గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ సవరణ
పాలిటీ
1. కాంగ్రెస్ పార్టీ గురించి సరైనది?
1) దీనిని1885లో స్థాపించారు
2) మొదటి కాంగ్రెస్ సమావేశానికి
హాజరైన ప్రతినిధుల సంఖ్య 72
3) రెండో కాంగ్రెస్ సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య 436 4) పైవన్నీ
2. మితవాదుల లక్ష్యాలు?
1) ప్రభుత్వంలోను, పరిపాలనలోను భారతీయులకు ఎక్కువ స్థానాలు కేటాయించడం
2) సివిల్ సర్వీస్ పరీక్షలు భారతదేశంలో కూడా నిర్వహించడం
3) జాతి వివక్షను తొలగించాలి
డి) పైవన్నీ
3. మితవాదుల పద్ధతులు.
ఎ) విన్నపాలు
బి) అర్జీల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలుపడం
సి) ఆందోళనల ద్వారా తమ కోర్కెలను
వెల్లడించుట డి) పైవన్నీ
4. స్వదేశీ ఉద్యమం (వందేమాతరం) గురించి సరైనది?
ఎ) ఇది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం
బి) ఈ ఉద్యమ కాలంలో బాగా ఊపందుకొన్న పరిశ్రమ వస్త్ర పరిశ్రమ
సి) ఈ ఉద్యమ కాలంలో ఉప్పు, పంచదార, అగ్గిపెట్టెలు లాంటి పరిశ్రమలు పెద్ద ఎత్తున స్థాపించారు
డి) పైవన్నీ
5. బెంగాల్ విభజనకు సంబంధించి సరికానిది.
ఎ) బెంగాల్‌ను విభజించినది లార్డ్ కర్జన్
బి) బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది 1905 అక్టోబర్ 16
సి) బెంగాల్ విభజనలో పాల్గొన్న మొత్తం సభ్యుల సంఖ్య 85,000
డి) వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర ఛటర్జీ
6. కింది వాటిలో సరికానిది?
ఎ) స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరుతానన్నది తిలక్
బి) అతివాదుల త్రయం లాల్, బాల్, పాల్
సి) తిలక్ 2015లో జైలు నుంచి విడుదలయ్యారు
డి) అనీబిసెంట్ పర్షియా నుంచి ఇండియాకి 1893లో వచ్చింది
7. మొదటి ప్రపంచ యుద్ధం గురించి సరికానిది.
ఎ) మొదటి ప్రపంచ యద్ధ కాలం 1914
-1919
బి) మిత్ర పక్షం బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా
సి) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాలో సామ్యవాద విప్లవం వచ్చింది
డి) జర్మనీలో కూడా సామ్యవాద విప్లవం వచ్చింది
8. కృష్ణా పత్రిక గురించి సరైనది?
ఎ) దీనిని 1902లో మచిలీపట్నంలో
స్థాపించారు
బి) ముట్నూరి కృష్ణారావు 1907-1945 వరకు కృష్ణా పత్రికకు సంపాదకత్వం వహించారు
సి) ఈ పత్రిక వందేమాతరం, హోంరూల్, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించింది డి) పైవన్నీ
9. గాంధీ ఉద్యమాల గురించి సరైనది?
ఎ) గాంధీ మొదటి ఉద్యమం 1917లో చంపారన్‌లో జరిగింది
బి) 1918లో ఖేడా పన్నుల ఉద్యమం
జరిగింది
సి) 1920-22 మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం చేశారు
డి) పైవన్నీ
10. జలియన్ వాలాబాగ్ గురించి సరికానిది?
ఎ) ఇది 1919 ఏప్రిల్ 13న జరిగింది
బి) ఈ ఉద్యమానికి కారకుడు
జనరల్ డయ్యర్
సి) ఈ సంఘటనకు నిరసనగా
రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్‌హుడ్ అనే
బిరుదును పరిత్యజించారు
డి) ఈ సంఘటనలో దాదాపు 500 మంది మరణించారు
11. మహాజనపదాలు ఏ కాలానికి చెందినవి?
ఎ) 2500 సంవత్సరాల క్రితం
బి) 1500 సంవత్సరాల క్రితం
సి) 1000 సంవత్సరాల క్రితం
డి) 800 సంవత్సరాల క్రితం
12. మగద రాజ్యాన్ని శక్తిమంతమైన రాజ్యంగా మార్చడానికి గల కారణం?
ఎ) అక్కడ నదులు రవాణాకు అనుకూలం
బి) ఇనుప నిక్షేపాలు లభించాయి
సి) వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు
డి) పైవన్నీ
13. కింది మగధ రాజులను వారి పాలనా కాలం ఆధారంగా గుర్తించండి?
ఎ) అజాత శత్రువు
బి) మహాపద్మనందుడు
సి) బింబిసారుడు
ఎ) ఎ, బి, సి బి) బి, ఎ, సి
సి) సి, ఎ, బి డి) సి, బి, ఎ
14. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో చర్చించిన అంశం?
ఎ) రాజ్య పాలన
బి) ఆర్థిక విషయాలు
సి) సాహిత్యం డి) శిల్పాలు
15. క్రీ.శ. 997-1030 మధ్యకాలంలో మధ్య ఆసియా నుంచి భారత దేశంపై దాడులు చేసిన ముస్లిం పాలకులు
ఎ) మహ్మద్ ఘోరీ
బి) మహ్మద్ గజనీ
సి) మహ్మద్ బిన్ ఖాసీం
డి) మహమ్మద్ బిన్ తుగ్లక్
16. పాలకులు వారు పరిపాలన చేసిన ప్రాంతాలకు సంబంధించి కిందివాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి?
ఎ) గాంగులు – ఒడిశా
బి) చేర – కేరళ
సి) రాష్ట్రకూటులు తమిళనాడు
డి) పాండ్యులు తమిళనాడు
17. రుద్రమదేవి పాలనా కాలం గుర్తించండి?
ఎ) క్రీ.శ.1116-1157
బి) క్రీ.శ.1158-1195
సి) క్రీ.శ.1199-1262
డి) క్రీ.శ.1262-1289
18. విజయనగరాన్ని పాలించిన వంశాల సరైన క్రమాన్ని గుర్తించండి?
1) సంగమ 2) సాళువ
3) అరవీటి 4) తుళువ
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 4, 3
సి) బి, 1, 4, 3 డి) 2, 1, 3, 4
20. బహమనీ రాజ్యం ఐదు రాజ్యాలుగా విడిపోయిన కాలం?
ఎ) క్రీ.శ. 1480-1520
బి) క్రీ.శ. 1489-1520
సి) క్రీ.శ. 1500-1530
డి) క్రీ.శ. 1490-1520
21. సర్వాయి పాపన్న ఏ మొఘల్ చక్రవర్తి సమకాలికుడు?
ఎ) బాబర్ బి) అక్బర్
సి) షాజహాన్ డి) ఔరంగజేబు
22. అసఫియా గ్రంథాలయంను నిర్మించింది?
ఎ) మీర్ ఉస్మాన్ అలీఖాన్
బి) మీర్ మహబూబ్ అలీఖాన్
సి) సిరాజుద్దౌలా
డి) నిజాం ఉల్-ముల్క్
23. అక్బర్ పరిపాలన కాలం?
ఎ) క్రీ.శ. 1509-1529
బి) క్రీ.శ. 1526-1530
సి) క్రీ.శ. 1526-1605
డి) క్రీ.శ. 1605-1627
24. సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్య దివాన్‌గా పనిచేసిన కాలం?
ఎ) క్రీ.శ. 1843-1873
బి) క్రీ.శ. 1853-1883
సి) క్రీ.శ. 1863-1903
డి) క్రీ.శ. 1855-1905
25. కిందివాటిలో సరైనది?
ఎ) 1906 ఢాకాలో ముస్లింలీగ్ పార్టీని స్థాపించారు
బి) 1915లో మదన్మోహన్ మాలవీయ హిందూ మహాసభను స్థాపించారు
సి) 1909 చట్టం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది
డి) పైవన్నీ
26. 1919 రౌలత్ చట్టం గురించి సరైనది?
ఎ) ఈ చట్టం 1919 మార్చి 18న
ప్రవేశ పెట్టారు
బి) ఈ చట్టం 1919 ఏప్రిల్ 6న
అమల్లోకి వచ్చింది
సి) ఏప్రిల్ 6ను ప్రార్థన గౌరవ భంగదినం గా జరుపుకోమని అన్నది గాంధీ
డి) పైవన్నీ
27. చీరాల పేరాల ఉద్యమం గురించి సరైనది?
ఎ) చీరాల పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
బి) ఈ ఉద్యమం వల్ల ప్రభావితమైన మొత్తం ప్రజల సంఖ్య 15,000
సి) ఈ ఉద్యమ కాలంలో ఏర్పాటు
చేసుకున్న నగరం పేరు రాంనగర్
డి) పైవన్నీ
28. శాసన ఉల్లంఘన ఉద్యమం గురించి సరైంది.
ఎ) ఈ ఉద్యమం 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగింది.
బి) ఈ ఉద్యమంలో గాంధీ 375 కి.మీ. నడిచాడు
సి) ఈ ఉద్యమంలో పాల్గొన్న మొత్తం సభ్యుల సంఖ్య 78 డి) పైవన్నీ
29. 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి సరైనది?
ఎ) ఈ చట్టంలో మొదట ఎస్సీ, ఎస్టీ పదాలను వాడారు
బి) ఈ చట్టం ద్వారా 1937లో 11
రాష్ర్టాలకు ఎలక్షన్స్ జరిగాయి
సి) 7 రాష్ర్టాల్లో కాంగ్రెస్ గెలిచింది
డి) పైవన్నీ
30. రెండో ప్రపంచ యుద్ధం గురించి సరైనది
ఎ) రెండోప్రపంచ యుద్ధకాలం 1939-1945
బి) ఈ యుద్ధంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా మిత్ర కూటమిగా పేరు తెచ్చుకున్నాయి
సి 1945లో అమెరికా హిరోషిమా,
నాగసాకిపై అణుబాంబులు వేయడంతో ముగిసింది
డి) పైవన్నీ
31. ముస్లింలీగ్ పార్టీ గురించి సరైన వాక్యం?
ఎ) 1937లో జరిగిన ఎన్నికల్లో 102 స్థానాలను గెలుచుకుంది
బి) సింధ్ రాష్ట్రంలో కూడా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది
సి) ముస్లింలీగ్ పార్టీ 1937-47 మధ్య బాగా ప్రజాదరణ పొందింది
డి) పైవన్నీ
32. పాకిస్థాన్ గురించి సరైన వాక్యం.
ఎ) పాకిస్తాన్ అనే పదాన్ని రూపొందించినది మహమ్మద్ ఇక్బాల్
బి) పాకిస్థాన్ అనే పదాన్ని రూపొందించినది రహమత్ అలీఖాన్
సి) ముస్లింలీగ్ 1946 ఆగస్టు 16ను ప్రత్యేక చర్య దినంగా జరుపుకొంది
డి) ముస్లింలీగ్ పార్టీ బెంగాల్ విభజనను సమర్థించింది
33. క్విట్ ఇండియా ఉద్యమం గురించి సరికానిది?
ఎ) క్రిప్స్ రాయబారాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు
బి) ఈ ఉద్యమ సమయంలో గాంధీ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు
సి) 1942 ఆగస్టు 9న గాంధీ, సర్దార్, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ వంటి నాయకులను అరెస్ట్ చేశారు
డి) ఈ ఉద్యమంలో ఎలాంటి నష్టం జరగలేదు
34. సుభాష్ చంద్రబోస్ గురించి సరైనది.
ఎ) ఇతడు బ్రిటిష్ వారిని తరిమేయడానికి జపాన్ సహాయం తీసుకోవాలన్నాడు
బి) ఇతడు తాత్కాలిక ప్రభుత్వాన్ని
సింగపూర్‌లో ఏర్పాటు చేశాడు
సి) ఇతడు ‘ఢిల్లీ పదండి’ అనే నినాదాన్ని ఇచ్చాడు డి) పైవన్నీ
35. గాంధీ ఘాతుకంపై సరైన వాక్యం కానిది?
ఎ) 1948 జనవరి 28న గాంధీ పిచ్చివాడి చేతిలో చావవలసి వస్తే నవ్వుతూ
చనిపోతానన్నాడు
బి) 1948 జనవరి 30న హతమార్చబడ్డాడు
సి) గాంధీ పాకుతూ మరణించాడు
డి) హరేరాం అంటూ మరణించాడు
36. జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి?
ఎ) సరోజినీ నాయుడు బి) కాదంబరి గంగూలీ
సి) శకుంత దేవి
డి) సుచేతా కృపలానీ
-ఆంజనేయులు విషయనిపుణులు
ఏకేఆర్స్టడీ సర్కిల్,వికారాబాద్
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు