హెల్మెట్ల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం?
(నవంబర్ 16 తరువాయి)
65. ఇమిటేషన్ జ్యూవెలరీలో ఉపయోగించే నికెల్-సిల్వర్‌లో లేని లోహం ఏది?
ఎ) కాపర్ బి) నికెల్
సి) జింక్ డి) సిల్వర్
66. క్యాన్సర్ నయం చేయడానికి ఉపయోగించే ప్లాటినం సమ్మేళనం?
ఎ) సిస్-ప్లాటిన్ బి) ట్రాన్స్-ప్లాటిన్
సి) ప్లాటినం-క్లోరైడ్ డి) ప్లాటినం ఫ్లోరైడ్
67. ఎరుపు రంగులో ఉండే కెంపులో ప్రధానంగా ఉండే అల్యూమినియం ట్రైఆక్సైడ్తో పాటు స్వల్పంగా ఉండే మలినం?
ఎ) క్రోమియం బి) మాంగనీస్
సి) కోబాల్ట్ డి) కాపర్
68. ఫ్లాష్ బల్బులలో ఉపయోగించే అధిక కాంతిని వెదజల్లే వైర్లను ఏ లోహంతో తయారుచేస్తారు?
ఎ) సిల్వర్ బి) మెగ్నీషియం
సి) రాగి డి) అల్యూమినియం
69. పుష్యరాగం, మాణిక్యం ఏ లోహ సమ్మేళనాలు?
ఎ) కోరండమ్ బి) రాగి
సి) బంగారం డి) వెండి
70. దంతాలలో రంధ్రాలను నింపడానికి ఉపయోగించే మిశ్రమలోహంలో ఉండే లోహాలు?
1. సిల్వర్ 2. టిన్
3. మెర్క్యూరీ 4. జింక్
ఎ) 1 బి) 1, 3
సి) 1, 2, 3 డి) అన్నీ
71. అగ్గిపుల్ల తలలోని మండే పదార్థం?
ఎ) యాంటిమొని సల్ఫైడ్
బి) పాస్ఫరస్
సి) సల్ఫర్ డి) పొటాషియం
72. భూపటలంలో లభించే కింది మూలకాలు అవరోహణ క్రమంలో ఆక్సిజన్(O),
సిలికాన్(Si), ఇనుము(Fe), అల్యూమినియం(Al)
ఎ) O, Si, Fe, Al బి) O, Si, Al, Fe
సి) Fe, Al, Si, O డి) O, Fe, Al, Si
73. మెర్క్యూరీ ఓజోన్‌తో సంపర్కంలోకి వచ్చినప్పుడు అది తన ద్రవ వక్రతలాన్ని కోల్పోయి గాజు పాత్రలకు అంటుకుంటుంది. ఈ ధర్మాన్ని ఏమంటారు?
ఎ) టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ
బి) అన్నీలింగ్ ఆఫ్ మెర్క్యూరీ
సి) హీలింగ్ ఆఫ్ మెర్క్యూరీ
డి) రైపెనింగ్ ఆఫ్ మెర్క్యూరీ
74. సముద్రపు నీటి నుంచి తీసే లోహం?
ఎ) బంగారం బి) సిల్వర్
సి) మెగ్నీషియం డి) మెర్క్యూరీ
75. చాక్లెట్లలో ఉండే హానికర లోహం?
ఎ) నికెల్ బి) కోబాల్ట్
సి) రాగి డి) ఐరన్
76. వెన్నలాగా చేతిలో వేస్తే కరిగిపోయే లోహం?
ఎ) పాదరసం బి) గాలియం
సి) సోడియం డి) పొటాషియం
77. జతపరచండి.
ఎ. మిరుమిట్లు 1. స్ట్రాన్షియం
గొలిపే తెలుపు
బి. సింధూర ఎరుపు 2. బేరియం
సి. ఆకుపచ్చ 3. మెగ్నీషియం
డి. సోడియం 4. పసుపు
ఎ) ఎ-1, బి-3, సి-2, డి-4
బి) ఎ-4, బి-3, సి-1, డి-2
సి) ఎ-3, బి-1, సి-2, డి-4
డి) ఎ-3, బి-1, సి-4, డి-2
78. ఆర్థోపెడిక్ పరికరాల తయారీలో ఉపయోగించే లోహం?
ఎ) ఐరన్ బి) సిల్వర్
సి) టాంటలం డి) టైటానియం
79. పొగ గొట్టాల ఉత్ప్రేరక పరివర్తనకారులలో ఉపయోగించే లోహం?
ఎ) సిల్వర్ బి) గోల్డ్
సి) ప్లాటినం డి) ఐరన్
80. రంధ్రాలు చేయడానికి ఉపయోగించే డ్రిల్ తయారీకి ఉపయోగించే లోహం?
ఎ) వజ్రం బి) టంగ్స్టన్ కార్బైడ్
సి) కాల్షియం కార్బైడ్ డి) గ్రాఫైట్
81. మనిషి రక్తం pH విలువ?
ఎ) 3 బి) 6 సి) 7.4 డి) 13
82. సోడానీటిలో ఉండే ఆమ్లం?
ఎ) ఎసిటిక్ ఆమ్లం
బి) కార్బోనిక్ ఆమ్లం
సి) నైట్రస్ ఆమ్లం
డి) నైట్రిక్ ఆమ్లం
83. ఆర్థరైటిస్ వ్యాధి నయం చేయడానికి ఉపయోగించే ఆయుర్వేద ఔషధంలో ఉపయోగించే లోహం?
ఎ) సోడియం బి) బంగారం
సి) పాదరసం డి) ఇనుము
84. రక్తహీనతతో బాధపడేవారి ఆహారంలో ఉండవలసిన లోహం?
ఎ) రాగి బి) ఇనుము
సి) బంగారం డి) వెండి
85. మిర్రర్ల కళాయిపూతతో ఉండే లోహం?
ఎ) అల్యూమినియం బి) వెండి
సి) బంగారం డి) రాగి
86. ఇనుము తుప్పు పట్టడానికి సంబంధించిన సరైన వాక్యం?
1. తేమ గల సముద్రపు తీరప్రాంతంలో
తేలికగా తుప్పుపడుతుంది
2. తుప్పు పట్టడం ఆక్సీకరణ చర్య
3. ఫెర్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది
4. తుప్పుపట్టకుండా ఉండటానికి జింక్ వంటి లోహాలతో పూతపూస్తారు
ఎ) 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) అన్నీ
87. నార్కో అనాలసిస్ పరీక్షల్లో ఉపయోగించే రసాయనాలు?
ఎ) సోడియం పెంటథాల్
బి) సోడియం అమైటాట్
సి) ఎ, బి
డి) సోడియం కార్బమైడ్
88. హెల్మెట్ల తయారీలో ఉపయోగించే మిశ్రమలోహం?
ఎ) మాంగనీస్ స్టీల్ బి) టంగ్స్టన్ స్టీల్
సి) క్రోమ్ స్టీల్ డి) మానెల్ మెటల్
89. మానవుడి ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమైన మూలకం?
ఎ) వెండి బి) ఐరన్
సి) మాంగనీస్ డి) సోడియం
90. జతపరచండి.
ఎ. హిమోగ్లోబిన్ 1. ఐరన్
బి. క్లోరోఫిల్ 2. కోబాల్ట్
సి. విటమిన్ బి12 3. కార్బన్
డి. వజ్రం 4. మెగ్నీషియం
ఎ) ఎ-1, బి-3, సి-2, డి-4
బి) ఎ-1, బి-4, సి-2, డి-3
సి) ఎ-4, బి-1, సి-2, డి-3
డి) ఎ-3, బి-1, సి-4, డి-2
91. ఐరన్‌పై జింక్ పూతకు సంబంధించిన సరైన వాక్యం?
ఎ) ఇనుము క్షయాన్ని నివారిస్తుంది
బి) ఈ ప్రక్రియను గాల్వనైజేషన్ అంటారు
సి) జింక్ క్రియాశీతల ఎక్కువ కాబట్టి, ఇది క్షయం చెంది ఐరన్‌ను పరిరక్షిస్తుంది
డి) అన్నీ సరైనవే
కేంద్రక రసాయనశాస్త్రం
1. కేంద్రక చర్యల్లో పాల్గొనని కణాలు?
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు డి) బి, సి
2. కేంద్రక పరిమాణాన్ని సూచించే ఒక ఫెర్మి అంటే?
ఎ) 10-10 cm బి) 10-10 m
సి) 10-13 m డి) 10-13 cm
3. కింది వాటిలో కేంద్రక కణాలు ఏవి?
ఎ) ప్రొటీన్ బి) న్యూట్రాన్
సి) ఎలక్ట్రాన్ డి) ఎ, బి
4. రేడియోధార్మికత గల కేంద్రకాలు స్వచ్ఛందంగా విడుదల చేసే కణాలు?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) అన్నీ
5. అత్యంత శక్తిమంతమైన విద్యుదయస్కాంత వికిరణ కణాలు?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) రేడియో
6. రేడియో ధార్మికతను కనుగొన్నది?
ఎ) ఫెర్మి బి) మేరీక్యూరీ
సి) హెన్రీ బెక్వరల్ డి) రూథర్‌ఫర్డ్
7. ఆల్ఫా కణాలు ఏ కేంద్రకాన్ని సూచిస్తాయి?
ఎ) హైడ్రోజన్ బి) రేడియం
సి) హీలియం డి) యురేనియం
8. క్యాన్సర్ చికిత్సను రేడియోథెరపీలో ఉపయోగించే కణాలు?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) రేడియో
9. రేడియోధార్మికత నుంచి రక్షించడానికి ఉపయోగించే కవచాలను ఏ లోహంతో తయారుచేస్తారు?
ఎ) బంగారం బి) సీసం
సి) స్టీల్ డి) వెండి
10. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకిలపై వేసిన పరమాణు బాంబుల పేర్లు వరుసగా?
ఎ) లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్
బి) లిటిల్ బాయ్, బిగ్‌మ్యాన్
సి) లిటిల్ బాయ్, స్ట్రాంగ్ బాయ్
డి) లీన్బాయ్, ఫ్యాట్ బాయ్
11. పరమాణుబాంబు సృష్టికర్తలు?
ఎ) ఒట్టోహాన్, స్ట్రాస్‌మన్
బి) మేరీక్యూరీ, లిటిల్ క్యూరీ
సి) రూథర్ ఫర్డ్, చాడ్విక్
డి) థామ్సన్, రూథర్‌ఫర్డ్
12. పరమాణుబాంబు ప్రధాన సూత్రం?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి
బి) కేంద్రక సంలీనం
సి) రసాయన సంయోగం
డి) రసాయన వియోగం
13. కేంద్రక విచ్ఛిత్తిలో పాల్గొనే ప్రధాన భారకేంద్రకాలు?
ఎ) యురేనియం-235
బి) యురేనియం-232
సి) ప్లుటోనియం-239 డి) ఎ, సి
14. అణురియాక్టర్లను ఉపయోగించి అణువిద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రక్రియ గురించి సరైన వాక్యం?
1. నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి చర్య
2. న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి ‘గ్రాఫైట్’ లేదా ‘భారజలాన్ని’ మితకారిగా
ఉపయోగిస్తారు
3. కాడ్మియం లేదా బోరాన్ కడ్డీలను
న్యూట్రాన్లను శోషించుకోవడానికి
ఉపయోగిస్తారు
4. బ్రీడర్ రియాక్టర్లలో విచ్ఛిన్నశీలత లేని యురేనియం-238ను ఉపయోగించుకొని విచ్ఛిన్నశీలత గల ప్లుటోనియం-239 ఉత్పత్తి జరుగుతుంది
ఎ) 1 బి) 1, 2
సి) 1, 2, 3 డి) అన్నీ
15. భారతదేశంలో విస్తారంగా లభించే మోనోజైట్ ఇసుక నుంచి లభించే మూలకం?
ఎ) యురేనియం బి) థోరియం
సి) ప్లుటోనియం డి) రేడియం
16. థోరియంను న్యూట్రాన్లతో పేల్చివేస్తే వచ్చే కేంద్రకం?
ఎ) యురేనియం-233
బి) యురేనియం-235
సి) భారజలం డి) ప్లుటోనియం
17. చెట్లు, కలప ఆధారిత నిర్మాణాల వయస్సును నిర్ధారించే పద్ధతి?
ఎ) రేడియో కార్బన్ డేటింగ్
బి) రేడియో హైడ్రోజన్ డేటింగ్
సి) రేడియో యురేనియం డేటింగ్
డి) ఎ, బి
18. రేడియో కార్బన్ డేటింగ్‌కు ఆధారమైన కేంద్రకం?
ఎ) C-12 బి) C-13
సి) C-14 డి) U-238
19. సూర్యుడితో పాటు ఇతర నక్షత్రాలకు శక్తి మూలాధారం?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి బి) కేంద్రక సంలీనం
సి) కేంద్రక వ్యాకోచం
డి) కేంద్రక సంకోచం
20. అణువిద్యుత్తుకు ఆధారమైన మూలకాలు?
ఎ) యురేనియం బి) థోరియం
సి) ప్లుటోనియం డి) అన్నీ
21. దేనిలో కేంద్రక సంలీనం అనే సూత్రం ఇమిడి ఉంది?
ఎ) అణువిద్యుత్తు
బి) సూర్యుడిలోని అపారమైన శక్తి
సి) హైడ్రోజన్ బాంబు
డి) బి, సి
22. టెర్రరిస్టులు స్మగ్లింగ్ చేసే ‘యెల్లో కేక్’ అంటే?
ఎ) కూల్ కేక్ బి) ప్లమ్‌కేక్
సి) యురేనియం ఆక్సైడ్
డి) థోరియం
23. శ్రేష్టమైన అణుఇంధనం ఏది?
ఎ) యురేనియం-238
బి) ప్లుటోనియం-239
సి) నెప్ట్యూనియం
డి) థోరియం-236
24. కేంద్రక సంలీన చర్యల్లో పాల్గొనే అతి తేలికైన కేంద్రకం, చివరగా వచ్చే కేంద్రకం వరుసగా?
ఎ) హైడ్రోజన్, హీలియం
బి) హైడ్రోజన్, లిథియం
సి) హీలియం, లిథియం
డి) కార్బన్, నైట్రోజన్
25. సరైన వాక్యాలను గుర్తించండి.
1. కోబాల్ట్-60 నుంచి ఉత్పత్తి అయిన గామా కిరణాలను ఉపయోగించి రేడియో థెరపీ చేస్తారు
2. కూరగాయలను, విత్తనాలను ఎక్కువ
రోజులు నిల్వచేయడానికి; క్రిమిరహితం
చేయడానికి గామా కిరణాలను ఉపయోగిస్తారు
3. మెదడులోని కణతులను గుర్తించడానికి, థైరాయిడ్ చికిత్సలో అయోడిన్-131ను ఉపయోగిస్తారు
4. రేడియోధార్మిక సోడియం-24ను
ఉపయోగించి రక్తసరఫరాలో కలిగే
అడ్డంకులను అధ్యయనం చేస్తారు
5. శిలల వయస్సు నిర్ధారణకు ‘యురేనియం డేటింగ్’ అనే పద్ధతిని ఉపయోగిస్తారు
ఎ) 1, 2 బి) 1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) అన్నీ
26. జతపరచండి.
ఎ. 4n 1. థోరియం
బి. 4n+1 2. నెప్ట్యూనియం
సి. 4n+2 3. యురేనియం
డి. 4n+3 4. ఆక్టీనియం
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
27. రేడియోధార్మికత అనేది కింది వాటిలో దేని ధర్మం?
ఎ) పరమాణు కేంద్రకం బి) X-కిరణాలు
సి) UV-కిరణాలు డి) ఎలక్ట్రాన్లు
28. దేశంలో భారజల ఉత్పత్తి ఉన్న కేంద్రాలు?
ఎ) నంగల్ బి) మణుగూరు
సి) కల్పకం డి) అన్నీ
29. థోరియం నిల్వలు తక్కువగా ఉన్న ప్రాంతం?
ఎ) ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం
బి) తెలంగాణ సి) తమిళనాడు
డి) ఒడిశా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు