Current Affairs JULY | దేశంలో ఆదాయ పన్ను దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
కరెంట్ అఫైర్స్ (జూలై)
1. ట్విట్టర్ కొత్త లోగో గుర్తు ఏమిటి?
1) ET 2) Y 3) X 4) M
2. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నేషనల్ జియోసైన్స్ అవార్డులు-2022 ఎంతమందికి ప్రదానం చేశారు?
1) 25 2) 22 3) 18 4) 15
3. బయోటెక్నాలజీ, వ్యవసాయ రంగంలో యువ పరిశోధకులు, స్టార్టప్‌ల ద్వెపాక్షిక మార్పిడికి భారతదేశంతో ఏ దేశం అంగీకరించింది?
1) రష్యా 2) సింగపూర్
3) అర్జెంటీనా 4) శ్రీలంక
4. ఇటీవల లింగ మార్పిడి వివాహాలను ఏ దేశం నిషేధించింది?
1) చైనా 2) అమెరికా
3) బ్రెజిల్ 4) రష్యా
5. ఐదో హెలికాప్టర్, స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు?
1) ఉత్తరప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) మధ్యప్రదేశ్ 4) తమిళనాడు
6. ఐఐఎం కోజికోడ్ డైరెక్టర్ దేబాశిష్ చటర్జీ రచించిన ‘కృష్ణ-ది 7th సెన్స్’ పుస్తకం మలయాళ అనువాదాన్ని ఎవరు విడుదల చేశారు?
1) అభినందన్
2) పినరయి విజయన్
3) ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
4) విరోజ్
7. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ‘వాటర్ ఏటీఎం’ను ఎక్కడ ప్రారంభించారు?
1) ఢిల్లీ 2) చెన్నై
3) పుదుచ్చేరి 4) హైదరాబాద్
8. బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని ఏ దేశం నిషేధించింది?
1) రష్యా 2) శ్రీలంక
3) చైనా 4) భారతదేశం
9. ఎన్ని కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
1) 16 2) 21 3) 25 4) 30
10. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) ఖాతాల్లో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు ఎంత శాతం?
1) 6.15 శాతం 2) 8.10 శాతం
3) 7.05 శాతం 4) 8.15 శాతం
11. టెస్టు క్రికెట్లో వేగవంతమైన 100 పరుగుల ప్రపంచ రికార్డును ఏ దేశం కలిగి ఉంది?
1) భారత్ 2) పాకిస్థాన్
3) న్యూజిలాండ్ 4) ఆస్ట్రేలియా
12. అమెరికాలో ఐటీఎఫ్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న రెండో భారత క్రీడాకారిణి ఎవరు?
1) విజయవాణి 2) కర్మన్ కౌర్ థండి
3) చార్లికా 4) విదిత
13. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్ 2023లో భారతదేశం ఎన్ని పతకాలు గెలుచుకుంది?
1) 12 2) 10 3) 17 4) 15
14. ప్రపంచ ముంపు నివారణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
1) జూలై 25 2) జూలై 26
3) జూలై 28 4) జూలై 21
సమాధానాలు
1. 3 2. 2 3. 3 4. 4
5. 3 6. 3 7. 1 8. 4
9. 2 10. 4 11. 1 12. 2
13. 3 14. 1
1. భారతదేశంలో ఎక్కువ కాలం పని చేసిన రెండో ముఖ్యమంత్రి ఎవరు?
1) నితీశ్ కుమార్
2) యోగీ ఆదిత్యనాథ్
3) మమతా బెనర్జీ
4) నవీన్ పట్నాయక్
2. ఇండియా ైక్లెమేట్ ఎనర్జీ డ్యాష్‌బోర్డ్ 3.0ని ఏ సంస్థ ప్రారంభించింది?
1) నీతి ఆయోగ్
2) కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ
3) విద్యా మంత్రిత్వ శాఖ
4) ఐఐటీ మద్రాస్
3. భారతదేశపు మొదటి గంజాయి ఔషధ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్వహించనున్నారు?
1) లడఖ్ 2) జమ్మూ
3) ఏపీ 4) ఒడిశా
4. ‘ఆసియా ట్రాన్సిషన్ ఫైనాన్స్ స్టడీ గ్రూప్’లో చేరిన మొదటి భారతీయ సంస్థ ఏది?
1) బీఎస్ఎస్ఎల్
2) పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
3) పవర్ సోలార్ కార్పొరేషన్
4) సెయిల్
5. భారత అధ్యక్షతన మూడో జీ20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) చెన్నై 2) భువనేశ్వర్
3) కోల్‌కతా 4) కోయంబత్తూరు
6. గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కోసం ఏ రాష్ట్రం అసెంబ్లీలో వర్కర్స్ బిల్లు 2023ను ప్రవేశపెట్టింది?
1) కేరళ 2) రాజస్థాన్
3) తమిళనాడు 4) ఒడిశా
7. సెమీకండక్టర్ పాలసీ (2022-2027)ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది?
1) గుజరాత్ 2) రాజస్థాన్
3) తమిళనాడు 4) ఒడిశా
8. ఏ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ప్రజలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో ఇవ్వనున్నట్లు ప్రకటించింది?
1) గుజరాత్ 2) రాజస్థాన్
3) తమిళనాడు 4) తెలంగాణ
9. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ పథకం కింద దివ్యాంగులకు ఆర్థిక సాయాన్ని ఎంత పెంచింది?
1) రూ.1,000 2) రూ.1,500
3) రూ.2,000 4) రూ.1,250
11. ‘మిషన్ శక్తి స్కూటర్ పథకం’ ఏ రాష్ట్రంలో ఆమోదించారు?
1) మధ్యప్రదేశ్ 2) ఛత్తీస్‌గఢ్
3) ఒడిశా 4) బీహార్
12. సుప్రీంకోర్టు అధికారాలను నియంత్రిస్తూ ఏ దేశ పార్లమెంట్ వివాదాస్పద బిల్లుకు ఆమోదం తెలిపింది?
1) ఇజ్రాయెల్ 2) రష్యా
3) సింగపూర్ 4) బ్రెజిల్
13. టాంపర్ ఓపెన్ 2023 టైటిల్‌ను గెలుచుకున్న భారతీయ టెన్నిస్ ఆటగాడు ఎవరు?
1) సుమిత్ నాగల్ 2) శేఖర్ నందా
3) కేశర్ 4) వినోద్ కృష్ణ
14. పారిస్ ఒలింపిక్స్‌కు సంబంధించి హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) కుమార్ గుప్తా 2) విగ్నేశ్ చంద్ర
3) కుమార్‌సింగ్ 4) రవిశంకర్
15. భారత క్రికెట్ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ ఎవరు?
1) శార్దూల్ ఠాకూర్
2) రవిచంద్రన్ అశ్విన్
3) హార్దిక్ పాండ్యా 4) జస్ప్రీత్ బుమ్రా
16. దేశంలో ఆదాయ పన్ను దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూలై 25 2) జూలై 24
3) జూలై 20 4) జూలై 21
17. జాతీయ థర్మల్ ఇంజినీర్ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూలై 25 2) జూలై 24
3) జూలై 20 4) జూలై 21
సమాధానాలు
1. 4 2. 1 3. 2 4. 2
5. 1 6. 2 7. 1 8. 4
9. 1 10. 1 11. 3 12. 1
13. 1 14. 4 15. 2 16. 2
17. 2
1. ఇటీవల బ్రిక్స్ కూటమిలో చేరడానికి ఏ దేశం దరఖాస్తు చేసుకుంది?
1) అల్జీరియా 2) అర్జెంటీనా
3) ఇరాన్ 4) జింబాబ్వే
2. NDBలో చేరడానికి ఇటీవల దరఖాస్తు చేసుకున్న దేశాల్లో లేని దేశం ఏది?
1) సౌదీ అరేబియా 2) అర్జెంటీనా
3) అల్జీరియా 4) ఇరాన్
3. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి?
1) INC 2) BJP
3) CPI 4) BJD
4. ఇటీవల 24×7 సోలార్ గ్రామంగా గుర్తింపు పొందిన సగసాహీ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఒడిశా 2) ఉత్తరప్రదేశ్
3) గుజరాత్ 4) కేరళ
5. అలోక్ అరధే ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు?
1) ఏపీ 2) తెలంగాణ
3) కేరళ 4) కర్ణాటక
6. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహాన్ని రూ.300 కోట్లతో ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు?
1) ఏపీ 2) తెలంగాణ
3) తమిళనాడు 4) మహారాష్ట్ర
7. ఇండియా ఏ దేశానికి INS కృపాణ్ యుద్ధనౌకను బహుమతిగా అందించింది?
1) శ్రీలంక 2) వియత్నాం
3) నేపాల్ 4) బంగ్లాదేశ్
8. కేంద్ర అణుశక్తి మంత్రి జితేంద్రసింగ్ ప్రకారం 2031 నాటికి అణువిద్యుత్ సామర్థ్యం 7000 MW నుంచి ఎంతకు పెరగనుంది?
1) 21,480 MW
2) 22,480 MW
3) 23,480 MW
4) 24,480 MW
9. స్కైరూట్ అనే అంకుర సంస్థ రామన్-2 రాకెట్ ఇంజిన్‌ను పరీక్షించింది, స్కైరూట్ ఏ రాష్ట్రంలో ఉంది
1) కర్ణాటక 2) కేరళ
3) తెలంగాణ 4) మహారాష్ట్ర
10. ఏ రక్షణ దళం ఇటీవల రెండో ఎడిషన్ ‘G20 THINQ’ని ప్రారంభించింది?
1) ఆర్మీ 2) నేవీ
3) ఎయిర్‌ఫోర్స్ 4) CRPF
11. కేంద్ర ఆర్థిక మంత్రి ఏ నగరంలో జీఎస్టీ భవన్‌ను ప్రారంభించారు?
1) ముంబై 2) అగర్తల
3) అహ్మదాబాద్ 4) ఢిల్లీ
12. వరల్డ్ బ్రౌన్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూలై 21 2) జూలై 22
3) జూలై 20 4) జూలై 23
13. ఫసల్ బీమా యోజన పథకం విస్తరణకు, అభివృద్ధికి సంబంధించి ఇండియా ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?
1) UNDP 2) FAO
3) WTO 4) ICAR
14. ఇంటర్నేషనల్ మైలోమా ఫౌండేషన్ నూతన చైర్మన్ ఎవరు?
1) ఎస్.రాజ్‌కుమార్ 2) ప్రవీణ్ చంద్ర
3) అక్షయ్ పటేల్ 4) ఎస్.రాజు
సమాధానాలు
1. 1 2. 4 3. 4 4. 1
5. 2 6. 1 7. 2 8. 2
9. 3 10. 2 11. 2 12. 2
13. 1 14. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 96525 78639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు