IBPS 2023 Notification | ఐబీపీఎస్లో 1,402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
IBPS 2023 Notification | ఐటీ ఆఫీసర్, వ్యవసాయ క్షేత్ర అధికారి, రాజభాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ అధికారి తదితర స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీఈ, బీటెక్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఎంఎస్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), కెనరా బ్యాంక్(Canara Bank), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితర బ్యాంకులలో 1,402 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిలిమ్స్ టెస్ట్, మెయిన్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 1,402
పోస్టులు : ఐటీ ఆఫీసర్, వ్యవసాయ క్షేత్ర అధికారి, రాజభాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్.
అర్హతలు : పోస్టులను బట్టి బీఈ, బీటెక్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఎంఎస్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయస్సు : 20-30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ప్రిలిమ్స్ టెస్ట్, మెయిన్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పోస్టులను భర్తీ చేయనున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్,
బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితరాలు.
దరఖాస్తు రుసుము: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
మెయిన్స్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.
దరఖాస్తుకు చివరితేది: ఆగష్టు 21
ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: డిసెంబర్ 2023
వెబ్సైట్: https://www.ibps.in/
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

