Social Stuides – TET Special | మార్కెట్ యార్డుల్లో కనీస ధర దేనితో ప్రారంభమవుతుంది ?
1. చెరువులోని నీటిని పొలాలకు కట్టే వ్యక్తిని గ్రామాల్లో ఏమంటారు?
1) భర్తుకా 2) పట్లా
3) నీరటి 4) గ్రామణి
2. భూమిలో రెండు రాతిపొరల మధ్యగల నీటి పొరను ఎలా పిలుస్తారు?
1) జలస్తరం 2) భూజలం
3) సహజనీరు 4) హాటర్లైన్
3. నీటిని ప్రవహించనీయని రాతిపొర?
1) గట్టి రాతిపొర 2) మృదు రాతిపొర
3) జలస్తరం 4) ఇసుకరాయి
4. ఎముకలు, దంతాల వ్యాధులు నీటిలోని ఏ ఖనిజం అధిక మోతాదు వల్ల కలుగుతాయి?
1) ఫ్లోరైడ్ 2) నైట్రేట్
3) ఉప్పు 4) జింక్
5. నీరు పీల్చని కఠిన రాతిపొర?
1. ఇసుకరాయి 2) గ్రానైట్
3) పగుళ్లు గల సున్నపురాయి
4) పైవేవీకాదు
6. బృహత్ శిలాయుగంలో మానవుడు నీటిని నిల్వ చేయడానికి అనుసరించిన విధానం?
1) కాలువలు 2) చెరువులు
3) గొట్టపు బావులు 4) బావులు
7. ఈర్లదేవి చెరువు నిర్మించినవారు?
1) బేతాళరెడ్డి 2) విరళాదేవి
3) వేమారెడ్డి 4) కాకతీరుద్రుడు
8. తక్కువ లోతులోనే భూగర్భజలం పుష్కలంగా ఎక్కడ లభిస్తుంది?
1) రాయలసీమ 2) తెలంగాణ
3) కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతం
4) పీఠభూమి ప్రాంతం
9. మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయ తలపెట్టిన చెరువులు సుమారుగా?
ఎ) 27000 బి) 37000
3) 47000 4) 57000
10. బేతవోలు గ్రామంలో ఉన్న చెరువు?
1) ఈర్లదేవి చెరువు
2) మైలాంబ చెరువు
3) రుద్రదేవ చెరువు 4) బేతాళరెడ్డి
11. చెరువులో నీరు అధికంగా ఉన్నప్పుడు వాడే వల?
1) సన్న వల 2) దొడ్డ వల
3) విసిరే వల 4) కచ్చువల
12. చెరువుల్లో చేపలు పట్టుకునే హక్కు దేని ఆధారంగా కల్పిస్తారు?
1) చెరువులోతు
2) ఆయకట్టు విస్తీర్ణం
3) కాలువల పొడవు
4) నీరు నిల్వ ఉండే కాలం
సమాధానాలు
1-3 2-1 3-1 4-1
5-2 6-2 7-1 8-3
9-3 10-1 11-4 12-2
1. మెరిసే ఖనిజం ఏది?
1) బాక్సైట్ 2) మైకా
3) క్రోమ్ 4) ఫెల్డ్స్పార్
2. బొగ్గుగని గోడలు నల్లగా కాకుండా ప్రకాశిస్తూ ఉండటానికి దేన్ని పూస్తారు?
1) బాక్సైట్ 2) డోలమైట్
3) బంగారం 4) వెండి
3. ముడి చమురు ఒక …..?
1) ఖనిజ నూనె 2) లోహం
3) వాయువు 4) ఘనపదార్థం
4. పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నాయి?
1) విశాఖపట్నం 2) అరకులోయ
3) గోదావరిలోయ 4) కృష్ణానదిలోయ
5. ఏ సంవత్సరంలో ప్రభుత్వం అన్ని గనులను స్వాధీనం చేసుకుంది?
1) 1980 2) 1970
3) 1950 4) 1920
6. దక్షిణ భారతదేశంలో అధికంగా గచ్చుకు ఉపయోగించే నీలిసున్నం బండలు లభించే ప్రదేశం?
1) వరంగల్ 2) షాబాద్
3) కరీంనగర్ 4) కొత్తగూడెం
7. టాన్ బ్రౌన్ గ్రానైట్ నిల్వలు ఏ జిల్లాలో కలవు?
1) నిజామాబాద్ 2) ఆదిలాబాద్
3) కరీంనగర్ 4) ఖమ్మం
8. కింది వాటిలో పునరుద్దరించే వనరు ఏది?
1) బంగారం 2) బొగ్గు
3) కలప 4) ఇనుము
9. విద్యుత్తు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో విస్తృతంగా వాడుతున్న ఖనిజం?
1) బాక్సైట్ 2) అభ్రకం
3) బెరైటీస్ 4) ఆస్బెస్టాస్
10. బేరియం అనే మూలకం దేని నుంచి తయారు చేస్తారు?
1) బెరైటీస్ 2) ఫెల్డస్పార్
3) ఆస్బెస్టాస్ 4) అభ్రకం
11. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో అధికంగా లభించే ఖనిజం?
1) ముడి చమురు 2) పెట్రోలియం
3) ముగ్గురాయి 4) బొగ్గు
12. నూతన జాతీయ ఖనిజ విధానాన్ని భారత ప్రభుత్వం ప్రకటించిన సంవత్సరం?
1) 1970 2) 1993
3) 1886 4) 1952
13. బయ్యారం రిజర్వు అడవుల్లో లభించే ఇనుప ఖనిజం?
1) మేలు రకం 2) మధ్య రకం
3) ఫ్లోట్ ఐరన్ 4) తక్కువ రకం
సమాధానాలు
1-2 2-2 3-1 4-3
5-2 6-2 7-2 8-3
9-2 10-1 11-4 12-2
13-2 14-2
1. మనదేశంలో సంతల సంఖ్య సుమారుగా?
1) 10,000 2) 15,000
3) 20,000 4) 25,000
2. చౌటుప్పల్ గ్రామంలో సంత జరిగే రోజు?
1) ఆదివారం 2) సోమవారం
3) మంగళవారం 4) బుధవారం
3. సంతలు జరిగే రోజులు ప్రదేశాలకు సంబం ధించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి?
1) ఆత్మకూరు-సోమవారం
2) మునుగోడు- గురువారం
3) నార్కెట్పల్లి-శుక్రవారం
4) కట్టంగూర్- బుధవారం
4. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి దారులను నేరుగా వినియోగదారులను కలుపుటకు ప్రారంభించింది?
1) రైతు బంధు 2) అప్నా బజార్
3) రైతు బజార్ 4) రైతు మార్కెట్
5. రైతు బజార్లలో రైతులతోపాటు దుకాణాలు ఎవరికి కేటాయిస్తారు?
ఎ) మిల్లర్
బి) స్వయం సహాయక సంఘ సభ్యులు
సి) కమీషన్ ఏజెంట్లు
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) సి
6. రైతుబజార్లో ధర ఏ విధంగా నిర్ణయిస్తారు?
1) టోకు వర్తకుని ధర కంటే
10 శాతం అధికం, చిల్లర వర్తకుని ధర కంటే 10 శాతం ఎక్కువ
2) టోకు వర్తకుని ధర కంటే 25 శాతం అధికం, చిల్లర వర్తకుని ధర కంటే 25
శాతం ఎక్కువ
3) టోకు వర్తకుని ధర కంటే 30 శాతం అధికం, చిల్లర వర్తకుని ధర కంటే 30 శాతం ఎక్కువ
4) టోకు వర్తకుని ధర కంటే 40 శాతం అధికం, చిల్లర వర్తకుని ధర కంటే 40 శాతం ఎక్కువ
7. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కనీస ధర దేనితో ప్రారంభమవుతుంది?
1) గిట్టుబాటు ధర 2) మద్దతు ధర
3) సేకరణ ధర 4) జారీ ధర
8. కనీస మద్దతు ధరలు ప్రకటించేది ఎవరు?
1) రైతులు
2) వ్యవసాయ మార్కెట్ యార్డులు
3) ప్రభుత్వం 4) కొనుగోలుదారులు
9. కనీస మద్దతు ధర కంటే ధరలు క్షీణించినప్పుడు పంట ఉత్పత్తులను ప్రభుత్వం ఏ సంస్థ ద్వారా కొనుగోలు చేస్తుంది?
1) ఐసీఎంఆర్ 2) పీసీఐ
3) ఇక్రిశాట్
4) భారత గిడ్డంగుల సంస్థ
10. వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన వర్తకులు చెల్లించాల్సిన రుసుం?
1) నూటికి 1 రూపాయి
2) నూటికి 2 రూపాయలు
3) నూటికి 3 రూపాయలు
4) నూటికి 4 రూపాయలు
11. వ్యయసాయ మార్కెట్ యార్డులో సరుకు విక్రయించిన రైతులు చెల్లించాల్సిన చార్జీలు?
1) నూటికి రూ.1.50 2) నూటికి రూ.2.5
3) నూటికి రూ.3.5
4) నూటికి రూ.4.5
12. రాష్ట్ర వ్యవసాయోత్పత్తుల్లో మార్కెట్ యార్డుల్లో అమ్మే పంటల వాటా?
1) వ వంతు 2) వ వంతు
3) వ వంతు 4) 2/5వ వంతు
13. మొత్తం గ్రామీణ కుటుంబాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నది?
1) 1/5వ వంతు 2) 2/5వ వంతు
3) 3/5వ వంతు 4) 4/5వ వంతు
14. కొన్ని కంపెనీలకు ముందుగా అంగీకరించిన ధర మేరకు పంటలను ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేసే విధానానికి గల పేరు?
1) సేంద్రీయ వ్యవసాయం
2) విస్తృత వ్యవసాయం
3) ఒప్పంద వ్యవసాయం 4) ఏదీకాదు
15. కింది వాటిలో ఒప్పంద వ్యవసాయం వల్ల కలిగే దుష్పరిణామం?
1) అధిక రసాయన ఎరువుల వినియోగం
2) భూగర్భజలాల అధిక వినియోగం
3) ఆహార భద్రత క్షీణించడం
4) పైవన్నీ
16. రాష్ట్రంలో మొత్తం రైతుల్లో చిన్న రైతుల వాటా?
1) 1/5వ వంతు 2) 2/5వ వంతు
3) 3/5వ వంతు 4) 4/5వ వంతు
సమాధానాలు
1-4 2-1 3-4 4-3
5-2 6-2 7-2 8-3
9-2 10-1 11-3 12-1
13-2 14-3 15-4 16-4
1. ఆదిమ మానవుడు బొమ్మలకు రంగులు వేయడానికి ఉపయోగించినవి?
ఎ) జంతువుల కొవ్వు
బి) రాళ్లపొడి
సి) చెట్ల నుంచి తీసిన రసం
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) బి, సి
2. మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన?
1) నిప్పును కనుగొనడం
2) చక్రాన్ని కనుగొనడం
3) వ్యవసాయం ప్రారంభించటం
4) ఆయుధాల తయారీ
3. కింది వాటిలో మొదటిసారి వ్యవసాయం చేసిన ప్రాచీన స్థావరం?
1) నాగార్జున కొండ 2) బీహార్
3) బెలూచిస్థాన్ 4) కశ్మీర్
4. శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు దేనికి చిహ్నాలు?
1) పశుపోషణ
2) వ్యవసాయం
3) ఆహార ధాన్యాల నిల్వ
4) వేట
5. తెలంగాణలో డోలమెన్ రాక్షసగుళ్లు బయల్పడిన ప్రదేశం?
1) పోతిన్పల్లి 2) ఏలేశ్వరం
3) రేవుని గ్రామం 4) దేవుని గుట్ట
6. తెలంగాణలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఎక్కడ బయల్పడ్డాయి?
1) నల్లగొండ 2) కరీంనగర్
3) నాగర్ కర్నూల్ 4) ఆదిలాబాద్
7. మానవుడు పంటలు పండించడాన్ని సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు?
1) 8000 సంవత్సరాలు
2) 9000 సంవత్సరాలు
3) 10,000 సంవత్సరాలు
4) 12,000 సంవత్సరాలు
8. చెక్కకు బింగించిన రాతి గొడ్డలి లభించిన ప్రదేశం?
1) సేరుపల్లి 2) అమ్రాబాద్
3) కొండాపూర్ 4) కోటిలింగాల
సమాధానాలు
1-2 2-3 3-3 4-1
5-1 6-3 7-4 8-2
1. కింది వాక్యాల్లో సరైనది?
1) వ్యవసాయ పనులు సంవత్సరమంతా ఉంటాయి
2) వ్యవసాయం ద్వారా లభించే కూలీ ద్వారా సంవత్సరానికి సరిపడా ఆదాయం పొందవచ్చు
3) వ్యవసాయ రంగంలో స్త్రీ, పురుషులకు కూలీ వేర్వేరుగా ఇస్తారు
4) నిత్యావసరాల ధరలు పెరిగిన రీతిలో వ్యవసాయ కూలీల రేట్లు కూడా పెరుగుతున్నాయి
2. తెలంగాణలో వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న గ్రామీణ కుటుంబాలు?
1) 1/5వ వంతు 2) 2/5వ వంతు
3) 3/5వ వంతు 4) 4/5వ వంతు
3. కింది వాటిలో చిన్న రైతులకు సంబంధించిన సమస్య?
1) పెట్టుబడి కొరత 2) రుణాల సమస్య
3) వ్యవసాయోత్పత్తుల అమ్మకం సమస్య
4) పైవన్నీ
4. రైతులు, కంపెనీల మధ్య అవగాహనతో చేసే వ్యవసాయానికి గల పేరు?
1) సేంద్రియ వ్యవసాయం
2) ఒప్పంద వ్యవసాయం
3) సాంద్ర వ్యవసాయం
4) విస్తృత వ్యవసాయం
5. ఒప్పంద వ్యవసాయంలో గల లోపం?
1) అధిక పెట్టుబడులు 2) స్థిరమైన ధరలు
3) పంటల నాణ్యత 4) పైవేవీకావు
6. ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే కంపెనీలు కొనుగోలు చేస్తాయి
2) తక్కువ దిగుబడుల వల్ల కలిగే నష్టం రైతులే భరించాలి
3) ఎరువులు, భూగర్భజలాల వాడకం అధికంగా ఉంటుంది
4) రైతు కుటుంబానికి ఆహార భద్రత లభిస్తుంది
7. తెలంగాణ ప్రస్తుత వ్యవసాయ రంగాన్ని తెలియజేసే వాక్యాన్ని గుర్తించండి?
1) ప్రధాన ఆహార పంట మొక్కజొన్న
2) ఆహార పంటలు రాగులు, జొన్నలు, మొక్కజొన్నలకు పాధాన్యం పెరుగుతున్నది
3) పత్తి, చెరకు, మిర్చి వంటి వాణిజ్య పంటల సాగు పెరుగుతున్నది
4) తెలంగాణ రైతులు కాలువలు, చెరువులపై అధికంగా ఆధారపడుతున్నారు
సమాధానాలు
1-3 2-2 3-4 4-2
5-1 6-4 7-3
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?