అడవులు – వినియోగం – సంరక్షణ
- అడవి అంటే చెట్లతో ఉన్న విశాలమైన భూ భాగం అనేది ఒక తేలికైన నిర్వచనం.
- బాగా చలిగా ఉండి, మంచు కూడా కురిసే ప్రాంతాల్లో మాత్రమే కోనిఫెరస్ జాతికి చెందిన దేవదారు చెట్లు పెరుగుతాయి.
- వేడిగా ఉండి, ఓ మోస్తరు వర్షాలు పడే ప్రాంతాల్లో టేకు చెట్లు పెరుగుతాయి.
- చాలా ఎక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్యరేఖ ప్రాంతాల్లో సతత హరిత అడవులు పెరుగుతాయి.
- కదంబం, వెదురు, నేరేడు చెట్లు సతత హరిత అరణ్యాల్లో పెరుగుతాయి.
- మన దేశంలో కేరళ, అండమాన్లో సతత హరిత అడవులు పెరుగుతాయి.
- హిమాలయాల్లో వేరే రకపు సతతహరిత అడవుల్లో దేవదారు చెట్లు పెరుగుతాయి.
- ఆకురాల్చే అడవులు కొన్నినెలలు పాటు వర్షం పడి, సంవత్సరంలో అధిక భాగం పొడిగా, వెచ్చగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి.
- ఆకురాల్చే అడవుల్లో ఎక్కువ వర్షపాతం వల్ల పెరిగే చెట్లు, తక్కువ వర్షపాతం వల్ల పెరిగే చెట్లు ఉంటాయి.
- ఎక్కువ వర్షం పడే ప్రాంతాల్లో ఆకురాల్చే అడవుల్లో వేప, ఎగిస, మద్ది(అర్జున) బండారు, జిట్రేగి వంటి చెట్లు పెరుగుతాయి.
- మన రాష్ట్రంలో పూర్వపు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు పెరుగుతాయి.
- తక్కువ వర్ష పాతం పడే ప్రాంతంలో మద్ది, టేకు, వెలగ, ఎగిస, యెసి, తునికి, బిగురు, జిల్లు, వేప, దురిశన, బూరుగు చెట్లు పెరుగుతాయి
- ఈ రకమైన అడవులు రాష్ట్రంలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా, మహబూబ్నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతాయి.
- ముళ్ళ అడవులు నల్గొండ, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో ఉన్నాయి.
- సముద్ర తీరపు చిత్తడి అడవులు సముద్రతీర చిత్తడి నేలల్లో, సముద్ర అలల ప్రభావిత నేలల్లో పెరుగుతాయి.
- వీటిని ‘మడ’ అడవులు అని కూడా అంటారు
- ఉప్పుపొన్న, బొడ్డుపొన్న, ఉరాడ, మడ, తెల్లమడ, గుండు మడ, కదిరి, చెట్లు మడ అడవుల్లోని ప్రధాన చెట్లు.
- రాష్ట్ర భూ విస్తీర్ణంలో 26,904 చ.కి.మీ మేర అడవులు ఉన్నాయి. ఇది రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం లేదా పావు వంతు (1/4).
- వాస్తవమైన అడవి విస్తీర్ణం 16.74 శాతంలోనే ఉంది.
- రాష్ట్ర అడవి విస్తీర్ణం ప్రతి ఏటా 30 చ.కి.మీ. మేర తగ్గిపోతోంది.
- రాష్ట్రంలోని అడవులు 60 శాతం గిరిజన జనాభా నివాస ప్రాంతాల్లోనే ఉన్నాయి.
- బ్రిటిష్ పాలనలో గిరిజనులు అడవులపై తమ హక్కులు, అధికారాలను కోల్పోయారు.
- అడవులను ‘రక్షిత’ రిజర్వు అడవులుగా వర్గీకరించారు.
- రిజర్వు అడవుల్లోకి ఎవరూ ప్రవేశించడానికి అనుమతి లేదు.
- ‘రక్షిత’ అడవుల్లోకి ప్రజలు వెళ్ళి, అటవీ ఉత్పత్తుల సేకరణ, పశువులను మేపుకోవడానికి, వంట చెరకు కోసం నెత్తిన కట్టె మోపును తీసుకెళ్ళేందుకు అనుమతులున్నవి. చెట్లు నరకడంపై నిషేధం ఉంది.
- మన రాష్ట్రంలో ఉత్తర జిల్లాల్లో గోండులు స్థిర వ్యవసాయం చేస్తారు. కొన్ని భూములను బీడుగా పెట్టి మార్చి మార్చి రెండేళ్ళకు ఒకసారి సాగు చేస్తారు.
- కొలాంలు వంటి తెగ గిరిజనులు కొండ వాలుల మీద పోడు వ్యవసాయం చేస్తారు.
- అటవీ సంరక్షణ పేరుతో 1920 నుంచి అడవుల నుంచి గిరిజనులను 1940 వరకు పెద్ద ఎత్తున తరలించారు.
- జాతీయ అటవీ విధానం-1988, అడవుల సంరక్షణ పునరుద్ధరణ అభివృద్ధిలో గిరిజనులను భాగస్వాముల్ని చేయడం ప్రధాన కర్తవ్యం.
అటవీ హక్కులు చట్టం-2006 చేయడానికి కారణాలు
1) అడవులను సంరక్షించడం, అటవీవాసులకు జీవనోపాధి కల్పించడం, ఆహార భద్రత ఉండేలా చూడటం
2) అడవుల సుస్థిరత, మనుగడలో సాగుభూములు, నివాస ప్రాంత హక్కులను గుర్తించకపోవడం చారిత్రక అన్యాయం జరిగిందని భావించడం.
3) ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల నిర్వాసితులు, అటవీ వాసులు భూమి హక్కులు, అడవి హక్కులపై ఉన్న అభద్రత పరిష్కారం చేయడానికి.
Previous article
ఎస్కిమోల జీవితాల్లో శిల అంటే..?(TET Special)
Next article
Active and Passive voice (TET Special)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు