తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక శాస్త్రీయనామం?
జీవ ప్రపంచం
1. ప్రకృతిలోని జీవులను ఒక క్రమ పద్ధతిలో అమర్చడాన్ని లేదా విభజించడాన్ని ఏమంటారు?
1) విభజన 2) సమీకరించు
3) వర్గీకరణ 4) పైవన్నీ
2. మొక్కలను వాటి ఔషధ గుణాల ఆధారంగా వర్గీకరించినవారు?
1) చరకుడు 2) శుశ్రుతుడు
3) పై ఇద్దరూ 4) చార్లెస్ డార్విన్
3. వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
1) లిన్నేయస్ 2) అరిస్టాటిల్
3) డార్విన్ 4) కురియన్
4. వర్గీకరణలో అతి చిన్న ప్రమాణం ఏది?
1) క్రమం 2) తరగతి
3) ప్రజాతి 4) జాతి
5. కింది వేటిని నీలి ఆకుపచ్చ శైవలాలు అంటారు?
1) ఆర్కి బ్యాక్టీరియా
2) యూ బ్యాక్టీరియా
3) సయనో బ్యాక్టీరియా
4) మైక్రో బ్యాక్టీరియా
6. జంతు రాజ్యంలో కుల్యావ్యవస్థ లేదా నీటి ప్రవాహ వ్యవస్థ అనే ప్రత్యేక లక్షణాన్ని కలిగిన జంతువర్గం ఏది?
1) పొరిఫెరా 2) నిడేరియా
3) నిమటోడా 4) ఇఖైనోడర్మెటా
7. కింది ఏ జీవి రక్తంలో ఎర్ర రక్తకణాలు లేనప్పటికీ రక్తం ఎరుపు రంగులో ఉంటుంది?
1) సైకాన్ 2) వానపాము
3) ఆస్కారిస్ 4) హైడ్రా
8. అనాడ్రోమస్ వలసను ప్రదర్శించే జీవిని గుర్తించండి.
1) పెట్రోమైజాన్ 2) మిక్సిన్
3) సాల్మన్ చేప 4) కట్ల
9. కింది వాటిలో ఉభయచరం కానిది ఏది?
1) సాలమండ్రా 2) ఇక్తియోఫిస్
3) రానా 4) పాము
10. జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గమైన కీటకాలను కలిగి ఉన్నది ఏది?
1) మొలస్కా 2) ఆర్థ్రోపొడా
3) ప్రొటోజోవా 4) పొరిఫెరా
11. వెన్నెముక కలిగిన జీవులను సకశేరుకాలు అంటారు. అయితే కింది వాటిలో సకశేరుకాన్ని గుర్తించండి.
1) వానపాము 2) బొద్దింక
3) నత్త 4) చేప
12. కింది వాటిలో సజీవ శిలాజాన్ని గుర్తించండి.
1) లిమ్యులస్ 2) స్పీనోడాన్
3) సీలకాంత్ 4) పైవన్నీ
13. ఏ మగజీవి ఉదరభాగంలో గుడ్లసంచి ఉండి సంతాన పాలనను ప్రదర్శిస్తుంది?
1) ఎక్సోసీటస్ 2) హిప్పోకాంపస్
3) ఎఖినస్ 4) లేబియో
14. తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక శాస్త్రీయ నామం ఏది?
1) మకాక్ 2) మాక్రోఫస్
3) ఆంటిలోప్ సెర్వికాప్రా
4) ఏక్సిస్ ఏక్సిస్
15. త్రినామీకరణంలో ఉపజాతి లాటిన్ భాషలో ఉండాలి. మరి ఎలా ముద్రించాలి?
1) గ్రీక్ 2) ఇటాలిక్స్
3) ఇంగ్లిష్ 4) తెలుగు
16. ఒక శాస్త్రీయనామంలో జాతిపేరు, ప్రజాతి పేరు ఒకటే అయితే అలాంటి శాస్త్రీయనామాన్ని ఏమంటారు?
1) టాటోనిమ్ 2) టోటిపొటెన్సీ
3) యూజెనిక్స్ 4) యూఫెనిక్స్
17. జీవులన్నింటిలో నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం ఏది?
1) కణం 2) కేంద్రకం
3) కణద్రవ్యం 4) జీవద్రవ్యం
18. 18వ శతాబ్దంలో మొదటిసారిగా జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళా కణాల్లో కేంద్రకాన్ని చూసినవారు ఎవరు?
1) రాబర్ట్ బ్రౌన్ 2) రాబర్ట్ హుక్
3) పెలిన్పాంటానా 4) ష్లీడన్
19. కింది వాటిలో ఏకకణ జీవి కానిది ఏది?
1) అమీబా 2) పారామీషియం
3) స్పైరోగైరా 4) వానపాము
20. జంతు రాజ్యంలో అతిపెద్ద కణం ఏది?
1) ఆస్ట్రిచ్ అండకణం 2) నాడీకణం
3) బ్యాక్టీరియా 4) కాలేయ కణం
21. జీర్ణక్రియా ఎంజైమ్‌లు కలిగి స్వయం విచ్ఛిత్తి సంచులుగా పిలిచే కణాంగాలు ఏవి?
1) గాల్జీ సంక్లిష్టం 2) లైసోజోమ్‌లు
3) మైటోకాండ్రియా 4) రైబోసోమ్స్
22. కణ సిద్ధాంతాన్ని 1838లో ప్రతిపాదించినది ఎవరు?
1) ష్లీడన్ 2) ష్వాన్
3) పై ఇద్దరు 4) ఎవరూ కాదు
23. కణ శ్వాసక్రియలో పాల్గొనే మైటోకాండ్రియాను ఏమని పిలుస్తారు?
1) కణ శక్త్యాగారం 2) కణ కరెన్సీ
3) స్వయం విచ్ఛిత్తి సంచులు
4) పైవన్నీ
24. కాండంలో పార్శపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించేది ఏది?
1) అగ్రవిభాజ్య కణజాలం
2) పార్శ విభాజ్య కణజాలాలు
3) మధ్యస్థ విభాజ్య కణజాలాలు
4) సంధాయక కణజాలాలు
25. దేహంలోని ఏ కణజాలం కొవ్వు పదార్థాన్ని నిల్వ చేస్తుంది?
1) ఎడిపోజ్ కణజాలం
2) ఏరియోలార్ కణజాలం
3) ఉపకళా కణజాలం
4) కండర కణజాలం
26. ఎముకలు శరీరానికి ఆకారాన్నిస్తాయి.
అస్థిపంజరాన్ని ఏర్పరుస్తాయి. అస్థిపంజరం దేనితో ఏర్పడుతుంది?
1) కాల్షియం పాస్ఫేట్
2) కాల్షియం కార్బొనేట్
3) పైరెండూ 4) ఏదీ కాదు
27. శ్వేత రక్తకణాల జీవితకాలం ఎన్ని రోజులు ఉంటుంది?
1) 12-13 2) 13-14
3) 120 4) 180
28. కాపర్ మూలకంతో ఏర్పడిన హీమోసయనిన్ అనే పదార్థం కలిగి ఉండి, నీలం రంగు రక్తం గల జీవి ఏది?
1) బొద్దింక 2) నత్త
3) వానపాము 4) రొయ్య
29. వృక్షకణంలో ఉండని కణాంగాన్ని గుర్తించండి.
1) కణకవచం 2) రిక్తికలు
3) ప్లాస్టిడ్లు 4) సెంట్రియోల్లు
30. క్రోమోజోమ్‌ల సంఖ్య రెట్టింపవడం తర్వాతనే కణ విభజన మొదలయ్యే విభజన ఏది?
1) సమ విభజన
2) క్షయకరణ విభజన
3) అసమ విభజన 4) పైవన్నీ
జీవశాస్త్రం- ఆధునిక పోకడలు
1. అతి సన్నిహిత సంబంధం ఉన్న జీవుల మధ్య జరిగే ప్రజననం ఏది?
1) రేఖా ప్రజననం
2) అతి సన్నిహిత ప్రజననం
3) బాహ్య ప్రజననం
4) పర ప్రజననం
2. వరణం, ఎంపికలు దేనికి సంబంధించినవి?
1) పర ప్రజననం 2) బాహ్య సంపర్కం
3) అంతఃప్రజననం 4) జాతి సంకరణం
3. కాల్షియం క్లోరైడ్ ద్రావణం ద్వారా ప్రేరేపించినప్పుడు సంయుక్తబీజం డీఎన్ఏను గ్రహించే పద్ధతి ఏది?
1) ట్రాన్స్‌ఫెక్షన్ 2) ట్రాన్స్డక్షన్
3) ట్రాన్స్ఫర్మేషన్ 4) ట్రాన్స్‌పొజిషన్
4. జంతుపరివర్తిత ప్రయోగాల్లో జన్యువును వేరుచేసి దేనిలో అనుసంధానిస్తారు?
1) ప్రమోటర్ 2) ఆపరేటర్
3) వేరుగా ఏ వాహకంలోనైనా
4) రెగ్యులేటర్ జన్యువు
5. అనాదిగా మానవుడు జంతువుల ప్రజననకు ఉపయోగించే సరళమైన పద్ధతి ఏది?
1) జంతువుల వరణం
2) పర ప్రజననం 3) క్లోనింగ్
4) కృత్రిమ బీజావాహం
6. తెలియని జంతు సంపద నుంచి జన్యురీత్యా సమయుగ్మజపు జనాభాను పొందాలంటే ఉపయోగపడే పద్ధతి ఏది?
1) అంతఃప్రజననం 2) బాహ్య ప్రజననం
3) పర ప్రజననం 4) ఎంపిక
7. వేటి సంకరణ వల్ల హెన్నీ ఉద్భవిస్తుంది?
1) మగ గాడిద, ఆడ గుర్రం
2) ఆడ గాడిద, మగ గుర్రం
3) మగ గాడిద, ఆడ గాడిద
4) ఆడ గుర్రం, మగ గుర్రం
8. వేటి సంకరణ వల్ల కంచర గాడిద ఉద్భవిస్తుంది?
1) మగ గాడిద, ఆడ గుర్రం
2) మగ గుర్రం, ఆడ గాడిద
3) మగ గాడిద, ఆడ గాడిద
4) ఆడ గుర్రం, మగ గుర్రం
9. ఏ సంకరణం వల్ల ఫలవంతమైన సంతతి తరం ఏర్పడుతుంది?
1) మగ గాడిద, ఆడ గుర్రం
2) మగ గుర్రం, ఆడ గాడిద
3) మగ గాడిద, ఆడ గాడిద
4) పైవన్నీ
10. డాలీ దృశ్య రూపేణా కింది వాటిలో దేన్ని పోలిఉంటుంది?
1) సరోగేట్ (మారు) తల్లి
2) అండ దాత
3) శాఖీయ కణదాత 4) శుక్రకణ దాత
11. అణుకత్తెరలు అంటే?
1) ఆక్సిడోరిడక్టేజ్లు
2) ప్రొటియేజ్‌లు
3) పాలిన్డ్రోమ్లు
4) రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్‌లు
12. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లను ఎవరు కనుగొన్నారు?
1) నాథన్స్ 2) ముల్లర్
3) ఎరికే 4) హేబర్‌లాండ్
13. డీఎన్ఏ అతుక్కొనే కొనల మధ్య దేని ద్వారా బంధాన్ని ఏర్పరచవచ్చు?
1) డీఎన్ఏ లైగేజ్
2) డీఏన్ఏ పాలిమరేజ్
3) ఆల్డోలేజ్
4) ఎండో న్యూక్లియేజ్‌లు
14. మానవ ఇన్సులిన్ అయిన హ్యుమ్యులిన్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఏది?
1) జాంథోమోనాస్ 2) సాల్మొనెల్లా
3) క్లాస్ట్రీడియమ్ 4) ఈ-కోలై
15. ప్లాస్మిడ్ డీఎన్ఏ, వాంఛనీయ జన్యువు కలిసి ఏర్పడే హైబ్రిడ్ డీఎన్ఏను కింది విధంగా పిలుస్తారు?
1) C DNA 2) r DNA
3) B DNA 4) z DNA
16. కింది జన్యు పరివర్తిత మొక్కల్లో ఏ రకం ఆలస్యంగా పక్వానికి రావడం వల్ల రవాణా, నిల్వచేయడానికి దోహదకారిగా ఉంటుంది?
1) తైపీ రకం వరి
2) టొమాటో ఫ్లెవర్ సెవర్ రకం
3) బీటీ పత్తి
4) బ్రాసికా నాపస్లో పురుష వంధ్యత్వాన్ని చూపే మొక్కలు
17. తైపీ జన్యు పరివర్తిత రకం ప్రజాతిని తెలపండి.
1) సొలానమ్ 2) ట్రిటికమ్
3) బ్రాసికా 4) ఒరైజా
18. జన్యుపరివర్తిత బంగాళదుంప మొక్కలు దేనికి నిరోధకతను చూపిస్తాయి?
1) బ్యాక్టీరియా 2) వైరస్
3) శిలీంధ్రం 4) నిమటోడ్
19. ఫైటాఫ్తొరా అనేది ఒక?
1) శిలీంధ్రం 2) బ్యాక్టీరియా
3) శైవలం 4) ఆవృత బీజం
20. బాస్మతి రకం ప్రజాతి దేనికి చెందినది?
1) ఒరైజా 2) ట్రిటికమ్
3) నికోటియానా 4) పైసమ్
21. కింది వాటిలో అణు స్విచ్‌లు అని వేటినంటారు?
1) ఎండోన్యూక్లియేజ్‌లు
2) జన్యువులు
3) క్రోమోజోమ్‌లు
4) న్యూక్లియోజోమ్లు
22. పరివర్తితం చెందిన కణం దేన్ని కలిగి ఉంటుంది?
1) r DNA 2) c DNA
3) t DNA 4) z DNA
23. వాహక డీఎన్ఏ, డీఎన్ఏ ఖండితం మధ్య ఏర్పడే ఖాళీని పూరించే ఎంజైమ్ ఏది?
1) డీఎన్ఏ పాలిమరేజ్
2) గ్లూకోరొసైడేజ్లు
3) డీఎన్ఏ లైగేజ్
4) ఉత్క్రమ అనులేఖనం
24. జెనెటిక్ ఇంజినీరింగ్ ప్రయోగాల్లో ప్రోబ్లను దేన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు?
1) ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే జన్యువు
2) ఒక జీవిలోని సంపూరక క్షారాల
వరుస క్రమం
3) సూక్ష్మజీవ నాశక ఔషధాన్ని ఉత్పత్తిచేసే జన్యువు
4) ఒక కాలనీలో విశిష్ట ప్రొటీన్
25. G.T అంటే ఏమిటి?
1) వ్యాధి చికిత్స కోసం ఒక వ్యక్తి కణంలోని వేరొక జన్యువును ప్రవేశపెట్టడం
2) సైట్ డైరెక్టెడ్ మ్యూటాజెనిసిస్
3) ఒక అసాధారణ జన్యువును ఇన్‌వివో పద్ధతిలో సరిచేయడం 4) పైవన్నీ
26. దైహిక జన్యు చికిత్స అంటే ఏమిటి?
1) ఒక అసాధారణ కణాన్ని ఇన్ వివో పద్ధతిలో సాధారణ కణంతో ప్రతిస్థాపన చేయడం
2) వ్యాధి చికిత్సలో భాగంగా ఒక జన్యువును బీజకణంలోకి ప్రవేశపెట్టడం
3) వ్యాధి చికిత్స కోసం ఒక జన్యువును దైహిక కణంలోకి ప్రవేశపెట్టడం.
4) ఒక బీజకణంలోని అసాధారణ
జన్యువును ఇన్‌వివో పద్ధతిలో సరిచేయడం
27. ఎక్స్వివో జన్యు చికిత్స అంటే ఏమిటి?
1) దైహిక కణంలోని జన్యువును జీవి దేహంలోనే బాగుచేయడం
2) వ్యాధి చికిత్స కోసం ఒక జన్యువును బీజకణంలోకి ప్రవేశపెట్టడం
3) జీవి దేహం వెలుపల కణాల్లో జన్యుమార్పిడి చేసి తిరిగి వాటిని జీవిలో ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధిని నయం చేయడం
4) ఒక జీవి దేహంలోని బీజకణంలోని జన్యువును బాగుచేయడం
28. జన్యు చికిత్స ద్వారా నయం చేసిన మొట్టమొదటి వ్యాధి ఏది?
1) SCID 2) AIDS
3) గోనోలోకల్ గనేరియా
4) క్షయ వ్యాధి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు