Telangana History | ‘ముసలమ్మ జాతర’ ఏ గ్రామంలో జరుగుతుంది?
జూలై 19వ తేదీ తరువాయి..
493. క్రీ.శ. 1163 నాటి హనుమకొండ వేయిస్తంభాల గుడి కోనేరు వద్ద ఉన్న రుద్రదేవుడి శాసనాన్ని పరిష్కరించింది ఎవరు?
a) జేఎఫ్ ఫ్లీట్ b) గులాం యాజ్దానీ
c) మారేమండ రామారావు
d) మల్లంపల్లి సోమశేఖర శర్మ
జవాబు: (a)
వివరణ: హనుమకొండ వేయిస్తంభాల గుడి కోనేరు దగ్గర మొదటి రుద్రదేవుడి శాసనం లభించింది. 1163 నాటి ఈ శాసనంలో రుద్రదేవుడి సైనిక విజయాలు, హనుమకొండ విషయం కాకతీయ సామ్రాజ్యంగా పరివర్తన చెందుతున్న క్రమాన్ని ఇది వివరిస్తుంది. దీన్ని 1882లో జేఎఫ్ ఫ్లీట్ పరిష్కరించాడు. ఇందులో పేర్కొన్న విషయం అంటే ఇప్పటి జిల్లాను పోలిన పాలనా విభాగం.
494. కాకతీయుల చరిత్రపై మైలురాయిగా భావించే 1935 నాటి ‘కాకతీయ సంచిక’కు ఎవరు సంపాదకత్వం వహించారు?
a) నేలటూరి వెంకటరమణయ్య
b) మల్లంపల్లి సోమశేఖర శర్మ
c) మారేమండ రామారావు
d) పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
జవాబు: (c)
వివరణ: కాకతీయ సంచిక ఆంధ్రేతిహాస పరిశోధక మండలి ఆధ్వర్యంలో వెలువడింది.
495. ‘మధ్య యుగాల దక్కన్ అనే నక్షత్ర మండలంలో పాలంపేట గుళ్లు ప్రకాశవంతమైన తారలు’ అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు?
a) మారేమండ రామారావు
b) గులాం యాజ్దానీ
c) సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి
d) జేఎఫ్ ఫ్లీట్ జవాబు: (b)
వివరణ: పాలంపేట గుళ్లు అంటే రామప్ప గుడి, పరిసరాల్లోని ఆలయాలు అని అర్థం చేసుకోవాలి.
496. 1930-46 మధ్యకాలంలో ఆంధ్ర మహాసభ ఎన్ని పర్యాయాలు సమావేశం అయ్యింది?
a) 10 b) 12 c) 13 d) 17
జవాబు: (c)
వివరణ: ఈ మహాసభల్లో తెలంగాణ అభివృద్ధి కోసం తీర్మానాలు చేశారు.
497. ఎన్నో సమావేశంలో ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయింది?
a) 10 b) 11 c) 12 d) 13
జవాబు: (b)
498. ఆంధ్ర మహాసభ వేదికలు, అధ్యక్షులను సరిగ్గా జతపరచండి
A. జోగిపేట 1. పులిజాల రంగారావు
B. దేవరకొండ 2. బూర్గుల రామకృష్ణారావు
C. ఖమ్మం మెట్టు 3. సురవరం ప్రతాపరెడ్డి
D. సిరిసిల్ల 4. మాడపాటి హనుమంతరావు:
a) A-3, B-2, C-1, D-4
b) A-3, B-2, C-4, D-1
c) A-2, B-3, C-1, D-4
d) A-1, B-2, C-3, D-4
జవాబు: (a)
వివరణ: జోగిపేట-1930, దేవరకొండ-1931, ఖమ్మం మెట్టు-1934, సిరిసిల్ల-1935లో ఆంధ్ర మహాసభ మొదటి నాలుగు సమావేశాలు జరిగాయి.
499. ఏ వేదికగా జరిగిన ఆంధ్ర మహాసభ తొలిసారిగా వామపక్షాల చేతుల్లోకి వెళ్లిపోయింది?
a) జోగిపేట b) సిరిసిల్ల
c) దేవరకొండ d) చిలుకూరు
జవాబు: (d)
వివరణ: ఈ సమావేశం 1941లో జరిగింది. దీనికి రావి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించాడు.
500. ఏ వేదికగా జరిగిన ఆంధ్ర మహాసభ పూర్తిగా వామపక్షాల అధీనంలోకి వెళ్లిపోయింది?
a) ధర్మవరం b) చిలుకూరు
c) భువనగిరి d) హైదరాబాద్
జవాబు: (c)
వివరణ: ఈ సమావేశం 1944లో జరిగింది. ఇందులోనే అతివాదులు, మితవాదులు అధికారికంగా విడిపోయారు. (నిజాం రాష్ట్ర) ఆంధ్ర మహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
501. ఆంధ్ర మహాసభ వామపక్షాల చేతుల్లోకి వెళ్లిపోవడంతో మితవాద నాయకులు కేవీ రంగారెడ్డి, ఎం రామచంద్రరావు ఏర్పాటు చేసుకున్న సభ ఏది?
a) తెలంగాణ ఆంధ్ర మహాసభ
b) జాతీయ ఆంధ్ర మహాసభ
c) హైదరాబాద్ ఆంధ్ర మహాసభ
d) నిజాం రాష్ట్ర కేంద్ర మహాసభ
జవాబు: (b)
వివరణ: చీలిక 11వ మహాసభలో పరిపూర్ణమయ్యింది.
502. ఏ సంవత్సరం నాటికి ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు ముగింపు దశకు చేరుకున్నాయి?
a) 1945 b) 1946
c) 1947 d) 1948
జవాబు: (c)
వివరణ: ఈ సమావేశం కంది (సంగారెడ్డి)లో జరిగింది. మితవాదులకు సర్దార్ జమలాపురం కేశవరావు, అతివాదులకు బద్దం ఎల్లారెడ్డి అధ్యక్షత వహించారు. 1946 డిసెంబర్ 3న కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం విధించారు. దాంతో అతివాదుల కార్యక్రమాలు నిలిచిపోయాయి. మితవాద వర్గం స్టేట్ కాంగ్రెస్‌లో విలీనమైపోయింది.
503. తెలంగాణలో తెలుగు భాషా, సాహిత్య వికాసం కోసం ‘నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు’ ఏ సంవత్సరంలో
ఏర్పాటైంది?
a) 1942 b) 1943
c) 1944 d) 1945
జవాబు: (b)
వివరణ: 1942లో వరంగల్ జిల్లా ధర్మవరంలో జరిగిన 9వ ఆంధ్ర మహాసభలో హైదరాబాద్ సాహిత్య పరిషత్తు స్థాపన కోసం చర్చ జరిగింది. 1943 మే 26న హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్లో సమావేశం అనంతరం సాహిత్య పరిషత్తు ఏర్పాటు చేశారు. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రంగనాథ రావు తదితరులు ఇందులో ముఖ్యపాత్ర పోషించారు. తర్వాత దీని పేరును నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తుగా మార్చారు. ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారింది.
504. ఆంధ్ర సారస్వత పరిషత్తు మొదటి అధ్యక్షుడు ఎవరు?
a) సురవరం ప్రతాపరెడ్డి
b) మాడపాటి హనుమంతరావు
c) లోకనంది శంకరనారాయణ
d) దేవులపల్లి రామానుజ రావు
జవాబు: (c)
505. ఆంధ్ర సారస్వత పరిషత్తు అభివృద్ధికి, ఆ సంస్థ తరఫున తెలుగు భాషాభివృద్ధికి గణనీయమైన కృషిచేసింది ఎవరు?
a) లోకనంది శంకరనారాయణ
b) మాడపాటి హనుమంతరావు
c) సీ నారాయణ రెడ్డి
d) దేవులపల్లి రామానుజ రావు
జవాబు: (d)
506. నిజాం రాజుల్లో సాలార్ జంగ్ ఎవరి పదవీ కాలంలో దివాన్‌గా సేవలందించాడు?
1. నాసిరుద్దౌలా 2. సలాబత్ జంగ్
3. అఫ్జలుద్దౌలా
4. మీర్ మహబూబ్ అలీఖాన్
a) 1, 2, 3 b) 1, 3, 4
c) 1, 2, 3, 4 d) 2, 3, 4
జవాబు: (b)
507. మొదటి సాలార్ జంగ్ అసలు పేరేంటి?
a) సిరాజ్ ఉల్ ముల్క్
b) వికార్ ఉల్ ఉమ్రా
c) తురాబ్ అలీ ఖాన్
d) కమాల్ ఖాన్ జవాబు: (c)
వివరణ: 1853 మే 31న తురాబ్ అలీ ఖాన్ హైదరాబాద్ దివాన్‌గా వచ్చాడు. 1883 ఫిబ్రవరి 8న మరణించే వరకు దివాన్ పదవిలో కొనసాగాడు. నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ఆయన దివాన్‌గా పని చేశాడు.
508. హైదరాబాద్ రాజ్య ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ‘హాలీసిక్కా’ను ప్రవేశపెట్టింది ఎవరు?
a) మొదటి సాలార్జంగ్
b) సిరాజ్ ఉల్ ముల్క్
c) రెండో సాలార్జంగ్
d) మూడో సాలార్జంగ్ జవాబు: (a)
509. నిజాం రాజుల కాలానికి సంబంధించి ‘నాజిమ్’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
a) విద్యా శాఖా మంత్రి b) ప్రధానమంత్రి
c) జిల్లా పాలనాధికారి
d) ప్రధాన న్యాయమూర్తి జవాబు: (d)
510. సాలార్ జంగ్ సంస్కరణలకు సంబంధించి ‘మహ్కాయ ఇ సదారత్’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
a) సివిల్ కోర్టు b) క్రిమినల్ కోర్టు
c) మతపరమైన విరాళాల కోర్టు
d) అప్పీలేట్ కోర్టు జవాబు: (c)
వివరణ: మహ్కాయ ఇ సదారత్లో మతపరమైన విరాళాల విషయంలో విచారణలు జరిపేవాళ్లు. దారుల్ ఖాజీ అనే మరో న్యాయస్థానం ముస్లిం చట్టాన్ని అమలుచేసేది.
511. సాలార్ జంగ్ పాలనా పరమైన సంస్కరణలకు సంబంధించి రాజ్య విభజన క్రమాన్ని అవరోహణ క్రమంలో అమర్చండి.
a) సుబా, తాలూకా, సర్కార్
b) సర్కార్, సుబా, తాలూకా
c) తాలూకా, సర్కార్, సుబా
d) సుబా, సర్కార్, తాలూకా
జవాబు: (d)
వివరణ: సుబా ను ప్రాంతం అని కూడా అంటారు. సాలార్ జంగ్ హైదరాబాద్ రాజ్యాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించాడు.
512. కింది వివరాలను పరిశీలించండి.
1. గోలకొండ కవుల సంచిక 1935లో వెలువడింది
2. దీనికి సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి
3. ఇందులో మొత్తం 354 కవితలున్నాయి
4. దీన్ని గద్వాల రాణికి అంకితం ఇచ్చారు
పై వాటిలో సరైన వాటిని గుర్తించండి?
a) 1, 2, 3 b) 2, 3, 4
c) 2, 3 d) అన్నీ సరైనవే
జవాబు: (c)
వివరణ: గోలకొండ కవుల సంచిక సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో 1934లో వెలువడింది. దీన్ని ఆత్మకూరు సంస్థాన రాణి సవైరాణి భాగ్యలక్ష్మమ్మ బహద్దూరుకు అంకితం ఇచ్చారు. గోలకొండ కవుల సంచికకు ఆర్థిక సాయం అందించింది ఆత్మకూరు సంస్థాన అధిపతి సవై రాజాశ్రీ రామభూపాలరావు బహద్దూర్. దీన్ని 2009లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పునర్ముద్రింపజేశారు.
513. కింది రచనలు, రచయితలను సరిగ్గా జతపరచండి?
A. మావూరి ముచ్చట్లు 1. బోయ జంగయ్య
B. యాది 2. అంపశయ్య నవీన్
C. జాతర 3. సామల సదాశివ
D. కాలరేఖలు 4. పాకాల యశోదా రెడ్డి
a) A-4, B-2, C-3, D-1
b) A-2, B-3, C-1, D-4
c) A-4, B-3, C-1, D-2
d) A-1, B-2, C-3, D-4
జవాబు: (c)
వివరణ: కాలరేఖలు నవలకు అంపశయ్య నవీన్ 2004లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. సామల సదాశివ ఆత్మకథ ‘యాది’.
514. ఎలుగుబంటి ప్రధానపాత్రగా ‘జిగిరి’ అనే నవల రచయిత ఎవరు?
a) అంపశయ్య నవీన్
b) పాకాల యశోదా రెడ్డి
c) ముదిగంటి సుజాతా రెడ్డి
d) పెద్దింటి అశోక్ కుమార్ జవాబు: (d)
515. ప్రతి రెండేండ్లకు ఒకసారి జరిగే ‘ముసలమ్మ జాతర’ ఏ గ్రామంలో జరుగుతుంది?
a) ములుగు b) గుంజేడు
c) వాజేడు d) కూరెళ్ల
జవాబు: (b)
వివరణ: మహబూబాబాద్ జిల్లా గుంజేడు శివారులో ‘ముసలమ్మ జాతర’ జరుగుతుంది. సమ్మక్క, సారక్క జాతర సమయంలోనే ఈ జాతర జరగడం విశేషం.
516. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో మూడేండ్లకోసారి జరిగే ప్రసిద్ధ జాతర ఏది?
a) వేల్పులమ్మ జాతర
b) గట్టమ్మ జాతర
c) వనదుర్గా దేవి జాతర
d) మల్లన్న జాతర జవాబు: (a)
526. ములుగు జిల్లా లక్నవరం సరస్సు గుట్టలో ‘నాగలి కర్రు’ ఆకారంలో ఉన్న వీరుడి ప్రతీకకు జాతర నిర్వహిస్తారు. ఆ వీరుడి పేరేంటి?
a) జంపన్న b) పగిడిద్ద రాజు
c) గోవిందరాజు d) ముసలయ్య
జవాబు: (d)
వివరణ: ముసలయ్య జాతర మేడారం జాతర తర్వాత మార్చి నెలలో జరుగుతుంది.
517. ‘నా జైలు జ్ఞాపకాలు-అనుభవాలు’ అనే రచన ఎవరిది?
a) దుర్గాబాయి దేశ్‌ముఖ్
b) స్వామి రామానంద తీర్థ
c) సంగెం లక్ష్మీబాయమ్మ
d) ఎల్లాప్రగడ సీతాకుమారి జవాబు: (c)
518. కింది వారిలో తెలంగాణ గాంధీగా గౌరవం పొందింది ఎవరు?
a) భూపతి కృష్ణమూర్తి
b) పల్లెర్ల హనుమంతరావు
c) మందుముల నరసింగరావు
d) స్వామి రామానంద తీర్థ
జవాబు: (a)
519. కింది వాటిలో దాశరథి రంగాచార్య రచన కానిది ఏది?
a) మోదుగుపూలు b) చిల్లరదేవుళ్లు
c) జగడం d) జనపదం
జవాబు: (c)
వివరణ: జగడం నవల రాసింది బోయ జంగయ్య.
520. సీతాపతి రాజు చరిత్ర, మన తెలంగాణం, గ్రీకు పురాణ గాథలు, ప్రాచీన ఆంధ్ర నగరములు రచనలు ఎవరివి?
a) కొమర్రాజు లక్ష్మణరావు
b) దేవులపల్లి రామానుజరావు
c) ఒద్దిరాజు రాఘవరంగారావు
d) ఆదిరాజు వీరభద్రరావు
జవాబు: (d)
వివరణ: ఆదిరాజు వీరభద్ర రావు 1921లో స్థాపితమైన ‘ఆంధ్ర పరిశోధక మండలి’కి మూలస్తంభంగా నిలిచారు.
521. కింది వివరాలను పరిశీలించండి.
1. కాకతీయులను గురించి మైలాంబ
బయ్యారం చెరువు శాసనంలో తొలిసారిగా ప్రస్తావించారు
2. ఈ శాసనం ప్రకారం కాకతీయుల మూలపురుషుడు మొదటి బేతరాజు
పై వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి?
a) 1 b) 2 c) 1, 2
d) 1, 2 సరైనవి కావు జవాబు: (d)
వివరణ: కాకతీయుల గురించి తొలి ప్రస్తావన తూర్పు (వేంగీ) చాళుక్య రాజు దానార్ణవుని మాగల్లు శాసనంలో ఉంది. బయ్యారం శాసనం ప్రకారం కాకతీయుల మూలపురుషుడు వెన్న భూపతి.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు