Telangana History & Culture | ‘మాయాజాల కళాకారులు’ అని ఎవరిని అంటారు?
29. కింది కోటలు, అవి ఉన్న ప్రాంతాలను/ జిల్లాలను గుర్తించండి?
ఎ. తిగవుడంపల్లి కోట 1. వనపర్తి జిల్లా
బి. జఫర్‌గఢ్ కోట 2. జనగామ జిల్లా
సి. నగునూర్ కోట 3. కరీంనగర్ జిల్లా
డి. కన్నెకల్ కోట 4. నల్లగొండ జిల్లా
5. జిగిత్యాల జిల్లా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-5
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-2, సి-4, డి-1
30. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. మెదక్ కోటలో ప్రస్తుతం 17వ శతాబ్దానికి చెందిన శూలం ఆకారంలో చెక్కిన 3.2 మీ. పొడవైన ఫిరంగి ఉంది
బి. గద్వాల కోటలో దేశంలోనే 32 అడుగుల అతిపెద్ద ఫిరంగి ఉంది
1) ఎ, బి 2) బి 3) ఎ 4) ఏదీకాదు
31. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. భువనగిరి కోటను 12వ శతాబ్దంలో ఏకశిలా రాతిపై పశ్చిమ చాళుక్య రాజు అయిన త్రిభువనమల్ల విక్రమాదిత్య-6 నిర్మించాడు
బి. రాచకొండ కోట (నల్లగొండ)ను రాజకొండ, నాగనాయని కొండ అనే రెండు కొండల మధ్య నిర్మించారు
సి. నిర్మల్ కోటకు మరో పేరు- శ్యాంగఢ్ కోట
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
32. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. దేవరకొండ కోటను 13-14 శతాబ్దాల మధ్య నిర్మించారు
బి. ఈ కోట నుంచి శ్రీశైలంలోని పాతాళ గంగకు చేరుకునే మెట్ల మార్గం ఉందని చెబుతారు
సి. ఈ కోట ప్రాంగణంలో మాదానాయుడు నిర్మించిన రామ, శివాలయాలు ఉన్నాయి
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) బి, సి
33. కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి.
ఎ. దోమకొండ కోట కామారెడ్డి జిల్లాలో ఉంది
బి. ఈ కోటలో ‘అద్దాల మేడ’ ఉంది
సి. 950వ దశకంలో ఖమ్మం కోటను కాకతీయ పాలకులు నిర్మించారు
డి. వెలమ, ముసునూరి నాయకులు కూడా ఖమ్మం కోట నిర్మాణంలో పాలుపంచుకున్నారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
34. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. నిజామాబాద్ కోటను 10వ శతాబ్దంలో పట్టణానికి నైరుతి దిశలో ఒక చిన్న కొండపై నిర్మించారు
బి. ఈ కోట దాదాపు 300 మీ. ఎత్తులో ఉంది
సి. గద్వాల కోట నిర్మాత- పెదసోమభూపాలుడు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
35. ఓరుగల్లు కోటకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. ఈ కోట నిర్మాణంలోని 77 బురుజులను ప్రతాపరుద్ర-2 కాలంలో నిర్మించారు
బి. కోట ప్రాంగణంలోని ఖుష్ మహల్‌ను షితాబ్ ఖాన్ నిర్మించాడు
సి. ఈ కోటలోని కీర్తి తోరణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంగా వాడుతున్నారు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) బి, సి
36. కింది తెలంగాణ చిత్ర కళాకారులను వారి ప్రాంతాలు/జిల్లాలను జతపర్చండి.
ఎ. కాపు రాజయ్య 1. సిద్దిపేట
బి. కొండపల్లి శేషగిరి రావు 2. మహబూబాబాద్
సి. ఏలె లక్ష్మణ్ 3. యాదాద్రి భువనగిరి
డి. లక్ష్మాగౌడ్ 4. మెదక్
5. కరీంనగర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-5, బి-4, సి-3, డి-2
37. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. ఏలె లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని, రాష్ట్ర పోలీస్ లోగోను రూపొందించారు
బి. చేర్యాల రవిశంకర్ ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’ లోగోను రూపొందించాడు
సి. చేర్యాల రవిశంకర్ జనగామ జిల్లాకు చెందినవాడు
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, సి
38. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. తెలంగాణ ఒగ్గు కళా పితామహుడిగా చుక్కా సత్తయ్య గుర్తింపు పొందారు
బి. ఒగ్గు కథా చక్రవర్తి అనే బిరుదు కలిగిన ఒగ్గు కళాకారుడు మొద్దె రాములు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
39. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. తెలంగాణ యక్షగాన పితామహుడిగా చెర్విరాల భాగయ్యను గుర్తిస్తారు
బి. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో సుద్దాల హనుమంతు రాసిన యక్షగానం ‘వీర తెలంగాణ’
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
40. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. విప్రవినోదులు బ్రాహ్మణ కులంపై ఆధారపడి, వారిని యాచించి జీవించే ఒక తెగవారు
బి. వీరిని తెలంగాణలో ‘మాయాజాల కళాకారులు’ అంటారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
41. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. మందెచ్చులవారు గొల్ల వారిని యాచిస్తారు
బి. వీరు కాటమరాజు కథను చెబుతారు
సి. వీరిని మంద పిచ్చోళ్లు, బొమ్మలాటవారు అని కూడా అంటారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
42. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. సాధనాశూరులు పద్మశాలీల ఇళ్ల వద్దకు వెళ్లి తమ గారడి విద్యను ప్రదర్శించి వారిని మాత్రమే యాచిస్తారు
బి. వీరిని ఇంద్రజాల ప్రదర్శకులుగా కూడా వ్యవహరిస్తారు
సి. వీరు ప్రదర్శించే విద్యలు అగ్నిస్తంభన, జల స్తంభన, అదృశ్య స్తంభన
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
43. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. వీరముష్టి వారు కోమటి కుల ఆశ్రిత గాయకులు
బి. వాసవి కన్యకాపరమేశ్వరి కథను ఆలపిస్తారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
44. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. (రామప్ప దేవాలయానికి సంబంధించి)
ఎ. దీన్ని 1213లో కాకతీయ రాజు గణపతిదేవుని సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు
బి. జాయపసేనాని రాసిన నృత్యరత్నావళి గ్రంథంలోని పేరిణి నృత్య భంగిమలు ఈ ఆలయన గోడలపై కనిపిస్తాయి
సి. 2020, జూలై 25న ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో యునెస్కో చేర్చింది
డి. దేశంలో యునెస్కో గుర్తింపు పొందిన 40వ కట్టడంగా నిలిచింది
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
45. కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి.
ఎ. కోలాటంను దండవర్తనం/ దండలాస్యం అని కూడా అంటారు
బి. కోలాటంలో వివిధ కోపులు జడ కోపు, విఘ్నేశ్వర కోపు ఉన్నాయి
సి. పాల్కురికి సోమనాథుని బసవపురాణంలో కోలాటం గురించిన ప్రస్తావన ఉంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
46. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. బహురూపులను బైరూపులు, పగటి వేషగాళ్లు అని కూడా వ్యవహరిస్తారు
బి. బహురూపుల పగటివేషాలు పూర్వం రాజదర్బార్‌లో 31 రోజులు ప్రదర్శించేవారు
సి. కొరవి గోపరాజు తన గ్రంథం ‘సింహాసన ద్వాత్రింశిక’లో బహురూపుల గురించి పేర్కొన్నాడు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
47. ‘కడునద్భుతంగా గంబ సూత్రంబు లడరంగ బొమ్మలనాడించు వారు’ అని కింది ఏ జానపద కళ/ఆట గురించి పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు?
1) దొమ్మరి ఆట
2) తోలు బొమ్మలాట
3) కోలాటం
4) ఏదీకాదు
48. ‘అమరాంగనలు దివి నాడెడు మాడ్కి సమరంగ గడలపై నాడెడు వారు’ అని కింది ఏ కళ/ఆట గురించి పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు?
1) దొమ్మరి ఆట
2) తోలు బొమ్మలాట
3) కోలాటం 4) ఏదీకాదు
49. తెలంగాణ రాష్ట్రంలో గుర్తించిన ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ కింది వాటిలో ఏవి?
ఎ. చెంచులు బి. కొండరెడ్లు
సి. కోలాములు డి. తోటీలు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
50. తీజ్, సీత్లా భవాని పండుగలు ఏ తెగవారు జరుపుకొంటారు?
1) లంబాడీలు 2) కొండరెడ్లు
3) చెంచులు 4) గోండులు
51. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. చెంచుల నివాస ప్రాంతాలను ‘పెంటలు’ అంటారు
బి. వీరు జరుపుకొనే ప్రధాన జాతరలు- సలేశ్వరం జాతర, లొద్దిమల్లయ్య జాతర, మన్ననూరు జాతర
సి. చెంచులు సంక్రాంతిని ‘చింతకాయల పండుగ’గా జరుపుకొంటారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
52. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. కోయలు ఎక్కువగా భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల్లో నివసిస్తారు
బి. ప్రతి సంవత్సరం జరుపుకొనే పండుగ ముత్యాలమ్మ పండుగ
సి. వీరు చిలుక జోస్యం చెబుతారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
53. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. (కొండరెడ్లకు సంబంధించి)
ఎ. కొండరెడ్లు నాగలిని ఉపయోగించరు
బి. మామిడికాయ కోత పండుగ జరుపుకొంటారు
సి. పోడు వ్యవసాయం చేస్తారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
54. పేరిణి శివతాండవానికి సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. దీన్ని యోధుల నృత్యం అని కూడా అంటారు
బి. ఈ నృత్య భంగమలు జాయపసేనాని ‘నృత్యరత్నావళి’ గ్రంథంలో కనిపిస్తాయి
సి. పేరిణి నృత్య భంగమలను రామప్ప గోడలపై తిలకించవచ్చు
డి. కాకతీయుల కాలం నాటి నృత్యంగా దీన్ని చెప్పవచ్చు
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
55. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. (గుస్సాడి నృత్యానికి సంబంధించి)
ఎ. గోండు తెగకు చెందిన పురుషులు ఈ నృత్యం ప్రదర్శిస్తారు
బి. ఈ నృత్యానికి సంబంధించి ప్రముఖ కళాకారుడు గుస్సాడి కనకరాజు
సి. ఇతనికి 2021కు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అందజేసింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
56. నృత్యం, ప్రదర్శించే సందర్భాలను జతపర్చండి.
ఎ. లంబాడి 1. తీజ్ పండుగ
బి. గుస్సాడి 2. నాగోబా జాతర
సి. గరగ 3. బోనాల పండుగ
డి. మదిలీ 4. పీర్ల పండుగ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-1, బి-3, సి-4, డి-2
57. సిద్దిపేట జిల్లాలో జరిగే జాతరలను గుర్తించండి.
ఎ. బెజ్జంకి జాతర
బి. కూడవెళ్లి జాతర
సి. ప్రతాపరుద్రసింగరాయ జాతర
డి. ఏడుపాయల జాతర
1) ఎ, బి
2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
58. కింది జలపాతాలు, అవి ఉన్న జిల్లాల్లో సరైన జతలను గుర్తించండి.
ఎ. బొగత- ములుగు
బి. మల్లెలతీర్థం- నాగర్‌కర్నూలు
సి. సప్తగుండాల- కుమ్రం భీం
డి. చింతామణి- ఆదిలాబాద్
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
సమాధానాలు
29-1, 30-1, 31-3, 32-2, 33-3, 34-3, 35-2, 36-1, 37-1, 38-3, 39-3, 40-3, 41-4, 42-3, 43-3, 44-1, 45-4, 46=3, 47-2, 48-1, 49-4, 50-1, 51-3, 52-3, 53-3, 54-4, 55-4, 56-1, 57-2, 58-2.
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
Dream Warriors Academy
Youtube Channel
9032620623
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు