ప్లస్ 2కి.. ఇంటర్‌బోర్డే ముద్దు
-మన సిలబస్ పై సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విద్యార్థుల ఆసక్తి
– ఏటా 30వేలకు పైగా విద్యార్థులు ఇంటర్ బోర్డులో చేరిక
-ఎంసెట్ సహా ఇతర పోటీ పరీక్షలే ఇందుకు కారణం
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లంటే మన దగ్గర యమ క్రేజీ. ఈ స్కూళ్లల్లో సీట్ల కోసం సిఫారసులు సర్వసాధారణం. అయితే ఇదంతా పదో తరగతి వరకే. ప్లస్ 2 లెవల్‌కి మాత్రం విద్యార్థుల ఆలోచనలు మారుతున్నాయి. పదో తరగతి వరకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో చదివిన విద్యార్థులు.. ప్లస్ 2కి మాత్రం ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో చేరుతున్నారు. ఏటా 30వేలకు పైగా విద్యార్థులు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లకు గుడ్‌బై చెప్పి.. ఇంటర్బోర్డులో ప్రవేశాలు పొందుతున్నారు. నిరుడు 27వేలకుపైగా విద్యార్థులు ప్రవేశాలు పొందగా, ఈ ఏడాది కూడా ఇలాంటి వారి సంఖ్య గణనీయంగానే ఉన్నది.
ఎంసెట్ కారణంగానే..
రాష్ట్ర విద్యార్థుల్లో అత్యధికులు ఎంసెట్ రాస్తుంటారు. ఈ పరీక్షను స్టేట్ సిలబస్, తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా నిర్వహిస్తారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల్లో ఎన్సీఈఆర్టీ పుస్తకాలను అనుసరిస్తారు. ఈ పుస్తకాలు జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ విద్యార్థులకు మాత్రమే ఉపయుక్తంగా ఉంటాయి. మన దగ్గర జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులున్నా.. ఐఐటీల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో ఎంసెట్‌ను ఎంచుకొంటున్నారు. ఇందుకు ఇంటర్‌బోర్డు సిలబస్ మంచిదన్న భావనతో విద్యార్థులు ఇటువైపు చూస్తున్నారు. ఇంటర్ బోర్డు సిలబస్ అనేక పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుండటం కూడా ఇందుకు ఓ కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పోటీ పరీక్షలకు మన సిలబస్ అనుకూలం
ఇంటర్‌బోర్డు సిలబస్ ఉత్తమం. సీబీఎస్ఈ పుస్తకాల తరహాలో సిలబస్ ను రూపొందించాం. సీబీఎస్ఈకి భిన్నంగా మన దగ్గర గణితంలో రెండు పేపర్లు అమలుచేస్తున్నాం. ముఖ్యంగా ఎంసెట్ వంటి పోటీపరీక్షలు రాసే వారికి ఇంటర్ బోర్డు సిలబస్ అనుకూలం. అందుకే విద్యార్థులు మన సిలబస్ ను ఇష్టపడుతున్నారు. ఇతర బోర్డుల నుంచి ఇంటర్బోర్డులో చేరేవారికి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ను ఇస్తున్నాం. ఈ ఏడాది 2వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. ప్రవేశాలు పూర్తయ్యే సరికి వీరి సంఖ్య 35వేలు దాటుతుంది.
– రమణరావు ఉడిత్యాల, ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ విభాగం, ఇంటర్ బోర్డు
2021-22 వివరాలు
బోర్డు విద్యార్థులు
సీబీఎస్ఈ 23,754
ఐసీఎస్ఈ 3,624
మొత్తం 27,378
- Tags
- CBSC
- icsc
- inter bord
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు