జేఈఈ మెయిన్ (సెషన్ -2) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్ : జేఈఈ మెయిన్ (సెషన్ -2) దరఖాస్తులకు షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. జూన్ 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 30న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జేఈఈ మెయిన్ (సెషన్ -2) ఎగ్జామ్స్ జూలై 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.
20 నుంచి మెయిన్ -1 పరీక్షలు
జేఈఈ మెయిన్ -1 ఎగ్జామ్స్ ఈ నెల 20 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. మొదటి విడత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఈ నెల రెండో వారం నుంచి అడ్మిట్‌కార్డులు జారీచేస్తారు.
ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్
జేఈఈ మెయిన్ ఫలితాల తర్వాత నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్‌ను ఆగస్టు 28న నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం అయిదున్నర గంటల వరకు పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 7 నుంచి 11 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయొచ్చు.
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






