Gurukula Special -Telugu | తెలుగులో వెలువడిన మొదటి చంపూ రామాయణం ఏది?
1. శాకుంతలోపాఖ్యానం గల పర్వం?
ఎ) ఆది పర్వం బి) సభా పర్వం
సి) అరణ్య పర్వం డి) విరాట పర్వం
2. అజ్ఞాత వాసంలో అర్జునుని పేరు?
ఎ) కంకుభట్టు బి వలలుడు
సి) బృహన్నల డి) ధామగ్రంధి
3. వ్యాసునికి, లేఖకుడిగా చెప్పే వ్యక్తి?
ఎ) నారదుడు బి) బృహస్పతి
సి) శ్రీ శుకుడు డి) వినాయకుడు
4. ‘గతకాలం మేలు వచ్చు కాలం కంటెన్’ అనే సూక్తిని రచించిన కవి ఎవరు?
ఎ) నన్నయ బి) తిక్కన
సి) ఎర్రన డి) శ్రీనాథుడు
5. ‘వృద్ధుల బుద్ధులు సంచలింపవే’ అని భారతంలో అన్నది ఎవరు?
ఎ) బీష్ముడు శిశుపాలునితో
బి) శిశుపాలుడు బీష్మునితో
సి) కృష్ణుడు దృతరాష్టుడితో
డి) కర్ణుడు ద్రోణుడితో
6. శిశుపాల వధ గల భారత పర్వం ఏది?
ఎ) ఆది పర్వం బి) సభా పర్వం
సి) అరణ్య పర్వం డి) విరాట పర్వం
7. స్వప్న వృత్తాంతం చెప్పిన తొలి తెలుగు కవి?
ఎ) నన్నయ బి) నన్నెచోడుడు
సి) పాల్కూరికి సోమనాథుడు
డి) తిక్కన
8. తిక్కన నిర్వచనంగా రచించిన భారత పర్వం ఏది?
ఎ) స్త్రీ పర్వం బి) శాంతి పర్వం
సి) అవ్వమేధ పర్వం డి) మౌసల పర్వం
9. ‘వ్యాసుడి వేదనం, మూల భారతం, తిక్కన సంవేదనం తెలుగు భారతం’ అన్నదెవరు?
ఎ) పింగళి లక్ష్మీకాంతం
బి) జి.వి. సుబ్రహ్మణ్యం
సి) వేటూరి ప్రభాకర శాస్త్రి
డి) దేవులపల్లి రామానుజరావు
10. కింది వాటిని జతపరచండి?
ఎ) కీచక కథ 1) ద్రోణ పర్వం
బి) ఉప పాండవుల మరణం 2) విరాట పర్వం
సి) సంజయ రాయభారం 3) సౌప్తిక పర్వం
డి) అభిమన్యుని మరణం 4) ఉద్యోగ పర్వం
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-2, బి-3, సి-4, డి-1
సి) ఎ-1, బి-3, సి-2, డి-4
డి) ఎ-1, బి-4, సి-3, డి-2
11. ఎర్రన అరణ్య పర్వాన్ని రచించిన పద్ధతి?
ఎ) వర్ణానాత్మకం బి) కథాకథనం
సి) తద్రచనయకాన్ డి) యథాతథం
12. దుర్యోధనుడి ఘోషయాత్ర వృత్తాంతం ఎందులో ఉంది?
ఎ) సభా పర్వం బి) అరణ్య పర్వం
సి) విరాటపర్వం డి) ఉద్యోగ పర్వం
13. తాను అరణ్య పర్వశేష రచన చేసినట్లు ఎర్రన ఎక్కడ చెప్పుకున్నాడు?
ఎ) రామాయణం బి) హరి వంశం
సి) నృసింహ పురాణం
డి) అరణ్య పర్వం
14. భారతం 15 పర్వాల్లో తిక్కన రచించిన పద్య గధ్యాల సంఖ్య ఎంత?
ఎ) 16, 457 బి) 16,157
సి) 20,157 డి) 20,457
15. ‘వచ్చినవాడు ఫల్గుణుడు…’ అనే పద్యాన్ని రచించిన కవి ఎవరు?
ఎ) నన్నయ బి) తిక్కన
సి) కేతన డి) ఎర్రన
16. విరాట పర్వంలో తిక్కన పూర్తిగా పరిహరించిన ఘట్టం ఏది?
ఎ) కీచక వృత్తాంతం బి) సనత్సుజాతీయం
సి) ఉత్తర వృత్తాంతం డి) గోగ్రహణం
17. రంగనాథ రామాయణం ఏ ఛందస్సులో ఉంది?
ఎ) కందం బి) ఉత్పలమాల
సి) ద్విపద డి) సీసం
18. అవాల్మీకాంశమైన సీత జనన వృత్తాంతం గల రామాయణం ఏది?
ఎ) రంగనాథ రామాయణం
బి) భాస్కర రామాయణం
సి) మొల్ల రామాయణం డి) ఏదీకాదు
19. భాస్కర రామాయణంలో అరణ్య, యుద్ధకాండల పూర్వ భాగాన్ని రచించినదెవరు?
ఎ) హుళక్కి భాస్కరుడు
బి) మల్లికార్జున భట్టు
సి) రుద్రదేవుడు
డి) అయ్యలార్యుడు
20. భాస్కర రామాయణంలో అధిక భాగాన్ని రచించిన కవి ఎవరు?
ఎ) హుళక్కి భాస్కరుడు
బి) మల్లికార్జునభట్టు
సి) రుద్రదేవుడు డి) అయ్యలార్యుడు
21. తారరాముడిని శపించినట్లు గల రామాయణం ఏది?
ఎ) రంగనాథరామాయణం
బి) భాస్కర రామాయణం
సి) మొల్ల రామాయణం
డి) నిర్వచనోత్తర రామాయణం
22. తెలుగులో వెలువడిన మొట్టమొదటి చంపూ రామాయణం ఏది?
ఎ) భాస్కర రామాయణం
బి) రంగనాథ రామాయణం
సి) మొల్ల రామాయణం
డి) ఏదీకాదు
23. భాస్కర రామాయణాన్ని రచించిన కవులు ఎందరు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 6
24. తేనెసోక నోరు తియగనగు రీతి’ అన్నదెవరు?
ఎ) గోన బుద్ధారెడ్డి బి) తిక్కన
సి) మల్లికార్జున భట్టు డి) మొల్ల
25. గుహుడు రాముడి పాదాలను కడిగిన వృత్తాంతం గల రామాయణం ఏది?
ఎ) రంగనాథ రామాయణం
బి) భాస్కర రామాయణం
సి) మొల్ల రామాయణం
డి) వాల్మీకి రామాయణం
26. ‘ఉన్నాడు లెస్స రాఘవుడు’ అని సీతతో చెప్పిందెవరు?
ఎ) సుగ్రీవుడు బి) హనుమంతుడు
సి) లక్ష్మణుడు డి) రావణుడు
27. ‘గూఢ శబ్దాల కావ్యం మూగచెవిటి వారి ముచ్చటగును’ అన్నదెవరు?
ఎ) మొల్ల బి) గోన బుద్ధారెడ్డి
సి) తిక్కన డి) నన్నయ
28. ‘నీలమేఘచ్ఛాయ బోలు దేహమువాడు’ ఈ పద్యం ఎందులోనిది?
ఎ) రంగనాథరామాయణం
బి) భాస్కర రామాయణం
సి) మొల్ల రామాయణం
డి) మహాభారతం
29. ‘చుక్కలు తలపూవులుగా నక్కజముగ మేను’ పెంచిందెవరు?
ఎ) జాంబవంతుడు బి) సుగ్రీవుడు
సి) రావణుడు డి) హనుమంతుడు
30. మహాభారతాన్ని జనమేజయునికి చెప్పినవారు ఎవరు?
ఎ) పరీక్షన్మహారాజు
బి) వైశంపాయనుడు
సి) ధర్మరాజు డి) శ్రీశుకుడు
31. మహాభారతంలో ఆవర పర్వం ఏది?
ఎ) విరాట పర్వం బి) ఉద్యోగ పర్వం
సి) భీష్మ పర్వం డి) కర్ణపర్వం
32. కర్ణుని కవచ కుండలాలను దానంగా స్వీకరించినవాడు?
ఎ) వరుణుడు బి) ఇంద్రుడు
సి) బ్రహ్మ డి) శివుడు
33. సర్పయాగం చేసినదెవరు?
ఎ) జనమే జయుడు బి) పరీక్షిన్మహారాజు
సి) ధర్మరాజు డి) బీష్ముడు
34. ధనుర్భంగం గల కాండ ఏది?
ఎ) బాలకాండ బి) ఆయోధ్యకాండ
సి) అరణ్యకాండ సి) సుందర కాండ
35. వాలి సుగ్రీవుల వృత్తాంతం గల కాండం ఏది?
ఎ) అయోధ్యకాండ బి) సుందరకాండ
సి) కిష్కింధకాండ డి) యుద్ధ కాండ
36. సుగ్రీవుడి భార్యపేరు ఏమిటి?
ఎ) తార బి) మండోదరి
సి) రమ డి) శూర్పణఖ
37. కుశలవుల వృత్తాంతం గల కాండ ఏది?
ఎ) సుందరకాండ బి) యుద్ధకాండ
సి) ఉత్తరకాండ డి) అయోధ్యకాండ
38. ఘటోత్కచుడి తల్లిపేరు ఏమిటి?
ఎ) సుభద్ర బి) హిడింబి
సి) ఉలూచి డి) చిత్రాంగద
39. కర్ణుడికి రథసారథిగా ఎవరు వ్యవహరించారు?
ఎ) శల్యుడు బి) శకుని
సి) విదురుడు డి) కృపాచార్యుడు
40. భాస్కర రామాయణంలో యుద్ధకాండ శేషభాగాన్ని రచించిన కవి ఎవరు?
ఎ) కుమార రుద్రదేవుడు
బి) అయ్యలార్యుడు
సి) మల్లిఖార్జున భట్టు
డి) భాస్కరుడు
41. ప్రబంధమనే పదాన్ని ప్రయోగించిన మొదటి కవి ఎవరు?
ఎ) నన్నయ బి) నన్నెచోడుడు
సి) పాల్కూరికి సోమనాథుడు
డి) తిక్కన
42. తన రచనను ప్రబంధమండలిగా పేర్కొన్న కవి ఎవరు?
ఎ) పాల్కూరికి సోమనాథుడు
బి) నన్నయ
సి) తిక్కన డి) శ్రీనాథుడు
43. జాతి, వార్త చమత్కారాలు గల ప్రక్రియ ఏది?
ఎ) పురాణం బి) ఇతిహాసం
సి) కావ్యం డి) ప్రబంధం
44. ఆశాసాంత గద్య లేని ప్రబంధం ఏది?
ఎ) ఆముక్త మాల్యద బి) మను చరిత్ర
సి) వసు చరిత్ర డి) కళాపూర్ణోదయం
45. కింది వాటిని జతపరచండి?
ఎ) అముక్త మాల్యద 1) అల్లసాని పెద్దన
బి) పారిజాత పహరణం 2) రామరాజ భూషణుడు
సి) మను చరిత్ర 3) శ్రీకృష్ణ దేవ రాయలు
డి) వసుచరిత్ర 4) నంది తిమ్మన
ఎ) ఎ-3, బి-4, సి-1, డి-2
బి) ఎ-4, బి-3, సి-1, డి-2
సి) ఎ-2, బి-1, సి-4, డి-3
డి) ఎ-3, బి-1, సి-2, డి-4
46. ఆమూక్త మాల్యద ద్వారా శ్రీకృష్ణదేవరాయలు స్థాపించదలచుకున్న మతం ఏది?
ఎ) ద్వైతం బి) అద్వైతం
సి) విశిష్టాద్వైతం డి) గాణపత్యం
47. కథానాయిక పేరుతో వెలువడిన ప్రథమాంధ్ర ప్రబంధం ఏది?
ఎ) మనుచరిత్ర బి) వసు చరిత్ర
సి) ఆముక్తమాల్యద
డి) రామాభ్యుదయం
48. విష్ణు చిత్తుడి వృత్తాంతం గల ప్రబంధం ఏది?
ఎ) పాండురంగ మహాత్మ్యం
బి) ఆముక్తమాల్యద
సి) వసుచరిత్ర
డి) కళాపూర్ణోదయం
49. ఆముక్తమాల్యదలో లోపించిన ప్రబంధ లక్షణం ఏది?
ఎ) అష్టాదశ వర్ణనలు బి) శృంగార రసం
సి) ఏకనాయకాశ్రయం డి) వస్వైక్యత
50. ‘కాంచెన్ వైష్ణపుడర్థ యోజన’ అనే పద్యం ఎందులోనిది?
ఎ) కాళహస్తి మహాత్మ్యం
బి) పాండురంగ మహాత్మ్యం
సి) ఆముక్తమాల్యద డి) మనుచరిత్ర
51. ఆముక్తమాల్యదలో వస్తై్వక్యము లోపించలేదన్న వారు ఎవరు?
ఎ) కొండూరి వెంగళాచార్యులు
బి) దివాకర్ల వెంకటావధాని
సి) వేటూరి ప్రభాకరశాస్త్రి
డి) తుమ్మపూడి కోటేశ్వరరావు
52. ఆముక్తమాల్యదలో వస్తై్వక్యము లోపించిదన్న వారు ఎవరు?
ఎ) వేటూరి ప్రభాకర శాస్త్రి
బి) కొండూరి వెంగళాచార్యులు
సి) దివాకర్ల వెంకటావధాని
డి) మందపూడి వెంకటేశ్వర్లు
53. ‘తలబక్షచ్చట గ్రుచ్చి బాతువులు’ ఈ పద్యం ఎందులోనిది?
ఎ) మనుచరిత్ర బి) విజయవిలాసం
సి) ఆముక్తమాల్యద
డి) వసుచరిత్ర
54. ‘శిరీష కుసుమపేశల సుధామయోక్తులు’ ఎవరి కవితా గుణం?
ఎ) శ్రీకృష్ణ దేవరాయలు
బి) మాదయగారి మల్లన
సి) రామరాజ భూషణుడు
డి) అల్లసాని పెద్దన
55. ‘అల్లసానివారి అల్లిక జిగిబిగి’ అన్నదెవరు?
ఎ) కాకమాని మూర్తికవి
బి) తెనాలి రామకృష్ణుడు
సి) రామరాజ భూషణుడు
డి) చేమకూర వేంకటకవి
56. ‘ఎత్వతెవీవు భీత హరిణేక్షణ’ అని వరూధినిని అడిగిందెవరు?
ఎ) ఇందీవరాక్షుడు బి) సిద్ధుడు
సి) ప్రవరుడు డి) బ్రహ్మమిత్రుడు
57. స్వరోచికి మృగ, పక్షి భాషలను తెలిపినదెవరు?
ఎ) మనోరమ బి) విభావసి
సి) కళావతి డి) వరూధిని
58. స్వరోచి వనదేవతల కుమారుడు ఎవరు?
ఎ) స్వారోచిష మనువు
బి) ప్రవరుడు
సి) బ్రహ్మమిత్రుడు
డి) వైవస్వత మనువు
59. ఇందీవరాక్షుడి ఆయుర్వేద గురువు ఎవరు?
ఎ) ప్రవరుడు బి) బ్రహ్మమిత్రుడు
సి) సిద్ధుడు డి) స్వారోచిష మనువు
60. మనోరమ ఎవరి కుతూరు?
ఎ) వరూధిని
బి) మాయా ప్రవరుడు
సి) ఇందీవరాక్షుడు
డి) స్వారోచిష మనువు
61. స్వరోచికి ఇందీవరాక్షుడు ఏ విద్యను అందించాడు?
ఎ) ధనుర్విద్య బి) వేదవిద్య
సి) ఆయుర్వేదం డి) జ్యోతిష్య విద్య
62. మనుచరిత్రలో లోపించిన ముఖ్యమైన ప్రబంధ లక్షణం ఏది?
ఎ) ఏకనాయకాశ్రయం
బి) శృంగార రసం
సి) వస్తైక్యత డి) పైవన్నీ
63. మను చరిత్రలో వర్ణింపబడని అష్టాదశ వర్ణనలలో ఒకటి ఏది?
ఎ) సర్వోదయ వర్ణన బి) పర్వత వర్ణన
సి) ఉద్యానవన వర్ణన
డి) మధుపాన వర్ణన
64. పారిజాత పహరణంలో అశ్వాసాలు ఎన్ని?
ఎ) 4 బి) 5 సి) 6 డి) 7
65. ‘ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు’ అని పలికిన కవి ఎవరు?
ఎ) కాకుమాని మూర్తికవి
బి) తెనాలి రామకృష్ణ కవి
సి) రామరాజ భూషణుడు
డి) శ్రీకృష్ణ దేవరాయలు
సమాధానాలు
1-ఎ 2-సి 3-డి 4-ఎ
5-బి 6-బి 7-డి 8-డి
9-బి 10-బి 11-సి 12-బి
13-సి 14-ఎ 15-బి 16-బి
17-సి 18-బి 19-ఎ 20-బి
21-బి 22-ఎ 23-సి 24-డి
25-సి 26-బి 27-ఎ 28-సి
29-డి 30-బి 31-సి 32-బి
33-ఎ 34-ఎ 35-సి 36-సి
37-సి 38-బి 39-ఎ 40-బి
41-బి 42-సి 43-డి 44-ఎ
45-ఎ 46-సి 47-సి 48-బి
49-ఎ 50-సి 51-ఎ 52-సి
53-సి 54-డి 55-ఎ 56-సి
57-బి 58-ఎ 59-బి 60-సి
61-సి 62-ఎ 63-డి 64-బి
65-ఎ
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు