Indian History | రామ్మోహన్రాయ్కు ‘రాజా’ అనే బిరుదు ఇచ్చిన మొగలాయి చక్రవర్తి?
21. కింది వాటిని జతపరచండి.
ఎ. ఆర్య సమాజం 1. స్వామి వివేకానంద
బి. రామకృష్ణ మిషన్ 2. శివనారాయణ అగ్నిహోత్రి
సి. దక్కన్ ఎడ్యుకేషన్ 3. దయానంద సరస్వతి
డి. దేవ సమాజం 4. జి.జి.అగర్వాల్
5. బాలగంగాధర్ తిలక్
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-3, బి-2, సి-5, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-5, బి-3, సి-1, డి-4
22. ఆంధ్రలో మొదటి వితంతు వివాహాన్ని ఎవరు జరిపించారు?
1) గిడుగు రామ్మూర్తి
2) కందుకూరి వీరేశలింగం
3) గురజాడ అప్పారావు
4) ఎస్. ముద్ద నరసింహం
23. 1856లో పునర్వివాహ చట్టం చేయటంలో ముఖ్యపాత్ర వహించిందెవరు?
1) రాజారామ్మోహన్ రాయ్
2) అనీబీసెంట్
3) రనడే 4) విద్యాసాగర్
24. జతపరచండి.
ఎ. రాజా రామ్మోహన్రాయ్ 1. ఆర్య సమాజం
బి. అనీబీసెంట్ 2. దివ్యజ్ఞాన సమాజం
సి. ఆత్మారాం పాండురంగ 3. బ్రహ్మ సమాజం
డి. స్వామి దయానందుడు 4. ప్రార్థనా సమాజం
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-3, బి-1, సి-4, డి-2
25. కింది వాటిని జతపరచండి.
ఎ. బ్రహ్మ సమాజం 1. పూనా
బి. పరమహంస మండలి 2. న్యూయార్క్
సి. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ 3. కలకత్తా
డి. విజ్ఞాన సమాజం 4. బొంబాయి
5. నాగపూర్
1) ఎ-3, బి-5, సి-4, డి-2
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-5, డి-1
26. రామ్మోహన్రాయ్కు రాజా అనే బిరుదు ఇచ్చిన మొగలాయి చక్రవర్తి ఎవరు?
1) ఫరూక్ సియర్ 2) రెండో షా ఆలం
3) రెండో అక్బర్ 4) మహ్మద్ షా
27. బ్రహ్మసమాజంలో వివిధ శాఖలు, స్థాపకులకు సంబంధించి సరైనవి గుర్తించండి.
ఎ. ఆది బ్రహ్మసమాజం- దేవేంద్రనాథ్ ఠాగూర్
బి. భారతీయ బ్రహ్మసమాజం- కేశవ చంద్రసేన్
సి. సాధారణ బ్రహ్మసమాజం- ఆనందమోహన్ బోస్
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, సి
28. వేద భాష్య భూమిక, వేద భాష్యం గ్రంథాల రచయిత ఎవరు?
1) వివేకానంద
2) స్వామి దయానంద్
3) రామకృష్ణ పరమహంస
4) సిస్టర్ నివేదిత
29. కింది వారిలో దివ్యజ్ఞాన సమాజానికి అసలు స్థాపకులు ఎవరు?
ఎ. మేడమ్ హెచ్.పి.బ్లావట్స్కీ
బి. అనీబీసెంట్
సి. కల్నల్ హెచ్.ఎస్.ఓల్కాట్
డి. కల్నల్ ఒ.పి.వాల్బర్న్
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) సి, డి
30. కింది వాటిలో సరిగా జత చేసినవి ఏవి?
ఎ. దేవ సమాజం 1. లాహోర్
బి. తత్వబోధిని సభ 2. కలకత్తా
సి. ఆర్యసమాజం 3. బేలూరు
డి. రామకృష్ణ మిషన్ 4. బొంబాయి
1) 1, 2 2) 2, 3
3) 3, 4 4) 1, 3
31. ఆంధ్రపత్రిక స్థాపకుడు ఎవరు?
1) కాశీనాథుని నాగేశ్వరరావు
2) ముట్నూరు కృష్ణారావు
3) సురవరం ప్రతాపరెడ్డి
4) కందుకూరి వీరేశలింగం
32. వివేకానంద గురించి కింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి?
ఎ. తన గురువుకు చెందిన సార్వత్రిక వేదాంత సంకేతాన్ని ప్రచారం చేసి, దాన్ని సమకాలీన భారతీయ సమాజ అవసరాలకు తగిన రీతిలో ఉంచడానికి ప్రయత్నించాడు
బి. ఈ ప్రపంచంలో సామాజిక చర్యలేని విజ్ఞానం నిరుపయోగమని సామాజిక చర్య ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పాడు
సి. అన్ని మతాలు తప్పనిసరిగా సమైక్యం కావాలని ప్రకటించాడు
డి. వేదాంతం పూర్తిగా సహేతుకమైన వ్యవస్థ అని ప్రకటించాడు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) పైవన్నీ
33. కింది వాటిని జతపరచండి.
ఎ. ఇండియన్ సోషల్ కాన్ఫరెన్స్ 1. రామ్మోహన్రాయ్
బి. బ్రహ్మ సమాజం 2. ఆనంద మోహన్బోస్
సి. భారతీయ బ్రహ్మసమాజం 3. కేశవ చంద్రసేన్
డి. సాధారణ బ్రహ్మ సమాజం 4. ఎమ్.జి.రనడే
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-4, బి-1, సి-3, డి-2
4) ఎ-2, బి-3, సి-1, డి-4
34. ‘సత్యప్రకాష్’ అనే పత్రికను జ్యోతిబా ఫులె ఏ భాషలో ప్రారంభించారు?
1) గుజరాతి 2) మరాఠి
3) సంస్కృతం 4) ఇంగ్లిష్
35. జ్యోతిబా ఫులె గురించి కింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి?
ఎ. మహారాష్ట్రలో ఒక ఉన్నత కులంలో జన్మించాడు
బి. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జీవితకాలం పోరాడాడు
సి. మహారాష్ట్రలో వితంతు పునర్వివాహాలకు మార్గదర్శకుడిగా నిలిచాడు
డి. మహిళా విద్య కోసం కృషి చేశాడు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) పైవన్నీ
36. ‘ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి’ అని పలికిందెవరు?
1) దయానంద సరస్వతి
2) స్వామి శ్రద్ధానంద
3) లాలా హన్స్రాజా
4) లాలా లజపతిరాయ్
37. కింది వాటిలో స్వామి దయానంద కార్యక్రమాలు ఏవి?
ఎ. వేదాలు మోసపూరితమని పరిగణించాడు
బి. విగ్రహారాధన, మత సంస్కారం, పౌరోహిత్యాలను వ్యతిరేకించడం
సి. పురాణాలన్నీ అబద్దాల పుట్టలని భావించడం
డి. రెండు గొప్ప ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలను మంచి సాహితీ రచనలకంటే ఎక్కువగా పరిగణించకపోవడం
ఇ. జన్మతః వచ్చిన కుల వ్యవస్థను సమర్థించడం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
38. ఆంధ్రలో మొదటి వితంతు వివాహం ఎప్పుడు జరిగింది?
1) 1881 2) 1880
3) 1888 4) 1871
39. కింది వాటిలో రామ్మోహన్రాయ్ చేసినవి ఏవి?
ఎ. సతీ సహగమనానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆ దురాచారాన్ని ఆంగ్లేయుల చేత రద్దు చేయించాడు
బి. వారసత్వం, ఆస్తిహక్కు వంటి మహిళా హక్కుల ఉద్యమం
సి. బహు భార్యత్వ వ్యవస్థను ఖండించడంతో పాటు క్షీణించిపోతున్న వితంతువుల పరిస్థితిని ఖండించాడు
డి. సంస్కృత మాధ్యమం ద్వారా సంప్రదాయ విద్యావ్యాప్తి కోసం పాటుపడటం
ఇ. మేధాపరమైన పరస్పర సంబంధ సాధనంగా బెంగాలీని రూపొందించడం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి, ఇ
40. శారదా వివాహ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది?
1) 1929 2) 1829
3) 1856 4) 1858
41. సరైన జతను సూచించే సంఖ్య ఏది?
ఎ. మైసూరు ప్రజామిత్ర మండలి 1. జ్యోతిబా ఫులె
బి. సత్యశోధక సమాజం 2. సి.వి. రామన్ పిైళ్లె
సి. అఖిలభారత అస్పృశ్యత లీగ్ 3. సి.ఆర్.రెడ్డి
డి. మలయాళీ మెమోరియల్ 4. ఎం.కె.గాంధీ
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-3, బి-1, సి-4, డి-2
42. ‘గిఫ్ట్ టు మోనోథీస్ట్’ రచయిత ఎవరు?
1) ఆర్.సి.దత్
2) రాజా రామ్మోహన్రాయ్
3) దయానంద సరస్వతి
4) నెహ్రూ
43. దివ్యజ్ఞాన సమాజానికి చెందిన ప్రధాన లక్ష్యాలేంటి?
ఎ. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఏర్పాటు చేయడం
బి. ప్రపంచంలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడం
సి. ప్రాచీన మతాల, దర్శనాల, అధ్యయనాన్ని ప్రోత్సహించడం
డి. విద్యాజ్ఞానంగా ప్రసిద్ధమైన జీవికి, పదార్థానికి సంబంధించిన మార్మిక సామర్థ్యాలను క్రమబద్ధంగా పరిశీలించడం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
44. దివ్యజ్ఞాన సమాజాన్ని మొదట ఏ దేశంలో ప్రారంభించారు?
1) అమెరికా 2) ఇంగ్లండ్
3) జర్మనీ 4) ఫ్రాన్స్
45. ఆర్య సమాజంలో ఏర్పడిన గొప్ప చీలిక గురించి కింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి?
ఎ. అనుసరించాల్సిన విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్య మీద 1892లో ఇది అవతరించింది
బి. గురుకులం విభాగం, ఆంగ్ల విద్యా వ్యాప్తిని అభిలషించింది
సి. కళాశాల విభాగం, ఆంగ్ల విద్యా వ్యాప్తిని అభిలషించింది
డి. గురుకులం విభాగానికి లాలా లజపతిరాయ్ నాయకత్వం వహించగా కళాశాల విభాగానికి లాలా హన్స్రాయ్ నాయకత్వం వహించాడు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
46. కింది వాటిలో సరిగా జతపరిచినది ఏది?
1) ఆత్మీయ సభ- రాధాకాంత దేవ్
2) ధర్మ సభ- దేవేంద్రనాథ్ ఠాగూర్
3) తత్వబోధిని సభ- రామ్మోహన్రాయ్
4) ప్రార్థనా సమాజం- ఆత్మారామ్ పాండురంగ
47. వీరేశలింగం పంతులు గురించి కింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి?
ఎ. 19వ శతాబ్ది ద్వితీయార్ధంలో దక్షిణ భారతదేశానికి చెందిన అతి ముఖ్యమైన సంఘ సంస్కర్త
బి. ఏపీలో రాజమహేంద్రవరం సంఘ సంస్కరణ సంఘాన్ని స్థాపించాడు
సి. ఈ సంఘం ప్రధాన లక్ష్యం స్త్రీ విద్య
డి. ఈ సంఘం ప్రధాన లక్ష్యం వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) పైవన్నీ
48. కింది వాటిని జతపరచండి.
పత్రిక స్థాపకుడు
ఎ. ఉద్బోధన 1. గోపాల్ హరిదేశ్ముఖ్
బి. లోకహితవాది 2. కేశవ చంద్రసేన్
సి. ఇండియన్ మిర్రర్ 3. అనీబీసెంట్
డి. న్యూఇండియా 4. స్వామి వివేకానంద
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-1, బి-4, సి-2, డి-3
49. కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
ఎ. భారతదేశంలోని తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని కలకత్తాలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్థాపించారు
బి. భారతదేశంలో తొలి మహిళ కళాశాలను పూనాలో డి.కె.కార్వే స్థాపించారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏవీకావు
50. ‘హితకారిణి’ సమాజాన్ని స్థాపించినవారు ఎవరు?
1) దయానంద సరస్వతి
2) రాజా రామ్మోహన్రాయ్
3) గురజాడ అప్పారావు
4) కందుకూరి వీరేశలింగం
సమాధానాలు
21. 1 22. 2 23. 4 24. 2
25. 2 26. 3 27. 1 28. 2
29. 3 30. 1 31. 1 32. 4
33. 3 34. 1 35. 2 36. 4
37. 2 38. 1 39. 3 40. 1
41. 4 42. 2 43. 4 44. 1
45. 1 46. 4 47. 3 48. 1
49. 4 50. 4
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
సాహిత్యోద్యమాలు
- 20వ శతాబ్ది ఆరంభం నుంచి తెలంగాణ ఆధునిక కవిత్వయుగంగా గుర్తించొచ్చు. తెలంగాణ సామాజిక పరిణామ దశలు భిన్నంగా ఉన్నాయి. నిజాం రాచరిక పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు లోనయ్యారు.
- పన్నులు, వెట్టిచాకిరీ, నిరక్షరాస్యత, కౌలు పద్ధతి వంటి ఎన్నో సామాజిక సంచలనాలకు కారణమయ్యాయి.
- గ్రంథాలయోద్యమం, రైతాంగ విమోచనోద్యమం, సాయుధ పోరాటం వంటివి సంభవించాయి.
- ఈ సామాజిక విప్లవాలు, ఉద్యమాలన్నీ సాహిత్యంలోనూ ప్రతిబింబించాయి.
- తెలంగాణలో ప్రత్యేకమైన సాహిత్యం పురుడు పోసుకుంది. సంప్రదాయ రూపమైన పద్యంలో సామాజిక విప్లవ భావాలు పెల్లుబికాయి.
- పాటల్లో ప్రజల భావోద్వేగాలు ప్రజ్వరిల్లాయి. 354 మంది కవి, పండితుల రచనలతో సురవరం ప్రతాపరెడ్డి రూపొందించిన ‘గోల్కొండ కవుల సంచిక’ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.
- కాళోజీ, దాశరథి, సుద్దాల హన్మంతు, యాదగిరి, పొట్లపల్లి రామారావు, గంగుల శాయిరెడ్డి, వానమామలై సోదరులు, బండారు అచ్చమాంబ, మైలవరపు నరసింహశాస్త్రి, వేటూరి రంగధామనాయుడు, బూర్గుల, కోదాటి రామకృష్ణారావు వంటి వారెందరో ఉత్తేజభరితమైన రచనలు చేశారు.
- చందాల కేశవదాసు 1911లో ‘కనకతార’ నాటకం రచించి ఆధునిక నాటక రచనకు పునాది వేశాడు.
- హితబోధిని (1913, డిసెంబర్) సంచికలో రత్నమాంబ దేశాయి స్త్రీలు విద్యలో, కవిత్వంలోనూ రాణించడానికి సమాజం సిద్ధం కావాలని అద్భుతమైన పద్యాలు రాసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు