ్యత
8. మూర్తిమత్వం
9. చింతనం/ఆలోచన
10. అవబోధనం 11. వైఖరి
12. ప్రవర్తన…
నోట్ : ప్రజ్ఞకు, జ్ఞానానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉంటుంది. - ప్రజ్ఞ వల్ల జ్ఞాన సముపార్జన జరుగుతుంది. కానీ జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరచుకోలేం. కాబట్టి ప్రజ్ఞ అనేది గమ్యం అయితే జ్ఞానం అనేది ఆ గమ్యాన్ని చేరడానికి సహకరించే మార్గం వంటిది – రాస్
- సృజనాత్మకత గల వారందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది. కానీ ప్రజ్ఞ ఉన్న వ్యక్తులందరూ సృజనాత్మకంగా ఉండాలని లేదు.
- ప్రజ్ఞ నూతన కార్యనిర్మాణానికి సంబంధించింది అయితే సృజనాత్మకత కొత్తదాన్ని కనుక్కోవడానికి సంబంధించింది.
ప్రజ్ఞ రకాలు (Type of Intelligence)
ప్రజ్ఞను మూడు రకాలుగా విభజించారు. అవి :
1. మూర్త / యాంత్రిక ప్రజ్ఞ
2. అమూర్త ప్రజ్ఞ 3. సాంఘిక ప్రజ్ఞ
1. మూర్త/యాంత్రిక ప్రజ్ఞ : కంటికి కనిపించే వస్తువులు/యంత్రాలు/యంత్ర పరికరాను ఉపయోగించి అనుప్రయుక్తం చేయగల సామర్థ్యమే “మూర్త/యాంత్రిక ప్రజ్ఞ”
ఉదా : చేతి వృత్తుల వారు, మెకానిక్లు, టెక్నిషియన్స్, హార్డ్వేర్ ఇంజినీర్లు
మొ॥లగువారు. - ఈ ప్రజ్ఞకు మూలం మధ్య మెదడు.
ఈ ప్రజ్ఞను కొలవగలం.
2. అమూర్త ప్రజ్ఞ : అక్షరాలను, పదాలను, సంఖ్యలను ఉపయోగించే నేర్పు. ఎదురుగా లేని వాటి గురించి కూడా మాట్లాడగలిగే సామర్థ్యమే “అమూర్త ప్రజ్ఞ”.
ఉదా : రచయితలు, కవులు, శాస్త్రవేత్తలు, విద్యావంతులు, ఇంజినీర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ మొదలగువారు.
3. సాంఘిక/సామాజిక ప్రజ్ఞ: ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకొని దానికనుగుణంగా స్పందించి, వారిని మెప్పించి తనకు అనుకూలంగా వారి ప్రతిస్పందనను పొందడమే “సాంఘిక ప్రజ్ఞ”.
ఉదా : రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సంఘసేవకులు, ఉపాధ్యాయులు, లాయర్లు, కళాకారులు, సైకాలజిస్టులు మొదలగువారు.
ప్రజ్ఞకాని లక్షణాలు
ఉద్వేగాత్మక ప్రజ్ఞ - ఒక వ్యక్తిలో శారీరకంగా, మానసికంగా కలియబెట్టే స్థితియే ఉద్వేగం.
- ఒక ఉద్దీపన పట్ల తగిన ప్రతిస్పందన చూపడంలో కనబరిచే ప్రజ్ఞయే ఉద్వేగాత్మక ప్రజ్ఞ.
- ప్రస్తుత కాలంలో ఒక వ్యక్తి సఫలత అతని ప్రజ ్ఞకంటే, ఉద్వేగాత్మక ప్రజ్ఞపై ఆధారపడి ఉంటుందని అంగీకరించబడింది.
- ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా 1985లో వెయిన్ లెయిన్ పెయిన్ అనే విద్యార్థి తన Ph.D సిద్ధాంత గ్రంథంలో ఉపయోగించారు.
- అయితే ఈ పదానికి ఎక్కువ ప్రాచుర్యం డేనియల్ గోల్మన్ అనే అమెరికా రచయిత వల్ల వచ్చింది. ఇతడు తన పుస్తకానికి Emotional Intelligence. why? It can matter more than I.Q అనే పేరు పెట్టాడు.
- గోల్మన్ ప్రకారం పాఠశాలలో క్రమంగా శిక్షణ ఇచ్చి పెంచే ప్రజ్ఞ కంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ విద్యార్థులకు తమ జీవిత సమస్యలను పరిష్కరించడానికి అధికంగా ఉపయోపడుతుంది. ఎందుకంటే ఉద్వేగప్రజ్ఞ సాధారణంగా ప్రేమ, ఆధ్యాత్మికం, దయ, మానవత్వాల మీద ప్రభావాల నుంచి పుడుతుంది.
- ఈ ప్రజ్ఞలో 2 విభాగాలు ఉన్నాయి. అవి :
1. వ్యక్తి తన లక్ష్యాలను, ఆదర్శాలను, స్పందనలను, ప్రవర్తనలను అర్థం చేసుకోవడం.
2. ఇతరులను, వారి భావాలను అర్థం చేసుకోవడం. - ఉద్వేగాన్ని గ్రహించి, ఆలోచనకు వీలుగా వాటిని జోడించి, అర్థం చేసుకొని, వ్యక్తిగత వికాసం పెంపొందించడానికి వాటిని క్రమబద్ధం చేయగలిగే సామర్థ్యమే ఉద్వేగాత్మక ప్రజ్ఞ” సలోవె, మేయర్లు.
ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు (Models of Emotional Intelligence) :
1. సామర్థ్య నమూనా (Ability Model) :
ప్రతిపాదించినది – పీటర్ సలోవె, జాన్ మేయర్లు.
వీరి ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ 4 రకాల సామర్థ్యాలపై ఆధారపడుతుంది అవి :
1. ఉద్వేగాలను గ్రహించడం/ప్రత్యక్షీకరించడం
2. ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం.
3. ఉద్వేగాలను ఉపయోగించడం
4. ఉద్వేగాలను నిర్వహించడం
ఉద్వేగ ప్రజ్ఞ ఉన్న వ్యక్తి వ్యతిరేక ఉద్వేగాలను కూడా అనుకూలంగా మార్చుకొని లక్ష్యాలను సాధిస్తాడు.
2. లక్షణ (Trait Model) : - ప్రతిపాదించినది – కాన్ స్పాన్టిన్ వాసిలి పుట్రైడ్స్.
- ఈ నామూనా వ్యక్తి మూర్తిమత్వానికి చెందినది?
- ఉద్వేగ ప్రజ్ఞ మూర్తిమత్వ అంతర్గత లక్షణాల సమూహం.
3. మిశ్రమ నమూనా (Mixed Model)
ప్రతిపాదించినది – డానియల్ గోల్మన్. - “వ్యక్తులు తమ సామాన్య లక్ష్యాల వైపు సాగడంలో కలిసి పనిచేయడానికి ఉపయోగపడే భావాలను ప్రభావవంతంగా నిర్వహించే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ -గోల్మన్.
ఉద్వేగాత్మక లబ్ది (Emotional Quotient – E.Q)
- ఉద్వేగాత్మక లబ్ది ఒక వ్యక్తి ఉద్వేగ ప్రజ్ఞను తెలుపుతుంది.
- తనని తాను తెలుసుకోవడం, ఎలాంటి ఒత్తిడులకు గురికాకుండా తన పనులను తాను చేసుకొని పోవడాన్ని సూచిస్తుంది.
- ప్రజ్ఞా లబ్ది (I.Q) వ్యక్తుల మానసిక వికాసాన్ని అంచనా వేస్తే, ఉద్వేగాత్మక లబ్ది (E.Q) వ్యక్తుల వికాసాన్ని తెలుపుతుంది.
- ప్రామాణికమైన, అందరికీ ఆమోదయోగ్యమైన, ఉద్వేగ ప్రజ్ఞా మాపనులు ఇప్పటికీ కనుక్కోలేదు. వారి వారి అవసరాల మేరకు కొన్ని సంస్థలు ఉద్వేగాత్మక ప్రజ్ఞా మాపనాలను వాడుతున్నాయి.
- సలోవె మేయర్ నిర్మించిన సాధనంతో పాటు మరికొన్ని ఉన్నప్పటికీ సార్వత్రికంగా ఉపయోగపడవు.
ప్రజ్ఞామాపనం (Measurement of Intelligence) - వ్యక్తి తెలివితేటలను కొలవాలనే ఆలోచనలను తొలిసారిగా చేసిన అనువంశికతావాది సర్ ఫ్రాన్సిన్ గాల్టన్.
- ప్రజ్ఞను కొలిచేదే ప్రజ్ఞా మాపనం.
- ప్రజ్ఞామాపనంలో, వ్యక్తి అంతర్గత సామర్థ్యాలను మాపనం చేయడం జరుగుతుంది.
- 1904లో ఫ్రాన్స్ ప్రభుత్వం, తమ పబ్లిక్ పాఠశాలోని విద్యార్థుల విద్యా సాధనలో వెనుకబడుటకు గల కారణాలను తెలుసుకోవడానికి “బినే” అధ్యక్షతన ఒక కమిటీ నియమించింది.
- బినే, సైమన్తో కలిసి మొదటిసారి ప్రజ్ఞాపరీక్షను తయారు చేశారు.
- ఈ విధంగా మొదటి “బినే సైమన్ స్కేల్ ఆఫ్ ఇంటిలిజెన్స్” తయారైంది.
Father of Intelligence Tests – బినే - ప్రజ్ఞా మాపనం ఉద్యమం ప్రారంభమైన దేశం – ఫ్రాన్స్
- మొట్టమొదటి ప్రజ్ఞామాపని -బినే సైమన్ మాపని (1905)
- ప్రామాణీకరించిన మొట్టమొదటి మాపనిని రూపొందించినది – బినే
- బినే రచించిన గ్రంథం –
An Experimental Studies on Intelligence. - 1905లో రూపొందించిన బినే సైమన్ మాపని వయో పరిమితుల ఆధారంగా రూపొందించబడలేదు.
- 1908లో రూపొందించిన బినే సైమన్ మాపని వయో పరిమితుల ఆధారంగా రూపొందించబడింది.
- 1911లో బినే మరణించడంతో ప్రజ్ఞామాపన ఉద్యమం ఫ్రాన్స్ నుంచి అమెరికా బదిలీ అయ్యింది.
- అమెరికాలో రూపొందించిన మొట్టమొదటి ప్రజ్ఞా మాపని – స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా మాపని (1916)
- ప్రజ్ఞాలబ్ధి సూచికను మొదటిసారిగా ఈ మాపనిలో ఉపయోగించారు.
Note : ఈ మాపనం ఆధారంగానే ప్రజ్ఞనున లెక్కించడం జరిగింది. - దీనికి ప్రధాన అంశం బినే ప్రతిపాదించిన మానసిక వయస్సు భావన
- వయస్సుల వారీగా తయారు చేసిన ప్రశ్నాంశాల ఆధారంగా మానసిక వయస్సు నిర్ణయం జరిగింది.
శివపల్లి
సైకాలజీ ఫ్యాకల్టీ
టీఎస్, ఏపీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
Previous article
Current Affairs – Groups Special | క్రీడలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?