సంపూర్ణ వికాసానికి, అభ్యసనా సామర్థ్యాలకు పునాది శిశు ఉద్దీపన
గర్భస్థ శిశువు వికాసం, లక్షణాలు, శిశుఉద్దీపనం, వికాసంలో క్రీడల పాత్ర
సంయుక్త బీజదశలో ఫలదీకరణం నుంచి 2వ వారం వరకు సాధారణంగా కొన్ని లక్షణాలు గోచరిస్తాయి. పరిమాణంలో పెద్దగా మార్పులుండవు కానీ అంతర్గతంగా వృద్ధి ఉంటుంది. ఫాలోపియన్ ట్యూబ్‌లో ఫలదీకరణం జరుగుతుంది. ఫలదీకరణం చెందిన 10 రోజుల తరువాత ఫాలోపియన్ ట్యూబ్ నుంచి పయనించి గర్భాశయంలో స్థిరపడుతుంది. సంయుక్త బీజం స్థిరపడేంత వరకు స్వయంపోషణపై ఆధారపడి తరువాత తల్లిపై ఆధారపడుతుంది.
పిండదశలో కనిపించే ప్రముఖ లక్షణాలు
- రెండు వారాల నుంచి 2 నెలల వరకు ఉన్న దశను పిండదశ అంటారు.
- ఈ దశలో పిండంలో అంతర్గత, బహిర్గత లక్షణాలు మార్పులకు లోనవుతాయి
- ఈ దశలోనే లైంగిక అవయవాలు వృద్ధి చెందుతాయి
- ఈ దశలో ఒక ఔన్స్ బరువు ఉంటుంది
- జరాయువు, Umbrical Card,గర్భాశయ ద్రవాలు పూర్తి స్థాయిలో వృద్ధి చెందుతాయి
భూృణ దశలో కనిపించే లక్షణాలు
రెండో నెల నుంచి జన్మించే వరకు ఉన్నసమయాన్ని భూృణ దశ అంటారు
అవయవాలు 5వ నెల నుంచి ఏర్పడతాయి
నాడీ కణాలు రెండవ నెల నుంచి అభివృద్ధి చెందుతాయి
Fetal Activity 2వ నెల నుంచి ప్రారంభమవుతుంది
గర్భస్థ పూర్వ అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు
- తల్లి పోషణ స్థాయి
- తల్లి శారీరక, మానసిక స్థాయిలు
- మద్యపానం, మాదక ద్రవ్యాల అలవాట్లు
- తల్లి వయస్సు, ఉద్వేగ స్థాయిలు
- తరచూ X-Ray అణుధార్మికతకు లోనయ్యే పరీక్షలు చేయించడం
- తల్లి Immunization
- తల్లి Rh కారకం
- తల్లిలో హార్మోన్ల స్థాయిలు
- గర్భాశయం నిర్మాణం, పనితీరు
కవలలు
- ఫలదీకరణంలోనే శిశువు భవిష్యత్తు వికాసం నిర్ధారించబడుతుంది. స్త్రీ, పురుష లైంగిక బీజాల కలయికనే ఫలదీకరణం అంటారు.
- ఫలదీకరణ సమయంలోనే కుటుంబంలో శిశువు క్రమం, వారసత్వ లక్షణాలు, శిశువు లింగ నిర్ధారణ జరుగుతుంది. ఫలదీకరణ విధానం ఆధారంగానే శిశువుల సంఖ్య కూడా నిర్ధారిస్తారు.
- ఫలదీకరణ ఫలితంగా తల్లి నుంచి 22 + X క్రోమోజోమ్‌లు, తండ్రి నుంచి 22 + X లేదా Y క్రోమోజోమ్‌తో కూడిన సంయుక్త బీజం ఏర్పడుతుంది
కవలలు ప్రధానంగా రెండు రకాలు
- సమరూప కవలలు
- అసమరూప కవలలు
- ఒకే సంయుక్త బీజం నుంచి జన్మించిన కవలలను సమరూప కవలలు అంటారు. వీరిలో జన్యుపరమైన నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి సమరూప కవలలుగా ఇద్దరు మగశిశువులు లేదా ఆడ శిశువులుగా జన్మిస్తారు.
- రెండు అండాలు, రెండు శుక్రకణాలు వేర్వేరుగా ఫలదీకరణం చెందడం వల్ల రెండు స్వతంత్ర సంయుక్త బీజాలు వృద్ధి చెంది ఉద్భవించే కవలలను అసమరూప కవలలు అంటారు. వీరిలో జన్యుపరమైన నిర్మాణం ఒకే రకంగా ఉండదు.
- ఒకే ప్రసవంలో ఒకటి కంటే ఎక్కువ మంది శిశువుల జననాన్నే ‘Multiple Births’ అంటారు.
- మల్టిపుల్ జననాలు జరిగినప్పుడు వికాసంలో ఆలస్యం కనిపిస్తుంది లేదా వికాసం నెమ్మదిగా జరుగుతుంది.
కవలల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు - వికాస ప్రక్రియ ఆలస్యంగా జరుగుతుంది, శారీరక పెరుగుదలలో లోటుపాట్లు
- బౌద్ధిక వికాస లోపాలు, ప్రవర్తనా సమస్యలు అధికంగా ఉంటాయి.
- గర్భావధి కాలం ముగియక ముందే ప్రసవం జరగడం, కృత్రిమ ప్రసవం చేయవలసి రావడం జరగవచ్చు.
- కుటుంబంలో శిశువు పుట్టుక క్రమం ఆధారంగా శిశువు లక్షణాలు కింది విధంగా ఉండవచ్చు
- ముందు జన్మించిన పిల్లవాడిలో అభద్రతా భావం, నమ్మకం లేకపోవడం, బాధ్యతగా ఉండటం, అసూయ, అధికారం ప్రదర్శించడం, పిరికితనం, ఏదైనా సాధించాలనే సంకల్పం, ప్రవర్తనా సమస్యల బారిన పడటం వంటి లక్షణాలు ఉండవచ్చు.
- కుటుంబంలో రెండవ శిశువుకు సాధారణంగా స్వేచ్ఛ, దూకుడుతత్వం, బహిర్ వర్తనం, స్నేహశీలత, సాహసగుణం, ఆధారపడే తతం వంటి లక్షణాలుండవచ్చు.
- మధ్య శిశువుకు ప్రేమ, ఆరాధన, న్యూనత వంటి లక్షణాలుంటాయి
- చివరి శిశువునకు భద్రతా భావం, సమయస్ఫూర్తి, జాలి, అసూయ, పరిణతి చూపలేకపోవడం వంటి లక్షణాలుంటాయి
- చర్యలను ప్రేరేపించే లేదా చర్యలకు కారణమయ్యే కారకాలను ఉద్దీపనలు అంటారు.
- ఉద్దీపనను బట్టి ప్రవర్తనలు ఏర్పడతాయి. ఇలా ఉద్దీపనకు గురిచేసే కారకాలను స్టిములెంట్స్ అంటారు. వయస్సు పెరిగేకొద్ది ఉద్దీపనల సంఖ్యలు కూడా పెరుగుతుంది.
- ఉద్దీపన అభ్యసనను ప్రేరేపించే లేదా ఉద్దీపనానికి గురిచేసే వారిలో శబ్దం, స్పర్శ, రుచి, రంగు, వాసనలకు సంబంధించిన జ్ఞానాన్ని పరిచయం చేస్తూ వృద్ధి చెందడాన్నే శిశు
ఉద్దీపనం అంటారు. - పై అంశాలతో పాటు భాషను, సైగలను, సోషల్ అటాచ్మెంట్, మానసిక, శారీరక నైపుణ్యాలు, చలన వికాసాలను కూడా పరిచయం చేస్తూ వృద్ధి చేయవచ్చు.
- శిశు ఉద్దీపన కార్యక్రమాల వల్ల శిశువులలో కుతూహలం ఏకాగ్రతలతో పాటు నాడీ వ్యవస్థ ప్రతిస్పందనలు వృద్ధి చెందుతాయి
- తల్లిదండ్రులకు, శిశు వికాస సంబంధిత సిబ్బంది, శిశువులకు మధ్య ఉద్దీపనలతో కూడిన పరస్పర చర్యలుండాలి.
- ఉద్దీపన చర్యల ముఖ్య ఉద్దేశం శిశువుకు ఇంతకుముందు అనుభవంలో లేనటువంటి అంశాలను పరిచయం చేస్తూ వారిలో ప్రతిచర్యలను విస్తృతం చేస్తూ తన చుట్టూ ఉండే పర్యావరణానికి సర్దుబాటు అయ్యేలా చేయడం.
- శిశువు వయస్సును బట్టి ఉద్దీపన విధానాలు, పరికరాలు, వస్తువులు ఉంటాయి
- ఉద్దీపన కార్యక్రమాల ప్రాముఖ్యతను కింది విధంగా అర్థం చేసుకోవచ్చు
- శిశువు సరైన వృద్ధికి, వికాసానికి తోడ్పడుతుంది.
- బౌద్ధిక కుతూహలం వృద్ధి చెందుతుంది
- భాషా నైపుణ్యాల వృద్ధి, వికాసం జరుగుతుంది
- దృక్పథాలు ఏర్పడతాయి 5. సామాజిక సంతృప్తి, మానసిక ఆనందం,సంతోషం కలుగుతుంది
- సంపూర్ణ వికాసానికి దోహదపడుతుంది. అభ్యసనా సామర్థ్యాలకు సంబంధించిన పునాదులు ఏర్పడతాయి.
శిశు ఉద్దీపనకు సంబంధించి ఆచరించవలసిన సూత్రాలు, విధానాలు - శిశువుకు, తల్లిదండ్రులకు ఆనందాన్ని,ఆహ్లాదాన్ని అందించే విధంగా ఉండాలి
- స్వచ్ఛమైన ప్రేమ, వాత్సల్యంతో కూడినవై ఉండాలి.
- Get to Know your Baby ని పాటించాలి
- శిశువుతో ఆనందించాలి
- సరైన సమయంలో అందించాలి
- దృష్టికి సంబంధించిన క్రియలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి (నవజాత శిశువు 8 నుంచి 10 ఇంచుల వరకే దృష్టిని నిలుపగలదు)
- కదలికలు, రంగులు, శబ్దాలకు సంబంధించిన అనుభవాలు కల్పించాలి
- అద్దాలు, మ్యూజిక్ బాక్స్‌లు, ఆట వస్తువులు, కదిలే బొమ్మలు, శబ్దాలు చేసేవి వినియోగించాలి.
- కూర్చోబెట్టడం, పట్టుకోవడం, బోర్లాపడటం వంటివి ప్రోత్సహించాలి
- సూక్ష్మ చలన వికాసానికి సంబంధించి వస్తువులను పట్టుకునేలా శిక్షణ ఇవ్వాలి
- భాషకు సంబంధించి శిశువు చేసే శబ్దాలను అనుకరించి ప్రోత్సహించాలి
- సామాజిక వికాసానికి సంబంధించి సోషల్ టాయ్స్, సోషల్ స్మైల్ వంటివి ప్రోత్సహించాలి
- నిలబెట్టడం, కూర్చోబెట్టడం, ఒడిలో కూర్చోబెట్టుకోవడం, వస్తువులను నెట్టేలా, లాగేలా తర్ఫీదునివ్వడం, జారేవి, కదిలేవి వంటి వస్తువులతో శిక్షణ ఇవ్వడం
- శిశువును గిలిగింతలు పెట్టాలి, కళ్లలోకి చూడాలి, శిశువు చేసే చర్యలను అనుకరించాలి
ICDS, NIPCCD సూచించిన ఉద్దీపన క్రియలు
- 0 నుంచి 6 నెలల మధ్య వయస్సు ఉన్న శిశువుల కోసం కింది క్రియలు చేపట్టాలి
- గిలిగింతలు వంటి వాటితో శారీరక, చలన ఉత్ప్రేరకం జరుగుతుంది.
- అరచేతులకు, వేళ్లకు వస్తువులను పట్టుకునేలా శిక్షణను ఇవ్వాలి
- జోలపాటలతో ప్రేరేపించాలి
- శిశువు చర్యలకు, నవ్వుకు పెద్దవారు ప్రతిస్పందించాలి
- శిశువు చేసే అర్థరహిత శబ్దాలను గమనించి తదనుగుణంగా శిశువుకు అర్థమయ్యేలా ప్రతిస్పందించాలి.
- రంగుల బొమ్మలు సాధారణ బొమ్మల కంటే ఎక్కువగా, కదిలే, శబ్దం చేసే బొమ్మలు శిశువును ఎక్కువగా ప్రేరేపిస్తాయి.
- 12 నెలల వయస్సున్న పిల్లల కోసం Pillow games, Mourning Toys వంటివి వినియోగించాలి.
ప్రాక్టీస్ బిట్స్
1. కోల్బర్గ్ సిద్ధాంత ప్రకారం సమాజం కోసం ఏ దశలో నైతికతను అనుసరిస్తారు?
ఎ. పూర్వ సంప్రదాయ స్థాయి
బి. సంప్రదాయ స్థాయి
సి. ఉత్తర సంప్రదాయ స్థాయి
డి. ఎ, బి
2. కోల్బర్గ్ సిద్ధాంత ప్రకారం ఏ దశలో భౌతిక పరిణామాల ఆధారంగా నియమాల అనుసరణ జరుగుతుంది?
ఎ. పూర్వ సంప్రదాయ స్థాయి
బి. సంప్రదాయ స్థాయి
సి. ఉత్తర సంప్రదాయ స్థాయి
డి. బి, సి
3. సంజ్ఞానాత్మకత అంటే?
ఎ. ఆలోచన బి. వివేచన
సి. ప్రత్యక్షం డి. పైవన్నీ
4. శిశువులో వస్తు స్థిరత్వ భావన ఎప్పుడు కలుగుతుంది?
ఎ. 6-8 నెలల మధ్య
బి. 8-12 నెలల మధ్య
సి. 12-18 నెలల మధ్య
డి. 12-24 నెలల మధ్య
5. శిశువులో పదిల పరుచుకునే భావన ఎప్పుడు ఆరంభమవుతుంది?
ఎ. మూర్త ప్రచాలక దశ
బి. అమూర్త ప్రచాలక దశ
సి. అంతర్ బుద్ధి దశ
డి. భావనాత్మక దశ
6. ఎరిక్సన్ ప్రకారం నమ్మకం (లేదా) అపనమ్మకం అనే సందిగ్ధత శిశువులో ఏ దశలో కనిపిస్తుంది?
ఎ. పూర్వ శైశవం
బి. ఉత్తర శైశవం
సి. క్రీడ దశ
డి. కౌమార దశ
జవాబులు
1.బి 2.ఎ 3.డి 4.బి 5.ఎ 6.ఎ
-మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ,సోషియాలజీ డిపార్ట్మెంట్ సౌజన్యంతో..
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు