కమిటీలు – కసరత్తులు
నిగర్వేకర్ కమిటీ: సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షా విధానంలో చేయాల్సిన మార్పులను సూచించడానికి ఈ కమిటీని 2011లో ఏర్పాటుచేశారు. 2013లో ఈ కమిటీ నివేదికను అందజేసింది.
-జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ: నిర్భయ అత్యాచార ఘటనానంతరం అత్యాచార నిరోధక చట్టానికి మరిన్ని సిఫారసులను సూచించే ఉద్దేశంతో కేంద్రం వర్మ నేతృత్వంలో కమిటీని నియమించింది.
-రంగనాథన్ కమిటీ: మత, భాషా సంబంధ మైనారిటీలపై మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన నివేదికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు 10 శాతం, ఇతర మైనారిటీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది.
-దీపక్ పరేఖ్ కమిటీ: దేశంలో పెట్టుబడులను ముఖ్యంగా మౌలిక రంగంలోకి భారీగా ఆకర్షించేందుకు విద్యుత్, రైల్వే టికెట్ చార్జీలను పెంచాలని, మరిన్ని సంస్కరణలను చేపట్టాలని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ సారథ్యంలో ఏర్పాటైన ఈ కమిటీ సిఫారసు చేసింది.
-విజయ్ కేల్కర్ కమిటీ: సహజ వాయువు, చమురును డొమస్టిక్ ఉత్పత్తులను పెంచడానికి కేంద్రప్రభుత్వం విజయ్ కేల్కర్ కమిటీని నియమించింది.
-ఎంబీఎన్ రావు కమిటీ: ఇండియలో తొలిసారిగా ప్రభుత్వరంగంలో మహిళాబ్యాంకును ఏర్పాటు చేయడానికి ఎంబీఎన్ రావు ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
-జీఎస్టీ సాధికారిక కమిటీ: దీనికి సుశీల్ కుమార్ మోదీ నాయకత్వం వహిస్తారు.
-సీ రంగరాజన్ కమిటీ: దారిద్య్రరేఖ నిర్ధారణకు ఇటీవల నియమించిన కమిటీ ఇది.
-సీవీ ఆనంద్ బోస్ కమిటీ: పద్మనాభస్వామి సంపద పర్యవేక్షణకు నియమించిన కమిటీ.
-షుంగ్లూ కమిటీ: కామన్వెల్త్ గేమ్స్ ఆర్థిక వసతులపై నియమించిన కమిటీ.
-జస్టిస్ శివరాజ్ పాటిల్ కమిటీ: 2జీ స్కాంపై విచారణకు కేంద్రప్రభుత్వం ద్వారా నియమించిన ఏకసభ్య కమిటీ.
-పీసీ చాకో కమిటీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని పీసీ చాకో సారథ్యంలో ఏర్పాటు చేశారు.
-జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ కమిషన్: ఆర్థికరంగ చట్టాలు, నియమనిబంధనల మార్పులకు ఉద్దేశించి నియమించిన కమిటీ ఇది.
-రంగరాజన్ కమిటీ: జాతీయ ఆహార భద్రతపై అధ్యయనానికి నియమించిన కమిటీ.
-చరణ్‌దాస్ మెహతా కమిటీ: పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల పెంపుదల కోసం ఏర్పాటు చేసిన కమిటీ.
-రాఘవన్ కమిటీ: విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్‌ని అరికట్టేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ.
-యశ్పాల్ కమిటీ: ఉన్నత విద్యలో (హైస్కూల్) సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ తన నివేదికను 2009లో ప్రభుత్వానికి సమర్పించింది.
-లిబర్హాన్ కమిషన్: బాబ్రీ మసీదు విధ్వంసం తదనంతరం జరిగిన ఘటనలపై విచారణకు 1992లో ఈ కమిషన్‌ను నియమించారు. ఈ కమిటీ తన నివేదికను 2009, జూన్ 30న సమర్పించింది. 17 ఏండ్లు పట్టిన ఈ కమిషన్ కార్యకలాపాలకు రూ. 8 కోట్లు ఖర్చయింది.
-శ్రీకృష్ణ కమిటీ: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అన్ని వర్గాల ప్రజలతో, అన్ని రాజకీయ పార్టీలు, గ్రూపులతో సంప్రదింపులు జరపడానికి కేంద్రం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో మరో నలుగురు ప్రొఫెసర్ రణబీర్‌సింగ్ (న్యాయ నిపుణుడు), వినోద్ కుమార్ దుగ్గల్ (హోంశాఖ మాజీ కార్యదర్శి), ప్రొఫెసర్ రవీందర్ కౌర్ (సామాజికవేత్త), అబుసలే షరీఫ్ (ఆర్థికవేత్త)లను సభ్యులుగా నియమించింది.
-కిరీట్ పారిఖ్ కమిటీ: పెట్రో ధరల విధానంపై వేసిన కమిటీ.
-సురేష్ టెండూల్కర్ కమిటీ: దేశంలో పేదరికాన్ని అంచనావేసేందుకు ఏర్పాటు చేశారు.
-సుందరం కమిటీ: ఎగుమతి, పరపతి నిర్మాణంపై ఏర్పాటు చేసిన కమిటీ.
-సోథాని కమిటీ: ప్రవాస భారతీయుల పెట్టుబడులు, ఫారెక్స్ మార్కెట్లపై ఏర్పాటు చేసిన కమిటీ.
-గోస్వామి కమిటీ: కార్పొరేటివ్ పునర్వ్యవస్థీకరణ, పరిశ్రమల రుగ్మతలపై ఏర్పాటు చేసిన కమిటీ.
-నరసింహన్ కమిటీ: ఆర్థిక వ్యవస్థల నిర్మాణం, నిర్వహణ, పనితీరులపై సమీక్ష.
-ఖన్నా కమిటీ: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పనితీరుపై మానిటరింగ్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ.
-నాదకర్ణి కమిటీ: ప్రభుత్వరంగ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారాలపై ఏర్పాటు చేసిన కమిటీ.
-జానకీరామన్ కమిటీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థల సెక్యూరిటీ లావాదేవీలపై సమీక్ష కోసం నియమించిన కమిటీ.
-నాయక్ కమిటీ: చిన్నతరహా పరిశ్రమల రంగానికి రుణాల గురించి ఏర్పాటు చేసిన కమిటీ.
-నరసింహన్ కమిటీ-2: బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల కోసం ఏర్పాటు చేశారు.
-వర్మ కమిటీ: బలహీనమైన ప్రభుత్వరంగ బ్యాంకుల పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేశారు.
-ఆర్వీ గుప్తా కమిటీ: వ్యవసాయ రుణాలపై ఏర్పాటు చేసిన కమిటీ.
-జేజే ఇరానీ కమిటీ: కంపెనీ సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీ.
-ఎస్ఎస్ తారాపోర్ కమిటీ: క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ కోసం నియమించిన కమిటీ.
-మెహతా కమిటీ: సమగ్ర గ్రామీణాభిద్ధి పథకంపై ఏర్పాటు చేశారు.
-మల్హోత్రా కమిటీ: బీమారంగ సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీ.
-రాకేష్ మోహన్ కమిటీ: మౌలిక సదుపాయాల కల్పనపై ఏర్పాటు చేశారు.
-వైహెచ్ మాలెగావ్ కమిటీ: యూటీఐ పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటు చేశారు.
-కేసీ పంత్ కమిటీ: ఖాదీ, గ్రామీణ పరిశ్రమలను పటిష్టపర్చేందుకు ఏర్పాటు చేశారు.
-ప్రకాశమణి త్రిపాఠి కమిటీ: యూటీఐ, స్టాక్ మార్కెట్ కుంభకోణాలపై నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ.
-కేసీ గీతాకృష్ణన్ కమిటీ: వ్యయసంస్కరణలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ.
-దీపక్ పరేఖ్ కమిటీ: యూఎస్-64 స్కీంపై 1998లో ఏర్పాటు చేసిన కమిటీ.
-మాలెగావ్ కమిటీ: సూక్ష్మరుణ సంస్థల అధ్యయనానికి ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ.
-శ్యామ్ పిట్రోడా కమిటీ: రైల్వేల నవీనీకరణ ప్రణాళిక కోసం ఏర్పర్చిన కమిటీ.
-సీ రంగరాజన్ కమిషన్ (నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్): ప్రస్తుత గణాంక వ్యవస్థలోని లోపాలను గుర్తించి, సూచనలు చేయడం కోసం.
-పీడీ షెనాయ్ కమిటీ: జాతీయ జెండాకు సంబంధించి నిబంధనల కోసం ఏర్పర్చిన కమిటీ.
-జేఎం గిర్గ్లానీ కమిటీ: ఏపీలో ఉద్యోగ నియామకాల్లో ఆరుసూత్రాల పథకానికి సంబంధించిన జీవో 610పై నియమించిన కమిటీ.
-పీఎన్ భగవతీ కమిటీ: టేకోవర్లపై సెబీ నియమించిన కమిటీ.
-నరేశ్‌చంద్ర కమిటీ: కార్పొరేట్ గవర్నెన్స్‌పై నియమించిన కమిటీ.
-ఎంకే ముఖర్జీ కమిషన్: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అదృశ్యం, మరణంపై నియమించిన కమిషన్.
-రవీంద్రవర్మ కమిషన్: రెండో లేబర్ కమిషన్.
-కేల్కర్ కమిటీ: పన్నుల సంస్కరణలపై సిఫారసుల కోసం నియమించిన కమిటీ.
-ఎన్కే సింగ్ కమిటీ: ఎఫ్‌డీఐలపై ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ.
-చలపతిరావు కమిటీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణపై నియమించిన కమిటీ.
-వరదరాజన్ కమిటీ: తాజ్‌మహల్ పరిసరాల్లో కాలుష్య తీవ్రత స్థాయిని అంచనా వేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు