Economy | స్వాతంత్య్రానికి పూర్వం ఎనిమిది… తర్వాత ఏడు
భారతదేశం జనాభా
- సెన్సస్ (Census) అనేది లాటిన్ మూలానికి చెందినది.
- సెన్సస్ (Census) లాటిన్ – సెన్సర్ (Censer) నుంచి ఆవిర్భవించింది. దీనికి అంచనా అని అర్థం.
- సెన్సస్ అంటే జన గణన (జనాభా లెక్కల సేకరణ).
- ఒకదేశంలో జనాభా, జనాభాకు సంబంధించిన అన్ని వివరాలు ప్రతి ఇంటింటికి సర్వేచేస్తూ శాస్త్రీయంగా లెక్కించడాన్ని జనాభా సెన్సస్ అంటారు.
- జనాభా గణన అనేది ఒక నిర్దిష్ట జనాభాలోని సభ్యులకు సంబంధించిన జనాభా సమాచారాన్ని క్రమపద్ధతిలో పొందడం, నమోదు చేయడం, గణించడం వంటి ప్రక్రియ.
జనాభా గణన
- భారతదేశంలో నమోదు చేసిన జనాభా గణన దాదాపు క్రీ.పూ.330 లో చంద్రగుప్త మౌర్య చక్రవర్తి చాణుక్యుడు, అశోకుడి నాయకత్వంలో జరిగినట్లు భావిస్తున్నారు.
- భారతదేశంలో జనాభా గురించి తెలిపిన మొదటి గ్రంథం కౌటిల్యుని అర్థశాస్త్రం.
- కౌటిల్యుని అర్థశాస్త్రం గొప్పరాజనీతి శాస్త్ర గ్రంథం. ఇది మానవ వనరులను ఖనిజ సంపదతో సమ్మిళితం చేసి వివరిస్తుంది.
- భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ మొదట క్రీ.శ. 1872లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన ఎల్టన్ మేయో కాలంలో లెక్కించారు. కానీ ఇది ఏక కాలంలో (1865-72) జరగలేదు, అశాస్త్రీయమైనది. ఈ జనాభా లెక్కలను శాస్త్రీయ పద్ధతిలో మొదట క్రీ.శ.1881 సం. నుంచి లార్డ్ రిప్పన్ కాలంలో డబ్ల్యూ.సి ఫ్ల్లోడెన్ ఆధ్వర్యంలో ఏక కాలంలో లెక్కించారు. 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన చేస్తున్నారు.
- 1872 నుంచి 2011 వరకు జనాభా లెక్కల సేకరణ 15వది. వీటిలో స్వాతంత్య్రానికి పూర్వం 8, స్వాతంత్య్రం తర్వాత 7 జరిగాయి.
- భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ చేయడానికి సెన్సస్ కమిషన్ను 1948లో ఏర్పాటు చేశారు. ఆది హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ జనన గణనను కేంద్ర జాబితాలో 7వ షెడ్యూల్ లోని ఆర్టికల్ 246 పొందుపరిచారు.
- ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి, శాస్త్రీయ పద్ధతిలో జనాభా లెక్కల సేకరణ ప్రారంభించిన సంవత్సరం 1881
- 20వ శతాబ్దంలో మొదటి జనాభా లెక్కల సేకరణ జరిగిన సంవత్సరం 1901
- పోలిస్తే 1921లో జనాభా తగ్గింది. కారణం 1918లో ఇన్ఫ్లూయెంజా వ్యాధి వల్ల జనాభా తగ్గింది. అంటే 1921లో రుణాత్మక వృద్ధి అల్ప జనాభా వద్ధిరేటు నమోదైన సంవత్సరం 1921 అందుకే 1921ని గొప్ప విభజన సంవత్సరం (The year of Great Divided) అంటారు.
- 1911-21 మధ్య దశాబ్ద కాలంలో జనాభా వృద్ధి రేటు అల్పంగా నమోదైంది. స్వాతంత్య్రం తర్వాత మొదటిసారి జనాభా లెక్కల సేకరణ 1951లో జరిగింది.
- 1961తో పోలిస్తే 1971లో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉంది. అంటే అత్యధిక జనాభా వృద్ధి రేటు గల సంవత్సరం 1971
- 2000 మే 11 నాటికి భారతదేశ జనాభా 100 కోట్లకు చేరుకుంది. 2000 మే 11న ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ హాస్పిటల్లో ఆస్తా అనే శిశువు జన్మించడంతో భారతదేశ జనాభా 100 కోట్లకు చేరుకుంది. ఆ శిశువును శతకోటి శిశువు అని ప్రభుత్వం ప్రకటించింది.
- 2001లో భారతదేశ జనాభా 102.9 కోట్లు (102,87, 37, 436)
- 2011లో భారతదేశ జనాభా 121.09 కోట్లు (121,08, 54,977)
- 1901లో 23.83 కోట్ల జనాభా ఉన్న భారతదేశం 2011 నాటికి 121.09 కోట్లకు చేరింది. అంటే 110 సంవత్సరాల్లో 97 కోట్లకు పైగా జనాభా పెరిగింది.
2011 భారతదేశ జనాభా లెక్కలు - 2011 భారతదేశ జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ సి. చంద్రమౌళి ఆధ్వర్యంలో జనాభా లెక్కల సేకరణ జరిగింది. ప్రస్తుత కమిషనర్గా వివేక్ జోషి ఉన్నారు.
- 2011 జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో జరిగింది.
- 28 రాష్ర్టాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 640 జిల్లాలు (ప్రస్తుతం 739 జిల్లాలు), 5924 ఉప జిల్లాలు, 7935 పట్టణాలు, 6 లక్షలకు పైగా గ్రామాల్లో జనాభా లెక్కలు 16 భాషల్లో సేకరించారు.
- నాటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అయిన గోపాల కృష్ణ పిైళ్లె, జాతీయ జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ అయిన సి. చంద్రమౌళి 2011 మార్చి, 31న జనాభా లెక్కల వివరాలను విడుదల చేశారు.
- 2011 జనాభా లెక్కల నినాదం (Slogan) Our Census-Our future
మన జనాభా లెక్కలు – మన భవిష్యత్. - 2011 మార్చి 1 నాటికి భారతదేశ జనాభా 121,08,54,977 (121.09 కోట్లు) అంటే 12010 మిలియన్లు, 1.21 బిలియన్లు.
- భారతదేశ జనాభా 121.09 కోట్లు అనేది ప్రపంచంలోని అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల మొత్తం జనాభాతో దాదాపు సమానంగా ఉంది. అంటే ప్రపంచంలోని జనాభాలో మొదటి పదిదేశాల్లో ఆరు దేశాల జనాభాకు సమానంగా ఉంది.
- ప్రపంచ విస్తీర్ణంలో 2.4 శాతం వాటా కలిగి భారతదేశం 7వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచ జనాభాలో 17.5 శాతం వాటా కలిగి భారతదేశం 2వ స్థానాన్ని ఆక్రమించింది.
- 2011 సెన్సస్ ప్రకారం భారతదేశ జనాభా 121,08,54,977 (121.09 కోట్లు)
- పురుష జనాభా 62,32,70,258 (51.47 శాతం)
- స్త్రీ జనాభా 58,75,84,719 (48.53 శాతం)
- భారతదేశ పురుష జనాభా కంటే స్త్రీ జనాభా సుమారు 1.5 శాతం తక్కువగా ఉంది.
- 2001-2011 మధ్య భారతదేశంలో అదనంగా పెరిగిన జనాభాలో పురుష జనాభా 9.097 కోట్లు కాగా స్త్రీ జనాభా 9.099 కోట్లు. అంటే అదనంగా పెరిగిన జనాభాలో పురుష జనాభా కంటే స్త్రీలలో ఎక్కువ.
- 2001-11 మధ్య భారతదేశంలో అదనం గా పెరిగిన జనాభా (18.19 కోట్లు) ప్రపంచంలోని జనాభాలో 5వ స్థానంలో ఉన్న బ్రెజిల్ జనాభాకు సమానం.
ప్రాక్టీస్ బిట్స్
1. సెన్సస్ అనే పదం ఏ భాషా మూలానికి చెందినది?
ఎ) గ్రీక్ బి) లాటిన్
సి) ఫ్రెంచ్ 4) ఆంగ్లం
2. భారతదేశంలో జనాభా గురించి వివరించిన మొదటి గ్రంథం ఏది?
ఎ) చాణుక్యుని అర్థశాస్త్రం
బి) కౌటిల్యుని అర్థశాస్త్రం
సి) విష్ణు గుప్తుని అర్థశాస్త్రం
డి) పైవన్నీ
3. భారతదేశంలో మొదటిసారి జనాభా లెక్కల సేకరణ ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ కాలంలో ప్రారంభించారు?
ఎ) ఎల్టన్ మేయో బి) లార్డ్ రిప్పన్
సి) డల్హౌసి డి) ప్లోడెన్
4. భారతదేశ స్వాతంత్య్రానంతరం 2011 జనాభా లెక్కల సేకరణ ఎన్నోది?
ఎ) 15 బి 12 సి) 9 డి) 7
5. భారతదేశంలో జనగణన చేయడానికి ఏర్పాటు చేసిన సెన్సస్ కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1947 బి) 1948
సి) 1949 డి) 1951
6. 1881లో భారతదేశ జనాభా ఎంత?
ఎ) 20.22 కోట్లు బి) 20.99 కోట్లు
సి) 23.07 కోట్లు డి) 23.83 కోట్లు
7. 1921లో జనాభా వృద్ధిరేటు తగ్గడానికి కారణం ఏది?
ఎ) ప్లేగు వ్యాధి బి) కలరా వ్యాధి
సి) ఇన్ఫ్లూయెంజా డి) మశూచి వ్యాధి
8. 1951లో భారతదేశ జనాభా ఎన్ని కోట్లు?
ఎ) 25.07 బి) 25.12
సి) 34.10 డి) 36.10
9. 2011 జనాభా లెక్కల సేకరణ ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారు?
ఎ) వివేక్జోషి బి) సి. చంద్రమౌళి
సి) టి.ఎన్.శేషన్ డి) పై అందరూ
10. 2011 జనాభా లెక్కల సేకరణ ఏ రోజు వరకు లెక్కించారు?
ఎ) 2011, మార్చి 1
బి) 2011, మార్చి 31
సి) 2011, ఏప్రిల్ 1
డి) 2010, డిసెంబర్ 31
11. 2011 జనాభా లెక్కల సేకరణ నినాదం ఏది?
ఎ) Our census – Our family
బి) Our family – Our India
సి) Our census – Our future
డి) Our future – Our family
12. 2011 సెన్సస్ ప్రకారం ప్రపంచంలోని జనాభాలో మొదటి పది దేశాలతో ఎన్ని దేశాల జనాభాకు భారతదేశ జనాభా సమానంగా ఉంది?
ఎ) 4 బి) 5 సి) 6 డి) 8
13. ప్రతి 10 సంవత్సరాలకు ఒక సారి శాస్త్రీయ పద్ధతిలో జనాభా లెక్కల సేకరణ ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు?
ఎ) 1872 బి) 1881
సి) 1891 డి) 1901
14. జనాభా లెక్కల సేకరణ / జన గణన అనేది రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్లో పొందుపరిచారు?
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8
15. అధిక జనాభా వృద్ధి రేటు గల సంవత్సరం ఏది?
ఎ) 1951 బి) 1961
సి) 1971 డి) 1991
16. 2011 మార్చి 1 నాటికి భారతదేశ జనాభా ఎంత?
ఎ) 121,01,93,422
బి) 120,90,93,411
సి) 121,08,54,977
డి) 121,05, 69,573
17. 1901లో భారతదేశ జనాభా ఎన్ని కోట్లు?
ఎ) 23.07 బి) 23.83
సి) 25.70 డి) 23.03
18. 2021 జనాభా లెక్కలతో పోలిస్తే 2011లో జనాభా?
ఎ) పెరిగింది బి) తగ్గింది
సి) స్థిరంగా ఉంది
డి) అధికంగా పెరిగింది
19. 2011 సెన్సస్ ప్రకారం స్త్రీ జనాభా కంటే పురుష జనాభా ఎంత శాతం ఎక్కువ?
ఎ) 1 శాతం బి) 1.5 శాతం
సి) 1.9 శాతం డి) 2 శాతం
20. 2001-2011 మధ్య భారతదేశ జనాభా ఎన్ని కోట్లు పెరిగింది?
ఎ) 18.19 బి) 15.16
సి) 19.20 డి) 20.25
21. 2001-2011 మధ్య పెరిగిన జనాభాలో ఎవరు ఎక్కువ?
ఎ) పురుష జనాభా కంటే స్త్రీ జనాభా ఎక్కువ
బి) పురుష జనాభా కంటే స్త్రీ జనాభా తక్కువ
సి) స్త్రీ పురుష జనాభా దాదాపు సమానం
డి) ఏదీకాదు
22. 2011 సెన్సస్ ప్రకారం ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా ఎంత శాతం ?
ఎ) 2.4 శాతం బి) 15.6 శాతం
సి) 17.5 శాతం డి) 18.19 శాతం
23. 2011 సెన్సస్ ప్రకారం భారతదేశ పురుష జనాభా ఎంత?
ఎ) 62,23,70,285
బి) 62,32,70,258
సి) 63,23,70,258
డి) 58,75,84,719
24. 2001-2011 మధ్య భారతదేశంలో పెరిగిన జనాభా ప్రపంచంలోని ఏ దేశ జనాభాకు సమానంగా ఉంది?
ఎ) అమెరికా బి) ఇండోనేషియా
సి) బ్రెజిల్ సి) జపాన్
25. ప్రస్తుతం భారతదేశ జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఎవరు?
ఎ) సి. చంద్రమౌళి బి) వినోద్ జోషి
సి) అరవింద జోషి డి) వివేక్ జోషి
26. ఏరోజు నాటికి భారతదేశ జనాభా 100 కోట్లకు చేరుకుంది?
ఎ) 2000, మే 11
బి) 2001, జూన్ 15
సి) 1999, అక్టోబర్ 2
డి) 1998, ఆగస్టు 2
27. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) 1921 సంవత్సరాన్ని గొప్ప విభజన సంవత్సరం అంటారు
బి) 1921 సంవత్సరంలో రుణాత్మక జనాభా వృద్ధి నమోదైనది
సి) 1918లో ఇన్ఫ్లూయెంజా వ్యాధి భారతదేశంలో విస్తరించింది డి) పైవన్నీ
28. 2000, మే 11న జన్మించిన భారత శతకోటి శిశువు పేరు ఏమిటి?
ఎ) నర్గీస్ కుమార్ బి) వినీస్
సి) ఆస్తా డి) అద్నాన్ మెవిక్
29. 2011 సెన్సస్ ప్రకారం భారతదేశ జనాభాలో స్త్రీ జనాభా ఎంత శాతం?
ఎ) 51.47 శాతం
బి) 48.53 శాతం
సి) 18.19 శాతం డి) 12.10 శాతం
సమాధానాలు
1-బి 2-డి 3-ఎ 4-డి
5-బి 6-సి 7-సి 8-డి
9-బి 10-ఎ 11-సి 12-సి
13-బి 14-సి 15-సి 16-సి
17-బి 18-బి 19-బి 20-ఎ
21-ఎ 22-సి 23-బి 24-సి
25-డి 26-ఎ 27-డి 28-సి
29-బి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు