GATE 2024 | ఉన్నత చదువులకు కొలువులకు గేట్‌వే
గేట్
- జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షను బెంగళూరులోని ఐఐఎస్సీతోపాటు ఏడు ఐఐటీలు (బాంబే, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ) కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ ఏడాది బెంగళూరులోని ఐఐఎస్సీ ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్గా వ్యవహరిస్తుంది.
- గేట్ పరీక్షలో స్కోర్ ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోని విద్యాసంస్థలు/ఏజెన్సీల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా నేరుగా డాక్టోరల్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ /ఆర్కిటెక్చర్. ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టుల్లో డాక్టోరల్ ప్రోగ్రామ్స్ చదవవచ్చు. దీంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంవోఈ) స్కాలర్షిప్/అసిస్టెంట్‌షిప్ అందిస్తుంది. గేట్‌స్కోర్, అకడమిక్ రికార్డు/ ఇంటర్వ్యూల ఆధారంగా స్కాలర్షిప్లను ఎంవోఈ అందిస్తుంది.
- గేట్ స్కోర్ ఆధారంగా పలు పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (పీఎస్‌యూ)లు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి.
ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలు
- ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, డీఆర్డీవో, బీహెచ్ఈఎల్, గెయిల్, హాల్, ఐవోసీఎల్, ఎన్పీసీఐఎల్, ఓఎన్జీసీ.
- కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ ఏ స్థాయి పోస్టులను నేరుగా భర్తీ చేయడానికి గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
అర్హతలు: డిగ్రీ (ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్) ఉత్తీర్ణత. ప్రస్తుతం డిగ్రీ మూడో సంవత్సరం లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: గరిష్ఠ వయోపరిమితి లేదు. ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు. - ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా
- మొత్తం పేపర్లు: 30
- పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి మూడుగంటలు. అభ్యర్థులు ఒకటి లేదా రెండు పేపర్లను ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఇవి నిర్వాహకులు ఇచ్చిన కాంబినేషన్స్ ప్రకారం మాత్రమే ఎంపిక చేసుకోవాలి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
పరీక్ష పేపర్లు
ఏరోస్పేస్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయో మెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్, కెమికల్, సీఎస్ &ఐటీ, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కెమిస్ట్రీ, ఈసీఈ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, జియోమ్యాటిక్స్ ఇంజినీరింగ్, జియాలజీ అండ్ జియోఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్&మెరైన్ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్, ప్రొడక్షక్షన్&ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, స్టాటిస్టిక్స్, టెక్స్టైల్ ఇంజినీరింగ్&ఫైబర్ సైన్స్, ఇంజినీరింగ్ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్.
ముఖ్య తేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో ఆగస్టు 24 నుంచి
- చివరితేదీ: సెప్టెంబర్ 29
- గేట్ పరీక్ష తేదీలు: 2024, ఫిబ్రవరి 3, 4, 10, 11
- రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, మెదక్, నల్లగొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్.
- ఫలితాల వెల్లడి: మార్చి 16
- వెబ్సైట్: https://gate2024.iisc.ac.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు