General Studies | ఐరోపాలో సంవత్సరమంతా వర్షం సంభవించే ప్రాంతం?
జనరల్ స్టడీస్
1. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితిని ఏమంటారు?
ఎ) వాతావరణ స్థితి బి) శీతోష్ణస్థితి
సి) ఉష్ణోగ్రత డి) అవపాతం
2. అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలను వేటి సహాయంతో సూచిస్తారు?
ఎ) సమోష్ణోగ్రత రేఖలు
బి) సమభార రేఖలు
సి) ైక్లెమెటోగ్రాఫ్ డి) పైవన్నీ
3. భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్ది వార్షిక సగటు ఉష్ణోగ్రత ఏమవుతుంది?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) తటస్థంగా ఉంటుంది
డి) క్రమరహితంగా ఉంటుంది
4. ఒకే అక్షాంశంపై ఉన్నప్పటికీ లూథియానా కంటే సిమ్లా చల్లగా ఉండడానికి కారణం?
ఎ) సముద్ర సమీపంగా ఉండటం
బి) భూమధ్యరేఖకు దూరంగా ఉండటం వల్ల
సి) శీతల స్థానిక పవనాల వల్ల
డి) సముద్ర మట్టం కంటే బాగా ఎత్తుగా ఉండటం వల్ల
5. భారతదేశ ఉపరితలం నుంచి 12,000 మీ. ఎత్తులోని మేఖలలో వేగంగా ప్రవహించే ఉపరితల వాయు ప్రవాహాలను ఏమంటారు?
ఎ) జెట్ ప్రవాహం బి) డ్రిఫ్ట్ ప్రవాహం
సి) ట్రేడ్ విండ్ డి) గల్ఫ్ స్ట్రీమ్
6. దేశపు అత్యంత శీతల మాసం?
ఎ) నవంబర్ బి) డిసెంబర్
సి) జనవరి డి) ఫిబ్రవరి
7. ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో కురిసే ఒక మోస్తరు వర్షాలకు కారణం?
ఎ) మ్యాంగో షవర్స్
బి) పశ్చిమ విక్షోభాలు
సి) ‘లూ’ పవనాలు
డి) ఈశాన్య వ్యాపార పవనాలు
8. దేశంలో అధిక వర్షపాతం ఏ పవనాల వల్ల సంభవిస్తుంది?
ఎ) ‘లూ’ పవనాలు
బి) పశ్చిమ విక్షోభాలు
సి) ఈశాన్య వ్యాపార పవనాలు
డి) నైరుతి వ్యాపార పవనాలు
9. ‘అక్టోబర్ వేడిమి’ అనే ఉక్కపోత కాలం దేశంలో ఏ కాలంలో సంభవిస్తుంది?
ఎ) వేసవికాలం బి) శీతాకాలం
సి) నైరుతి రుతుపవన కాలం
డి) ఈశాన్య రుతుపవనకాలం
10. శ్రావణ, భాద్రపద మాసాల్లో వచ్చే రుతువు?
ఎ) వసంత రుతువు బి) గ్రీష్మ రుతువు
సి) వర్ష రుతువు
డి) శరద్ రుతువు
11. శిశిర రుతువు ఏ నెలలో వస్తుంది?
ఎ) జనవరి – ఫిబ్రవరి
బి) మార్చి – ఏప్రిల్
సి) మే – జూన్ డి) జూలై – ఆగస్టు
12. కింది వాటిలో హరిత గృహ వాయువు?
ఎ) ఆక్సిజన్ బి) నైట్రోజన్
సి) ఆర్గాన్ డి) మిథేన్
13. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత?
ఎ) 30C – 300C బి) -20C – 290C
సి) 40C – 400C డి) 40C – 250C
14. 2009లో సుందర్బన్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన తుఫాను?
ఎ) నీలం బి) ఐలా
సి) కత్రినా డి) తిత్లీ
15. థింసా ఏ ప్రాంతంలోని గిరిజనుల సంప్రదాయ నృత్యం?
ఎ) శేషాచలం కొండలు
బి) నల్లమల అడవులు
సి) అరకులోయ డి) రాయలసీమ
16. గోండులు గ్రామ దేవతగా ఎవరిని ఆరాధిస్తారు?
ఎ) నాగోబా బి) అకిపెన్
సి) కాలోరానో డి) ఇంది రాజా
17. గోండుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయం ఎక్కడ ఉంది?
ఎ) కేస్లాపూర్,ఆదిలాబాద్
బి) మేడారం, ములుగు
సి) ఏడుపాయల, మెదక్
డి) పెద్దమనిగట్టు, మహబూబ్‌నగర్
18. గోండులు నాగోబా జాతర సందర్భంగా చేసే ప్రత్యేక నృత్యం?
ఎ) థింసా బి) గుస్సాడి
సి) కురవంజి డి) సదిర్
19. తెలంగాణ రాష్ట్రంలో చెంచులు అధికంగా ఉన్న జిల్లా ?
ఎ) భద్రాద్రి కొత్తగూడెం
బి) నాగర్ కర్నూల్
సి) ఆదిలాబాద్ డి) మంచిర్యాల
20. చెంచులు ఏ మాసంలో లింగయస్వామి చెంచు లక్ష్మీ పూజ నిర్వహిస్తారు?
ఎ) వైశాఖ బి) శ్రావణ
సి) ఆషాఢ డి) మాఘ
21. బాహ్య ప్రపంచానికి దూరంగా కరెన్సీ విలువ కూడా తెలియకుండా జీవిస్తున్న గిరిజనులు ఎవరు?
ఎ) చెంచులు బి) గోండులు
సి) బోండా డి) సంతాల్‌లు
22. బోండా గిరిజనులకు సంబంధించి కింది వాటిలో సరికానిది గుర్తించండి.
ఎ) రెమో – వీరి భాష
బి) హతా – సంత
సి) బినిమం ప్రోధా – వివాహ విధానం
డి) అరకు లోయ – వీరి నివాస ప్రాంతం
23. బోండా జాతి స్త్రీల దుస్తులు దేనితో తయారు చేస్తారు?
ఎ) నూలుదారం బి) పట్టు దారం
సి) ఉన్ని దారం డి) జనప నార
24. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన వాయువు?
ఎ) ఆక్సిజన్ బి) నైట్రోజన్
సి) కార్బన్ డై ఆక్సైడ్ డి) ఫ్లోరిన్
25. దేశంలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) అరుణాచల్‌ప్రదేశ
సి) మధ్యప్రదేశ్ డి) జార్ఖండ్
26. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే గిరిజన జాతి?
ఎ) సవర బి) గదబ
సి) కోలామి డి) కోయ
27. గుప్తుల కాలం నాటి చిత్రకళ కింది వాటిలో ఎక్కడ గమనించవచ్చు?
ఎ) కన్హేరి బి) ఎల్లోరా
సి) కంచి డి) మహాబలిపురం
28. విజయనగర సామ్రాజ్యం ఏ నదీ తీరాన స్థాపించారు?
ఎ) కృష్ణా బి) తుంగభద్రా
సి) గోదావరి డి) మంజీరా
29. ఖజురహో ఆలయ నిర్మాతలు?
ఎ) చందేలులు బి) సోలంకీలు
సి) చౌహాన్లు డి) గాంగులు
30. స్వర్ణ దేవాలయం ఉన్న ప్రదేశం?
ఎ) అమృత్సర్ బి) నాందేడ్
సి) లూథియానా డి) తల్వండీ
31. కొండలను తొలిచిన చైత్యాలు ఎక్కడ ఉన్నాయి?
ఎ) నాగార్జున కొండ బి) నాసిక్
సి) కార్లే డి) సాంచి
32. కింది వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి?
ఎ) త్రయంబకేశ్వరం బి) బాసర
సి) నాందేడ్ డి) సారనాథ్
33. మహారాష్ట్రలోని నాందేడ్‌లో గల నిర్మాణం?
ఎ) సబ్ఖండ్ గురుద్వారా
బి) జ్ఞాన సరస్వతి ఆలయం
సి) జైన మందిరం
డి) బృహదేశ్వర ఆలయం
34. ట్యాంక్ బండ్ వద్ద రోడ్డు ఏ సంవత్సరంలో నిర్మించారు?
ఎ) 1926 బి) 1936
సి) 1946 డి) 1956
35. కింది వాటిలో చండీగఢ్‌లోని రాక్ గార్డెన్‌ను నిర్మించింది?
ఎ) ధ్యాన్‌చంద్ బి) లేక్చంద్
సి) రాక్చంద్ డి) రాంచంద్
36. పిచోలా సరస్సు ఏ నగరంలో ఉంది?
ఎ) అజ్మీర్ బి) ఉదయ్‌పూర్
సి) అమృత్సర్ డి) జైపూర్
37. కాంచనగంగా శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) అరుణాచల్‌ప్రదేశ్ బి) సిక్కిం
సి) ఉత్తరాఖండ్ డి) అస్సాం
38. థార్ ఎడారిలో చిరుతిళ్లకు ప్రసిద్ధి చెందిన నగరం?
ఎ) జైపూర్ బి) జైసల్మీర్
సి) బికనీర్ డి) జోధ్‌పూర్
39. పారిశ్రామిక విప్లవం మొదట సంభవించిన ఖండం?
ఎ) యూరప్ బి) ఆస్ట్రేలియా
సి) ఉత్తర అమెరికా డి) దక్షిణ అమెరికా
40. యూరప్‌ను, ఆఫ్రికాను వేరు చేసే సముద్రం?
ఎ) అట్లాంటిక్ బి) ఉత్తర
సి) బాల్టిక్ డి) మధ్యధరా
41. ఆసియా, ఐరోపా సరిహద్దుల్లో ఉన్న పర్వతాలు?
ఎ) యూరల్ బి) ఆల్ప్స్
సి) కాకసస్ డి) పెన్నియస్
42. యూరప్‌కు పశ్చిమాన ఉన్న సముద్రం?
ఎ) అట్లాంటిక్ బి) పసిఫిక్
సి) బాల్టిక్ డి) మధ్యధరా
43. యురేషియా అని ఏ రెండు ఖండాలను కలిపి పిలుస్తారు?
ఎ) యూరప్, ఆస్ట్రేలియా
బి) యూరప్, ఆసియా
సి) యూరప్, అమెరికా
డి) యూరప్, ఆఫ్రికా
44. యూరప్‌లో సంవత్సరమంతా మంచుతో కప్పబడే పర్వతాలు?
ఎ) పైరినీస్ బి) ఆల్ప్స్
సి) యూరల్ డి) పెన్ని యస్
45. కాకసస్ పర్వతాలు ఏ రెండు సముద్రాల మధ్య ఉన్నాయి?
ఎ) కాస్పియన్ – నల్ల
బి) కాస్పియన్ – ఎర్ర
సి) నల్ల – మధ్యధరా డి) నల్ల – ఉత్తర
46. తూర్పు ఐరోపా సరిహద్దులో గల పర్వత శ్రేణులు?
ఎ) ఆల్ప్స్ బి) యూరల్
సి) పైరినీస్ డి) డినారిక్ ఆల్ప్స్
47. కింది వాటిలో పెద్ద సరస్సు వంటి సముద్రం?
ఎ) నల్ల సముద్రం బి) ఎర్ర సముద్రం
సి) మధ్యధరా సముద్రం
డి) కాస్పియన్ సముద్రం
48. కింది నదుల్లో జల రవాణాకు అనుకూలంగా లేనిది?
ఎ) రైన్ బి) డాన్యూబ్
సి) వోల్గా డి) సెయిన్
49. స్కాండినేవియా ద్వీపకల్పంలోని భాగం?
ఎ) నార్వే బి) స్వీడన్
సి) ఇంగ్లండ్ డి) ఎ, బి
50. ద్వీపకల్పానికి ఎన్ని వైపుల నీరు ఉంటుంది?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
51. కింది వాటిలో ద్వీపకల్పం ఏది?
ఎ) ఇటలీ బి) టర్కీ
సి) ఇంగ్లండ్ డి) రష్యా
52. స్కాండినేవియన్ ద్వీపకల్పంలో గల పర్వత శ్రేణులు?
ఎ) ఆల్ప్స్ బి) కాకసస్
సి) యూరల్ డి) స్కాండినేవియన్
53. భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సన్నని సముద్ర భాగం?
ఎ) గల్ఫ్ బి) అఖాతం
సి) జలసంధి డి) భూసంధి
54. కింది వాటిలో అతిపెద్ద గల్ఫ్?
ఎ) బాల్టిక్ సముద్రం
బి) ఉత్తర సముద్రం
సి) మధ్యధరా సముద్రం
డి) గల్ఫ్ ఆఫ్ ఎడెన్
55. పశ్చిమ యూరప్ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సముద్ర ప్రవాహం?
ఎ) ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్
బి) బెంగ్యులా సి) కురుషియో
డి) ఈక్వేటర్ స్ట్రీమ్
56. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఉష్ణ ప్రవాహాలు అమెరికాలోని ఏ తీరానికి చేరుకుంటాయి?
ఎ) తూర్పు బి) పశ్చిమ
సి) ఉత్తర డి) దక్షిణం
57. 1750లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం?
ఎ) ఇంగ్లండ్ బి) ఫ్రాన్స్
సి) స్పెయిన్ డి) పోర్చుగల్
58. పశ్చిమ పవనాలు అట్లాంటిక్ మహాసముద్రం నుంచి యూరప్‌కు ఏ కాలంలో వీస్తాయి?
ఎ) వర్షాకాలం బి) వేసవికాలం
సి) సంవత్సరమంతా
డి) శీతాకాలం
59. పశ్చిమ పవనాలు ఏ రకమైన గాలులు?
ఎ) శీతల బి) అతిశీతల
సి) తేమ డి) పొడి
60. ఐరోపా పశ్చిమ తీరాన్ని ఏ జలాలు తాకుతూ వెళ్తాయి?
ఎ) చల్లటి బి) వెచ్చని
సి) హిమానీ డి) పైవేవీ కావు
61. యూరప్‌లోని పశ్చిమ తీర జలాన్ని చలికాలంలో గడ్డ కట్టనీయకుండా చేసేది?
ఎ) ఈక్వేటర్ స్ట్రీమ్
బి) ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్
సి) బెంగ్యులా ప్రవాహం
డి) లారెన్షియా డ్రిఫ్ట్
62. ఐరోపాలో సంవత్సరమంతా వర్షం సంభవించే ప్రాంతం?
ఎ) దక్షిణ ఐరోపా
బి) తూర్పు ఐరోపా
సి) పశ్చిమ ఐరోపా
డి) మధ్య ఐరోపా
63. డాగర్ బ్యాంక్ ఏ సముద్రంలో ఉంది?
ఎ) బాల్టిక్ బి) ఉత్తర
సి) మధ్యధరా డి) కాస్పియన్
64. మధ్యధరా వలె శీతోష్ణస్థితి ఐరోపాలో ఎక్కడ ఉంది?
ఎ) దక్షిణ ఐరోపా బి) ఉత్తర ఐరోపా
సి) తూర్పు ఐరోపా డి) పశ్చిమ ఐరోపా
65. మధ్యధరా శీతోష్ణస్థితి ప్రత్యేకత?
ఎ) వేసవిలో వర్షం
బి) చలికాలంలో వర్షం
సి) సంవత్సరమంతా వర్షం
డి) అసలు వర్షం కురవదు
66. అమెరికాను చేరుకున్న మొదటి యూరోపియన్ ఎవరు?
ఎ) హెన్రీ బి) వాస్కోడిగామా
సి) డయాజ్ డి) కొలంబస్
67. కొలంబస్ అమెరికాలోని ఏ ప్రాంతం చేరుకున్నాడు?
ఎ) కెనడా తీరం బి) మెక్సికో తీరం
సి) బ్రెజిల్ తీరం
డి) పశ్చిమ ఇండీస్ దీవులు
68. నైరుతి ఐరోపా నుంచి అమెరికా తూర్పు తీరానికి వీచే పవనాలను ఏమంటారు?
ఎ) పశ్చిమ పవనాలు
బి) వ్యాపార పవనాలు
సి) రుతుపవనాలు
డి) స్థానిక పవనాలు
జవాబులు
1.బి 2.సి 3.బి 4.డి
5.ఎ 6.సి 7.బి 8.డి
9.డి 10.సి 11.ఎ 12.డి
13. బి 14.బి 15.సి 16.బి
17.ఎ 18.బి 19.బి 20.డి
21. సి 22.సి 23.డి 24.సి
25. సి 26.డి 27.బి 28.బి
29.ఎ 30.ఎ 31.సి 32.ఎ
33.ఎ 34.సి 35.బి 36.బి
37.బి 38.సి 39.ఎ 40.డి
41.ఎ 42.ఎ 43.బి 44.బి
45.ఎ 46.బి 47.డి 48.సి
49.డి 50.సి 51.ఎ 52.డి
53.ఎ 54.ఎ 55.ఎ 56.ఎ
57.ఎ 58.సి 59.సి 60.బి
61.బి 62.సి 63.బి 64.ఎ
65.బి 66.డి 67.డి 68.బి
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు