Telangana Movement Group IV Special | తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఏ తేదీన విరమించారు?
తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రూప్-IV గ్రాండ్ టెస్ట్
53. జాబితా-I, జాబితా-II తో జతపరిచి సరైన సమాధానం గుర్తించండి.
జాబితా-I జాబితా-II
ఎ. తెలంగాణ జనసభ 1. 1997, ఆగస్టు
బి. భువనగిరి సభ 2. 1997, అక్టోబర్
సి. తెలంగాణ మహాసభ 3. 1998, జూలై
డి. తెలంగాణ ఐక్యవేదిక 4. 1997, మార్చి
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-2, బి-3, సి-1, డి-4
54. 2001, మే నెలలో కరీంనగర్లో జరిగిన సింహగర్జన సభకు ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరు?
1) శరద్‌పవార్ 2) దేవెగౌడ
3) శిబూసోరెన్ 4) అజిత్‌సింగ్
55. 2002, ఏప్రిల్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) వరంగల్ 2) మెదక్
3) నల్లగొండ 4) సిద్దిపేట
56. 2003, జనవరిలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన జలసాధన సభకు కిందివారిలో ఎవరు హాజరు కాలేదు?
1) శరద్ యాదవ్ 2) మేథా పట్కర్
3) రామ్‌విలాస్ పాశ్వాన్
4) శిబూసోరెన్
57. 2003, అక్టోబరులో తెలంగాణ రాష్ట్ర సమితి ‘పల్లెబాట’ కార్యక్రమాన్ని కింది ప్రాంతంలో ఎక్కడి నుంచి ప్రారంభించింది?
1) వేములవాడ 2) మేడారం
3) మంచిర్యాల 4) అలంపూర్
58. సరికాని జతను గుర్తించండి.
1) సమర శంఖారావం- సిద్దిపేట
2) తెలంగాణ ఆత్మగౌరవసభ- నల్లగొండ
3) తెలంగాణ సంబరాలు- హైదరాబాద్
4) తెలంగాణ నిరసన సభ- ఆదిలాబాద్
59. టీఆర్ఎస్ ‘తెలంగాణ సోయి’ అనే చైతన్యం కలిగించే కార్యక్రమాన్ని ఎవరి కోసం నిర్వహించింది?
1) విద్యార్థులు 2) యువత
3) మహిళలు 4) పార్టీ కార్యకర్తలు
60. 2009, అక్టోబర్‌లో ‘తెలంగాణ ఉద్యోగుల గర్జన’ ఎక్కడ నిర్వహించారు?
1) సిద్దిపేట 2) కరీంనగర్
3) జనగామ 4) కామారెడ్డి
61. 2009లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడిన రోజు?
1) డిసెంబర్ 21 2) డిసెంబర్ 22
3) డిసెంబర్ 23 4) డిసెంబర్ 24
62. తెలంగాణ కథల సంకలనం దస్త్రం రచించినవారు?
1) సంగిశెట్టి శ్రీనివాస్
2) అల్లం రాజయ్య
3) గూడ అంజయ్య
4) బోయ జంగయ్య
63. కింది వాటిలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ ప్రాంతం నుంచి 2012, జనవరిలో బీజేపీ ‘తెలంగాణ పోరుయాత్ర’ ప్రారంభించింది?
1) అలంపూర్ 2) కృష్ణ
3) ఉండవల్లి 4) బీచుపల్లి
64. సరికాని జతను గుర్తించండి.
1) తెలంగాణ ప్రజా ఫ్రంట్- గద్దర్
2) తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్- ఆకుల భూమయ్య
3) నగారా భేరి- బెల్లయ్య నాయక్
4) తుడుందెబ్బ- నర్సింగరావు
65. తెలంగాణ కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి ఏ మండలానికి చెందినవాడు?
1) నార్కట్‌పల్లి 2) ఆత్మకూరు
3) మోత్కూరు 4) వలిగొండ
66. కిందివాటిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి.
ఎ. గూడ అంజయ్య 1. చూడాచక్కని తల్లి
బి. గోరటి వెంకన్న 2. వందనాలమ్మ
సి. అందెశ్రీ 3. ఊరు మనదిరా
డి. జయరాజ్ 4. పల్లె కన్నీరు
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
67. కింది వారిలో తెలంగాణ మలితరం కథలు గ్రంథానికి సంపాదకులు?
1) దేవకి దేవి 2) శ్యామల
3) ముదిగంటి సుజాతరెడ్డి
4) విమల
68. సరికాని జతను గుర్తించండి.
1) తెలంగాణ జర్నలిస్టుల ఫోరం- కలం కవాతు
2) హెచ్ఎం టీవీ చానల్- ‘దశ-దిశ’
3) సామల సదాశివ- యాడ
4) ఎ.నాగరాజు- జానపద జాతర
69. 2013లో ఏ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ‘తెలంగాణ యుద్ధభేరి’ పేరుతో పెద్ద సభ జరిపింది?
1) సెప్టెంబర్ 21 2) సెప్టెంబర్ 22
3) సెప్టెంబర్ 23 4) సెప్టెంబర్ 24
70. తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన రోజు?
1) 2014, మార్చి 1 2) 2014, మార్చి 2
3) 2014, మార్చి 3 4) 2014, మార్చి 4
71. ప్రతిపాదన (ఎ): విద్యార్థులు-తెలంగాణ ఉద్యమం ఎల్లప్పుడూ విడదీయలేనివి.
కారణం (ఆర్): 2009 నవంబర్ 28న పోలీసు అధికారులు కేసీఆర్‌ను అరెస్టు చేయడానికి కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవనానికి చేరుకున్నారు.
1) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఆర్)కు (ఎ) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఆర్)కు (ఎ) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైనది, (ఆర్) సరైనది కాదు
4) (ఎ) సరైనది కాదు, (ఆర్) సరైనది
72. శాసనసభలో తెలంగాణకు చెందిన సభ్యుల కోరిక మేరకు జీవో నెం. 610 అమలు విషయంపై 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించిన కమిషన్ ఏది?
1) జస్టిస్ భార్గవ కమిషన్
2) జె.జి.ఎల్.గ్విన్ కమిషన్
3) గిర్గ్లాని కమిషన్
4) కె.అచ్యుతరెడ్డి కమిషన్
73. 1969, ఏప్రిల్‌లో ముల్కీ నిబంధన కొనసాగించడానికి తగు రాజ్యాంగ సవరణలను సిఫారసు చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది? ఆ కమిటీ అధ్యక్షుడెవరు?
1) పింగళి జగన్మోహన్ రెడ్డి
2) కుమార్ లలిత్
3) జి.ఎన్. వాఘ్రె 4) కె.ఎన్. వాంఛు
74. 2012లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేపట్టిన తెలంగాణ నాయకుడు ఎవరు?
1) కె. చంద్రశేఖర్ రావు
2) కిషన్ రెడ్డి
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) కోదండరామ్
75. ప్రతిపాదన (ఎ): తెలంగాణ ఉద్యమానికి 1956లో ఏపీ ఆవిర్భావంతోనే బీజాలు పడ్డాయి.
కారణం (ఆర్): ఆంధ్ర రాజకీయ నాయకులు ఆధిక్యత క్రమేణ తెలంగాణ ప్రజలను కేవలం ప్రేక్షకుల మాదిరిగా మార్చింది.
1) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఆర్)కు (ఎ) సరైన వివరణ అవుతుంది
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఆర్)కు(ఎ) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైనది. (ఆర్) సరైనది కాదు
4) (ఎ) సరైనది కాదు. (ఆర్) సరైనది
76. తెలంగాణకు చెందిన కవులు, కళాకారులు, అధ్యాపకులు, పత్రికా రచయితలు కలిసి సాహితీ మిత్ర మండలి అనే సంస్థను ఏర్పాటు చేసి 1997 మార్చిలో గొప్ప సభ నిర్వహించారు. ఆ సభ ఎక్కడ జరిగింది?
1) వరంగల్ 2) కరీంనగర్
3) భువనగిరి 4) ఖమ్మం
77. కింది వాటిలో ఏది ఆరు సూత్రాల పథకంలో లేదు?
1) ఒక ప్రత్యేక రాష్ట్ర ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం
2) ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్‌లో స్థాపించడం
3) రెండు హైకోర్టులు ఒకటి ఆంధ్రాకు, మరొకటి తెలంగాణకు ఏర్పాటు చేయడం
4) ఉద్యోగ నియామకాలకు, ప్రమోషన్లలో స్థానికులకు ప్రాధాన్యమివ్వడం
79. కింది వాటిలో సరైన జతను గుర్తించండి.
1) తెలంగాణ పతాక దినం- 1980 జూలై 12
2) తెలంగాణ పోరాట దినోత్సవం- 1969 మార్చి 7
3) తెలంగాణ కోరికల దినం- 1969 మే 1
4) తెలంగాణ వంచన దినం- 1969 ఏప్రిల్ 22
80. తెలంగాణ ప్రజా సమితి తమ సంస్థను ఎప్పుడు ఒక రాజకీయ సంస్థగా ప్రకటించింది?
1) 1970 మే 2) 1970 ఏప్రిల్
3) 1970 జూన్ 4) 1970 జూలై
81. కింది రచయితలు, వారి రచనలను జతపరచండి.
ఎ. అల్లం నారాయణ 1. తెలంగాణ జైత్రయాత్ర
బి. ఘంటా చక్రపాణి 2. ప్రాణహిత
సి. ఎన్.గోపి 3. సలాం హైదరాబాద్
డి. పి.లోకేశ్వర్ 4. తంగేడు పూలు
1) ఎ-4, బి-2, సి-3, డి-1 2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-2, బి-1, సి-4, డి-3 4) ఎ-2, బి-3, సి-1, డి-4
82. కింది వారి పేర్లు, వారు అమరులైన స్థలంతో జతపరచండి.
ఎ. యాది రెడ్డి 1. శాస్త్రి భవన్, ఢిల్లీ
బి. శ్రీకాంతాచారి 2. అంబేద్కర్ విగ్రహం, ఎల్బీ నగర్
సి. యాదయ్య 3. ఓయూ క్యాంపస్
డి. ఇషాన్ రెడ్డి 4. ఎన్సీసీ గేట్
1) ఎ-3, బి-4, సి-2, డి-1 2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-1, బి-3, సి-4, డి-2 4) ఎ-1, బి-2, సి-4, డి-3
83. కింది వాక్యాల్లో సరైనది?
1) గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు వి. నారాయణస్వామి ప్రత్యేక ఆహ్వానితుడు
2) ప్రత్యేక తెలంగాణను ఏర్పరచాలని కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం 2018 జూలై 20న ఒక తీర్మానం చేసింది
3) కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం తెలంగాణ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకుందో వివరించడానికి ఎ.కె. ఆంటోని అధ్యక్షతన ఒక కమిటీని 2013 జూలై 30న నియమించింది
4) ఆర్టికల్-3 ప్రకారం పార్లమెంట్‌కు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి అధికారముంటుంది
84. తెలంగాణ సాయుధ పోరాట కమిటీ తన సాయుధ పోరాటాన్ని ఏ తేదీన విరమించుకుంది?
1) 1951 ఆగస్టు 4
2) 1951 జనవరి 20
3) 1950 డిసెంబర్ 15
4) 1951 అక్టోబర్ 21
85. కింది ప్రవచనాల్లో తెలంగాణలో భూదాన్ ఉద్యమానికి సంబంధించి సరికానిది?
1) వినోభాబావే రెండో భూదాన్ ఉద్యమ యాత్ర ఖమ్మం జిల్లా రామన్నగూడెం నుంచి 1954లో ప్రారంభించాడు
2) భూదాన్ ఉద్యమానికి మద్దతుగా 1956 ఫిబ్రవరి 6న విద్యార్థులు ఒక ఊరేగింపును నిర్వహించి పి.వి. కాలేజి ఆవరణలో బహిరంగ సభను నిర్వహించారు
3) ఈ ఉద్యమాన్ని ఆచార్య వినోభాబావే ప్రారంభించారు. 1951 ఏప్రిల్ 15న ఆయన శివరాంపల్లి నుంచి తెలంగాణ పర్యటన ప్రారంభించాడు
4) భూదాన్ ఉద్యమం ద్వారా సేకరించిన భూమిని దానం చేసేందుకు భూదాన్ యజ్ఞ సమితి అనే సంస్థను స్థాపించి ఉమ్మెత్తల కేశవరావును కన్వీనర్‌గా నియమించాడు
86. ప్రతిపాదన (ఎ): 1956 ఫిబ్రవరిలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను విలీనం చేయడానికి రెండు ప్రాంతాల నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది
కారణం (ఆర్): విలీనపు ప్రతిపాదనలను అంగీకరిస్తూ ఆంధ్రరాష్ట్ర శాసన సభ 1954 నవంబర్ 25న తెలంగాణ ప్రజల అవసరాలకు తగు రక్షణ కల్పించడానికి తీర్మానించింది
1) ఎ నిజం కానీ ఆర్ తప్పు
2) ఎ తప్పు కానీ ఆర్ నిజం
3) ఎ, ఆర్ రెండూ నిజం. ఎ కు ఆర్ సరైన వివరణ
4) ఎ, ఆర్ రెండూ నిజం. ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
87. హైదరాబాద్ రాజ్యంపై జరిపిన పోలీస్ చర్యను కింది విధంగా కూడా పిలుస్తారు?
1) గోడార్డ్ ప్లాన్ 2) రజాకర్ ప్లాన్
3) జై హైదరాబాద్ ప్లాన్
4) చౌదరి ప్లాన్
88. కింది వాటిలో ఏ లంబాడీ నాయకుడు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో విసునూరు దొరకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు?
1) జాటోత్ థాను నాయక్
2) బల్లు నాయక్
3) తేజావత్ దాసు నాయక్
4) భూక్యా బాల్య
89. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో కింది వారిలో ఎవరి భాగస్వామ్యం లేదు?
1) బి.ఎస్ రాములు
2) భూపతి కృష్ణమూర్తి
3) ఆచార్య గంగాధర్
4) పసునూరి దయాకర్
90. హైదరాబాద్ 1952 ముల్కీ ఉద్యమ ఘటనలపై దర్యాప్తునకు ఎవరు నాయకత్వం వహించారు?
1) వామన్ నాయక్ 2) అక్బర్ హైదరి
3) జగన్మోహన్ రెడ్డి 4) రామాచారి
91. 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో కింది వారిలో ఎవరు మొట్టమొదట ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు?
1) కొలిశెట్టి రామదాసు
2) టి.పురుషోత్తమారవు
3) పోటు కృష్ణమూర్తి
4) అన్నాబత్తుల రవీంద్రనాథ్
92. కింది వాటిని కాలానుక్రమంలో అమర్చండి.
ఎ. ఎనిమిది సూత్రాల పథకం
బి. ఆరు సూత్రాల పథకం
సి. ఐదు సూత్రాల పథకం
డి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్
1) ఎ, సి, బి, డి 2) ఎ, బి, సి, డి
3) డి, బి, సి, ఎ 4) బి, ఎ, డి, సి
93. కింది వాటిని జతపరచండి.
ఎ. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1. 1997
బి. తెలంగాణ స్టూడెంట్స్ ఫోరం 2. 1998
సి. తెలంగాణ ఐక్య వేదిక 3. 1991
డి. తెలంగాణ జనసభ 4. 1986
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-3, బి-4, సి-2, డి-1
94. కింది రాజకీయ సంస్థలు, వాటిని స్థాపించిన వారిని జతపరచండి.
ఎ. నవ తెలంగాణ పార్టీ 1. ఇంద్రారెడ్డి
బి. తెలంగాణ సాధన సమితి 2. నాగం జనార్దన్ రెడ్డి
సి. జై తెలంగాణ పార్టీ 3. టి.దేవేందర్ గౌడ్
డి. తెలంగాణ నగర సమితి 4. ఆలె నరేంద్ర
1) ఎ-4, బి-2, సి-3, డి-1 2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-3, బి-4, సి-1, డి-2 4) ఎ-2, బి-1, సి-4, డి-3
95. తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీకి ఎవరు కన్వీనర్‌గా ఉన్నారు?
1) ఎం. రాజేందర్ రెడ్డి
2) తన్నీరు శ్రీరంగరావు
3) గండ్ర మోహన్ రావు
4) పి. గోవర్ధన్ రెడ్డి
96. కింది వాటిలో సరైన జత కానిది?
1) బెల్లయ్య నాయక్- లంబాడీ హక్కుల పోరాట సమితి
2) దబ్బగట్ల నర్సింగరావు- మున్నూరుకాపు హక్కుల పోరాట సమితి
3) బెల్లి కృష్ణ- గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి
4) వాలిగి ప్రభాకర్- ఎరుకల హక్కుల పోరాట సమితి
97. కింది వారిలో సకల జనుల సమ్మెకు ఎవరు పిలుపునిచ్చారు?
1) తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ
2) తెలంగాణ విద్యావంతుల వేదిక
3) తెలంగాణ రాష్ట్ర సమితి
4) తెలంగాణ ఐక్య వేదిక
98. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్‌సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 2014 ఫిబ్రవరి 3
2) 2014 ఫిబ్రవరి 13
3) 2014 ఫిబ్రవరి 20
4) 2014 మార్చి 1
99. కింది వాటిని కాలానుక్రమంగా అమర్చండి.
ఎ. సకల జనుల సమ్మె
బి. మిలియన్ మార్చ్
సి. సాగర హారం డి. సడక్ బంద్
1) బి, సి, డి, ఎ 2) ఎ, డి, సి, బి
3) ఎ, బి, డి, సి 4) బి, ఎ, సి, డి
100. కింది వాటిలో సరైన ప్రవచనాలేవి?
ఎ. బీఎస్ నారాయణరావు ‘నిమజ్జనం’ సినిమా దర్శకుడు
బి. ‘నిషాంత్’ సినిమా నిర్మాత శ్యాం బెనగల్
సి. ‘ఒక ఊరి కథ’ సినిమా దర్శకుడు మృణాల్ సేన్
డి. ‘మా భూమి’ సినిమా దర్శకుడు బి.నరసింగరావు
1) ఎ, బి 2) బి, డి
3) ఎ, సి 4) ఎ, బి, సి
సమాధానాలు
53-3 54-3 55-3 56-1 57-2 58-4 59-4 60-1 61-4 62-1 63-2 64-2 65-3 66-1 67-3 68-3 69-1 70-1 71-2 72-3 73-4 74-1 75-2 76-3 77-3 78-1 79-2 80-4 81-3 82-4 83-2 84-4 85-1 86-1 87-1 88-1 89-2 90-3 91-4 92-1
93-4 94-3 95-1 96-2 97-1 98-2 99-4 100-3
ఆంజనేయులు
ఫ్యాకల్టీ,ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు