Indian History | మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంవత్సరం?
హిస్టరీ
1. గాంధీ ఏ ఉద్యమ సందర్భంలో ‘సాధించు లేదా మరణించు’ అనే పిలుపునిచ్చారు?
1) సహాయ నిరాకరణ ఉద్యమం
2) దండియాత్ర ఉద్యమం
3) క్విట్ ఇండియా ఉద్యమం
4) హోంరూల్ ఉద్యమం
2. సహాయ నిరాకరణోద్యమాన్ని 1920లో ఏ సమావేశంలో తీర్మానించారు?
1) బొంబాయి 2) కలకత్తా
3) గుజరాత్ 4) ఉత్తరప్రదేశ్
3. కింది సంఘటనలను కాలానుక్రమ పద్ధతిలో గుర్తించండి.
ఎ. క్రిప్స్ రాయబారం
బి. క్విట్ ఇండియా ఉద్యమం
సి. ఉప్పు సత్యాగ్రహం
డి. ఆగస్టు ప్రతిపాదన
1) డి, సి, బి, ఎ 2) సి, డి, ఎ, బి
3) సి, ఎ, డి, బి 4) డి, సి, ఎ, బి
4. దేశంలో గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని చేపట్టిన చంపారన్ (1917) ఏ రాష్ట్రంలో ఉంది?
1) పశ్చిమబెంగాల్ 2) బీహార్
3) ఉత్తరప్రదేశ్ 4) పంజాబ్
5. మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనవారు ఎవరు?
1) గాంధీ 2) పటేల్
3) డా.బి.ఆర్ అంబేద్కర్
4) మదన్ మోహన్మాలవీయ
6. భారత జాతీయ సైన్యం ఎక్కడ ప్రారంభించారు?
1) జపాన్ 2) జర్మనీ
3) మలేషియా 4) సింగపూర్
7. ప్రత్యేక పాకిస్థాన్ అనే ఆలోచనను వ్యతిరేకించిన కమిషన్ ఏది?
1) క్రిప్స్ కమిషన్ 2) సైమన్ కమిషన్
3) క్యాబినెట్ కమిషన్
4) వేవెల్ ప్రణాళిక
8. జతపరచండి.
1. స్వరాజ్యపార్టీ ఎ. ఆచార్య నరేంద్ర
2. సోషలిస్ట్ బి. మోతీలాల్ నెహ్రూ
3. కాంగ్రెస్ సోషలిస్టు సి. ఎం.ఎన్. రాయ్
4. కమ్యూనిస్టు డి. జోషి
1) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
9. 1924లో గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏ సమావేశంలో ఎన్నికయ్యారు?
1) గుజరాత్ 2) బెల్గాం
3) నాగ్‌పూర్ 4) చౌరీచౌరా
10. జతపరచండి.
1. చౌరీచౌరా సంఘటన ఎ. 1930
2. దండియాత్ర బి. 1931
3. గాంధీ-ఇర్విన్ ఒప్పందం సి. 1922
4. క్రిప్స్ మిషన్ డి. 1942
1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
11. రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్ హుడ్ బిరుదును ఎందుకు వదిలేశారు?
1) జలియన్ వాలా బాగ్ ఆందోళన
2) శాసనోల్లంఘన ఉద్యమ నిలిపివేత
3) భగత్‌సింగ్ ఉరితీత
4) చౌరీచౌరా సంఘటన
12. గాంధీ నాయకత్వంలో గుజరాత్లో జరిగిన సంఘటన?
1) నెల్లిమర్ల మిల్లు వర్కర్ల ఆందోళన
2) ఖేడాలోని రైతుల ఆందోళన
3) బార్డోలీలోని రైతుల ఆందోళన
4) సత్యాగ్రహం
13. జతపరచండి.
1. ఇంక్విలాబ్ జిందాబాద్ ఎ. సుభాష్‌చంద్రబోస్
2. చలో ఢిల్లీ బి. గాంధీ
3. డూ ఆర్ డై సి. సరస్వతి
4. తిరిగి వేదాలకు వెళ్లండి డి. భగత్‌సింగ్
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
14. మొదటిసారి స్వాతంత్య్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకొన్నాం?
1) 1931 ఆగస్టు 2) 1929
3) 1930, జనవరి 26
4) 1930, నవంబర్ 26
15. జలియన్ వాలా బాగ్ నరమేధానికి నిరసనగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేసినవారు?
1) శంకరన్ నాయర్
2) దాదాభాయ్ నౌరోజీ
3) మోతీలాల్ నెహ్రూ
4) సుభాష్ చంద్రబోస్
16. గాంధీ పిలుపు మేరకు రాణి గైడిన్‌లియూ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న వీరనారి. ఈమె ఏ ప్రాంతానికి చెందినవారు?
1) నాగాలాండ్ 2) మేఘాలయ
3) అసోం 4) నేపాల్
17. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ గురించి కింది స్టేట్మెంట్లలో వాస్తవం ఏది?
ఎ. తమ అభిమాన నాయకులైన డా.సత్యపాల్, డా.కిచ్లూలను అరెస్టు చేసి దేశం నుంచి పంపడంపై నిరసన తెలపడానికి ప్రజా సమూహం, అమృత్‌సర్‌లోని ఒక ఉద్యానవనంలో సమావేశమైంది.
బి. ఆ సమయంలో జనరల్ డయ్యర్, పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నాడు.
సి. నిరాయుధులైన ప్రజల మీద కాల్పులు జరపమని మైకేల్ డయ్యర్ ఆదేశించాడు.
డి. ఈ దురంతానికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్‌హుడ్‌ను పరిత్యజించాడు.
ఇ. ఈ దురంతానికి నిరసనగా గాంధీ కైజర్ ఇ హింద్ మెడల్‌ను తిరిగి ఇచ్చేశాడు.
సరైన సమాధానం ఎంచుకోండి.
1) ఎ, బి, డి 2) ఎ, డి, ఇ
3) ఎ, సి, డి 4) ఎ, డి
18. చౌరీ చౌరా గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
1) పంజాబ్ 2) పశ్చిమబెంగాల్
3) బీహార్ 4) ఉత్తరప్రదేశ్
19. గాంధీ-ఇర్విన్ ఒడంబడిక సందర్భంగా ముఖ్యమైన పాత్ర పోషించినవారు?
ఎ. మోతీలాల్ నెహ్రూ
బి. రాజ్‌బహుదూర్ సప్రూ
సి. మదన్మోహన్ మాలవీయ
డి. జయకర్ ఇ. చింతామణి
1) ఎ, బి 2) బి, డి
3) బి, సి 4) డి, ఇ
20. మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంవత్సరం?
1) 1932, జనవరి 2) 1932, మార్చి
3) 1932, జూలై 4) 1932, నవంబర్
21. సహాయ నిరాకరణోద్యమంలో భాగం కాని ఒక సంఘటన దేశ వ్యాప్తంగా ప్రజాదరణ పొందినది కింది వాటిలో ఏది?
1) విదేశీ వస్ర్తాలు విక్రయించే దుకాణాల ముందు నిరసన వ్యక్తపరచటం
2) ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను బహిష్కరించడం
3) కల్లు దుకాణాల ముందు నిరసన తెలపడం
4) ప్రభుత్వ ప్రచార, రవాణా వ్యవస్థను బహిష్కరించడం
22. గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు?
1) 1918 2) 1917
3) 1915 4) 1920
23. అనీబీసెంట్ ఏ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు?
1) సహాయ నిరాకరణోద్యమం
2) ఉప్పు సత్యాగ్రహం
3) హోంరూల్ ఉద్యమం
4) క్విట్ ఇండియా ఉద్యమం
24. చౌరీ చౌరా ఉదంతంతో స్వాతంత్య్ర సమరంలోని ఏ ఉద్యమం ఉన్నట్టుండి ఆగిపోయింది?
1) స్వదేశీ ఉద్యమం
2) సహాయ నిరాకరణోద్యమం
3) ఉప్పు సత్యాగ్రహం
4) క్విట్ ఇండియా ఉద్యమం
25. కింద ఇచ్చిన సంఘటనలను అధిరోహణ క్రమంలో వాటి ప్రారంభం లేదా జరిగిన సంవత్సరాన్ని బట్టి అమర్చండి.
ఎ. కమ్యూనల్ అవార్డు
బి. మీరట్ కుట్ర కేసు
సి. వైకోం సత్యాగ్రహం
డి. గురవాయూర్ సత్యాగ్రహం
1) ఎ, బి, సి, డి 2) బి, ఎ, సి, డి
3) డి, బి, ఎ, సి 4) సి, బి, డి, ఎ
26. 1928లో జరిగిన బార్డోలి సత్యాగ్రహానికి సంబంధం లేని దాన్ని గుర్తించండి.
1) అది నీలిమందు తోటల బ్రిటిష్ యజమానులకు వ్యతిరేకం
2) అది వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా జరిగింది.
3) రైతులకు కౌలుహక్కులు సంపాదించడానికి జరిగింది.
4) బొంబాయి ప్రభుత్వం 22% భూమిశిస్తు అధిక విధింపునకు వ్యతిరేకంగా కొనసాగింది.
27. ముస్లింలీగ్ పిలుపుతో ప్రత్యక్ష చర్యా దినంగా పాటించిన రోజు?
1) 1940, ఆగస్టు 16
2) 1942, సెప్టెంబర్ 26
3) 1946, ఆగస్టు 16
4) 1936, అక్టోబర్ 26
28. 1931 ఎన్నికలు భారతదేశంలో ఎన్ని ప్రావిన్స్‌లలో జరిగాయి?
1) 15 2) 11 3) 9 4) 12
29. కింది వాటిలో గాంధీతో సంబంధం లేని ఉద్యమం?
1) సహాయ నిరాకరణోద్యమం
2) శాసనోల్లంఘన ఉద్యమం
3) హోంరూల్ ఉద్యమం
4) క్విట్ ఇండియా ఉద్యమం
30. కింది వాటిలో తప్పుగా జతపరిచినది ఏది?
1) బెంగాల్ విభజన-1905
2) సైమన్ కమిషన్-1925
3) గాంధీ-ఇర్విన్ ఒప్పందం-1931
4) క్రిప్స్ రాయబారం-1942
31. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?
1) మహమ్మద్ అలీజిన్నా
2) బద్రుద్దీన్ త్యాబ్జీ
3) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
4) అబుల్ కలామ్ ఆజాద్
32. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
1) దాదాభాయ్ నౌరోజి
2) గోపాలకృష్ణ గోఖలే
3) రాజ్‌బిహారీ ఘోష్
4) ఎస్.ఎన్.బెనర్జీ
33. జాతీయవాద ప్రబోధాన్ని నేరంగా చేస్తూ ఆంగ్లేయులు ఏ సంవత్సరంలో శాసనం చేశారు?
1) 1890 2) 1895
3) 1848 4) 1905
34. బాలగంగాధర్ తిలక్‌ను భారతీయ అశాంతిపితగా వర్ణించింది ఎవరు?
1) వాలంటైన్ చిరోల్ 2) డిస్రాయెలీ
3) మింటో-2 4) చేమ్స్‌ఫోర్డ్
35. ‘స్వరాజ్యం నా జన్మహక్కు దాన్ని సాధిస్తాను’ అని తిలక్ ఏ సంవత్సరంలో ప్రకటించారు?
1) 1905 2) 1907
3) 1914 4) 1916
36. సరిగా జతపరిచినది గుర్తించండి.
ఎ. కామ్రేడ్ 1. అనీబీసెంట్
బి. అల్‌హిలాల్ 2. మహమ్మద్ అలీ
సి. జమీందార్ 3. అబుల్‌కలామ్ ఆజాద్
డి. కామన్వీల్ 4. జాఫర్ అలీఖాన్
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-1, బి-3, సి-4, డి-2
37. జతపరచండి.
ఎ. రవీంద్రనాథ్ ఠాగూర్ 1. నీల్ దర్పణ్
బి. దాదాభాయ్ నౌరోజీ 2. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా
సి. దీనబంధు మిత్రా 3. గోరా
డి. ఆర్.సి.దత్ 4. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-3, బి-2, సి-3, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-3, బి-4, సి-1, డి-2
38. హింసాయుత విప్లవ మార్గాన్ని అద్భుతంగా చిత్రించిన బ్రిటిష్ ప్రభుత్వ నిషేధానికి గురైన ‘పథేర్ దాబి’ నవలా రచయిత ఎవరు?
1) ప్రేమ్‌చంద్
2) శరత్చంద్ర ఛటర్జీ
3) బంకిమ్‌చంద్ర ఛటర్జీ
4) అజయ్‌ఘోష్
39. అనీబీసెంట్కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ. 1916లో మదనపల్లిలో జాతీయ కళాశాలను స్థాపించారు.
బి. యంగ్ ఇండియా పత్రిక ద్వారా బ్రిటిషర్లను తీవ్రంగా విమర్శించారు.
సి. 1917 కలకత్తాలో జరిగిన ఐఎన్సీకి అధ్యక్షత వహించారు.
డి. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన చివరి విదేశీ వనిత
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, బి 4) ఎ, సి, డి
40. అభినవ భారత్ అనే రహస్య సమాజాన్ని స్థాపించిన వారెవరు?
1) నరేన్ భట్టాచార్య
2) జతిన్ ముఖర్జీ
3) గణేశ్ సావర్కర్
4) దామోదర్ చాపేకర్
సమాధానాలు
1. 3 2. 2 3. 4 4. 2
5. 3 6. 4 7. 3 8. 1
9. 2 10. 1 11. 1 12. 2
13. 2 14. 3 15. 1 16. 1
17. 4 18. 4 19. 2 20. 4
21. 3 22. 3 23. 3 24. 2
25. 4 26. 1 27. 3 28. 2
29. 3 30. 2 31. 2 32. 3
33. 3 34. 1 35. 4 36. 3
37. 4 38. 2 39. 4 40. 3
వారన్ హేస్టింగ్స్ (1773-85)
- మొదటి బ్రిటిష్ బెంగాల్ గవర్నర్ జనరల్
- ఈ పదవి బ్రిటిష్ పార్లమెంటు 1773లో చేసిన రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏర్పరిచారు.
- బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేశారు.
- కలకత్తాను బెంగాల్ రాష్ట్ర రాజధానిగా చేసుకున్నాడు.
- ముర్షిదాబాదు నుంచి ఖజానాను కూడా కలకత్తాకు మార్చాడు.
- వారన్ హేస్టింగ్స్ బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో భూమిశిస్తు వసూలు చేసే హక్కును, వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు.
- బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఏర్పరచి భూమిశిస్తు వ్యవహారాలు చూసుకోవడానికి జిల్లా సూపర్ వైజర్లను కలెక్టర్‌గా పేరు మార్చి నియమించాడు.
- ఇంగ్లిష్ వారైన కలెక్టర్లకు సహాయం చేయడానికి భారతీయ దివాన్లను నియమించాడు.
- సివిల్, క్రిమినల్ న్యాయస్థానాలను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నియమించాడు.
వాటి పేర్లు.. - మఫిసిల్ దివానీ అదాలత్: దీని అధికార్లు కలెక్టర్లు. సివిల్ వివాదాలు పరిష్కరించేవారు.
- మఫిసిల్ ఫౌజ్దారీ అదాలత్: దీని అధికారి కాజీ. క్రిమినల్ కేసులు పరిష్కరించేవారు.
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు