నిరుద్యోగ నిర్మూలన- ప్రభుత్వ విధానాలు
నిరుద్యోగం
ప్రస్తుతం అమల్లో ఉన్న వేతనానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా పని లభించని స్థితిని నిరుద్యోగం అంటారు.
నిరుద్యోగం – కారణాలు
శ్రామిక జనాభా పెరుగుదల
ఉపాధి రహిత వృద్ధి
వ్యవసాయ రంగంపై ఆధారపడటం
విద్యావిధానం
మూలధన సాంద్రత ఉత్పత్తి పద్ధతులు
శిక్షణ వసతుల కొరత
అల్పవనరుల వినియోగం
పరిశ్రమల ఆధునికీకరణ
అవస్థాపన సౌకర్యాల కొరత
చిన్న, కుటీర పరిశ్రమలు క్షీణించడం
ప్రాంతీయ, ఆదాయ అసమానతలు
ఆర్థిక స్థోమత కేంద్రీకరణ
ప్రభుత్వ విధానాలు
నిరుద్యోగ నిర్మూలన- ప్రభుత్వ విధానాలు-చర్యలు
-నిరుద్యోగ సమస్య స్వభావాన్ని, తీవ్రతను వాటి కారణాలను విశ్లేషించిన తరువాత నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలను ప్రభుత్వ విధానాలను తెలుసుకుందాం.
జనాభా నియంత్రణ
– జనాభా పెరుగుదల నియంత్రిస్తే శ్రామిక శక్తి తగ్గి నిరుద్యోగితను తగ్గించవచ్చు.
వ్యవసాయాభివృద్ధి
వ్యవసాయం దాని అనుబంధ కార్యకలపాలపై పెట్టుబడి పెట్టాలి. ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరగడానికి అవకాశం ఉంది.
ఉత్పత్తి పద్ధతుల ఎంపిక
భారతదేశంలో శ్రామిక శక్తి ఎక్కువ కాబట్టి మూలధన సాంద్రత పద్ధతులకు బదులు శ్రమసాంద్రత పద్ధతులు అవలంబిస్తే ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగం తగ్గుతుంది.
విద్యా విధానం పునర్వ్యవస్థీకరణ
ప్రస్తుత విద్యా విధానాన్ని సమూలంగా మార్చాలి అనాదికాలంగా కొనసాగుతున్న విద్యా విధానం గుమస్తాగిరి ఉద్యోగాలకు తోడ్పడే విధంగా ఉంది. దీనిని మార్చి ఆధునిక / ప్రస్తుత కాలానికి అనుగుణంగా, స్వయం ఉపాధిని కల్పించే విధంగా జాతీయస్థాయి కమిషన్ సిఫారుసులను అమలు చేయాలి.
వృద్ధి కేంద్రాలు
– గ్రామీణ వలసలను నియంత్రించి గ్రామీణ నిరుద్యోగితను అదుపు చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో శ్రమసాంద్రత పద్ధతులను చిన్న కుటీర పరిశ్రమలను పునర్ వ్యవస్థీకరించాలి. అందుకు తగిన శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఫలితంగా ఉపాధి పెరిగి నిరుద్యోగిత తగ్గుతుంది.
వికేంద్రీకరణ
-ఆర్థిక వికేంద్రీకరణే కాకుండా పారిశ్రామిక వికేంద్రీకరణ జరిగినట్లయితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు ఆదాయ అసమానతలు కూడా తగ్గుతాయి. వనరుల వినియోగం జరిగి ఉపాది పెరిగి నిరుద్యోగం తగ్గుతుంది.
కలామ్ నమూనా ఆచరణ Providing Urban Amenities to Rural Areas – PURA
– పట్టణ ప్రాంతాల సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాల్లో కూడా సమకూర్చేందుకు ఏపీజే అబ్దుల్ కలాం పుర నమూనాను ప్రతిపాదించారు.
ప్రత్యక్ష చర్యలు
-పైన పేర్కొన్న చర్యలు అన్ని వర్గాలవారికి ప్రయోజనకరంగా ఉండవు. మార్కెట్ వ్యవస్థ పరిధిలోకి వచ్చే వర్గాల వారికి కొన్ని ఉపాధి హామీ వంటి ప్రత్యక్ష చర్యల ద్వారా కూడా ఉపాధి కల్పించవలసి ఉంటుంది.
– నిరుద్యోగం, పేదరికం నిర్మూలనకు భారత ప్రభుత్వం 1970 వరకు ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని అనుసరించింది.
– ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సిద్ధాంతం అంటే దేశంలో అభివృద్ధి జరుగుతుంటే పెరిగే అభివృద్ధి / ఆదాయం కిందిస్థాయికి ప్రవహించి అంటే పేద అట్టడుగు వర్గాలకు చేరి పేదరికం, నిరుద్యోగం అదే తగ్గుతుందని ప్రభుత్వం, ప్రభుత్వ విధాన కర్తలు భావించారు. దీనినే ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సిద్ధాంతం అంటారు.
– మన దేశంలో వృద్ధి రేటు తక్కువగా ఉండటం వల్ల ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సిద్ధాంతం పనిచేయలేదు. అందుకే దాని స్థానంలో లక్ష్య వర్గాల పద్ధతి (Target Group Appoach) ని ప్రవేశపెట్టారు.
– 1970 తర్వాత లక్ష్య వర్గాల పద్ధతిని అనుసరించి పేదరికం, నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా చేసుకొని ప్రత్యక్షంగా పేదరికం, నిరుద్యోగ నిర్మూలన పథకాలను చేపట్టింది.
– 1973 లో శ్రీ పి.బి. భగవతి కమిటి కూడా పేదరిక, నిరుద్యోగం నిర్మూలనకు ప్రత్యక్ష చర్యలను పథకాలను చేపట్టాలని భారత ప్రభుత్వానికి సంబంధించింది.
-టార్గెట్ గ్రూప్ అప్రోచ్ ఆధారంగా పేదరికం నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేసిన / ప్రవేశ పెట్టిన పథకాలు 3 రకాలు అవి.
1) స్వయం ఉపాధి పథకాలు ఉదా: TRYSEM, PMRY, PMEGP, SGSY
2) వేతన ఉపాధి పథకాలు ఉదా: NREGS, JRY, FFWS, SGRY
3) సామాజిక భద్రత పథకాలు ఉదా: అన్నపూర్ణ, AAY
– పేదరికం, నిరుద్యోగం నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యక్షంగా తీసుకున్న చర్యల్లో ముఖ్యంగా ప్రణాళికలు ప్రారంభించిన తరువాత మొదటి మూడు ప్రణాళికల్లో ఏమి లేకపోయిన ముఖ్యంగా 4వ ప్రణాళిక నుంచి నిరుద్యోగ నిర్మూలనకు ప్రత్యేక పథకాలు
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం (IRDP)
అమలు చేసింది. వాటిలో ముఖ్యమైనవి.
– 1960లో ప్రవేశ పెట్టారు. వ్యవసాయం విస్తృత వ్యవసాయాభివృద్ధికి, ఉపాధికల్పనకు, ఉత్పత్తికి దోహదం చేసే శ్రమసాంద్రత పద్ధతులను ఉపయోగించి ఉపాధిని పెంచి నిరుద్యోగితను తగ్గించవచ్చు.
గ్రామీణ పరిశ్రమల ప్రాజెక్టులు
– గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఉద్యోగాలు కల్పించి పారిశ్రామికోత్పత్తిని పెంచుట ద్వారా దీనిని 1962-63లో చేపట్టింది.
గ్రామీణ పనుల కార్యక్రమం (Rural work Programme)
– తరచూ దుర్భిక్షానికి గురయ్యే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లనిర్మాణం, నీటి పారుదల, భూ సంరక్షణ, పునరుద్ధరణ మొదలైన కార్యక్రమాలను చేపట్టి వ్యవసాయ కూలీలకు పని కల్పించడం దీని లక్ష్యం.
ఉపాంత రైతులు, వ్యవసాయ శ్రామికుల అభివృద్ధి (MFAL-DA)
– వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాలపాలకు కావలసిన సౌకర్యాలను (అవస్థాపన, పరపతి) అందించడం.
సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ (SFDA)
-సాంద్ర, విస్తృత వ్యవసాయ విస్తరణకు చిన్న, సన్నకారు రైతులకు పరపతిని అందించడం దీని లక్ష్యం.
ఏరియా అభివృద్ధి పథకాలు
-దీనిని 1975లో ప్రవేశ పెట్టారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల వద్ధ అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.
మహారాష్ట్ర ఉపాధిహామి పథకం (MEGP)
-దీన్ని 1972-73లో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దేశంలో మొట్టమొదటి సారిగా పనిచేసే హక్కు నినాదం ఈ పథకం ద్వారా గుర్తింపు పొందింది. దీని ద్వారా పనిచేసే శ్రామిక శక్తికి పని కల్పించే బాధ్యత ప్రభుత్వం తనపై వేసుకుంది.
గ్రామీణ యువకులు స్వయం ఉపాధి పథకం (TRYSEM)
– దీనిని 1979లో ప్రవేశ పెట్టారు. గ్రామీణ విద్యావంతులకు ఏదో ఒక వృత్తిలో శిక్షణ ఇచ్చి వారు స్వయం ఉపాధి కల్పించుకునేలా చేయటం దీని లక్ష్యం దీనిని IRDP లో విలీనం చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (NREP)
– ఈ పథకాన్ని 1980 అక్టోబర్ నుంచి ప్రారంభించారు. గ్రామీణ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టే ఉపాది అవకాశాలను కల్పించడం దీని లక్ష్యం. దీనిని JRY లో విలీనం చేశారు.
పారిశ్రామిక సేవారంగంలో ఉద్యోగ సమన్వయ బ్యూరో: దీన్ని 1979 ఫిబ్రవరిలో ప్రారంభించారు. దీనిని IRDP లో విలీనం చేశారు.
సమన్విత/ సంఘటిత గ్రామీణాభివృద్ధి పథకం (IRDP- Intigrated Rural Develo pment Programme)
l SFDA-1974,MFAL-1973,DPAP- 1973, DDP-1977, CADP-1975, EGP-1993, PWP-1977, TRYSEM-1979 మొదలైన పథకాలను ఐఆర్డీపీలో విలీనం చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన వ్యవసాయ, వ్యవసాయ, వ్యవసాయేతర వృత్తుల్లో ఉపాధిని కల్పించడం దీని లక్ష్యం.
గ్రామీణ భూమిలేని ఉపాధి హామీ పథకం: (RLEGP-Rural land less Employ ment Guarantee Programmee)
-దీనిని 1983 ఆగస్టు 15 నుంచి అమలు చేశారు. దీనిని జవహర్ రోజ్‌గార్ యోజన(JRY)లో విలీనం చేశారు.
-ఇందిరా ఆవాస్ యోజన (IAY)-1985
– జవహర్ రోజ్‌గార్ యోజన పథకం( JRY), ఆర్ఎల్ఈజీపీ, ఎన్ఆర్ఈపీ పథకాలను విలీనం చేసి 1989 ఏప్రిల్ 28న రాజీవ్‌గాంధీ ఈ పథకాన్ని ప్రారంభించింది.
-గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబంలో ఒక్కొక్కరికి కనీసం 50-100 రోజులు ఉపాధి కల్పించడం దీని లక్ష్యం.
నెహ్రూ రోజ్‌గార్ యోజన(NRY)
– 1989 అక్టోబర్‌లో రాజీవ్‌గాంధీ ప్రారంభించారు. పట్టణ నిరుద్యోగితను నిర్మూలించుటకు ఈ పథకం ప్రారంభించారు.
ప్రధాన మంత్రి ఉద్యోగ హామీ పథకం(PMEGP):
-దీనిని 1993 ఆగస్టు 15న ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో 18-35 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యావంతులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం.
-SGSY (స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన) – 1999
-SGRY (సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన)-2001
-భారత్ నిర్మాణ్ పథకాన్ని కేంద్రప్రభుత్వం 2005లో ప్రవేశ పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలను కల్పించడం దీని లక్ష్యం.
PMEGP-2008
MUDRA-2016
– మేక్ ఇన్ ఇండియా: దీనిని 2014 సెప్టెంబర్ 25న ప్రారంభించారు. దేశంలో ద్వితీయ, తృతీయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధిని పెంచడం దీని లక్ష్యం.
– అటల్ పెన్షన్ యోజన -2015 మే 19.
-ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2015 జూలై 15 ప్రారంభించారు
– స్టార్టప్ ఇండియా : 2016 జనవరి 16న ప్రారంభం.
-శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ -2016 ఫిబ్రవరి 21న ప్రారంభం
ప్రాక్టీస్ బిట్స్
1. ఈ కిందివాటిలో నిరుద్యోగితకు గల కారణాలు కానిది ఏది ?
ఎ) మూలధన సాంద్రత ఉత్పత్తి పద్ధతులు
బి) అల్ప వనరుల వినియోగం
సి) వికేంద్రీకరణ
డి) ప్రాంతీయ ఆదాయ అసమానతలు
2. కింది వాటిలో నిరుద్యోగ నిర్మూలన చర్య కానిది ఏది?
ఎ) జనాభా నియంత్రణ
బి) ఆర్థిక స్థోమత వికేంద్రీకరణ
సి) విద్యా పునర్వ్యవస్థీకరణ
డి) ఆధునిక ఉత్పత్తి పద్ధతులు
3. ‘పుర’ పథకాన్ని ప్రతిపాదించినది ఎవరు?
ఎ) ఎ.పి.జె. అబ్దుల్ కలాం
బి) జేఆర్డీ టాటా
సి) ఎ.సి. పిగూ డి) పై అందరూ
4. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సిద్ధాంతం ఎప్పటి వరకు అనుసరించారు?
ఎ) 1960 బి) 1965
సి) 1970 డి) 1975
5. నిరుద్యోగ నిర్మూలనకు తగు సూచనలు చేసిన కమిటీ ఏది?
ఎ) వాంచూ కమిటీ
బి) భగవతి కమిటీ
సి) దేశాయ్ కమిటీ
డి) గోస్వామి కమిటీ
6. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సిద్ధాంతం స్థానంలో ప్రవేశ పెట్టిన మరొక పద్ధతి ఏది?
ఎ) లక్ష్యవర్గాల పద్ధతి
బి) కలాం నమూనా ఆచరణ
సి) స్వయం ఉపాధి పథకాలు
డి) ఉపాధి వర్గాల పద్ధతి
7. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం (RADP) ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
ఎ) 1955 బి) 1960
సి) 1965 డి) 1970
8. ‘పనిచేసే హక్కు’ అనే నినాదం ఏ పథకం ద్వారా గుర్తింపు వచ్చింది?
ఎ) జాతీయ గ్రామీణ ఉపాధి పథకం
బి) సమన్వయ గ్రామీణాభివృద్ధి పథకం
సి) మహారాష్ట్ర ఉపాధి హామీ పథకం
డి) పైవన్నీ
9. TRESEM ప్రధాన లక్ష్యం?
ఎ) గ్రామీణ నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం
బి) గ్రామీణ విద్యా వంతులకు శిక్షణ ఇవ్వడం
సి) గ్రామీణ నిర్మాణ కార్యక్రమం ద్వారా పని కల్పించడం డి) పైవన్నీ
సమాధానాలు
1-సి 2-డి 3-ఎ 4-సి 5-బి 6-ఎ 7-బి 8-సి 9-బి
పానుగంటి కేశవ రెడ్డి
లెక్చరర్
గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?