పాజిటివ్ థింకింగ్ పెంచుకోండిలా..
మైండ్‌లో అల్లకల్లోలంగా ఉండే స్థితిలో ఏ విద్యార్థి ప్రశాంతంగా చదువుకోలేడు. పరీక్షలను విజయవంతంగా రాయనూలేడు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ముందుగా మైండ్‌లో ఉన్న నెగెటివ్ కలుపు మొక్కలను ఏరిపారేయాలి. తరువాత పాజిటివ్ భావాలకు బీజాలను నాటాలి.
మైండ్‌ను ఒక కంప్యూటర్‌తో పోల్చినట్లయితే మెదడు ఒక హార్డ్‌వేర్ లాంటిది. మనం ఇంతకాలం పెంపొందించుకున్న విషయాలన్నీ ఒక సాఫ్ట్వేర్ మాదిరిగా పనిచేస్తాయి. దాంతో మన మైండ్ ప్రక్రియలన్నీ ఈ ప్రోగ్రామింగ్ ఆధారంగానే సాగుతాయి. అందువల్ల మనం ఎప్పుడూ చేసే పనినే చేస్తూ ఉంటే ఎప్పుడూ వచ్చే ఫలితమే వస్తుంది. కొత్తగా ఒక ప్రయోజనకరమైన ఫలితం రాబట్టాలంటే చేసే విధానం కొత్తగా ఉండాలి. సాఫ్ట్వేర్ మార్చనిదే అది సాధ్యంకాదు. అందుకోసం మనం చిన్నప్పటి నుంచి పోగుచేసుకుంటూ వచ్చినవాటిలో మనకిప్పుడు ఏమాత్రం ఉపయోగపడని అంశాలన్నిటినీ తొలగించుకుంటూ రీ ప్రోగ్రామింగ్ చేసుకోవాలి.
మన బ్రెయిన్లో అనే సంవత్సరాలుగా మనం పోగుపెట్టుకుంటూ వచ్చిన నెగెటివ్ అంశాలన్నిటినీ విడిగా వర్గీకరించుకోవాలి. వాస్తవానికి అవన్నీ కలగలిపి ఒక పెద్ద చెత్తరాశిగా తయారయ్యాయి. ఇప్పుడు చెత్తరాశిని బయటకు నెట్టి పాజిటివ్ భావాలను పోగుచేసుకోవాలి. అనాదిగా పేరుకుపోయిన ఈ చెత్తను ఎత్తివేయడానికి మీరు ఇప్పుడు రెడీగా ఉండండి. మీ మైండ్పవర్ నోట్‌బుక్‌లో రెండో పేజీ తిప్పండి. అక్కడ లోపలున్న చెత్త, బయటపడే చెత్త అని హెడ్డింగ్ పెట్టండి. తరువాత కింది విధంగా ఒక పట్టికను గీసుకోండి.
-ఈ రెండు కాలమ్‌లను మీ స్వవిషయాలతో పూరించం డి. అంటే మీ మైండ్‌లో మీ పట్ల మీకు గల నెగెటివ్ అభిప్రానయాలన్నిటినీ పై పట్టికలో ఎడమచేతివైపు వరుసగా రాసుకోండి. పైన కనిపిస్తున్న పట్టికలో నేనిచ్చిన 1, 2, 3లు ఉదాహరణలు మాత్రమే. వీటి మాదిరిగా ఉన్న మీ నెగెటివ్ అభిప్రాయాలనుగానీ, భావాలనుగానీ వరుసగా రాసుకోండి. వాటికి ఎదురుగా, కుడివైపున ఆయా అభిప్రాయాల మేరకు మీ ప్రవర్తనలో చోటుచేసుకునే చర్యలను రాయండి. పరీక్షల్లో సరిగ్గా రాయలేను అనేది మీ నిశ్చితాభిప్రాయం అయినట్టయితే ఆ నెగెటివ్ అభిప్రాయం మీరు పరీక్ష రాయడానికి హాల్లో కూర్చున్నప్పుడు మీపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా మీలో ఆందోళన, కంగారు, చెమటలు పట్టడం వంటి ఉపద్రవాలు ఎదురవుతాయి.
ఇలాగే మీ పట్ల మీకు గల అనేక ఇతర నెగెటివ్ సర్టిఫికెట్ల మూలంగా మీ ప్రవర్తన పరిమితమైపోవడమే కాకుండా అపక్రమంగా తయారవుతుంది. దీని నుంచి బయటపడటానికి మీరు ముందుగా దీన్ని సమగ్రంగా అర్థం చేసుకొని, అవగాహన పెంపొందిచుకోవాలి. అందుకు పై పట్టిక చక్కగా ఉపయోగపడుతుంది. ఈ లిస్టు రాయడం పూర్తిచేశాక, నా మైండ్‌లో ఇన్ని పనికిరాని ఆలోచనలు ఉన్నాయా? అని నోరు వెళ్లబెడతారు. ఈ నెగెటివ్ ఆలోచనలే మీ ఇంటర్నల్ టేపులోల బ్యాక్టీరియా పాకినట్టు మిమ్మల్ని ఇలా తయారు చేశాయని మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇవే మీ ఆత్మవిశ్వాసాన్ని చంపేసి మీ మార్కులు పడిపోవడానికి ప్రధాన కారణం అయ్యాయి.
తరువాత ఏం చెయ్యాలి?
సిసిలీ సామెత ప్రకారం మన ఆలోచనల కన్నా మనల్ని అతిదారుణంగా మోసగించేవారు ఎవరూలేరు ఇది మన మైండ్ లోపలున్న చెత్త విషయంలో అక్షర సత్యంగా రుజువవుతుంది. దీన్ని తొలగించుకోవడానికి మీరు మరో కొత్త పట్టికను మీట్ నోట్‌బుక్‌లో గీసుకోండి దీనిలో రెండు కాలమ్స్ పెట్టండి. ఎడమ చేతివైపు మీ మైండ్‌కు మీరివ్వాల్సిన ఇన్పుట్లను అదే హెడ్డింగ్ కింద రాసుకోండి. కుడి చేతివైపున పాజిటివ్ అపుట్‌పుట్ అని హెడ్డింగ్ పెట్టండి. ఇప్పుడు ఎడమ చేతివైపు 1. నేను పరీక్షలను ప్రేమిస్తాను. 2. నేను మ్యాగ్జిమమ్ ప్రయత్నం చేస్తాను వంటి నమూనాలో వరుసగా మీ లక్ష్యాలకు సంబంధించిన అంశాలను రాసుకోండి. ఇప్పుడు నోట్‌బుక్‌ను పక్కనపెట్టి, క్రిస్టల్ బాల్‌ను తీసుకోండి. ఒక్కొక్క పాజిటివ్ అంశాన్ని తీసుకొని మీ ఇమాజినేషన్‌ను డెవలప్ చేసుకోండి. ఉదాహరణకు నేను డయాస్ ఎక్కన తరువాత అనర్గళంగా మాట్లాడుతాను అని మీలో మీరు స్పష్టంగా వల్లించుకోండి.
క్రిస్టల్ బాల్‌ను చేత్తో పట్టుకొని మీరు అనర్గళంగా ఉపన్యసిస్తున్న దృశ్యాన్ని ఊహించుకోండి. మీ ఊహలో మీకు స్పష్టంగా కనిపిస్తున్న అంశాలను, మాలకాలను, విజువల్, ఆడిటరీ, కైనస్థటిక్ అంశాలను గమనించండి. వాటిని వరుసగా, పట్టికలోని కుడివైపున రాయండి. అంటే మీ మైండ్‌కు మీరిచ్చిన ఇన్పుట్ ఫలితంగా మీకు లభించిన పాజిటివ్ అవుట్‌పుట్ లేదా మీ ప్రవర్తనలో చోటుచేసుకున్న కొత్త పాజిటివ్ చర్యలను మీ పట్టికలో పొందుపరిచారన్నమాట.
ఈ టెక్నిక్‌ను చదువులో విజయం సాధించడానికి మాత్రమేకాక, విద్యార్థులే కాకుండా ఎవరైనా సరే, ఏ రంగానికి చెందినవారైనా సరే విజయాలను చేజిక్కించుకోవడానికి చక్కగా వినియోగించుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా ముందుగా మీరు ఏయే అంశాలకు సంబంధించి మార్పును కోరుకుంటున్నారో స్పష్టంగా వర్గీకరించుకోవాలి. ఉదాహరణకు 1. నాకు అందరితోనూ సత్సంబంధాలు ఉండాలి. 2. నేను ఆటలలో రాణించాలి. 3. పబ్లిక్ పరీక్షలో నంబర్‌వన్ ర్యాంక్ తెచ్చుకోవాలి. 4. ఎనర్జిటిక్‌గా ఉండాలి. ఇలా వేరువేరుగా అంశాలను స్పష్టం గా విభజించాలి. తరువాత ఒక్కొక్క అంశానికి సంబంధించి పాజిటివ్ సజెషన్లు తయారు చేసుకోవాలి. వీటని అఫర్మేషన్లు అంటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు