TSES Recruitment 2023 | ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 239 టీచింగ్ పోస్టులు
TSES Recruitment 2023 | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (TSES) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంగ్లిష్, హిందీ, గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, కామర్స్, ఎకనామిక్స్, తెలుగు, ఐటీ, తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్డీ, ఎంఫిల్, ఎంఈడీ, టెట్ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. అకడమిక్ మెరిట్, టీచింగ్ అనుభవం, డెమో ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు సీబీఎస్ఈ సిలబస్‌ను ఇంగ్లిష్ మీడియంలో బోధించాల్సి ఉంటుంది. బోర్డింగ్, లాడ్జింగ్ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం కల్పిస్తారు.
మొత్తం పోస్టులు : 239
పోస్టులు : పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)
విభాగాలు : ఇంగ్లిష్, హిందీ, గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, కామర్స్, ఎకనామిక్స్, తెలుగు, ఐటీ, తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్డీ, ఎంఫిల్, ఎంఈడీ, టెట్ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : అకడమిక్ మెరిట్, టీచింగ్ అనుభవం, డెమో ద్వారా
వయస్సు : జులై 01 2023 నాటికి 60 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు పీజీటీలకు రూ.35,750; టీజీటీలకు రూ.34,125. లైబ్రేరియన్లకు రూ.30,000 వరకు
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
చివరి తేదీ : జులై 02
వెబ్సైట్ : https://fastses.telangana.gov.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు