‘నెట్’లో నెగ్గడం ఎలా!
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) సాధించాలన్నా, లెక్చరర్‌షిప్‌నకు అర్హత పొందాలన్నా యూజీసీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) పాసవ్వాలి. జేఆర్ఎఫ్ సాధించినవారికి యూజీసీ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ‘నెట్’లో ఎలా నెగ్గాలో తెలుసుకుందాం.
# ‘ఈ పరీక్షకు ప్రతి అభ్యర్థి పక్కా ప్రణాళికతో ప్రిపేరవ్వాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు గత ప్రశ్నపత్రాలను ణ్ణంగా పరిశీలించి, దానికి తగినట్టుగా ్యహంతో చదవాలి. 2018 డిసెంబర్ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నెట్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. అప్పటి నుంచి ప్రశ్నలు అడిగే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కాలానికి అనుగుణంగా ప్రశ్నలు మరింత క్లిష్టంగా అగుతున్నారు.
# ఇటీవల అగుతున్న ప్రశ్నల రకాలు పరిశీలిస్తే అసెన్షన్ రీజనింగ్, మ్యాచ్ ది ఫాలోయింగ్, క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడం, ఒక సబ్జెక్టుకు ఇంకొక సబ్జెక్టును అనుసంధానం చేస్తూ అడగటం, సరైన/ తప్పు స్టేట్మెంట్ ఆధారిత ఇంకా మరెన్నో నూతన పద్ధతిలో ప్రశ్నలు అగుతున్నారు.
# కాబట్టి అభ్యర్థులు సరైన పద్ధతిని అనుకరిస్తూ ఈ రెం నెలలు కష్టపడితే అనుకున్నది సాధించవచ్చు. దానికి పేపర్-1- 50 ప్రశ్నలు మొత్తం 10 యూనిట్ల నుంచి, పేపర్-2 -100 ప్రశ్నలు మొత్తం 10 యూనిట్ల నుంచి అడుగుతున్నారు. పేపర్-2 సబ్జెక్ట్ పేపర్ కావడంవల్ల అభ్యర్థి మాస్టర్ డిగ్రీలో చదివిన సబ్జెక్టు ఎక్కువగా ఉంటుంది.
పేపర్-1లో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా?
# చాలామందికి మొదటి పేపర్ కొత్తగా ఉంటుంది. కాబట్టి అది కాస్త కష్టంగా అనిపించవచ్చు. కానీ సరైన గైడెన్స్‌తో 10 యూనిట్లను సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈ 10 విభాగాల్లో కొంత పట్టు సాధిస్తే 50కి 40 ప్రశ్నలకు సులువుగా సమాధానం రాయవచ్చు. ముందుగా విభాగాలుగా విభజించి, తగిన సమయం కేటాయించి ప్రిపేరవ్వాలి.
# సిలబస్ ఎక్కువగా ఉండటం వల్ల పరీక్షకు అనుగుణంగా తక్కువ సమయంలో సాధించేలా చదవాలి. ఇందుకు 10 యూనిట్లను కింది విధంగా సాధన చేయాలి.
# పేపర్-1లో కొన్ని యూనిట్లకు రోజువారీ సాధన అవసరం. అంటే ప్రతిరోజూ 15 నిమిషాలు యూనిట్-3 రీడింగ్ కాంప్రహెన్షన్, మరొక 15 నిమిషాలు యూనిట్-7 డేటా ఇంటర్‌ప్రిటేషన్ గత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే సులువుగా 20 మార్కులకు 20 సాధించవచ్చు.
# చాలామంది యూనిట్-5 మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ కఠినంగా భావిస్తుంటారు. కానీ ఇందులో గత ప్రశ్నలను రోజుకి 10 చొప్పున సాధన చేయాలి. అంతేకాదు ఈ యూనిట్‌కి సంబంధించి కొన్ని ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకుంటే, అవగాహన పెరిగి సులభంగా మార్కులు సాధించవచ్చు.
# యూనిట్-1 టీచింగ్ ఆప్టిట్యూడ్, యూనిట్-2 రిసెర్చ్ ఆప్టిట్యూడ్‌కి సంబంధించి సాధారణ అవగాహనతో ఇచ్చిన సిలబస్‌పై పట్టు సాధించి, ప్రశ్నలు అడిగే పదజాలం అర్థం చేసుకోవాలి.
# యూనిట్-4 కమ్యూనికేషన్ అతి సులువైన విభాగం. కానీ ఈ మధ్యకాలంలో ప్రశ్నలు కమ్యూనికేషన్ చరిత్రను అనుసంధానం చేస్తూ క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడం, కమ్యూనికేషన్ రకాలను ప్రాక్టికల్ పద్ధతిలో అడుగుతున్నారు. ఇందుకు కమ్యూనికేషన్ బేసిక్స్ సరైన పద్ధతిలో అర్థం చేసుకుంటే హైలెవల్ ప్రశ్నలకు కూడా సమాధానం సులువుగా గుర్తించవచ్చు.
# యూనిట్-6 లాజికల్ రీజనింగ్, అత్యధిక అభ్యర్థులు అతికష్టంగా భావించే విభాగం. ఎందుకంటే ఇటీవల కొత్త సిలబస్ ప్రకారంగా ఇండియన్ లాజిక్ అనే ఒక నూతన భాగాన్ని జోడించారు. కానీ పదజాలాన్ని అర్థం చేసుకుంటూ, ఇండియన్ లాజిక్ సబ్జెక్ట్‌ను పరివూర్ణంగా కాకుండా కొంతవరకు ప్రాథమిక అవగాహనతో ప్రశ్నలకు సమాధానం రాయవచ్చు. ఇందుకు యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడం చాలా సులభం. యూనిట్-6లో మిగతా విభాగాలు అత్యంత సులువుగా ఉంటాయి. గత ప్రశ్నలను అనుసంధానం చేస్తూ చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
# యూనిట్-8 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది అత్యంత సులభమైన విభాగం. ఐదుకు ఐదు ప్రశ్నలు సరిగ్గా చేసి 10 మార్కులు సులువుగా పొందవచ్చు.
# యూనిట్-9 పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. అతికష్టంగా భావించే విభాగం. ప్రశ్న విధానం చాలా కష్టంగా ఉంటుంది. కానీ కొన్ని స్థిరమైన భాగాలు నేర్చుకుంటే, ప్రశ్నలు అదే భాగాల నుంచి వచ్చే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు ఎండీజీ, ఎస్డీజీ, ఎన్ఏపీసీసీ, ఎన్విరాన్మెంట్ అగ్రిమెంట్లు, సోలార్ అలయన్స్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ వంటి విభాగాల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతున్నారు.
# యూనిట్-10 హయ్యర్ ఎ్యకేషన్ సిస్టం. ప్రాచీన విద్య నుంచి నేషనల్ ఎ్యకేషన్ పాలసీ- 2020 వరకు ప్రశ్నలు అగుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి, కింది వాటిలో సరైనది/సరికానిది లాంటి ప్రశ్నలు అగుతున్నారు. చాలా ప్రశ్నలు ఎ్యకేషన్ కమిటీల పై, హయ్యర్ ఎ్యకేషన్ బాడీస్ UGC, AICTE, NAAC వంటి వాటిపై, యూనివర్సిటీ రకాలు, వాటి విధులు, నియమాలు, యూనివర్సిటీ సోపానక్రమం ఇలాంటి వాటిపై ప్రశ్నలు అగుతున్నారు.
# కరెంట్ అఫైర్స్‌ను జోడిస్తూ ఈ యూనిట్‌ను చదివితే ఐదుకు ఐదు ప్రశ్నలు సరిగ్గా చేయవచ్చు.
# ప్రతి సబ్జెక్టు పై ప్రాథమిక అవగాహన అవసరం. ఇందుకు ఏవైనా పుస్తకాలు, ఇంటర్నెట్ ఉపయోగించి నేర్చుకోవచ్చు.
# పేపర్-2 కాస్త సులభంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇంతకుముందు చదివింది కాబట్టి. ఇంకా కొంచెం నెట్‌కు అనుగుణంగా ప్రిపేరయితే విజయం సాధించవచ్చు.
గత ప్రశ్నపత్రాల ప్రాముఖ్యత
# గత ప్రశ్నపత్రాలను అర్థం చేసుకుంటూ చదవడం ద్వారా ప్రశ్నలు అడిగే విధానంపై అవగాహన కలుగుతుంది.
# గత ప్రశ్నపత్రాలను చదువుతున్నప్పు సరైన సమాధానం ఒక్కటే చూసుకోవడం కాకుండా మిగతా మూ ఆప్షన్లు కూడా అర్థం చేసుకుంటూ ప్రతి ప్రశ్నను సాధన చేస్తే కాన్సెప్ట్‌పై పట్టు పెరుగుతుంది.
# గత ప్రశ్నపత్రాల్లో కొత్త కాన్సెప్ట్ చూసినప్పు దానికి సంబంధించిన సమాచారాన్ని గూగుల్ సహాయంతో వెతికి నోట్‌బుక్‌లో రాసుకోవడం మంచిది.
# గత ప్రశ్నల సమాధానాలు అని సింగిల్ లైన్ రూపంలో నోట్‌బుక్‌లో రాసుకోవడం ద్వారా రివిజన్ సులభంగా ఉంటుంది.
# గత ప్రశ్నపత్రాలను టాపిక్ వైజ్ రూపంలో సాధన చేస్తే ప్రతి ఒక్క యూనిట్ నుంచి ప్రశ్నలు అడిగే విధానం అర్థం చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఏ విభాగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అగుతున్నారనేది ఒక అవగాహన వస్తుంది. ఇలా ప్రతి ఒక్క యూనిట్ చేస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
# కనీసం 5 మాక్ టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల టైం మేనేజ్మెంట్, ఏకాగ్రత పెరుగుతాయి.
# నెట్ ప్రిపరేషన్ త్వరలో వెలువడే తెలంగాణ సెట్ (స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్) 2022కు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నెట్ దేశవ్యాప్తంగా జరిగితే, టీఎస్ సెట్ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే జరుగుతుంది. అదేవిధంగా సిలబస్, ప్రశ్నపత్రం, ప్రశ్నలు అడిగే విధానం ఒకే రకంగా ఉంటుంది.
వీ శివలింగం
విషయ నిపుణులు
నల్లగొండ
9666364708
- Tags
- competitive exams
- JRF
- NET
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?