BIOLOGY | అతుకులు కలిగిన కాళ్లు ఉండటం ఏ వర్గపు జీవుల లక్షణం?
1. కింది వాటిని జతపరచండి.
ఎ. పొరిఫెరా 1. సైకాన్
బి. ప్లాటిహెల్మింథిస్ 2. ప్లనేరియా
సి. అనెలిడా 3. జలగ
డి. మొలస్కా 4. ఆల్చిప్ప
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-1, బి-2, సి-3, డి-4
2. గొంగళి పురుగు అనేది?
1) కీటకాల సరూప శాబకం
2) కీటకాల లార్వా
3) కీటకాల ప్యూపా దశ
4) అనెలిడాకు చెందిన జీవి
3. కింద పేర్కొన్న జంతువుల్లో క్షీరదం కానిది ఏది?
1) మేక 2) మొసలి
3) గబ్బిలం 4) కంగారూ
4. సముద్ర తీరంలో ఉంటూ, సముద్ర జీవులను ఆహారంగా గ్రహిస్తూ, ఈదే శక్తి కలిగి ఉన్న ఎగురలేని పక్షి?
1) నిప్పుకోడి 2) కివి
3) సీ గల్ 4) పెంగ్విన్
5. కింది వాటిలో ప్రొటో కార్డెటా వర్గానికి చెందిన జీవి ఏది?
1) బెలనోగ్లాసస్ 2) హెర్డేనియా
3) ఫలపియాక్సిస్ 4) ప్లనేరియా
6. కింది వాటిని జతపరచండి.
ఎ. పక్షులు 1. ఫినాలజీ
బి. పక్షుల వలస 2. ఆర్నిథాలజీ
సి. బల్లులు 3. పేలియంటాలజీ
డి. డైనోసార్స్ 4. సారాలజీ
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3
7. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. వేసవి కాల సుప్తావస్థలో ఉండేవి కప్ప, నత్త
బి. శీతాకాల సుప్తావస్థలో ఉండేవి ధృవపు ఎలుగుబంటి
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీ కాదు
8. జీవుల వర్గీకరణ ఆధారంగా కింది వాటిని జతపరచండి.
ఎ. చాటన్ 1. వెజిటెబిలియా
బి. లిన్నేయస్ 2. ప్రొటిస్టా
సి. కోప్లాండ్ 3. కేంద్రక పూర్వ జీవులు
డి. హెకెల్ 4. మొనీరా
5. ఫంగి
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-5, బి-4, సి-2, డి-1
3) ఎ-3, బి-5, సి-1, డి-4
4) ఎ-2, బి-3, సి-5, డి-1
9. చేపల శ్వాసాంగాలు?
1) వాయునాళాలు 2) చర్మం
3) గ్రసని 4) మొప్పలు
10. కింది వాటిని జతపరచండి.
ఎ. నెమలి 1. పావో క్రిస్టేటస్
బి. తేనెటీగ 2. ఎపిస్ ఇండికా
సి. మందార 3. హైబిస్కస్ రోజా సైనెన్సిస్
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-2, బి-3, సి-1
4) ఎ-3, బి-1, సి-2
11. జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద వర్గం?
1) ఆర్థ్రోపొడా 2) మొలస్కా
3) కార్డెటా 4) మత్స్యాలు
12. కింది వాటిలో ఏది జంతువుల సమజాతీయ శాస్త్రీయ సమూహాన్ని సూచిస్తుంది?
1) గబ్బిలం, పావురం, బాతు, కోడి పెట్ట
2) పీత, చేప, రొయ్య, తిమింగలం
3) కోడిపెట్ట, బాతు, మేక, గొర్రె
4) మానవుడు, ఓరంగ్టాన్, జిబ్బాన్, కోతి
13. కింది వాటిని సరిగ్గా జతపరచండి.
ఎ. జనాభా సిద్ధాంతం 1. అటావిజం
బి. జిరాఫీలో మెడ 2. అపసారం సాగటం
సి. తోక కలిగిన శిశువు 3. మాల్తూస్
డి. సకశేరుకాలు 4. లామార్కిజం పూర్వాంగాలు
5. అభిసారం
1) ఎ-3, బి-1, సి-2, డి-4 2) ఎ-3, బి-4, సి-2, డి-5
3) ఎ-3, బి-5, సి-4, డి-2 4) ఎ-3, బి-4, సి-1, డి-2
14. కింద పేర్కొన్న సకశేరుక సమూహాలు పరిశీలించండి.
ఎ. మత్స్యాలు బి. ఉభయచరాలు
సి. పక్షులు డి. క్షీరదాలు
ఇ. సరీసృపాలు
పై వాటిలో ఉష్ణరక్త జీవులను గుర్తించండి.
1) ఎ, సి 2) సి, డి
3) బి, సి 4) డి, ఇ
15. ద్వినామ నామీకరణను ప్రతిపాదించింది ఎవరు?
1) లామార్క్ 2) విట్టేకర్
3) లిన్నేయస్ 4) డివ్రీస్
16. కింది సజీవ సంధాన సేతువులను జతపరచండి.
ఎ. ప్రొటోథీరియన్లు 1. అనెలిడా-ఆర్థ్రోపొడా
బి. పెరిపేటస్ 2. అనెలిడా- మొలస్కా
సి. ప్రొటిరోస్పాంజియా 3. సరీసృపాలు-క్షీరదాలు
డి. నియోపిలైనా 4. ప్రొటోజొవా-పొరిఫెరా
1) ఎ-3, బి-1, సి-2, డి-4 2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-3, బి-1, సి-4, డి-2 4) ఎ-1, బి-2, సి-3, డి-4
17. అతిపెద్ద సజీవ పక్షి?
1) ఫ్లెమింగో 2) నిప్పు కోడి
3) కివి 4) నెమలి
18. ప్రొటిస్టా జాతికి చెందినది ఏది?
1) అమీబా 2) యూగ్లినా
3) పారామీషియం 4) బ్యాక్టీరియా
19. ఎగిరే శక్తి గల క్షీరదం?
1) ఎఖిడ్నా 2) తిమింగలం
3) గబ్బిలం 4) పావురం
20. స్నానపు స్పంజికగా పేర్కొనే జీవి?
1) సైకాన్
2) యూస్పాంజియా
3) యూప్లెక్టెల్లా 4) స్పాంజిల్లా
21. జ్వాలా కణాలున్న జీవులు?
1) సిలెంటరేట్లు
2) స్పంజికలు
3) బల్లపరుపు పురుగులు
4) కీటకాలు
22. అతుకులు కలిగిన కాళ్లు ఉండటం ఏ వర్గపు జీవుల లక్షణం?
1) పొరిఫెరా 2) ప్లాటిహెల్మింథిస్
3) అనెలిడా 4) ఆర్థ్రోపొడా
23. పూర్తిగా సముద్రజీవనం గడిపే జీవులు మాత్రమే ఉన్న వర్గం?
1) కార్డెటా 2) మొలస్కా
3) అనెలిడా 4) ఇఖైనోడర్మెటా
24. కింది వాటిని జతపరచండి.
ఎ. సాలెపురుగులు 1. పరినాలజీ
బి. సరీసృపాలు 2. హెర్పటాలజీ
సి. కప్పలు 3. బాట్రకాలజీ
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-2, బి-3, సి-1
25. క్షీరదాల ముఖ్య లక్షణాలు?
1) ఈకలు, ముక్కు
2) రోమాలు, పాల గ్రంథులు
3) పొలుసులు, తోక
4) కాళ్లు, తోక
26. విట్టేకర్ ఐదు రాజ్యాల వర్గీకరణ వేటిని కలిగి ఉంటుంది?
1) మొనీరా, ప్రొటోజోవా, క్రోమిస్టా, ఫంగి, ఎనిమేలియా
2) మొనీరా, ప్రొటాక్టిస్టా, ప్లాంటే, ఫంగి, ఎనిమేలియా
3) మొనీరా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంటే, ఎనిమేలియా
4) మొనీరా, ప్రొటిస్టా, ఆర్కియా, ప్లాంటే, ఎనిమేలియా
27. ఉప్పు నేలల్లో పెరిగే మొక్కలను ఏమంటారు?
1) హాలోఫైట్స్ 2) మీసోఫైట్స్
3) హైడ్రోఫైట్స్ 4) థాలోఫైట్స్
28. ఏ మొక్కలు అతిచిన్న విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి?
1) ఆర్కిడ్ మొక్కలు
2) గడ్డిజాతి మొక్కలు
3) పామే మొక్కలు
4) ఎడారి మొక్కలు
29. కింది వాటిని జతపరచండి.
ఎ. ఫెనిరోగ్రామ్స్ 1. పుష్పించే మొక్కలు
బి. క్రిప్టోగ్రామ్స్ 2. పుష్పించని మొక్కలు
సి. థర్మోఫిల్స్ 3. వేడి నీటి బుగ్గల్లో నివసించేవి
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-2, బి-3, సి-1
30. కింది వాటిలో ఏ శిలీంధ్రం నుంచి యాంటీ బయాటిక్ను తయారు చేయవచ్చు?
1) ఈస్ట్ 2) బ్యాక్టీరియా
3) రైజోపస్ 4) పెనిసీలియం
31. కింది వాటిలో సరైన వాక్యాలేవి?
ఎ. పుట్టగొడుగుల విత్తనాలను స్పాన్ అంటారు
బి. పుట్టగొడుగుల్లో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ రోగులు తినవచ్చు
సి. అమనీటా అనేది విషపూరిత పుట్టగొడుగు ప్రజాతి పేరు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
32. అంతరిక్ష ప్రయాణాల్లో ఉపయోగపడే శైవలం?
1) క్లామిడోమోనాస్ 2) స్పైరోగైరా
3) క్లోరెల్లా 4) కారా
33. శిలీంధ్రాలు, శైవలాలతో కూడి ఏర్పడిన జీవిని ఏమని పిలుస్తారు?
1) మైకోరైజా 2) లైకెన్
3) రైజోమార్ఫ్ 4) థాలస్
34. వరి, గోధుమ, మొక్కజొన్న ఏ విభాగానికి చెందుతాయి?
1) ఏకదళ బీజాలు 2) ద్విదళ బీజాలు
3) స్పెర్మటోఫైటా 4) వివృత బీజాలు
35. వరి శాస్త్రీయనామం?
1) ట్రిటికమ్ ఎస్టివం
2) టామరిండస్ ఇండికా
3) పైసమ్ సటైవం 4) ఒరైజా సటైవా
36. కజానస్ కజాన్ అనేది ఏ మొక్క శాస్త్రీయనామం?
1) పెసర 2) శనగ
3) కంది 4) చెరుకు
37. ఆడ, మగ వేర్వేరుగా ఉండే మొక్కకు ఉదాహరణ?
1) కొబ్బరి 2) ఖర్జూరం
3) బొప్పాయి 4) అరటి
38. ఏ మొక్కలను ప్రప్రథమ నిజమైన నేల మొక్కలని పిలుస్తారు?
1) శైవలాలు 2) ఏకదళ బీజాలు
3) ద్విదళ బీజాలు
4) టెరిడోఫైటా మొక్కలు
39. పేసియోలస్ అరియస్ ఏ మొక్క శాస్త్రీయ నామం?
1) పెసలు 2) కందులు
3) ఉలవలు 4) రాగులు
40. పొడి ప్రదేశాల్లో పెరగడానికి అలవాటు పడ్డ మొక్కలను ఏమంటారు?
1) మీసోఫైట్స్ 2) హైడ్రోఫైట్స్
3) జెరోఫైట్స్ 4) హాలోఫైట్స్
41. శిలీంధ్రాలకు చెందిన ఏ జీవిని బ్రెడ్మోల్డ్ అని అంటారు?
1) పెనిసీలియం 2) అగారికస్
3) రైజోపస్ 4) ఈస్ట్
42. కింది వాటిలో సరైన వాక్యాలేవి?
ఎ. గింకో బైలోబా ఒక సజీవ శిలాజ మొక్క. ఇది ఇండియా హిమాలయ ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది
బి. టాక్సస్ అనే వివృత బీజ మొక్క కాండం నుంచి టాక్సాల్ అనే యాంటీ క్యాన్సర్ పదార్థం లభిస్తుంది
సి. సైకాన్ను సాగోఫామ్ అంటారు. దీని ఎండు విత్తనాల (చిల్గోజా)ను కాల్చుకొని తింటారు
1) ఎ, బి 2) బి, సి
3) బి 4) ఎ, బి, సి
43. వివృత బీజాల్లోని విత్తనంలో అంకురచ్ఛదం ఏ స్థితిలో ఉంటుంది?
1) ఏక స్థితిలో 2) ద్వయ స్థితిలో
3) త్రయ స్థితిలో 4) చతుఃస్థితిలో
44. విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కలను ఏమని పిలుస్తారు?
1) స్పెర్మటోఫైటా 2) ట్రాకియోఫైటా
3) ఎట్రాకియోఫైటా 4) క్రిప్టోగ్రామ్స్
45. దేహాన్ని కాండం, వేరు, పత్రాలుగా విభజన చెందించలేని మొక్కలను ఏ విభాగంలో చేర్చారు?
1) బ్రయోఫైటా 2) థాలోఫైటా
3) టెరిడోఫైటా 4) స్పెర్మటోఫైటా
46. బ్రయోఫైటా మొక్కలను ఏ మారుపేరుతో పిలుస్తారు?
1) వృక్షరాజ్య ఉభయచరాలు
2) వృక్షరాజ్య సరీసృపాలు
3) సముద్రపు కలుపు మొక్కలు
4) ఎంబ్రియోఫైటా మొక్కలు
47. మాస్ మొక్కలు వృక్షరాజ్యంలోని ఏ విభాగానికి చెందుతాయి?
1) శైవలాలు 2) శిలీంధ్రాలు
3) బ్రయోఫైటా 4) టెరిడోఫైటా
48. శిలల మీద పెరిగే మొక్కలను ఏమంటారు?
1) లితోఫైట్స్ 2) ఎరిమోఫైట్స్
3) చారోఫైట్స్
4) ఆక్సిలోఫైట్స్
49. కింది వాటిలో పుష్పించని మొక్క?
1) అరటి 2) నీటమ్
3) వరి 4) మార్సీలియా
50. థాలోఫైటాకు చెందిన ఏ మొక్కలను సముద్రపు కలుపు మొక్కలు అనే పేరుతో పిలుస్తారు?
1) శైవలాలు 2) శిలీంధ్రాలు
3) వివృత బీజాలు
4) ఆవృత బీజాలు
సమాధానాలు
1. 4 2. 2 3. 2 4.4
5. 4 6. 4 7. 3 8.1
9. 4 10.1 11.1 12.4
13.4 14.2 15.3 16.3
17.2 18.4 19.3 20.2
21.3 22.4 23.4 24.1
25.2 26.3 27.1 28.1
29.1 30.4 31.4 32.3
33.2 34.1 35.4 36.3
37.3 38.4 39.1 40.3
41.3 42.3 43.1 44.1
45.2 46.1 47.3 48.1
49.4 50.1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు