JoSAA 2023 Registration | జోసా-2023
ఇంజినీరింగ్ విద్యకు దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా పేరుగాంచిన ఐఐటీ, నిట్, ఐఐఐటీ, జీఎఫ్ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియ జూన్ 19 నుంచి ప్రారంభమైంది. సుమారు రెండు నెలల పాటు జరిగే ఈ ప్రక్రియ నేపథ్యంలో జేఈఈ మెయిన్/ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్‌లో అర్హత సాధించినవారు ఆయా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన పలు విషయాలు,
ముఖ్యతేదీల వివరాలు నిపుణ పాఠకుల కోసం..
జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)- 2023ని కేంద్ర మానవ వనరుల శాఖ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 119 సంస్థల్లో ప్రవేశాల కోసం జోసా ద్వారా సీట్లు కేటాయిస్తారు. దేశంలోని 23 ఐఐటీలు, 32 నిట్లు (ఐఐఈఎస్టీ శిబ్పూర్తో కలిపి), 26 ఐఐఐటీలు, 38 ఇతర జీఎఫ్‌ఐటీ (గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్) తదితర సంస్థల్లో ప్రవేశాల కోసం ఏర్పాటు చేసిన ఒకే ఒక్క వేదిక జోసా. కౌన్సెలింగ్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది.
రిజిస్ట్రేషన్
- జేఈఈ (మెయిన్)-2023 లో అర్హత సాధించిన వారు నిట్ + సిస్టమ్ (ఐఐటీలు మినహాయించి) ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు జేఈఈ మెయిన్/అడ్వాన్స్డ్ రోల్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
- జేఈఈ (అడ్వాన్స్డ్)-2023లో అర్హత సాధించినవారు ఐఐటీల్లో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Filling-in of choices: అభ్యర్థులు వారివారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఇన్స్టిట్యూట్లు – కోర్సుల ప్రాధాన్యతలను ఇవ్వాలి. సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోవడం మంచిది.
Locking of choices: అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు/ప్రాధాన్యతలను లాక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫిల్లింగ్ ఇన్ ఛాయిస్ మూసివేసినప్పుడు ఆటోమెటిక్‌గా ఇచ్చిన ఆప్షన్లు సేవ్ అవుతాయి. - సీట్ల కేటాయింపు: మొత్తం ఆరు రౌండ్లలో సీట్ల కేటాయింపు చేస్తారు. జోసా పరిధిలోని మొత్తం 119 సంస్థల్లో ఈ సీట్ల కేటాయింపు ఉంటుంది. స్టెప్-1- సీటు అంగీకారం
- సీటు వచ్చిన తర్వాత అభ్యర్థులు ఫ్రీజ్, ైస్లెడ్, ఫ్లోట్ ఆప్షన్లు ఇవ్వాలి.
- తర్వాత సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి. సీటు అలాట్ అయిన తర్వాత యాక్సెప్టెన్స్ ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించకుంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయరు. ఫీజు చెల్లిస్తేనే తర్వాతి రౌండ్లకు అనుమతి ఇస్తారు.
- రిపోర్టింగ్: జోసా ఏర్పాటు చేసిన రిపోర్టింగ్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వెళ్లాలి. అక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సర్టిఫికెట్లను చూపించాలి.
నోట్: ఫ్రీజ్, ైస్లెడ్, ఫ్లోట్ ఆప్షన్ల ద్వారా తర్వాతి దశల్లో జరిగే కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. చివరగా సీట్లు వచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఈ ఆప్షన్ల గురించి పూర్తిగా తెలుసుకుని వాటిని ఉపయోగించండి. దీనికి సంబంధించి జోసా వెబ్సైట్లో వివరంగా ఇచ్చారు.
నోట్: ఎంత ఎక్కువ ఆప్షన్లు ఇస్తే అంత మంచిది. గతేడాది ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకుల ఆధారంగా ఆప్షన్లు కేవలం అవగాహన కోసం మాత్రమే ఉపయోగపడుతాయి. నచ్చిన, చేరాలనుకునే అన్ని కాలేజీలకు, బ్రాంచీలకు ఆప్షన్లు ఇస్తేనే మంచిది.
గమనిక: జోసాకు వెళ్లే వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.. రాష్ట్రంలోని ఎంసెట్ కౌన్సెలింగ్ లాగా ఇక్కడ ప్రతి దశలో వెబ్ ఆప్షన్లు ఇవ్వడం కుదరదు. ఒక్కసారి వెబ్ ఆప్షన్లు ఇస్తే ఆరు రౌండ్ల వరకు అవే కొనసాగుతాయి. వాటిలో ఎటువంటి మార్పు చేయలేరు.
జోసా -2023 ముఖ్యాంశాలు
- ప్రతిసారిలాగే ఈసారి జోసా ద్వారా ఆరు రౌండ్లలో సీట్ల కేటాయింపు చేస్తారు. ఎన్ఐటీ+ సిస్టమ్‌కు మాత్రం ఏ కాలేజీల్లోనైనా సీట్లు మిగిలి ఉంటే వాటి భర్తీని సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీఎస్ఏబీ) చేపడుతుంది. దీనికోసం సీఎస్ఏబీ వెబ్సైట్ చూడవచ్చు.
నోట్: ఎన్ఐటీలో రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. అవి హోమ్ స్టేట్ కోటా (హెచ్ఎస్), ఇతర రాష్ర్టాల కోటా (ఓఎస్). తెలంగాణ విద్యార్థులకు ఎన్ఐటీ వరంగల్ హోమ్ స్టేట్ కిందికి వస్తారు. 50 శాతం సీట్లను హోమ్ స్టేట్ కోటా కింది రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. - ఈసారి సీటు యాక్సెప్టెన్సీ ఫీజు జనరల్/ఓబీసీలకు రూ. 40,000/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు రూ. 20,000/-
- జోసా కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చే ముందు విద్యార్థులు సీట్ మ్యాట్రిక్స్‌ను, గతేడాది ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకులను విశ్లేషించుకుని ఆప్షన్లు పెట్టుకుంటే మంచిది. అదేవిధంగా ఆయా కాలేజీల గురించి ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా ఆ కాలేజీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి కాలేజీ వివరాలు, గతేడాది ప్లేస్‌మెంట్స్, ఇతర వివరాలను తెలుసుకోవడం మంచిది. ఎవరో ఏదో చెప్పారని కాకుండా మీరు వెబ్ ఆప్షన్లపై కసరత్తు చేయడం, అవసరం అనుకున్న వారు నిపుణులు, సీనియర్ స్టూడెంట్స్ సలహాలు, సూచనలు తీసుకోవడం చేయండి.
జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్
జూన్ 19: ఉదయం 10 నుంచి ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్, ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్ట్ (ఏఏటీ) రాసినవారు జూన్ 24 తర్వాత ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
జూన్ 25 : మాక్ సీట్ అలకేషన్ -1, డిస్ప్లే (జూన్ 24 వరకు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా)
జూన్ 27: మాక్ సీట్ అలకేషన్ -2, డిస్ప్లే (జూన్ 26 వరకు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా). ఇష్టం ఉన్న వారు ఈరోజు ఇచ్చిన ఆప్షన్లను లాక్ చేసుకోవచ్చు.
జూన్ 28: సాయంత్రం 5 గంటలకు విద్యార్థుల రిజిస్ట్రేషన్, ఫిల్లింగ్ ముగింపు (ఆటో/సిస్టమ్ లాకింగ్)
జూన్ 29: డేటా పరిశీలన, సీట్ అలకేషన్ పరిశీలన
జూన్ 30: ఉదయం 10 గంటలకు మొదటి దశ సీట్ల కేటాయింపు
జూన్ 30- జూలై 4: ఆన్లైన్ రిపోర్టింగ్, డాక్యుమెంట్ అప్లోడ్ (రౌండ్-1)
జూలై 5: రౌండ్ 1కు సంబంధించి ఏమైనా క్వారీలు ఉంటే సాయంత్రం 5లోపు రెస్పాండ్ కావాలి.
జూలై 6 : సాయంత్రం 5 గంటలకు రెండోదశ సీట్ల కేటాయింపు.
జూలై 12: సాయంత్రం 5 గంటలకు మూడోదశ సీట్ల కేటాయింపు.
జూలై 16: సాయంత్రం 5 గంటలకు నాల్గో దశ సీట్ల కేటాయింపు
జూలై 21: సాయంత్రం 5 గంటలకు ఐదో దశ సీట్ల కేటాయింపు
జూలై 26: సాయంత్రం 5 గంటలకు ఆరో రౌండ్ సీట్ల కేటాయింపు
పూర్తి సమాచారం కోసం వెబ్సైట్: https://josaa.nic.in చూడవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు