సభలో సభ్యుడు కాదు.. కానీ నిర్ణాయక ఓటరు
రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 63 నుంచి 71వరకు ఉపరాష్ట్రపతి గురించి తెలుపుతుంది. భారత ఉపరాష్ట్రపతిని అమెరికా ఉపాధ్యక్ష పదవితో పోల్చవచ్చు. ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఆర్టికల్ 64 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్అఫిషియో ఛైర్మన్గా వ్యవహరిస్తారు.ఈ పదవిని అమెరికా నమూనా ఆధారంగా చేసుకొని రూపొందించారు. (ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటుచేయాలని రాజ్యాంగ పరిషత్లో ప్రతిపాదించింది
– హెచ్వీ కామత్
ఆర్టికల్ 64- హోదారీత్యా రాజ్యసభకు అధ్యక్షుడు
పార్లమెంటు సంస్థలతో రాజ్యసభ జరిపే అన్ని ఉత్తర, ప్రత్యుత్తరాలు ఉపరాష్ట్రపతి పేరుతోనే కొనసాగుతాయి. రాజ్యసభలో ఉపరాష్ట్రపతి సభ్యుడు కాకపోవడవం వల్ల ఉపరాష్ట్రపతికి సాధారణ ఓటు హక్కు ఉండదు. కానీ ఏదైనా బిల్లు విషయంలో వ్యతిరేక, అనుకూల ఓట్లు సమానంగా వస్తే ఉపరాష్ట్రపతికి నిర్ణాయక ఓటు హక్కు (Casting Vote) ఉంటుంది.
ఆర్టికల్ 65- తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం
ఆర్టికల్ 65 ప్రకారం ఏదైనా కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే కొత్త రాష్ట్రపతి వచ్చే వరకు లేదా గరిష్ఠంగా 6 నెలల వరకు ఉపరాష్ట్రపతి.. రాష్ట్రపతి (Acting Presi dent) గా వ్యవహరిస్తారు.
నోట్: అమెరికా అధ్యక్ష పదవి ఖాళీ అయితే ఉపాధ్యక్షుడు పూర్తికాలానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. కాని భారత ఉపరాష్ట్రపతి ఒక వేళ రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే తిరిగి ఎన్నిక జరిగి కొత్త రాష్ట్రపతి నియామకం జరిగే వరకు మాత్రమే రాష్ట్రపతిగా వ్యవరిస్తారు.
- ఆర్టికల్ 65 (1)- ప్రకారం రాష్ట్రపతి మరణించినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు లేదా రాష్ట్రపతిని తొలగించినప్పుడు రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరిగి కొత్త రాష్ట్రపతి అధికార విధులను చేపట్టేవరకు రాష్ట్రపతి అధికారాలను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తారు.
- ఆర్టికల్ 65 (2) ప్రకారం ఏవైనా కారణాల చేత (అనారోగ్యం, విదేశీ పర్యటన, వ్యక్తిగత కారణాలు) రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించలేనప్పుడు, ఉపరాష్ట్రపతి నిర్వహిస్తాడు. దీనికి నిర్ణీత సమయం ఉండదు.
- ఆర్టికల్ 65(3) ప్రకారం రాష్ట్రపతి అధికారాలను ఉపరాష్ట్రపతి నిర్వహించే కాలంలో రాష్ట్రపతికి గల అధికారాలు, సౌకర్యాలు మొదలైనవి ఉపరాష్ట్రపతి కలిగి ఉంటాడు. ఈ కాలంలో ఉపరాష్ట్రపతికి చెల్లించాల్సిన జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. అయితే ఈ సమయంలో రాజ్యసభ చైర్మన్ విధులు నిర్వహించకూడదు. కాబట్టి ఆర్టికల్ 97 ప్రకారం రాజ్యసభలో చైర్మన్కు లభించే జీతభత్యాలు స్వీకరించరాదు.
- ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణను చేపడుతుంది. ఉపరాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఒక ఓటు బదిలీ ద్వారా రహస్య పద్ధతిలో పరోక్షంగా ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకొంటారు.
- ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఉంటారు.
- 1961 వరకు పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విధానం ఉండేది. అయితే 1961లో 11వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను రద్దు చేశారు.
- ఉపరాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభల్లో ఎన్నికైన సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు.
- రాష్ట్రశాసన సభ్యులకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేసే అవకాశం లేదు.
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇద్దరూ పరోక్ష ఎన్నిక విధానం ద్వారానే ఎన్నికవుతారు.నోట్: రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల విధానసభల సభ్యులు అంతర్భాగం కాదు. కానీ ఎన్ని క పద్ధతి మాత్రం రాష్ట్రపతి ఎన్నికవలే ఉంటుంది.
- భారత పౌరసత్వం కలిగి ఉండాలి.
- 35 సంవత్సరాలు కనీస వయస్సు ఉండాలి.
- రాజ్యసభ్యత్వం పొందడానికి కావలసిన అర్హతలు ఉండాలి.
- ఆదాయాన్నిచ్చే లాభదాయక ప్రభుత్వ పదవిని చేపట్టకూడదు.
- చట్టసభల్లో సభ్యత్వం (పార్లమెంట్, రాష్ట్రశాసన సభ) ఉండకూడదు. ఒక వేళ పదవిలో ఉంటే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత చట్టసభల సభ్యత్వానికి రాజీనామా చేయాలి.
- ప్రభుత్వ ఉద్యోగులు (కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలు) పోటీచేయరాదు. ఒక వేళ చేస్తే ఉద్యోగానికి రాజీనామా చేయాలి.
- ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ప్రాథమికంగా (Praposers) 20 మంది, ద్వితీయంగా (Seconders) మరో 20 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు సమర్పించాలి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల డిపాజిట్ రూ. 15,000 చెల్లించాలి. (నేరుగా లేదా ఆర్బీఐ లేదా ప్రభుత్వ ట్రెజరీకి)
- భారత రాజ్యాంగానికి విధేయుడై ఉంటానని, నిర్దేశించిన విధులను విశ్వాసంతో నిర్వహిస్తానని ఉపరాష్ట్రపతి చేత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు.
ఉపరాష్ట్రపతి కాలపరిమితి (ఆర్టికల్ 67) (Term of Office)
- పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కాలపరిమితి 5 సంవత్సరాలు.
- సుదీర్ఘకాలం పనిచేసిన ఉపరాష్ట్రపతి -సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952-1962)
- అతి తక్కువ కాలం పనిచేసిన ఉపరాష్ట్రపతి- వీవీ.గిరి (1967-1969)
- కాలపరిమితి పూర్తయిన ఉపరాష్ట్రపతి కొత్త ఉపరాష్ట్రపతి పదవి స్వీకరించే వరకు పదవిలో కొనసాగుతారు. అదే విధంగా ఎన్నిసార్లయినా పోటీచేసే ఎన్నిక కావడానికి అర్హతను కలిగి ఉంటారు.
- ఉపరాష్ట్రపతి తన రాజీనామాను ఆర్టికల్ 67 (ఎ) ప్రకారం రాష్ట్రపతికి పంపించాలి.
- ఇప్పటివరకు రాజీనామా చేసిన ఒకే ఒక ఉపరాష్ట్రపతి వీవీ గిరి.
- తొలగించే పద్ధతి (ఆర్టికల్ 67 బి)
- ఉపరాష్ట్రపతిని తొలగించేందుకు ఎలాంటి కారణాలు రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఆర్టికల్ 67(బి) ఉపరాష్ట్రపతిని తొలిగించే విధానాన్ని తెలియజేస్తుంది. తొలగించే తీర్మానాన్ని ఉపరాష్ట్రపతికి 14రోజుల ముందుస్తు నోటీసు ఇచ్చి మొదటగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అయితే ఎంత మంది ఈ నోటీసుకు మద్దతు ఇవ్వాలనే విషయం రాజ్యాంగంలో పేర్కొనలేదు.
- ఈ తీర్మానాన్ని అప్పటికి ఉన్న రాజ్యసభ అందరి సభ్యుల్లో (ఖాళీలు పోను అప్పటికి ఉన్న సభ్యుల్లో) మెజారిటీ సభ్యులు ఆమోదించిన తర్వాత దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలి. లోక్ సభ కూడా ఆమోదించాలి. లోక్సభ కూడా ఆమోదిస్తే పదవి నుంచి తొలగించవచ్చు.
- ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని మొదటగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి ( రాష్ట్రపతి మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు)
- అతనికి తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు అవకాశం ఇవ్వాలి.
- రాజ్యసభ ఆమోదించిన తీర్మానాన్ని లోక్సభకు పంపితే లోక్సభ ఆ తీర్మానాన్ని ఆమోదించడానికి కాలపరిమితి అంటూ ఏదీలేదు. లోక్సభ ఆ తీర్మానాన్ని ఆమోదించేవరకు ఉపరాష్ట్రపతి పదవిలో కోనసాగుతాడు. (ఒక వేళ రాజ్యసభ ఆమోదించిన తొలగింపు తీర్మానాన్ని లోక్సభ ఆమోదించకపోతే ఆ తీర్మానం వీగిపోతుంది).
- నోట్: ఇప్పటివరకు ఏ ఉపరాష్ట్రపతి తొలగించ బడలేదు.
- 67 (c) ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసినప్పటికీ, కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నుకోబడి, ప్రమాణ స్వీకారం చేసి పదవిని చేపట్టేవరకు తన పదవిలో కొనసాగుతాడు.
- ప్రకరణ 68 నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికను తెలుపుతుంది.
- 68 (1) ప్రకారం ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి పదవీకాలం పూర్తికాకముందే నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను పూర్తిచేయాలి.
- ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామ చేయడం.
- తొలగింపు తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించడం.
- పదవిలో ఉండగా మరణించడం (1997 నుంచి 2002 వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్ పదవిలో ఉండగా మరణించాడు)
- ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదు అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం.
- ఆర్టికల్ 69 ప్రకారం ఉపరాష్ట్రపతిగా ఎన్నికయిన వ్యక్తిని రాష్ట్రపతి ఈ కింది విధంగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
- ‘…అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల, నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఉపరాష్ట్రపతిగా నా విధులను నమ్మకంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా/అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ (రాష్ట్రపతి రాజ్యాంగాన్ని రక్షిస్తానని ప్రమాణం చేస్తాడు) (దేశ 16వ ఉపరాష్ట్రపతి (వ్యక్తుల పరంగా 14వ) భగవంతుడి పేర ….. ప్రమాణం చేశాడు.
జీతభత్యాలు
- రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి హోదాలో ఏ విధమైన జీతభత్యాలను ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతభత్యాలు పొందుతారు. వీటిని పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. జీతంతో పాటు ఉచిత అధికార నివాసం, కారు, ఉచిత ప్రయాణ సౌకర్యాలు పొందుతారు. వీటితో పాటు పెన్షన్ సౌకర్యంతో పాటు జీవితాంతం వరకు కార్యాలయాన్ని, వ్యక్తిగత సిబ్బంది మొదలైనవి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
- జీతం- రూ. 4,00,000
ఎన్నికల వివాదాలు
- ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టులో మాత్రమే వేయాలి.
- ఈ పిటిషన్పై ఎలక్టోరల్ కాలేజీలోని 10మంది సభ్యులు సంతకం చేయాలి.
- సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదు అంటే ఉపరాష్ట్రపతిగా ఆయన గతంలో చేపట్టిన చర్యలు రద్దుకావు.
విధులు
- రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎటువంటి విధులను పేర్కొనలేదు.
ఉపరాష్ట్రపతి పదవిపై వ్యాఖ్యానాలు-
టీకే తోపే: ‘ఉపరాష్ట్రపతి పదవిని వేల్స్ యువరాజు’తో పోల్చాడు.ఎంవీ ఫైలీ: ‘రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఇచ్చిన గౌరవం ఉపరాష్ట్రపతికి ఇవ్వకపోయినప్పటికీ ఈ పదవి ప్రతిషాత్మకమైనది’.
రెండు సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసింది- సర్వేపల్లి రాధాకృష్ణన్, హమీద్ అన్సారీ
- పదవిలో ఉండగా మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి- కృష్ణకాంత్
- అత్యధిక మెజారిటీ సాధించిన ఉపరాష్ట్రపతి- కేఆర్ నారాయణన్
- ఉపరాష్ట్రపతులుగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతులు అయినవారు- సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వీవీగిరి, ఆర్ వెంకట్రామన్, శంకర్దయాళ్శర్మ, కేఆర్ నారాయణన్,
- ఏకగ్రీవంగా ఎన్నికయిన ఉపరాష్ట్రపతులు- సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎమ్ హిదయతుల్లా, డా. శంకర్దయాళ్శర్మ
జవాబులు
1.1 2.3 3.1 4.45.4 6.2 7.1 8.2 9.1 10.4 11.4 12.1 13.4 14.1 15.4
విజేత కాంపిటీషన్స్ బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు