IBPS RRB Preparation Plan 2023 | నిత్య సాధనతో.. బ్యాంక్ కొలువు సాకారం
నిత్య సాధనతో.. బ్యాంక్ కొలువు సాకారం
దేశవ్యాప్తంగా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (ఆర్ఆర్బీ) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XII ద్వారా వివిధ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ప్రకటన విడుదల చేసింది. దీనిలో స్కేల్-3 సీనియర్ మేనేజర్, స్కేల్-2 మేనేజర్, స్కేల్-1 అసిస్టెంట్ మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) తదితర 8612 ఖాళీలు ఉన్నాయి. ఈ జాబ్ సాధించాలంటే ఎలా ప్రిపేర్ కావాలో తెలుసుకుందాం.
1. రీజనింగ్ ఎబిలిటీ
- ఈ విభాగాన్ని బాగా ఔపాసన పట్టాలి. బ్యాంకింగ్ రంగం లో రీజనింగ్‌కు ప్రత్యేకత ఉంది. ఇందులో చాలా వరకు స్టేట్మెంట్ ఆధారిత అంశాలే అధికం. కాబట్టి వీలైనంత వరకు ఇంగ్లిష్‌పై నైపుణ్యం పెంచుకుంటే రీజనింగ్ అంశాలను చదవడం, అర్థం చేసుకోవడం, సాల్వ్ చేయడం సులభమవుతుంది.
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో ఈ విభాగం రెండు ఫేజ్‌లలో ఉంటుంది. ప్రిలిమ్స్‌లో 40 మార్కులు, మెయిన్స్‌లో 50 మార్కులు కేటాయించారు. ఈ విభాగం నుంచి సీటింగ్ అరెంజ్మెంట్స్, పజిల్స్, సిలాజిసం, కోడెడ్-ఇన్-ఈక్వాలిటీస్, ఇన్పుట్-అవుట్‌పుట్ వంటి అంశాల నుంచి 60 శాతం మార్కులు వస్తాయి. కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్, డైరెక్షన్స్, స్టేట్మెంట్-అజంప్షన్, కంక్లూజన్, ఆర్గ్యుమెంట్ వంటి అంశాలకు కూడా ప్రాధాన్యమివ్వాలి.
- రీజనింగ్ ఎబిలిటీ విభాగం కఠినంగా ఉంటుంది. అయితే తరచూ అడిగే అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. కచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. ఈ విభాగంలోని ప్రశ్నలు తార్కిక, విశ్లేషణ్యాలను పరీక్షిస్తాయి. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించే అంశాలను గుర్తించి ప్రాక్టీస్ చేస్తే ఫలితం ఉంటుంది.
ఈ విభాగంలో ఎక్కువ మార్కులు రావాలంటే..
1) టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైన అంశం. టైమర్ ప్రకారం తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు చేయగలిగే అంశాలను ఎంచుకొని సమయ పాలన ప్రకారం సాధన చేయాలి.
2) వేగం, కచ్చితత్వం విజయాన్ని నిర్ణయిస్తాయి.
3) మాక్ టెస్టులు, గత ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి.
4) రివిజన్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
రీజనింగ్ బుక్స్
1) ఆర్ఎస్ అగర్వాల్- వెర్బల్, నాన్ వెర్బల్
2) ఎంకే పాండే- అనలిటికల్ రీజనింగ్
2. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఈ విభాగం ప్రిలిమ్స్‌లో 40, మెయిన్స్‌లో 50 మార్కులకు రెండు ఫేజ్‌లలో కామన్‌గా ఉండే సబ్జెక్ట్ ఇది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ (క్లర్క్)లో న్యూమరికల్ ఎబిలిటీస్ అని, ఆఫీసర్ స్కేల్-1లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్గా ఈ విభాగం ఉంటుంది.
- అభ్యర్థుల గణన నైపుణ్యాలను ఈ విభాగం పరీక్షిస్తుంది. ప్రాథమిక గణిత సూత్రాలను, గుణకార పద్ధతిని నేర్చుకోవడం వల్ల న్యూమరికల్ ఎబిలిటీస్, ఆప్టిట్యూడ్ వంటి అంశాలను తేలికగా సాల్వ్ చేయవచ్చు.
- ఈ విభాగం నుంచి నంబర్ సిస్టమ్స్, శాతం, నిష్పత్తి, లాభం, నష్టం, సమయం, దూరం, వేగం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 1-2 ప్రశ్నలు వస్తాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై చార్టులు, లైన్‌గ్రాఫ్‌లు, బార్‌గ్రాఫ్‌లు వంటివి చాలా ముఖ్యమైనవి. వీటి నుంచి 20 ప్రశ్నలు వరకు వచ్చే అవకాశం ఉంది.
- ప్రిలిమ్స్, మెయిన్స్‌కు పై అంశాలతో పాటు ఆఫీసర్ స్కేల్-1 మెయిన్స్‌లో మెన్సురేషన్, చతుర్భుజాలు, ప్రాబబిలిటీ, మిశ్రమాలు, అనుబంధాలు, ప్రస్తారణలు, కలయికల నుంచి ప్రశ్నలు వస్తాయి.
- వివిధ మూలాల నుంచి అంశాలవారీగా సుపరిచితులై ఉండాలి. ఇందుకు గత ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. సామర్థ్యాలను బట్టి అంశాలను ఎంచుకొని వేగం, కచ్చితత్వం ఉండేలా సాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు ఇలా సిద్ధం కావాలి..
1) సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. స్కేర్లు, క్యూబ్‌లు, కూడికలు-తీసివేతలు ప్రాక్టీస్ చేయాలి.
2) బ్యాంక్ ఎగ్జామ్స్‌కు సమయం, వేగం, కచ్చితత్వం చాలా అవసరం. కాబట్టి స్పీడ్ మ్యాథ్స్ రూల్స్ పాటించడం, సాధన చేయడం వల్ల ఎక్కువ స్కోర్ చేయవచ్చు.
3) ప్రతి అంశం నుంచి 100-150 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
4) 50 శాతం ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి వస్తాయి. కాబట్టి ఈ అంశం నుంచి అన్ని రకాల ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
5) సరైన అధ్యయన ప్రణాళికను అనుసరించడం వల్ల విజయానికి బాటలు వేసినట్టే.
6) నిత్యం బోడ్మాస్ పద్ధతిని బాగా ఔపాసన పట్టాలి.
పుస్తకాలు
1) ఆర్ఎస్ అగర్వాల్- క్వాంటిటేటివ్ టెక్నికల్స్
2) ఎం టైరా- స్పీడ్ మ్యాథ్స్
3) అరిహంత్- ఆబ్జెక్టివ్ అర్థమెటిక్
3. ఇంగ్లిష్ లాంగ్వేజ్
- ఈ విభాగం కేవలం మెయిన్స్‌లో మాత్రమే ఉంటుంది. 40 ప్రశ్నలకు 40 మార్కులు కేటాయించారు. ఈ విభాగం హెచ్చుస్థాయిలో ఉంటుంది. దీని నుంచి గ్రామర్-నాన్ గ్రామర్ ప్రశ్నలు వస్తాయి. కాంపిటీటివ్ ఇంగ్లిష్ గురించి పూర్తి అధ్యయనం చేస్తే ఈ విభాగం సులభమవుతుంది. ఏ మీడియం వారైనా ఈ విభాగంలో ప్రిపరేషన్ లేకుండా బాగా స్కోర్ చేయలేరు.
- ఈ సెక్షన్లో రీడింగ్-కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్-ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీ అరెంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, కోడ్ టెస్ట్, జంబుల్డ్ సెంటెన్సెస్ వంటి వాటితో పాటు ఇడియమ్స్-ఫ్రేజెస్, ప్రిపోజిషన్, యాంటోనిమ్స్-సినానిమ్స్, యాక్టివ్-పాసివ్ వాయిస్ వంటి వ్యాకరణాలకు సంబంధించిన అంశాలను ఔపాసన పట్టాలి.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో రీడింగ్ కాంప్రహెన్షన్ చాలా ముఖ్యమైన అంశం. 10-12 ప్రశ్నలు వస్తాయి.
- క్రమం తప్పకుండా నవలలు, కథనాలను, ఇంగ్లిష్ దినపత్రికల్లో వచ్చే ఎడిటోరియల్స్ చదివితే పఠనా నైపుణ్యత, వేగంగా చదివే అలవాటుతో పాటు మంచి ఫలితాలను ఇస్తుంది.
పుస్తకాలు
1) రెన్ అండ్ మార్టిన్
2) నార్మన్ లూయిస్
3) ఎస్పీ బక్షి-అరిహంత్ పబ్లికేషన్స్
4. కంప్యూటర్ నాలెడ్జ్
- ఈ విభాగం మెయిన్స్‌లో 40 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయించారు. బ్యాంకింగ్ పరీక్షలో ఈ సెక్షన్ స్కోరింగ్‌కు ఉపయోగపడుతుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్‌తో పాటు కంప్యూటర్ పరికరాలు, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇంటర్నెట్, నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్, కీ బోర్డ్- షార్ట్‌కట్ కీస్ వంటి అంశాలతో పాటు కొత్త తరం వైరస్లు, నూతన ఆవిష్కరణలు, బ్యాంకింగ్‌లో కంప్యూటర్ల పాత్ర, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యాప్‌లు, యూపీఐ నిర్వహణ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, చాట్‌జీపీటీ వంటి అంశాలు ముఖ్యమైనవి.
పుస్తకాలు
1) ఆబ్జెక్టివ్ కంప్యూటర్ నాలెడ్జ్- కిరణ్ ప్రకాశన్
2) కంప్యూటర్ అవేర్నెస్- అరిహంత్ పబ్లికేషన్స్
3) ఆబ్జెక్టివ్ విత్ సబ్జెక్టివ్ ఇన్ కంప్యూటర్స్- సౌమ్యారంజన్ బెహరా
5. జనరల్ అవేర్నెస్ - విభాగం నుంచి బ్యాంకింగ్, ఆర్థిక అంశాలు, కరెంట్ అఫైర్స్‌తో కూడిన ప్రశ్నలు ఉంటాయి.
- విభాగం నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు, చరిత్ర, వ్యవస్థ, బ్యాంకింగ్ సంస్కరణలు, 1969, 1980లలో బ్యాంకుల జాతీయికరణ, 2015 నుంచి విలీనాలు, ఆర్బీఐ చట్టం- 1934, బ్యాంకింగ్ చట్టం- 1949, లావాదేవీలు, ఆర్బీఐ మానిటరీ పాలసీ, ద్రవ్యోల్బణం కట్టడి వంటి అంశాలను బాగా చదవాలి.
- ఆర్థిక అంశాల్లో నీతి ఆయోగ్, 15వ ఆర్థిక సంఘం, జీఎస్టీ, బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, కరెన్సీ ఎక్సేంజ్, కమిటీలు వంటి వాటితో పాటు 2023 వార్షిక బడ్జెట్, 2022-23 ఆర్థిక సర్వేలు ఔపాసన పట్టాలి.
- కరెంట్ అఫైర్స్‌లో వార్తల్లోని వ్యక్తులు, క్రీడలు, జాతీయ-అంతర్జాతీయ అంశాలు, ముఖ్యమైన రోజులు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు, అంతర్జాతీయ సంస్థలు, ఈవెంట్లు, జీ-20, జీ-7, బ్రిక్స్,
క్వాడ్, ఎస్సీవో, ఆసియాన్ వంటివి చాలా ముఖ్యమైన అంశాలు. - ఈ విభాగంలో స్కోరింగ్ చేయాలంటే దిన, మాస పత్రికల్లో వచ్చే సమకాలీన అంశాలపై సొంతంగా నోట్స్ రాసుకోవాలి.
పుస్తకాలు
1) నమస్తే తెలంగాణ పత్రికలోని నిపుణ
2) ది హిందూ ఇంగ్లిష్ దినపత్రిక
మధు కిరణ్
డైరెక్టర్
ఫోకస్ అకాడమీ
హైదరాబాద్
9030496929
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు