Gurukula Special Telugu | నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది?
1. వెండి అనే పదానికి పర్యాయ పదాన్ని గుర్తించండి?
1) రజతం 2) కాంచనం
3) ధౌతం 4) రూప్యం
2. భంగి అనే పదానికి పర్యాయపదం రాయండి?
1) రీతి, వలె 2) భృంగం, తుమ్మెద
3) తేనెటీగ, మధువని 4) మధువు, తేనె
3. కింది పర్యాయపదాలను జతపర్చండి?
1) స్నేహం ఎ) మది, హృదయం
2) మనసు బి) నెయ్యము, మైత్రి
3) ధ్వని సి) శబ్దం, చప్పుడు
4) కృపాణం డి) కత్తి, అసి
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
4. కింది ప్రకృతి పదాలను జతపరచండి?
1) పబ్బం ఎ) కార్యం
2) పున్నమి బి) పౌర్ణమి
3) జీతం సి) జీవితం
4) కర్ణం డి) పర్వం
1) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
5. కింది ప్రకృతి-వికృతి పదాల జతను గుర్తించండి?
1) మేఘము ఎ) కొండ
2) ధర్మము బి) గాసం
3) గ్రాసం సి) దమ్మము
4) కుండము డి) మొగులు
ఇ) కుండ
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఇ
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఇ
4)1-డి, 2-బి, 3-సి, 4-ఎ
6. గర్వం అనే పదానికి గరువము అనే పదం వికృతి పదంగా వస్తుంది. అయితే అద్భుతం అనే పదానికి వికృతి పదం ఏది?
1) అంబురం 2) అదుబుతము
3) అబ్బురం 4) అద్భుతం
7. పరుషాలు, సరళాలకు ఏమని పేరు?
1) అల్పప్రాణాలు 2) మహాప్రాణాలు
3) వర్గయుక్కలు 4) అనునాసికాలు
8. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది?
1) విశేషణం 2) క్రియ
3) అవ్యయం 4) లింగం
9. ఒక తోటలో ఒక స్త్రీ స్నేహితురాళ్లతో కలిసి వీణ వాయిస్తూ పాట పాడుతుంది. పై వాక్యంలో బహువచన పదం ఏది?
1) ఒక తోట 2) స్త్రీ
3) స్నేహితురాళ్లు 4) పాట
10. మా ఊరి చెరువు గట్టున సంగమేశ్వర దేవాలయం ఉన్నది. పై వాక్యంలో ఉన్న నామవాచకం ఉన్న పదం ఏది?
1) ఊరి చెరువు 2) చెరువు గట్టు
3) దేవాలయం 4) సంగమేశ్వరాలయం
11. బలరాం మంచి ఫలాల కోసం పల్లెలో తోటకు పోయాడు. పై వాక్యంలో ఏ వర్గపు అక్షరాలు ఎక్కువ ఉన్నాయి?
1) త వర్ణం 2) ప వర్గం
3) బ వర్గం డి) చ వర్గం
12. కింది వాటిలో సరైనది గుర్తించండి?
1) అ నుంచి ఱ వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు
2) క నుంచి ఱ వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు
3) క నుంచి మ వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు
4) క నుంచి మ వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా విభజించలేదు
13. ముక్కుసాయంతో పలికే అక్షరాలు అని వేటికి పేరు?
1) అంతస్థాలు 2) పరుషాలు
3) సరళాలు 4) అనునాసికాలు
14. కిందివాటిలో దీర్ఘాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) ఇవి అచ్చుల విభజనలో ఒక భాగం
2) దీర్ఘాలు రెండు, మాత్రల కాలంలో పలికేవి
3) దీర్ఘాలలో ఐ, ఔ లు కూడా ఉంటాయి
4) అచ్చుల్లోని దీర్ఘాలు మొత్తం-9
15. ఆశ్చర్యాన్ని సూచించే పదాలు ఏ భాషాభాగానికి చెందుతాయి?
1) లింగం 2) వచనాలు
3) క్రియలు 4) అవ్యయాలు
16. కిందివాక్యంలో సరికానిది గుర్తించండి?
1) కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులుండేవారు- బహువచనం
2) రాముడు ఏకపత్నీవ్రతుడు – ఏకవచనం
3) మా ఆవు రెండు దూడలను కన్నది – స్త్రీలింగాలు
4) అమ్మో! ఎంత పెద్ద పామో అవ్యయం
17. పేరును తెలియజేసే భాషా భాగం?
1) సర్వనామం 2) విశేషణం
3) నామవాచకం 4) అవ్యయం
18. రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు. ఈ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చడానికి ఏ అనుసంధాన పదాన్ని ఉపయోగిస్తారు?
1) కావున 2) మరియు
3) అందువల్ల 4) కానీ
19. వనజ చురుకైనది, వనజ అందమైనది. ఈ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చేటప్పుడు కలిగే మార్పును కింది వాటిలో గుర్తించండి?
1) రెండు నామ పదాల్లో ఒకటి లోపించడం
2) రెండు నామ పదాలు ఒకచట చేరి చివర బహువచనం చేరడం
3) రెండు సర్వనామాల్లో ఒకటి లోపించడం
4) రెండు క్రియల్లో ఒకటి లోపించడం
20. సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చేటప్పుడు ఉండే అసమాపక క్రియలు ఏంటి?
1) ఒకటి
2) ఒక సమాపక క్రియ, ఒక అసమాపక క్రియ
3) ఎన్నైనా సమాపక క్రియలు
4) ఎన్నైనా అసమాపక క్రియలు
21. వారు గొప్పవారు, తెలివైనవారు. ఇది ఏ రకమైన వాక్యం?
1) సామాన్య వాక్యం 2) సంయుక్త వాక్యం
3) సంక్లిష్ట వాక్యం 4) ఏదీకాదు
22. చేతులు కడుక్కో అనే వాక్యం ఏ సందర్భాన్ని సూచిస్తుంది?
1) విధిగా ఒక పని చేయాలి అనే అర్థాన్ని
2) కచ్చితంగా చేయాలి అనే ఆజ్ఞను
3) సలహాను సూచించడం
4) నిర్బంధంగా చేయాలి అనే విషయాన్ని
23. కింది వాటిలో విద్యార్థక వాక్యాన్ని గుర్తించండి?
1) పూలనన్నింటినీ హారంగా కూర్చండి
2) వసంత ఎంత బాగా పాడిందో
3) మన పాఠశాలకు ఎవరు వచ్చారు
4) చెరువులో తామరలు అందంగా ఉన్నాయి
24. ఇతరులను ఎగతాళి చేయవద్దు. ఇది ఏ రకమైన వాక్యం?
1) విద్యార్థక వాక్యం
2) అనుమత్యర్థక వాక్యం
3) నిషేధార్థక వాక్యం
4) ప్రశ్నార్థక వాక్యం
25. ‘అనుమతి లేకుండా లోపలికి రావద్దు’ ఇది ఏరకమైన వాక్యం?
1. విద్యార్థక వాక్యం
2) అనుమత్యర్థక వాక్యం
3) నిషేధార్థక వాక్యం 4) ప్రశ్నార్థక వాక్యం
26. అనుమతి లేకుండా లోపలికి రావద్దు. ఇది ఏ రకమైన వాక్యం?
1) అనుమత్యర్థక వాక్యం
2) విద్యార్థక వాక్యం
3) నిషేధార్థక వాక్యం
4) సందేహార్థక వాక్యం
27. ద్వితియా విభక్తికి సంబంధించిన ప్రత్యయంలో కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) కి 2) ని 3) ను 4) కూర్చి
28. వాణి పూజ…పూలను కోసింది. పై వాక్యంలో ఏ విభక్తి ప్రత్యయం ఉంటే వాక్యానికి సంపూర్ణ అర్థం వస్తుంది?
1) కొరకు 2) అందు
3) యొక్క 4) చేత
29. రాలిలిచాలని చింపులంగి సగం ఖాళీ చల్లగాలి గోనెచింపు కొప్పెర పెట్టవా ఓపాలబుగ్గల జీతగాడ దానికి చిల్లులెన్నో లెక్కపెట్టాలా
పై పద్య రెండవ పాదంలో ఉన్న విభక్తి ప్రత్యయం ఏది?
1) ప్రథమ విభక్తి 2) ద్వితీయా విభక్తి
3) తృతీయా విభక్తి 4) చతుర్థి విభక్తి
30. ‘శాశ్వతుడ వోయి నీవు నిశ్చయంగాను’ ఈ పద్యపాదం అంత్యపదంలో గల విభక్తి ఏది?
1) ప్రథమ 2) ద్వితీయ
3) తృతీయ 4) చతుర్థి
31. కింది వాటిలో సరికాని పదబంధాన్ని గుర్తించండి?
1) నాయన+అమ్మ= నాయనమ్మ
2) నిజం+ ఆశ్రమంబు = నిజాశ్రమంబు
3) వలయం+ అందు = వలయమందు
4) ముఖార + విందం = ముఖారవిందం
32. అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళమైతే దాన్ని ఏ సంధి అంటారు?
1) ఇత్వసంధి 2) ఉత్వసంధి
3) అత్వసంధి 4) యడాగమసంధి
33. నర+ ఉత్తముడు అనే పదాలను కలిపినపుడు ఏ గుణం సంధికార్యంలో వస్తుంది?
1) ఏ 2) ఓ 3) ఆర్ 4) య
34. కింది సంధి పదాలను జతపరచండి?
1) శివాలయం ఎ) ఋ+ఋ=ౠ
2) మునీంద్రుడు బి) ఉ+ఉ=ఊ
3) బానూదయం సి) ఇ+ఇ=ఈ
4) మాతృజం డి) అ+ఆ=ఆ
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
35. ఆమ్రేడితం అంటే?
1) ఒక పదం రెండుసార్లు వచ్చినపుడు రెండోసారి వచ్చిన పదం
2) ఒకపదం రెండుసార్లు వచ్చినప్పుడు మొదటిసారి వచ్చిన పదం
3) ఒకపదం రెండుసార్లు, వెంటవెంటనే రావడం
4) ఒకపదం రెండుసార్లు వెంటవెంటనే రాకపోవడం
36. కింది త్రిక సంధి సూత్రాల్లో సరికానిది గుర్తించండి?
1) త్రికం మీద సంయుక్త హల్లు ద్వితం
2) త్రికం మీద అసంయుక్త హల్లు ద్వితం ఏకాదేశమవుతుంది
3) ద్విరుక్తమైన హల్లు పరమైపుడు ఐచ్ఛికమైన దీర్ఘం హ్రస్వమవుతుంది
4) ఐచ్చికం అంటే అచ్చతెలుగు పదం
37. సమాసంలో రెండు పదాల మధ్య జరిగే మార్పును సవరించడాన్ని ఏమంటారు?
1) సంధి కార్యం 2) విగ్రహవాక్యం
3) సమాన పదం 4) అన్యపదం
38. రెండుకాని అంతకంటే ఎక్కువగాని సమప్రాధాన్యంగల నామవాచకాలు కలిపి ఒక మాటగా ఏర్పడే సమాసాన్ని ఏమంటారు.
1) ద్వంద్వ సమాసం 2) ద్విగు సమాసం
3) కర్మధారయ సమాసం
4) తత్పురుష సమాసం
39. ‘తిలకమును ధరించువాడు’ ఈ విగ్రహ వాక్యం ఏ సమాసానికి చెందినదో గురించండి?
1) ప్రథమ 2) ద్వితీయ
3) చతుర్థి 4) పంచమి
40. జీవధనములు, మూడడుగులు ఈ పదాలకు సమాసాలు గుర్తించండి.
1) ద్వంద్వం ద్విగు సమాసాలు
2) ద్విగు ద్వంద్వ సమాసాలు
3) కర్మధారయ-తత్పురుష సమాసాలు
4) తత్పురుష -కర్మధారయ సమాసాలు
41. ‘నువ్వునేను మామూలు స్త్రీలం కాదు’ అని రుద్రమదేవి అన్నది. ఇది ఏ రకమైన వాక్యం?
1) ప్రత్యక్ష వాక్యం 2) పరోక్షవాక్యం
3) కర్తరి వాక్యం 4) కర్మణి వాక్యం
42. కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) తాను వస్తానని అతడు అన్నాడు పరోక్ష కథనం
2) తాను చదువుతున్నానని సరళ చెప్పింది- పరోక్ష కథనం
3) నేను వస్తాను అని అతడు అన్నాడు ప్రత్యక్ష కథనం
4) నేను చదవుతున్నాను అని సరళ చెప్పింది- ప్రత్యక్ష కథనం
43. అది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది జాగ్రత్త అని అతడిని బెదిరించింది మెల్లీ. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చండి?
1) అది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది జాగ్రత్త అని అతడిని బెదిరించింది మెల్లీ
2. ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్తయని నన్ను బెదిరించింది మెల్లీ
3) ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది జాగ్రత్త అని నన్ను మెల్లీ బెదిరించింది.
4) అది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది జాగ్రత్తయని అందరినీ మెల్లీ బెదిరించింది.
44. ఉత్తమ పురుషలో కాకుండా ఇంకొకరు చెబుతున్నట్టుగా ఉన్న వాక్యాలు ఏవి?
1) ప్రత్యక్ష వాక్యాలు 2) పరోక్ష వాక్యాలు
3) కర్తరీ వాక్యాలు 4) కర్మణీ వాక్యాలు
45. జానపద కళల ప్రదర్శనకు ఆహ్వాన పత్రిక తయారు చేశారు. ఈ వాక్యాన్ని కర్మణి వాక్యం లోకి మార్చండి?
1) జానపద కళలచే ప్రదర్శనకు ఆహ్వాన పత్రిక తయారు చేశారు
2) జానపద కళల ప్రదర్శనకు ఆహ్వాన పత్రిక తయారు చేయబడింది
3) జానపదకళలచే ప్రదర్శనచే ఆహ్వాన పత్రిక తయారు చేశారు
4) జానపద కళల ప్రదర్శనచే ఆహ్వాన పత్రిక తయారు చేయబడింది.
46. లఘువుకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి?
1) ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది
2) ‘ల’ అక్షరంతో గుర్తిస్తారు
3) దీని గుర్తు 1 (నిలువుగీత)
4) హ్రస్వాక్షరాలు కానివి లఘవులు
47. గురువుకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి?
1) ‘U’ గుర్తుతో చూచిస్తారు
2) రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది
3) గ అనే అక్షరంతో చూచిస్తారు.
4) దీర్ఘాక్షరాలు కానివి
48. కింది వాటిలో ఉత్పలమాల పద్యలక్షణం కానిది?
1) భరనభభరవ గణాలు వరుసగా వస్తాయి
2) ప్రతిపాదంలో 21 అక్షరాలుంటాయి
3) 10వ అక్షరం యతి స్థానం
4) ప్రాసనియమం చెల్లుతుంది
49. కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి?
1) పద్యపాదంలో రెండవ అక్షరానికి సాధారణ యతి మైత్రి స్థానంలోని ముందు
అక్షరానికి యతిని పాటించడం ప్రాసయతి
2) పద్యపాదంలో రెండో అక్షరానికి సాధారణ యతి మైత్రి స్థానంలోని తరువాతి అక్షరానికి యతిని పాటించడం
3) తేటగీతి పద్యపాదంలో వరుసగా ఒక సూర్యగ్రహణం రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వస్తాయి
4) నల, నగ, సల, భ,ర,త,లు ఇంద్ర గణాలు
సమాధానాలు
1-2 2-1 3-1 4-1
5-1 6-3 7-1 8-1
9-3 10-4 11-2 12-3
13-4 14-4 15-4 16-3
17-3 18-4 19-1 20-3
21-2 22-1 23-1 24-3
25-3 26-1 27-1 28-1
29-1 30-2 31-4 32-3
33-2 34-1 35-1 36-2
37-2 38-1 39-2 40-1
41-1 42-4 43-1 44-2
45-4 46-4 47-4 48-2
49-1
శివశంకర్
విషయ నిపుణులు
ఏకేఆర్ పబ్లికేషన్స్, వికారాబాద్, 9441022571
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు