ECONOMY | పదిరూపాయిల నోటు మీద ఎన్ని భాషలుంటాయి?
ఎకానమీ
1. మహలనోబిస్ నెహ్రూ నమూనాను అనుసరించిన ప్రణాళిక ఏది?
1) మొదటి ప్రణాళిక
2) రెండో ప్రణాళిక
3) మూడో ప్రణాళిక
4) ఐదో ప్రణాళిక
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) 1, 2, 3
2. ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
ఎ) మార్చి 1 బి) ఏప్రిల్ 1
సి) జనవరి 1 డి) జూలై 1
3. VAT ను విశదీకరించండి.
ఎ) Value Available Tax
బి) value Added Tax
సి) Value Advantage Tax
డి) Value After Tax
4. జీరో బేస్డ్ బడ్జెట్ అనగా?
ఎ) ప్రారంభ బడ్జెట్
బి) పునః ప్రారంభ బడ్జెట్
సి) ద్రవ్య బడ్జెట్ డి) ఏదీకాదు
5. Advelorum అంటే?
ఎ) వస్తు విలువ ఆధారంగా పన్ను విధించుట
బి) వస్తువు పరిమాణం ఆధారంగా పన్ను విధించుట
సి) వస్తువు బరువు ఆధారంగా పన్ను విధించుట
డి) పైవన్నీ
6. పురోగామి పన్ను విధానం దోపిడి లాంటిది అన్నవారు ఎవరు?
ఎ) మార్షల్ బి) ఎడ్జివర్త్
సి) జె.ఎస్.మిల్ డి) ఎ.సి. పిగూ
7. ప్రచ్చన్న నిరుద్యోగిత అంటే?
1) అవసరానికి మించి శ్రామికులు ఉండటం
2) వీరి ఉపాంత ఉత్పాదకత శూన్యం
3) అవసరానికి తగిన శ్రామికులు ఉండటం
4) ఇది వ్యవసాయ రంగంలో ఉంటుంది
ఎ) 1 మాత్రమే సరైంది
బి) ఎ, బి
సి) 1, 2, 4 డి) అన్ని సరైనవి
8. కింది వాటిని జతపరచండి
1) ద్రవ్యోల్బణం ఎ) నిరంతర ధరల తగ్గుదల
2) ప్రతి ద్రవ్యోల్బణం బి) నిరంతర ధరల పెరుగుదల
3) రుణాత్మక ద్రవ్యోల్బణం సి) ప్రభుత్వం ధరలు ఉద్దేశపూర్వకంగా తగ్గించుట
4) పునరుల్బణం డి) ప్రభుత్వం ధరలు ఉద్దేశ పూర్వకంగా పెంచుట
ఎ) 1, 2, 3, 4 బి) 2, 1, 3, 4
సి) 1, 2, 4, 3 డి) 4, 3, 2, 1
9. ద్రవ్యోల్బణం ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులను తెలుసుకోవడానికి ఉపయోగపడేది?
ఎ) జాతీయదాయం
బి) వ్యయార్హ ఆదాయం
సి) ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం
డి) తలసరి ఆదాయం
ఎ) 2 బి) 3 సి) 2, 3
డి) పైవన్నీ
10. దీనిపై పెట్టుబడి వల్ల మానవ వనరుల అభివృద్ధి జరుగును?
1) వ్యవసాయం 2) విద్య
3) ఆరోగ్యం 4) గ్రామీణ ప్రాంతాలు
11. ఒక చదరపు కిలోమీటరు వైశాల్యంలో నివసించే వారి సంఖ్యను ఏమంటారు?
ఎ) జన విస్ఫోటనం బి) జనసాంద్రత
సి) జనన పెరుగుదల డి) పైవన్నీ
12. స్త్రీ పురుష నిష్పత్తిలో ఇటీవల సంభవించిన మార్పు
ఎ) స్త్రీలకు అనుకూలం
బి) స్త్రీలకు ప్రతికూలం
సి) స్త్రీ, పురుషులకు అనుకూలం
డి) పురుషులకు అనుకూలం
13. 1921 సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరం అని పిలుచుటకు
ఎ) దేశ విభజన జరిగింది
బి) 1921 వరకు జనాభా పెరుగుదల తగ్గి ఆ తరువాత పెరిగింది
సి) 1921 నుంచి భారత్‌లో అక్షరాస్యత పెరిగింది
డి) 1921 నుంచి స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ
14. ద్రవ్యోల్బణ విరామం అనే భావనతో సంబంధం గల వ్యక్తి?
ఎ) ఆచార్య కెంట్ బి) మార్షల్
సి) జేఎం. కీన్స్ డి) రోస్టోవ్
15. జతపరచండి.
1) పిగూ ఎ) వినియోగదారుని మిగులు
2) మార్షల్ బి) పాత శ్రేయస్సు అర్థశాస్త్రం
3) పారిటో సి) నష్ట పరిహార సూత్రం
4) కాల్దార్ డి) అభిలషణీయ స్థితి
ఎ) 2, 1, 4, 3 బి) 3, 2, 1, 4
సి) 4, 1, 3, 2 డి) 2, 1, 3, 4
16. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది?
ఎ) 1991 బి) 1977
సి) 1956 డి) 1948
17. ద్రవ్య చలామణి వేగం అంటే
ఎ) కొత్తగా ముద్రించిన ద్రవ్యాన్ని చలామణిలోకి తెచ్చే వేగం
బి) కొత్తగా ముద్రించిన ద్రవ్యం నిధుల్లో చేర్చేవేగం
సి) ఇచ్చిన కాలంలో ఒక కరెన్సీ యూనిట్ చేతులు మారే వేగం
డి) పైవన్నీ
18. ద్రవ్యం విలువ
ఎ) ధరల స్థాయికి విలోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది
బి) ధరల స్థాయికి సంబంధం లేక స్వాతంత్య్రంగా ఉంటుంది
సి) ధర స్థాయిలో పత్య్రక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది
డి) పైవేవీకావు
19. పది రూపాయిల నోటు మీద ఎన్ని భాషలుంటాయి?
ఎ) 20 బి) 15 సి) 17 డి) 18
20. నేషనల్ హౌసింగ్ బ్యాంకు దేని ఆధీనంలో ఉంది?
ఎ) ఎస్బీహెచ్ బి) ఆర్బీఐ
సి) ఎల్ఐసీ డి) నాబార్డ్
21. ఫియట్ మనీ అంటే?
ఎ) తాత్కాలికంగా బంగారాన్ని ద్రవ్యంగా అమలు చేయుట
బి) శాశ్వతంగా బంగారాన్ని ద్రవ్యంగా అమలు చేయుట
సి) నిల్వ చేసిన బంగారం
డి) నిల్వ చేసిన ద్రవ్యం
22. ప్రపంచంలో ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థకు మూలం
ఎ) భారత్‌లోని ఆర్యులు
బి) ఇంగ్లండ్‌లోని స్వర్ణ కారులు
సి) ఈజిప్షియన్లు
డి) యూరోపియన్లు
23. జాతీయాదాయం అంటే?
ఎ) ప్రభుత్వ సాలుసరి ఆదాయం
బి) ఆదాయాల మొత్తం
సి) బడ్జెట్ అంచనాలు
డి) పబ్లిక్ సంస్థల ఆదాయం
24. మూల్యహీనీకరణ అంటే?
ఎ) ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరగడం వల్ల ఏర్పడే ద్రవ్యం
బి) ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గడం వల్ల ఏర్పడే ద్రవ్యం
సి) దేశంలో ద్రవ్యబిల్లు
డి) ఏదీకాదు
25. కింది వాటిలో కీన్స్ భావన కానిది ఏది?
ఎ) సార్థక డిమాండ్
బి) ఆదాయ గుణకం
సి) ఉపాంత వినియెగ ప్రవృత్తి
డి) వేగత్వరణం
26. ఆర్థిక మాంద్యాన్ని నివారించుటలో ఎక్కువ సమర్థవంతమైన విధానం?
ఎ) ద్రవ్య విధానం బి) కోశ విధానం
సి) పారిశ్రామిక విధానం
డి) విదేశీ, వ్యాపార విధానం
27. సంప్రదాయక ఆర్థిక వేత్తల ఆర్థిక విశ్లేషణలను తీవ్రంగా విమర్శించినవారు?
ఎ) మార్షల్ బి) కీన్స్
సి) డాల్టన్ డి) సే
28. కింది వాటిలో తప్పును గుర్తించండి?
ఎ) మొదటి ప్రణాళిక 1951-56
బి) రెండో ప్రణాళిక 1956-61
సి) మూడో ప్రణాళిక 1961-66
డి) నాలుగో ప్రణాళిక 1966-71
29. పంచవర్ష ప్రణాళికలు సాధారణంగా?
ఎ) స్వల్పకాలిక ప్రణాళికలు
బి) మధ్యకాలిక ప్రణాళికలు
సి) దీర్ఘకాలిక ప్రణాళికలు
డి) ఏదీకాదు
30. తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి?
ఎ) హజారి కమిటీ పరిశ్రమల లైసెన్సింగ్
బి) రంగరాజన్ – షేర్ల ఉపసంహరణ
సి) ఓంకార్ గోస్వామి ఎంఆర్టీపీ చట్టం
డి) అర్జున్ సేన్ గుప్తా ప్రభుత్వరంగ సంస్థలపై కమిటీ
31. కిందివాటిలో ఏవి ద్రవ్య గుణకం యొక్క విలువను నిర్ధారించును?
1) వాణిజ్యబ్యాంకుల అధిక రిజర్వ్ నిష్పత్తి
2) ప్రజల కరెన్సీ నిష్పత్తి
3) కేంద్ర బ్యాంక్ వద్ద కావల్సిన రిజర్వ్ నిష్పత్తి
ఎ) 1 బి) 1, 2
సి) 2, 3 డి) పైవన్నీ
32. ద్విపక్ష ఏకస్వామ్యం అంటే
ఎ) ఒకే ఒక అమ్మకం దారుడు ఉండటం అని అర్థం
బి) ఒకే ఒక కొనుగోలు దారుడు ఉండటం అని అర్థం
సి) ఒక అమ్మకం దారుడు, ఒక కొనుగోలు దారుడు ఉన్న మార్కెట్ అని అర్థం
డి) ఏదీకాదు
33. కింది పారిశ్రామిక విత్త సంస్థల ప్రారంభ సరైన క్రమం గుర్తించండి?
1) ఐఎఫ్సీఐ 2) ఐసీఐసీఐ
3) ఐఆర్బీఐ 4 ఐడీబీఐ
ఎ) 2, 3, 1, 4 బి) 4, 3, 1, 2
సి) 1, 2, 3, 4 డి) 1, 2, 4, 3
34. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పరిశోధనా కేంద్రం గల నగరం?
ఎ) మద్రాస్ బి) కలకత్తా
సి) న్యూఢిల్లీ డి) నాగపూర్
35. భారతదేశంలో భూ సంస్కరణలు?
ఎ) విజయవంతం అయినవి
బి) విఫలమైనవి
సి) కొంత వరకు విజయవంతమైనవి
డి) పైవన్నీ
36. వాల్యూ&క్యాపిటల్ గ్రంథరచయిత ఎవరు?
ఎ) ఫిలిప్స్ బి) హిక్స్
సి) హెన్సన్ డి) కీన్స్
37. ద్రవ్యోల్బణం అన్యాయమైనది, ప్రతి ద్రవ్యోల్బణం అయుక్తమైనది అని ఎవరన్నారు?
ఎ) అమర్త్యసేన్
బి) జే.ఆర్. హిక్స్
సి) శామ్యూల్ సన్ డి) జె.ఎం. కీన్స్
38. జండర్ బడ్జెట్ అనే పదానికి సరైన అర్థం?
ఎ) ఇది మహిళలకు మాత్రమే సంబంధించిన ప్రత్యేక బడ్జెట్
బి) ఇది పురుషులకు మాత్రమే సంబంధించిన ప్రత్యేక బడ్జెట్
సి) ఇది లింగ వివక్షతకు సంబంధించిన సాధనం
డి) లింగ వివక్షతను తగ్గించి మహిళా సాధికారతను ప్రోత్సహించే సాధనం
39. విచక్షణాత్మక ఏకస్వామ్యం అనే భావన గురించి తెలిపిన ఆర్థికవేత్త ఎవరు?
ఎ) చాంబర్లిన్ బి) మార్షల్
సి) పీగూ డి) జోన్ రాబిన్సన్
40. కింది ఏ ప్రణాళికను శూన్య విదేశీ సాయం గల ప్రణాళిక అంటారు?
ఎ) 9వ బి) 10వ
సి) 11వ డి) 12వ
41. లాఫర్ రేఖ అనేది?
ఎ) ఆదాయ అసమానతలను కొలుస్తుంది
బి) పన్నురేటుకి పన్ను రాబడికి మధ్యగల సంబంధాన్ని తెలియజేస్తుంది
సి) ద్రవ్యోల్బణానికి వేతన పెరుగుదలకు మధ్యగల సంబంధాన్ని తెలియజేస్తుంది.
డి) పైవేవీకాదు
42. కిందివాటిలో హరిత సూచీలోని అంశాల్లో లేనిది ఏది?
ఎ) ఉత్పత్తి చేయబడ్డ ఆస్తులు
బి) మానవ వనరులు
సి) సహజ వనరులు
డి) సాంకేతిక పరిజానం
43. పారిశ్రామిక రంగాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు?
1) ద్వితీయరంగం 2) గౌణరంగం
3) తృతీయరంగం 4) సేవారంగం
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) 1, 2, 4
44. విక్రయం కాగల మిగులు కమతాలకు ముఖ్యకారణం?
ఎ) ఆహార పంటలు
బి) వాణిజ్య పంటలు
సి) ఎ & బి డి) ఏవీకావు
45. నాబార్డ్ బ్యాంకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) ఆర్బీఐ గవర్నర్
బి) ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్
సి) ఆర్థిక మంత్రి
డి) గవర్నర్
46. కింది పన్నుల సంస్కరణల కమిటీలను సరైన వరుస క్రమంలో అమర్చండి?
1) కాల్దార్ కమిటీ
2) భూత లింగం కమిటీ
3) కె.ఎన్ వాంఛూ కమిటీ
4) మత్తయ్య కమిటీ
ఎ) 1, 2, 3, 4 బి) 4, 2, 1, 3
సి) 4, 3, 1, 2 డి) 4, 1, 2, 3
47. stylised facts గ్రంథ రచయిత ఎవరు?
ఎ) రాబిన్సన్ బి) కాల్దార్
సి) హిక్స్ డి) హరడ్
48. జతపరచండి?
1) 3వ ఆర్థిక సంఘం ఎ) కె.సి.పంత్
2) 6వ ఆర్థిక సంఘం బి) జె.ఎం. షేలత్
3) 7వ ఆర్థిక సంఘం సి) కాసు బ్రహ్మానందరెడ్డి
4) 10వ ఆర్థిక సంఘం డి) ఎ.కె. చందా
ఎ) 4, 3, 2, 1 బి) 3, 4, 2, 1
సి) 3, 2, 1, 4 డి) 2, 3, 4, 1
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు