సాధనతోనే.. సెంట్రల్ జాబ్ సాకారం
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇన్‌కం ట్యాక్స్, ఎక్సైజ్, కస్టమ్స్, ఇంటెలిజెన్స్, నారోటిక్స్, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆడిట్ డిపార్ట్మెంట్ మొదలైన 25కి పైగా సంస్థల్లో గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) ఎగ్జామ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్ ప్లాన్ నిపుణ పాఠకుల కోసం..
ఈ పరీక్షను 2 లెవల్స్‌లో (టైర్-1, టైర్-2) నిర్వహిస్తారు.
దీనిలో 4 సబ్జెక్టులు ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్-రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్. ఈ సబ్జెక్టులు టైర్-2లో కూడా కామన్‌గా ఉన్నాయి. కాబట్టి ప్రతి చాప్టర్‌ను క్షుణ్ణంగా చదివితే టైర్-2 కూడా ఉపయోగపడుతుంది.
దీనిలో సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, వెర్బల్, నాన్ వెర్బల్ ఉంటాయి. గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేస్తే ఏ చాప్టర్‌కు ఎకువగా ప్రాధాన్యం ఇస్తున్నారు, కఠినత్వం గురించి ఒక అవగాహన వస్తుంది. దాని ప్రకారం ఒక ప్రణాళిక వేసుకొని క్రమం తప్పకుండా చదవాలి. అలా చదివితే మొత్తం 25 ప్రశ్నల్లో మంచి సోర్ సాధించవచ్చు. 60 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి 20కి మించి ప్రశ్నలను సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇందుకు మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. ఒకోసారి పేపర్ కఠినంగా ఇస్తే సమయం కొంచెం ఎకువ పట్టవచ్చు. ఈ టాపిక్కు సంబంధించిన ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం చదివితే బాగుంటుంది.
ఈ సబ్జెక్ట్‌లో ముఖ్యంగా సైన్స్, పాలిటీ, కరెంట్ అఫైర్స్, చరిత్ర, ఎకానమీ మొదలైన వాటి నుంచి ఎకువగా ప్రశ్నలు అగుడుతున్నారు. కరెంట్ అఫైర్స్ కోసం కనీసం 9 నెలల నుంచి జరిగిన సంఘటనలు, వార్తలను చదవాలి. ఈ సబ్జెక్ట్ ఎంత చదివినా ఒకోసారి కొన్ని ప్రశ్నలకు కచ్చితమైన జవాబులు రాబట్టడం అంత సులభం కాదు. గ్రూప్స్, యూపీఎస్సీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను చదివితే ఈ సబ్జెక్ట్‌పై అవగాహన రావడంతో పాటు పట్టు సాధించవచ్చు. ఈ సబ్జెక్ట్‌కి 7 లేదా 8 నిమిషాల కంటే ఎకువ కేటాయించకూడదు. ఎందుకంటే తెలియని ప్రశ్నల గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయవద్దు. క్వాంట్-రీజనింగ్‌లో ప్రయత్నిస్తే జవాబులు వస్తాయి. కాబట్టి ఈ టైంని అకడ ఉపయోగించాలి. ప్రిలిమ్స్‌కు తకువగా సమయం ఉన్నందున సమయం అంతా ఈ సబ్జెక్ట్‌కే కేటాయించకండి. ఒకోసారి సిలబస్ అంతా పూర్తిచేసినా ఊహించని ప్రశ్నలు ఎన్నో వస్తుంటాయి. కాబట్టి రోజుకు రెండు గంటలు కేటాయించండి. ఈ టాపిక్ కోసం అరిహంత్ పుస్తకాలు చదవాలి.
ఇది అత్యంత ముఖ్యమైన సబ్జెక్ట్. దీనిలో ముఖ్యంగా సంఖ్యామానం, శాతాలు, నిష్పత్తులు మొదటగా పూర్తిచేయండి. అప్పుడే తకువ టైంలో వేగంగా చేసే సిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. వాటితో పాటు అన్ని చాప్టర్లలో శాతాలు, నిష్పత్తులు ఎకువగా కనబడుతుంటాయి. లాభ నష్టాలు, వడ్డీలు, కాలం-పని, కాల-వేగం-దూరం లాంటి చాప్టర్లలో బేసిక్స్ చదవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కాన్సెప్ట్స్‌తో పాటు వేగంగా చేయడం చాలా ముఖ్యమని అర్థమవుతుంది. అలాగే కచ్చితత్వంతో పాటు ప్రతి చాప్టర్‌కు సమానమైన ప్రాముఖ్యం ఇవ్వాలి. ఈ చాప్టర్లన్నీ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో అంటే బార్ పటాలు, (పై) చిత్రాలు లాంటి టాపిక్స్‌లో ఉపయోగపడతాయి. వీటితో పాటు మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, వాటి ప్రాముఖ్యత ఎలాంటి ప్రశ్నల్లో వాడతారో తెలుసుకుంటే ఆ ప్రశ్నలకు జవాబులు రాబట్టడంలో సమయం చాలా తగ్గుతుంది.
ప్యూర్ మ్యాథ్స్‌లో మొదట మెన్సురేషన్-2డితో ప్రారంభించాలి.
ఈ చాప్టర్లో వివిధ పటాలకు అంటే త్రిభుజాలు, చతుర్భుజాలు, బహుభుజిల వైశాల్యాలు, చుట్టుకొలతలు, ఎలా చేయాలో తెలుసుకుంటే మెన్సురేషన్ 3డిలో సిలిండర్, కోన్, గోళం, అర్ధగోళం వంటి వాటిలో ఘనపరిమాణాలు, సంవూర్ణతల వైశాల్యాలు కనుగొనడానికి చాలా ఉపయోగపడతాయి. తర్వాత జామెట్రీ ప్రారంభించాలి. వీటిలో రేఖలు, కోణాల నుంచి త్రిభుజాలు, బాహుభుజి, వాటి ప్రాపర్టీస్ అలాగే అతిముఖ్యమైన వృత్తాలు వాటిలో జ్యా, చాపాలు, వాటి స్పర్శ రేఖల గురించి ప్రతి చిన్న ప్రాపర్టీ చదవడంతో పాటు వాటిని ప్రశ్నల్లో జవాబులు రాబట్టడానికి అప్లయ్ చేసే విధానం నేర్చుకోవాలి. సంఖ్యామానం బాగా చదవడం వల్ల ఆల్జీబ్రా సులభం అవుతుంది. అలాగే ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రిల్లో ఒక టాపిక్ ఉమ్మడిగా ఉంటుంది. అదే మ్యాగ్జిమం, మినిమం కనుగొనడం వీటిని సాధించే ప్రక్రియ ఒకటే కాబట్టి కలిపి చదవాలి. వీటికి అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ కాన్సెప్ట్‌ని వాడతారు. ఈ టాపిక్కు సంబంధించిన ఆర్ఎస్ అగర్వాల్, సర్వేశ్ వర్మ పుస్తకాలు చదివితే మంచిది.
ఇది భాష. కాబట్టి దీనికోసం ఎన్ని పుస్తకాలు చదివినా, కోచింగ్‌లకు వెళ్లినా దీనిపై పట్టు సాధించాలంటే కొంచెం టైం పడుతుంది. పరీక్షలో ఏం అడుగుతున్నారు, దానికి జవాబులు ఎలా రాబట్టాలి అనే దానిపై ధ్యాస పెడితే బాగుంటుంది. ముఖ్యంగా న్యూస్ పేపర్లు చదవడం వల్ల కాంప్రహెన్షన్ సిల్స్ కావచ్చు, గ్రామర్ సిల్స్ కావచ్చు, వొకాబులరీ సిల్స్ కావచ్చు ఇలా ప్రతీది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. టైర్-2లో కూడా ఈ సబ్జెక్ట్‌కు ఎకువ వెయిటేజీ ఉంంది. కాబట్టి ఇప్పటినుంచే న్యూస్‌పేపర్, ఏదైనా స్టోరీబుక్స్ చదవడం ప్రారంభించండి. సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, ఆంటనిమ్స్, స్పాటింగ్ ది ఎర్రర్, స్పెల్లింగ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, డైరెక్ట్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, ప్యాసేజ్ మొదలైనవి కచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. 3 లేదా అంతకంటే ఎకువ ప్యాసేజ్‌లు ఇస్తారు. వాటిలో సులభమైనవి, ఏవైనా స్టోరీబుక్ల నుంచి అది కూడా కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి, ఒక రిపోర్ట్‌కి సంబంధించి లేదా ఏదైనా ఎడిటోరియల్ నుంచి ఇస్తారు. ఎడిటోరియల్ చదవడం ఇబ్బందిగా ఉంటే మొదట చిన్న చిన్న స్టోరీ బుక్స్ చదవండి అప్పుడే చదవడంపై ఆసక్తితో పాటు అలవాటు అవుతుంది. ఇది ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది.
టైర్-2లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్లతో పాటు అదనంగా కంవ్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ కూడా కలిపారు. గతంలో లాగా రెండు పేపర్లు కాకుండా మొత్తం ఒకే పేపర్ 2 గంటల 15 నిమిషాల్లో రాయాలి. మొదటి సెషన్లో సెక్షన్-1లో మ్యాథ్స్, రీజనింగ్ 30 ప్రశ్నల చొప్పున మొత్తం 60, సెక్షన్-2లో ఆంగ్లం నుంచి 45, జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు మొత్తం 70 ప్రశ్నలు. వీటితో పాటు చివరగా సెక్షన్-3లో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు మూడు మారుల చొప్పున 450 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. రెండో సెషన్లో కేవలం 15 నిమిషాల కోసం డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ నిర్వహిస్తారు. పేపర్-2 స్టాట్స్ ఆఫీసర్ కోసం, పేపర్-3 ఏఏవో కోసం మాత్రమే నిర్వహిస్తారు.
మొదటి పేపర్లో ఉన్న కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే. అలాగే రెండో సెషన్లో ఉన్న డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కూడా క్వాలిఫయింగే. టైర్-1, టైర్-2లలో కామన్‌గా ఉన్న నాలుగు సబ్జెక్టుల్లోని
సిలబస్‌లో పెద్ద మార్పు లేదు. మ్యాథ్స్‌లో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీలను కలిపారు.
కంవ్యూటర్ నాలెడ్జ్ టెస్ట్‌లో బేసిక్స్ నుంచి డివైజెస్, పోర్ట్స్, సాఫ్ట్వేర్ బేసిక్స్, నెట్వరింగ్, సైబర్ సెక్యూరిటీ బేసిక్స్, ఇంటర్నెట్ సిస్టమ్‌కు సంబంధించిన అంశాలు చదవాలి.
టైర్-1, టైర్-2 రెండూ ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలే. సిలబస్ కూడా ఒక్కటే కాబట్టి మొదటి నుంచి రెండింటినీ దృష్టిలో పెట్టుకుని చదవాలి. ప్రతి చాప్టర్‌ను చదివిన తరువాత, రెండు రోజులకు ఒక చాప్టర్వైజ్ పరీక్ష రాయండి. మాక్ టెస్టులు రాసినా వాటిలో ఎన్నో మాడల్స్ మిస్ అవుతుంటాయి. కాబట్టి మాక్ టెస్ట్‌ల పైనే ఆధారపడటం సరికాదు. చాప్టర్‌కి వందల ప్రశ్నలు చేయడం కంటే వెరైటీ ప్రశ్నలు ఎకువగా చేయండి. ఇలా చేస్తే ఉద్యోగం సాధించవచ్చు.
మ్యాథ్స్‌లో 100కు 100 సాధించాలంటే ఏం చేయాలి?
గణితం.. ఇది చాలామందికి కొరుకుడు పడని సబ్జెక్టు. మ్యాథ్స్ అంటే భయపడుతుంటారు. కానీ నిజానికి అన్నింటి కంటే సులభమైన సబ్జెక్టు మ్యాథ్స్ అంటారు నిపుణులు. ఎవరైనా మ్యాథ్స్‌లో పట్టు సాధించవచ్చు. ముఖ్యంగా పాఠశాల, కాలేజీ స్థాయి విద్యార్థులు మ్యాథ్స్‌లో ఎక్కువ మార్కులు లేదా ఫుల్ స్కోర్ అంటే 100కు 100 సాధించాలంటే ఏం చేయాలి? అనే విషయంపై నిపుణుల సూచనలు పరిశీలిద్దాం…
రెగ్యులర్ ప్రాక్టీస్
అత్యంత ప్రధానమైనది మ్యాథ్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ చాలా అవసరం. ఇతర సబ్జెక్టుల్లాగా వారానికో, పక్షానికో ఒకసారి చదివితే/చేస్తే మ్యాథ్స్ రాదు. ప్రతిరోజూ దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. దీనికితోడు ఆయా సమస్యలను సాల్వ్ చేసేందుకు, వాటిలో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి టీచర్లు/సీనియర్లను సంప్రదించడం కంటే మీ అంతకు మీరు ఎక్కువసార్లు ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే, దానికి సంబంధించిన టెక్నిక్ అర్థమవుతుంది. దానిపై పట్టు సాధించగలుగుతారు.
ఉదాహరణలను సాల్వ్ చేయండి
సాధ్యమైనన్ని ఎక్కువ ఉదాహరణలను ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ సమస్యలను ఎలా సాల్వ్ చేశారు, వాటిలోని ఉపయోగించిన సూత్రాలు, టెక్నిక్స్ అర్థమవుతాయి. సాల్వ్ చేసిన ప్రశ్నలను మొదట ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ కఠినమైన/స్థాయి ప్రశ్నలను సాల్వ్ చేయడం వల్ల సిద్ధాంతాలకు, వాటి ప్రాక్టికల్ అప్లికేషన్స్‌కు మధ్య సంబంధాలు తెలుస్తాయి.
కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవాలి
సూత్రాలను గుర్తుంచుకోవడం కంటే ఆయా సమస్యలకు మూలాలను, వాటికి సంబంధించిన డెరివేషన్స్ను అర్థం చేసుకోవాలి. దీనివల్ల వాటికి సంబంధించిన బలమైన కాన్సెప్ట్స్ మదిలో నిలబడిపోతాయి. పరీక్ష సమయంలో క్లిష్టమైన సమస్యలను కూడా కాన్సెప్ట్స్ తెలిసి ఉంటే సులభంగా సాల్వ్ చేయగలరు.
బలహీనతలను దూరం చేసుకోండి
బలహీనతలను దూరం చేసుకోండి. అంటే బలహీనతను బలోపేతం చేసుకోండి. దీనికోసం ప్రతి అధ్యాయం (యూనిట్) పూర్తికాగానే మాక్ టెస్ట్‌లను రాయండి. మీ లోపాలపై దృష్టిపెట్టి వాటిని సరిచేసుకోండి. ఎక్కడైతే మీరు తప్పులు చేశారో లేదా ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో వాటి కోసం ఎక్కువ సమయం కేటాయించండి. దీంతోపాటు ఆయా చాప్టర్లు పూర్తికాగానే పాత ప్రశ్నప్రత్రాల్లో వచ్చిన ఆ చాప్టర్‌కు సంబంధించిన ప్రశ్నలను సాల్వ్ చేయండి. దీనివల్ల పరీక్ష సరళి అర్థం అవుతుంది. పరీక్ష ప్యాట్రన్ కూడా అవగతం అవుతుంది. పరీక్ష భయం కూడా పోతుంది.
రెగ్యులర్ రివిజన్
ఆయా సబ్జెక్టుల ప్రిపరేషన్‌తో పాటు మ్యాథ్స్ ప్లాన్‌ను మొదట సిద్ధం చేసుకోవాలి. మ్యాథ్స్‌కు సంబంధించి సరైన మెటీరియల్, నోట్స్ తయారుచేసుకోండి. వీటిని తరచుగా రివిజన్ చేయండి. ఇలా చేయడం వల్ల కాన్సెప్ట్‌లు గుర్తుంచుకోవడం సులభం అవుతుంది.
-టీ శ్రీనివాస్
అడ్వైజర్ స్పూర్తి స్టడీ సర్కిల్
7032031986
- Tags
- nipuna news
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






