టీ-సాట్ లో పోటీ పరీక్షల పాఠ్యాంశ ప్రసారాలు మరోగంట పొడిగింపు
తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్న గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీ -సాట్ ప్రసారం చేస్తున్న పాఠ్యాంశాల ప్రసారాన్నిమరో గంట పాటు పొడిగిస్తున్నట్లు టీ-సాట్ సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ప్రతి రోజూ నాలుగు గంటల పాటు-ఎనిమిది పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నామని ప్రకటించారు. టీ-సాట్ నిపుణ ఛానల్ లో సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, విద్య ఛానల్ లో ఉదయం ఆరు గంటల నుండి 10 గంటల వరకు ప్రసారాలుంటాయని, గతంలో మూడు గంటలుగా ఉన్న ప్రసారాలను మరో గంట అదనంగా ప్రసారం చేస్తున్నామని తెలిపారు.
ప్రసారమవుతున్న నాలుగు గంటల్లో గంట పాటు ఇంగ్లీష్ పాఠ్యాంశాలుంటాయన్నారు. టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యాక మే ఒకటి నుండే టీ-సాట్ బోధనా పాఠ్యాంశ ప్రసారాలు ప్రారంభించిందని తెలిపారు. అక్టోబర్ 16వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష తేదీని ఖరారు చేసినందున అదనపు పాఠ్యంశాలను ప్రసారం చేసి, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు మరింత వెసులుబాటు కలిగించాలని నిర్ణయించినట్లు శైలేష్ రెడ్డి వివరించారు.
ఇప్పటి వరకు సుమారు 180 పాఠ్యాంశ భాగాలు ప్రసారాలు చేశామని అక్టోబర్ 10వ తేదీ వరకు 620 పాఠ్యాంశ భాగాలను ప్రసారాలు చేయాలని నిర్ణయించామని, ఆంగ్ల భాష ప్రసారాలతో కలిపి మొత్తం 1200 పాఠ్యాంశ భాగాలు ప్రసారం చేస్తామని స్పష్టం చేశారు. అనుభవం కలిగిన ఫ్యాకల్టీ, ఆధునిక సాంకేతికతో భోధించే పాఠ్యాంశాలను గ్రూప్-1 పోటీ పరీక్షల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని శైలేష్ రెడ్డి కోరారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు