Current Affairs May 03 | జాతీయం
సంరక్షణ కేంద్రాలు
రాజస్థాన్ ప్రభుత్వం మూడు కన్జర్వేషన్ రిజర్వ్‌లను ఏప్రిల్ 24న ప్రకటించింది. బరన్‌లోని సోర్సాన్, జోధ్‌పూర్‌లోని ఖిచాన్, భిల్వారాలోని హమీర్‌గఢ్ ప్రాంతాలను వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా గుర్తించింది. సోర్సాన్ గడ్డిభూములు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కు ఖిచాన్ డెమోయిల్లే అనే జాతి కొంగలకు, హమీర్‌గఢ్ జింకలు, దుప్పులు, పులులు తదితర జంతువులకు నివాసంగా ఉన్నాయి. ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్-1990 ప్రకారం వీటిని సంరక్షణ కేంద్రాలుగా గుర్తించారు.
లాజిస్టిక్ రిపోర్ట్
వరల్డ్ లాజిస్టిక్స్ పనితీరు సూచీ (ఎల్పీఐ)-2023లో భారత్ 38వ స్థానంలో నిలిచింది. 139 దేశాల ఈ 7వ నివేదికను ప్రపంచ బ్యాంక్ ఏప్రిల్ 23న విడుదల చేసింది.
జూపిటర్ బ్యాంక్
నియోబ్యాంకింగ్ స్టార్టప్ జూపిటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లైసెన్స్‌ను ఏప్రిల్ 25న పొందింది. దీంతో కంపెనీ తన సొంత వనరుల నుంచి క్రెడిట్‌ను అందించడానికి వీలు కల్పిస్తుంది. జూపిటర్ ఎలాంటి శాఖలు లేకుండా పూర్తిగా ఆన్లైన్లోనే పనిచేసే డిజిటల్ బ్యాంక్. దీన్ని 2019లో జితేంద్ర గుప్తా ప్రారంభించారు.
గ్లోబల్ గోల్డ్
మహారత్న కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్)కు గ్లోబల్ గోల్డ్ అవార్డు లభించినట్లు అధికారులు ఏప్రిల్ 25న వెల్లడించారు. యూఎస్ మియామిలో గ్రీన్ వరల్డ్ అవార్డ్స్-2023 కార్యక్రమం నిర్వహించారు. పీజీసీఐఎల్ డైరెక్టర్ ఈ అవార్డును అందుకున్నారు. ఒడిశాలోని కలహండి జిల్లా జైపట్నా బ్లాక్‌లోని 10 గ్రామాల్లో వాటర్‌షెడ్, సమాజ భాగస్వామ్యం, మెరుగైన పంట నిర్వహణ పద్ధతుల ద్వారా వ్యవసాయ ఉత్పాదకత, గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడం కోసం పవర్ గ్రిడ్ సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) పనితీరుకు ఈ అవార్డు దక్కింది.
మాణా గ్రామం
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట ఉన్న ‘మాణా’ గ్రామ ప్రవేశ ద్వారం వద్ద భారతదేశపు మొదటి గ్రామం అని రాసి ఉన్న బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 25న ఏర్పాటు చేసింది. భారత్-చైనా సరిహద్దులో ఉన్న ఈ గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రం, చమోలి జిల్లాలోని బద్రీనాథ్ సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతం. దీన్ని ‘టూరిజం విలేజ్’గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం గుర్తించింది. మాణా దేశపు చివరి గ్రామం కాదని, మొదటి గ్రామమని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్ ప్రకారం ఈ గ్రామం సరస్వతి నది ఒడ్డున సముద్ర మట్టానికి 3219 మీటర్ల ఎత్తులో ఉంది.
జీరో షాడో డే
‘జీరో షాడో డే’ అని పిలిచే నీడ కనిపించని ఘటన బెంగళూరులో జరిగింది. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12:18 గంటల నుంచి 3 నిమిషాల పాటు క్రమంగా తగ్గుతూ వచ్చిన నీడ కొన్ని క్షణాల పాటు కనిపించకుండా పోయింది. ఈ జీరో షాడో డే మళ్లీ ఆగస్టు 18న మరోసారి వస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. ఈ ప్రక్రియ ఏడాదికి రెండుసార్లు కనిపిస్తుంది. కర్కటక-మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతాల్లోనే ఇది జరుగుతుంది. జీరో షాడో సమయంలో ఆయా ప్రాంతాల్లోని వస్తువులు ఉన్న అక్షాంశానికి సమాంతరంగా సూర్యుడు వస్తాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు