అష్టక నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
రసాయన శాస్త్రం
1. నైట్రోజన్ (Z=7) యొక్క సరైన ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s1x3s1y 2p1z ఇది కింది ఏ నియమానికి అనుకూలంగా రాసింది?
ఎ) అఫ్ భౌ నియమం
బి) పౌలీసూత్రం
సి) హుండ్ నియమం
డి) పౌలింగ్ సూత్రం
2. కింది వాటిని జతపరచండి?
ఆవర్తన పట్టిక ఆధారం
ఎ) లోథర్ మేయర్ i) పరమాణు భారం
బి) మెండలీవ్ ii) పరమాణు పరిమాణం
సి) మోస్లే iii) పరమాణు సంఖ్య
డి) త్రిక సిద్ధాంతం iv) థాంమ్సన్
v) దోబిరైనర్
ఎ) ఎ-i, బి- ii, సి- iii, డి- iv
బి) ఎ-iii, బి- iii, సి- iv, డి- v
సి) ఎ-ii, బి- i, సి- iii, డి- v
డి) ఎ-i, బి- iii, సి- ii, డి- iv
3. 2, 8, 1 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన ఒక మూలకం రసాయనికంగా కింద ఇచ్చిన మూలకాల్లో ఏ మూలకంతో పోలీ ఉంటుంది?
ఎ) నైట్రోజన్ బి) ఫ్లోరిన్
సి) పాస్ఫరస్ డి) ఆర్గాన్
4. మెండలీఫ్ ఆవర్తన పట్టిక దేనిమీద ఆధారపడి ఉంది?
ఎ) అణుభారం బి) అణు సంఖ్య
సి) న్యూట్రాన్ల సంఖ్య డి) పైవేవీకాదు
5. విస్తృత ఆవర్తన పట్టికలో ప్రతి పీరియడ్ చివరన కుడివైపున ఉండేవి ఏవి?
ఎ) చురుకైన లోహాలు
బి) రేడియోధార్మిక మూలకాలు
సి) చాల్కోజన్లు డి) పైవేవీకాదు
6. నవీన ఆవర్తన పట్టిక ఏ నియమం ఆధారంగా నిర్మితమైంది?
ఎ) ఆఫ్ బౌ బి) న్యూల్యాండ్స్
సి) మోస్లే డి) చిన్లాండే
7. 5వ పీరియడ్‌లో గల మూలకాలు ఏ ఆర్బిటాళ్ళతో కూడిన ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటాయి?
ఎ) 5s బి) 4d సి) 8p డి) పైవన్నీ
8. కిందివాటిలో మూలకాల రుణ విద్యుదాత్మకత పెరిగే క్రమం?
ఎ) N, Si,C, P బి) P, Si, N, C
సి) Si, P, C, N డి) C, N, Si, P
9. వర్గీకరణ పట్టికలో అత్యంత తక్కువ బరువున్న మూలకం ఏది?
ఎ) మెగ్నీషియం బి) అల్యూమినియం
సి) ప్లాటినం డి) లిథియం
10. ఆవర్తన పట్టికలో మొదటి నాలుగు మూలకాలు ఏవి?
ఎ) హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం
బి) హైడ్రోజన్, హీలియం, లిథియం, కార్బన్
సి) హైడ్రోజన్, లిథియం, హీలియం, కార్బన్
డి) హైడ్రోజన్, లిథియం, హీలియం, బోరాన్
11. ఆధునిక ఆవర్తన పట్టికలోని పీరియడ్ల సంఖ్య?
ఎ) 6 బి) 7 సి) 8 డి) 9
12. కిందివాటిలో అత్యధిక చర్యాశీలత గల లోహం?
ఎ) లిథియం బి) సోడియం
సి) పోటాషియం డి) హైడ్రోజన్
13. కిందివాటిలో ఏ ధర్మం గ్రూపుల్లో పై నుంచి కింది పోయిన కొద్ది తగ్గుతుంది?
ఎ) పరమాణు వ్యాసార్థం
బి) రుణ విద్యుదాత్మకత
సి) ధన విద్యుదాత్మకత
డి) లోహస్వభావం
14. కిందివాటిలో ఏవి ఒకే పీరియడ్‌కు చెందినవి?
ఎ) Li, Be, Cr బి) Al, Si, Ag
సి) K, Ca, Co డి) N, O, Br
15. పరమాణు సంఖ్య 7 గల మూలకం ఏ పీరియడ్‌లో ఏ గ్రూప్‌లో దొరుకుతుంది?
ఎ) 1వ పీరియడ్ IA గ్రూప్
బి) 2వ పీరియడ్ VA గూప్
సి) 2వ పీరియడ్ IIIA గ్రూప్
డి) 2వ పీరియడ్ IVA గ్రూప్
16. 90Th నుంచి 103Lr వరకు గల మూలకాలను ఏమంటారు?
ఎ) ఆక్టినైడ్లు బి) లాంథనైడ్లు
సి) జడవాయువులు
డి) ప్రాతినిధ్య మూలకాలు
17. Cl అయాను పరమాణు వ్యాసార్థ్యం Cl అణువు వ్యాసార్థం కన్నా ?
ఎ) తక్కువ బి) ఎక్కువ
సి) సమానం డి) ఏదీకాదు
18. ఎకా-అల్యూమినియంగా పిలిచేది?
ఎ) గాలియం బి) స్కాండియం
సి) బోరాన్ డి) రేడియం
19. ఆల్కలీ అంటే
ఎ) భూమి నుంచి తీసిన లోహం
బి) మొక్కల నుంచి సేకరించిన అలోహాలు
సి) మొక్కల నుంచి సేకరించిన బూడిద
డి) జంతువుల నుంచి సేకరించిన బూడిద
20. Li, Na, K లోహాలు ఏ గ్రూపునకు చెందినవి?
ఎ) IA బి) IIA సి) IB డి) IIB
21. బాహ్యకక్ష్యలో 5 లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న మూలకాలను
ఏమంటారు?
ఎ) లోహాలు బి) వాయువులు
సి) అలోహాలు డి) ద్రవాలు
22. ఆధునిక ఆవర్తన పట్టికను కనుగొన్నది?
ఎ) జె.జె. థాంమ్సన్ బి) జె. చాడ్విక్
సి) రూథర్‌ఫర్డ్ డి) మోస్లే
23. ఆవర్తన పట్టికలోని మొదటి మూలకమైన హైడ్రోజన్ ఆక్సిజన్‌తో ఏర్పరిచే సమ్మేళనం?
ఎ) నీరు బి) హైడ్రోజన్ పెరాక్సైడ్
సి) 1, 2 డి) ఏదీకాదు
24. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో X అనేది 5వ గ్రూపునకు చెందిన మూలకమైతే అది ఏర్పరచగల సమ్మేళనం?
ఎ) XO3 బి) X2O5
సి) XO డి)X2O
25. ఎకా-బోరాను కొత్త పేరు
ఎ) గాలియం బి) స్కాండియం
సి) జెర్మేనియం డి) సిలికాన్
26. కిందివాటిలో అరచేతిలో కరిగిపోయే మూలకం
ఎ) ఎకా అల్యూమినియం
బి) ఎకాబోరాన్
సి) స్కాండియం డి) జెర్మేనియం
27. మెండలీఫ్ గౌరవార్థం మెండలీనియం అని పేరు పెట్టిన మూలక పరమాణు సంఖ్య?
ఎ) 100 బి) 105
సి) 109 డి) 101
28. పరమాణుభారం అనే భావన నుంచి పరమాణు సంఖ్య భావనను తెచ్చిన శాస్త్రవేత్త?
ఎ) మెండలీఫ్ బి) మోస్లే
సి) డాబర్‌నీర్ డి) న్యూలాండ్
29. గ్రూపు-13(IIIA) మూలకాలను ఏమని పిలుస్తారు?
ఎ) ఆల్కలీ కుటుంబం
బి) నైట్రోజన్ కుటుంబం
సి) జడవాయు కుటుంబం
డి) బోరాన్ కుటుంబం
30. ఒక మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 3s2 3p1 అయితే అది ఒక ….?
ఎ) జడవాయువు
బి) పరివర్తన మూలకం
సి) అంతర పరివర్తన మూలకం
డి) ప్రాతినిధ్య మూలకం
31. కేంద్రక పరమాణువు అష్టక నియమాన్ని పాటించకపోయినప్పటికీ స్థిరమైనవిగా ఉన్న సమయోజనీయ అణువుల జంట?
ఎ) మీథేన్, కార్బన్ టెట్రాక్లోరైడ్
బి) బెరీలియం హాలైడ్, బోరాన్ హాలైడ్
సి) అమ్మోనియా, నీరు
డి) కార్బన్ డై అక్సైడ్, ఎసిటిలిన్
32. బాహ్యకక్ష్యలో అష్టక ఎలక్ట్రాన్లు లేని జడవాయువు?
ఎ) నియాన్ బి) రేడాన్
సి) హీలియం డి) ఆర్గాన్
33. N=3, l=1 విలువలు గల ఆర్బిటాల్‌లోని గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య?
ఎ) 1 బి) 6 సి) 10 డి) 14
34. ఆధునిక ఆవర్తన పట్టికలోని మొదటి మూలకం?
ఎ) ఆక్సిజన్ బి) హైడ్రోజన్
సి) నైట్రోజన్ డి) కార్బన్
35. అధిక శక్తి గల ఎలక్ట్రానుల్లో తేడాను మూలక పరమాణువులు చెందిస్తే విడుదలైన పరమాణు సంఖ్యలను లెక్క గట్టడానికి ఉపయోగపడేవి?
ఎ) x కిరణాలు బి) కిరణాలు
సి) అతినీలలోహిత కిరణాలు
డి) పరారుణ కిరణాలు
36. కింది వాటిలో క్షారలోహాలు అని వేటిని పిలుస్తారు?
ఎ) H నుంచి F వరకు
బి) Li నుంచి Fr వరకు
సి) Be నుంచి Ra వరకు
డి) F నుంచి At వరకు
37. Cl, Br, I లు డాబర్ త్రికాలు. అందులో Cl, I లు పరమాణు భారాలు 35, 5, 127 అయిన Br పరమాణు భారం సుమారుగా ఎంత ఉండవచ్చు?
ఎ) 80 బి) 84 సి) 76 డి) 101
38. అష్టక నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
ఎ) డాబర్‌నీర్ బి) న్యూలాండ్స్
సి) నీల్స్ బోర్ డి) మెక్ ముల్లర్
39. అష్టక నియమం ప్రకారం పరమాణు భారాలను ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు 3వ, 17వ మూలకాలతో పోలిన ధర్మాలు కలిగిన మూలకం ఏది?
ఎ) 11 బి) 25 సి) 10 డి) 32
40. పరమాణువును గుర్తించడానికి ఏది ముఖ్యమైంది?
ఎ) పరమాణు సంఖ్య
బి) న్యూట్రాన్ల సంఖ్య
సి) పరమాణు భారం
డి) పరమాణు పరిమాణం
41. ఒక గ్రూపులో పరమాణు సంఖ్యతోపాటు పెరిగేది ఏది?
ఎ) పరమాణు పరిమాణం
బి) ధన విద్యుదాత్మకత (ఎలక్ట్రో పాజిటివిటీ)
సి) రుణ విద్యుదాత్మకత (ఎలక్ట్రో నెగెటివిటీ)
డి) 1, 2
42. మెండలీఫ్ ఆవర్తన పట్టిక మూలకం వేటిపై ఆధారపడి నిర్మించారు?
ఎ) ఎలక్ట్రాన్ విన్యాసం
బి) సంయోజకత
సి) సమ్మేళనాల ఫార్ములా డి) 2, 3
43. క్వాంటమ్ సంఖ్య
ఎ) ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్
బి) అజిముతల్ క్వాంటమ్ నంబర్
సి) మాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్
డి) పైవన్నీ
44. ఆధునిక ఆవర్తన పట్టికలో గరిష్ఠ సంఖ్యలో మూలకాలు గల గ్రూపు ఏది?
ఎ) 3 బి) 4 సి) 1 డి) 16
45. ‘మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు’ ఇది ఏ నియమం?
ఎ) మెండలీఫ్ బి) మోస్లే
సి) న్యూలాండ్ డి) డాబర్‌నీర్
46. అతి చిన్న పీరియడ్ అయిన మొదటి పీరియడ్‌లోని మూలకాలెన్ని?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
47. ఆధునిక ఆవర్తన పట్టికలో x అనే మూలకం బాహ్యస్థాయి విన్యాసం ns2np3 అయిన x కింది ఏ గ్రూపునకు చెందుతుంది?
ఎ) III A బి) VA సి) VIA డి) IIA
48. జడవాయువును మొట్టమొదటగా కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) కావెండిష్ బి) విలియం రామ్సే
సి) రేలీ డి) ఫ్రాంక్లాండ్
49. కింది అణువులను వాటి బంధకోణాలు పెరిగే క్రమంలో అమర్చండి?
NH3-(I), H2O-(H), BF3-(III), BeCl2-(IV)
ఎ) I < III < IV < II
బి) II < IV < I < III
సి) IV < I < II < III
డి) II < I < III < IV
50. సిలికాన్ మొదటి అయనీకరణ శక్మం, ఎలక్ట్రాన్ ఎఫినిటీలు వరుసగా 785K.J/mole, 135 K.J/mole అయితే రుణ విద్యుదాత్మకత?
ఎ) 786.08 బి) 460
సి) 1.69 డి) 325
ఆధునిక ఆవర్తన పట్టిక
- మోస్లే అనే బ్రిటిష్ శాస్త్రవేత్త X కిరణాల స్వభావాన్ని విశ్లేషించి, మూలక పరమాణువులలో ఉండే ధనావేశిత కణాల సంఖ్యను లెక్కించటం ద్వారా మూలకానికి పరమాణు సంఖ్యయే విలక్షణమైన ధర్మమని ప్రతిపాదించాడు.
- మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు దీనినే మోస్లే ఆవర్తన నియయం/ నవీన ఆవర్తన నియమం/ ఆధునిక ఆవర్తన నియమం అంటారు.
- ఆధునిక ఆవర్తన పట్టికను బోర్ ఆవర్తన పట్టిక లేదా విస్తృత ఆవర్తన పట్టిక అంటారు.
- నవీన ఆవర్తన పట్టికలో 18 నిలువు వరుసలు అంటే 16 గ్రూపులు, 7 అడ్డువరుసలు అంటే పీరియడ్లు ఉంటాయి.
- పీరియడ్లలో మూలకాలను వాటి పరమాణు సంఖ్యల ఆరోహణ క్రమం ఆధారంగా పొందుపరిచారు. ఆ మూలకాలను ఆఫ్ బౌ నియమం ఆధారంగా పొందుపరిచారు.
- నవీన ఆవర్తన పట్టికలో ప్రతి పీరియడ్ ఒక క్షార లోహంతో ప్రారంభమై జడవాయువుతో ముగుస్తుంది.
- ఆధునిక ఆవర్తన పట్టికలో లాంథనాయిడ్‌లు, ఆక్టినాయిడ్ల పట్టిక కింది స్థానం కల్పించారు.
- మొదటి పీరియడ్ రెండు మూలకాలను కలిగి ఉంటుంది. దీనిని ‘అతి పొట్టి పీరియడ్’ అంటారు. రెండో, మూడో పీరియడ్‌లో 8 మూలకాలుంటాయి. నాలుగో పీరియడ్‌లో 18 మూలుకాలుంటాయి. దీన్ని పొడవైన పీరియడ్ అంటారు. ఆరో పీరియడ్‌లో 32 మూలకాలుంటాయి. దీనిలో లాంథనాయిడ్స్ (14 మూలకాలు)కలిసి ఉంటాయి. దీన్ని అతి పొడవైన పీరియడ్ అంటారు. ఏడో పీరియడ్ అసంపూర్తిగా నిండి ఉంది. దీనిలో ఆక్టినాయిడ్స్ (14 మూలకాలు) కలిసి ఉంటాయి.
- s-బ్లాకు, p-బ్లాకు మూలకాలు ప్రాతినిథ్య మూలకాలు.
- d- బ్లాకు మూలకాలను పరివర్తన మూలకాలంటారు. f-బ్లాకు మూలకాలను అంతర్ పరివర్తన మూలకాలు అంటారు.
- d-బ్లాకులో ఉన్నవి అత్యంత తక్కువ చర్యా శీలత గల మూలకాలు. d-బ్లాకు మూలకాల్లో Hg(పాదరసం) తప్ప మిగిలినవన్నీ ఘన స్థితిలోనే ఉంటాయి. Hg మాత్రమే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉంటుంది.
- లాంథనాయిడ్స్, ఆక్టినాయిడ్స్ f -బ్లాకుకు చెందుతాయి. f-బ్లాకులో అత్యధిక మూలకాలు రేడియోథార్మిక స్వభావాన్నిప్రదర్శిస్తాయి.
-టాపర్స్ ఇన్స్టిట్యూట్,మేడిపల్లి, హైదరాబాద్
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు