జేఈఈలో సత్తా చాటిన గురుకుల విద్యాలయాల విద్యార్థులు
వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఇంటర్‌తోనే చదువు ఆపేయకుండా ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లోని జూనియర్ కాలేజీ విద్యార్థులకు సూపర్ 100 పేరుతో నీట్, ఎంసెట్ లతో పాటు వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్ ఇస్తున్నారు.
కాగా ఎన్ఐటీ, ఐఐటీలో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ (ఫస్ట్ సెషన్) ప్రవేశ పరీక్షల్లో గురుకుల విద్యాలయాల సంస్థ లోని జూనియర్ కాలేజీ విద్యార్థులు మంచి మార్కులతో ఉతీర్ణత సాధించారు. 60మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 23మంది ఉతీర్ణత సాధించారు. వీరిలో 92.01 స్కోరుతో భరత్ కుమార్ సత్తా చాటాడు. 2020 -21లోనూ జెఈఈ మెయిన్స్ లో ఇరవై మంది విద్యార్థులు అర్హత సాధించి ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరారు.
గతంతో పొలిస్తే ఈ ఏడాది జెఈఈ మెయిన్స్ మొదటి సెషన్ లో ఉత్తీర్ణత సాధించిన వారి సంఖ్య 23కు చేరింది. రెండో సెషన్ లో మరింత ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష రాసి మంచి మార్కులు సాధించి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధిస్తారని కార్యదర్శి మల్లయ్య బట్టు ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినవిద్యార్థులను, అందుకు సహకరించిన అధ్యాపకులను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం అభినందించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు