TET Science | ప్రపంచంలో రెండో అత్యంత వేగవంతమైన జంతువు?
1. వేరు వెంట్రుకలు నేలలోని దేన్ని పీల్చి వేర్లకు అందిస్తాయి?
1) లవణాలు 2) నత్రజని
3) నీరు 4) పొటాషియం
2. కాండం నుంచి నిట్టనిలువుగా నేలలోకి పోయే వేరు?
1) పిల్లవేరు 2) తల్లివేరు
3) గుబురు వేరు 4) కాండం
3. పరపరాగ సంపర్కానికి సంబంధించి సరైనది?
ఎ) ఏకలింగ పుష్పాల్లో మాత్రమే జరుగుతుంది.
బి) పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని అండాలను చేరుతాయి
సి) పరాగ సంపర్కం జరిగే వాహకాలు సహాయ పడతాయి
డి) ఈ విధానంలో ఏర్పడిన విత్తనాలు, స్వపరాగ సంపర్కం వల్ల తయారైన విత్తనాల కంటే ఆరోగ్యంగా ఉంటాయి
1) ఎ, డి 2) బి, సి
3) ఎ, బి 4) సి, డి
4. కప్ప జీవిత చరిత్రలో రూప విక్రయ ప్రక్రియను ప్రారంభించే హార్మోన్?
1) ఎడ్రినాలిన్ 2) ఆల్డోస్టిరాన్
3) కార్టిసాల్ 4) థైరాక్సిన్
5. నీటి ద్వారా గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కానికి ఉదాహరణలు వరుసగా?
1) హైడ్రిల్లా, మొక్కజొన్న
2) గోధుమ, వాలిస్నేరియా
3) డ్రాసిరా, వరి
4) ఐకార్నియా, పిస్టియా
6. ఒక రైతు తన పొలంలో ఒక పంట పెంచడానికి పిలకలను సేకరించాడు. అతను వేసే పంట?
1) బంగాళాదుంప 2) పసుపు
3) అరటి 4) చిలగడదుంప
7. కీటకాలకు ఉండే కాళ్ల సంఖ్య?
1) 4 2) 5 3) 6 4) 7
8. కింది వాటిలో రెక్కలు లేని కీటకం?
1) ఈగ 2) బొద్దింక
3) నల్లి 4) సీతాకోకచిలుక
9. కింది వాటిలో ఎగిరే పురుగు?
1) గొల్లభామ 2) మిడత
3) 1, 2 4) ఏదీకాదు
10. కప్ప నీటిలో ఈదడానికి కారణం?
1) కప్పకి కాళ్ల వేళ్ల మధ్య చర్మం పొర ఉంటుంది
2) కప్పకి సహజంగా ఈత రావడం
3) కప్ప ఉభయచరజీవి
4) ఏదీకాదు
11. కీటకాలను నాశనం చేసే బ్యాక్టీరియా?
1) బాసిల్లస్ ధురంజెన్సిస్ 2) రైబోజియం
3) అజటోబాక్టర్
4) బాసిల్లస్ సుడోమోనస్
12. క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
1) 3 2) 2 3) 4 4) 1
13. మొక్కలు ఆకురాల్చే కాలం?
1) చలికాలం 2) వేసవి కాలం
3) వర్షాకాలం 4) అన్ని కాలాలు
14. మొక్కలు చిగురించే కాలం?
1) చలికాలం 2) వేసవి కాలం
3) వర్షాకాలం 4) ఏదీకాదు
15. గుల్మాలు అంటే?
1) సన్నని కాండంతో ఉండే చిన్న మొక్కలు
2) గుబురుగా పెరిగే మొక్కలు
3) పెద్ద కాండం గల చెట్లు
4) పైవన్నీ
16. గులాబి ఏ వర్గీకరణకి చెందింది?
1) గుల్మాలు 2) పొదలు
3) వృక్షాలు 4) పైవన్నీ
17. వరిసాగు చేసిన తర్వాత మినుములను సాగుచేస్తే దేన్ని అదుపులో ఉంచవచ్చు?
1) టుంగ్రో వైరస్
2) ధాన్యాన్ని తినే గొంగళి పురుగు
3) అజటోబాక్టర్
4) బాసిల్లస్ సుడోమోనాస్
18. ఔషధ మొక్క కానిది?
1) తులసి 2) వేప
3) నీలగిరి 4) తోటకూర
19. మొక్కలు CO2 పీల్చుకుంటాయి ఎందుకు?
1) అది మొక్కల సహజ లక్షణం
2) మొక్కల సహజ పోషకం ఆక్సిజన్
3) మొక్కల సహజ పోషకమైన కార్బన్, ఆక్సిజన్ కోసం 4) ఏదీకాదు
20. నీలగిరి మొక్కలకు గల మరొక పేరు?
1) క్యాప్సికం 2) సొలానం
3) యూకలిప్టస్ 4) అజాడిరెక్టా
21. తేనె పట్టులో ఒక్కొక్కగది ఏ ఆకారంలో ఉంటుంది?
1) పంచభుజి 2) షడ్భుజి
3) సప్తభుజి 4) అష్టభుజి
22. చాలా ఎత్తులో ఎగిరే గద్ద ఆహారాన్ని ఎలా గుర్తిస్తుంది?
1) గద్దకు కంటి చూపు చాలా స్పష్టంగా ఉంటుంది
2) గద్దకు అది సహజ లక్షణం
3) గద్ద వాసన ద్వారా ఆహారాన్ని గుర్తిస్తుంది
4) పైవన్నీ
23. జంతువులకు, మనుషులకు పోలిక దేనిలో ఉంది?
1) తినడం 2) నిద్రపోవడం
3) 1, 2 4) ఏదీకాదు
24. మానవ అస్థిపంజరం: ఎముకలు:: ఆకుఅస్థి పంజరం :….?
1) పత్ర హరితం 2) ఈనెలు
3) దారు కణజాలం 4) పత్ర రంధ్రాలు
25. ఇకేబానా అంటే ?
1) ఆకులతో అలంకరణ
2) ఫలాలు విత్తనాలతో అలంకరణ
3) ఫలాలు అమరిక
4) పుష్పాల అమరిక
26. ప్రపంచంలో రెండో అత్యంత వేగవంతమైన జంతువు?
1) చిరుతపులి 2) కృష్ణజింక
3) కుందేలు 4) ఖడ్గమృగం
27. సముద్ర తీర ప్రాంత రైతులు వేటిని పెంచాలని సలహా
1) జీడిమామిడి, చెరకు, కొబ్బరి
2) అరటి, ఆర్కిడ్స్, తాటిచెట్లు
3) సరుగుడు, జీడిమామిడి, ఆర్కిడ్స్
4) సరుగుడు, పసుపు, చెరకు
28. కింది వాటిలో బిడియ జంతువు ఏది?
1) కుక్క 2) పిల్లి
3) ఉడుత 4) మేక
29. కింది వాటిలో ఒంటరిగా తిరిగే జంతువు?
1) మగ ఏనుగు 2) గొర్రెలు
3) సింహాలు 4) జీబ్రాలు
30. తేనెటీగలు ఎన్ని రకాలు?
1) 1 2) 2 3) 3 4) 4
31. తేనెటీగల నుంచి ఏమి నేర్చుకోవచ్చు?
1) క్రమశిక్షణ 2) పనుల విభజన
3) సంఘజీవనం 4) పైవన్నీ
32. ఒక కిలోతేనె తయారు కావడానికి ఎన్ని పూల మకరందం కావాలి?
1) 1 మిలియన్ 2) 2 మిలియన్లు
3) 3 మిలియన్లు 4) 4 మిలియన్లు
33. కింది వాటిలో ఔషధ మొక్కలు ఏవి?
1) తులసి 2) వేప
3) యూకలిప్టస్ 4) పైవన్నీ
34. చర్మవ్యాధులు, పండ్లకి ఉపయోగించే మొక్క?
1) వెల్లుల్లి 2) పుదీనా
3) నీలగిరి 4) వేప
35. ఏ మొక్క ఆకులు కూరగా ఉపయోగించరు?
1) తోటకూర 2) వేప
3) పాలకూర 4) చింత
36. కింది వాటిలో సర్వభక్షకులు?
1) కాకి 2) ఏనుగు
3) నెమలి 4) పులి
37. పక్షుల ఎముకలు దేనితో నిండి ఉంటాయి?
1) నీరు 2) మాంసం
3) ఎముక మజ్జ 4) గాలి
38. నెహ్రూ జూలాజికల్ పార్కు గల నగరం?
1) వరంగల్
2) మహబూబ్నగర్
3) హైదరాబాద్ 4) విశాఖపట్నం
39. కింది వాటిలో అంతరించిపోతున్న జంతువులు?
1) ఆవు, గేదె 2) నెమలి, బట్టమేక
3) గొర్రె, మేక 4) పులి, ఆవు
40. మొక్కలో వేర్లు ఏ భాగంలో ఉంటాయి?
1) కాండం కింద 2) కాండం పైన
3) కొమ్మపైన 4) ఆకులకు
సమాధానాలు
1-3 2-2 3-1 4-4
5-1 6-3 7-3 8-3
9-3 10-1 11-1 12-2
13-1 14-2 15-2 16-2
17-1 18-4 19-3 20-3
21-2 22-1 23-3 24-2
25-4 26-2 27-3 28-2
29-1 30-3 31-4 32-2
33-4 34-4 35-2 36-1
37-4 38-3 39-2 40-2
1. కింది వాటిని సరిగ్గా జతపరచండి?
1) తల్లివేరు – సమాంతర ఈనెల వ్యాపనం
2) తల్లివేరు – జాలాకార ఈ నెల వ్యాపనం
3) పీచువేర్లు – జాలాకార ఈనెల వ్యాపనం
4) పీచువేర్లు – ద్విదళ బీజాలు
2. స్వల్ప రాత్రికాల పంటకు ఉదాహరణ?
1) జొన్న 2) పత్తి
3) సోయాచిక్కుడు 4) గోధుమ
3. జతపరచండి?
ఎ) తేనెటీగలు 1) ఆక్వాకల్చర్
బి) పట్టుపురుగులు 2) ఎపీ కల్చర్
సి) చేపలు 3) సెరీకల్చర్
1) ఎ-3, బి-1, సి-2
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-2, బి-3, సి-1
4) ఎ-1, బి-2, సి-3
4. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) పాలలోని నీటిశాతం 10 శాతం -20శాతం
బి) జున్నుపాలు పసుపు రంగులో ఉండటానికి కారణం లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
5. కింది వాటిలో శైవలానికి ఉదాహరణ?
ఎ) పుట్టగొడుగు
బి) క్లామిడోమోనాస్
సి) సైకస్
డి) చిక్కుడు
6. ద్విదళ బీజ మొక్కల లక్షణం?
ఎ) తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటుంది
బి) జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
7. కింది వాటిలో గుల్మం రకానికి చెందిన మొక్క?
ఎ) గన్నేరు బి) గులాబి
సి) మిరప డి) ఆవ
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, సి డి) బి, డి
8. కింది వాటిలో ద్వివార్షిక మొక్క?
1) గోధుమ 2) బెండ
3) క్యారెట్ 4) వరి
9. కింది వాటిలో చలికాలంలో పూచే పూలు?
1) చామంతి 2) కనకాంబరాలు
3) మల్లెలు 4) పైవన్నీ
10. వెల్లుల్లి మొక్కలో జీర్ణకోశ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే భాగం?
1) ఆకులు 2) పాయుగర్భం
3) గింజలు 4) బెరడు
11. గుబురు వేరు వ్యవస్థ కలిగిన మొక్క?
ఎ) వరి బి) చిక్కుడు
సి) వేప డి) మొక్కజొన్న
1) బి 2) బి, సి
3) ఎ, డి 4) పైవన్నీ
12. వేర్ల ద్వారా శాఖీయోత్పత్తి జరిపేది?
ఎ) కరివేపాకు బి) రణపాల
1) ఎ 2) బి
3) ఎ, బి, 4) ఏదీకాదు
13. కింది వాటిలో సరైనది?
ఎ) నిష్కాంతి దశలో CO2 క్షయకరణం చెంది గ్లూకోజ్ ఏర్పడుతుంది
బి) కిరణజన్య సంయోగ క్రియ ఒక కాంతి రసాయన చర్య
సి) కిరణజన్య సంయోగ CO2 విచ్ఛిత్తి చెంది వాతావరణంలోకి CO2 విడుదల చేస్తుంది.
1) బి 2) ఎ, బి
3) ఎ, సి 4) పైవన్నీ
14. లైంగిక ప్రత్యుత్పత్తిలో అనావశ్యక భాగం?
1) రక్షక పత్రావళి 2) కేసరావళి
3) అండకోశం 4) పైవన్నీ
15. కింది వాటిలో సరైనది?
ఎ) మొక్కల్లో ద్విఫలదీకరణ, త్రిసంయోగం జరుగుతుంది
బి) శీతాకాలంలో పండే పంటల్ని ఖరీఫ్ పంటలు అంటారు
1) బి 2) ఎ
3) ఎ, బి 4) ఏదీకాదు
16. మొక్కల్లో కొత్త ఆకులు, పుష్పాలు వేగంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే పోషక పదార్థం?
1) పొటాషియం 2) ఫాస్ఫరస్
3) నత్రజని 4) పైవన్నీ
17. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) కృత్రిమంగా గుడ్లను పొదిగించేవి ఇంక్యుబేటర్స్
బి) తేనేటీగల్లో మగ ఈగలను డ్రోనులు అంటారు.
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
18. గుర్రంలో శాశ్వత దంతాల సంఖ్య?
1) 32 2) 26 3) 42 4) 28
19. పశువుల్లో వచ్చే గొంతువాపు వ్యాధికి నివారణ?
1) ట్రైక్విన్ ఇంజక్షన్
2) బెన్నిల్ ఇంజక్షన్
3) హెచ్.ఎస్. టీకా
4) పైవన్నీ
20. తేనెటీగల్లో మకరందాన్ని పరాగరేణువులను సేకరించేవి ఏవి?
1) రాణిఈగ 2) డ్రోనులు
3) కూలీ ఈగలు 4) ఏదీకాదు
21. రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండే వేర్లను కలిగిన మొక్క?
1) కరివేపాకు 2) చిక్కుడు
3) మర్రి 4) మామిడి
22. ఏ చట్టంలోని షెడ్యూలు -1 ప్రకారం అడవి జంతువులను వేటాడటం, విక్రయించడం నేరం?
1) వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1971
2) వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1991
3) వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1981
4) వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1961
సమాధానాలు
1-2 2-4 3-3 4-4
5-1 6-3 7-2 8-3
9-1 10-2 11-3 12-1
13-2 14-1 15-2 16-3
17-4 18-3 19-3 20-2
21-2 22-1
ఏకేఆర్ స్టడీసర్కిల్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?